jorhat
-
అస్సాం లో భారీ అగ్ని ప్రమాదం
-
వైరల్ వీడియో: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి..
-
హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్
దిస్పూర్: అస్సాంలో ఓ చిరుత హడలెత్తించింది. గత 24 గంటలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అస్సాంలోని జోర్హాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఇనుప కంచె దాడి జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. చిరుత వరుస దాడిలో 15 మంది గాయపడ్డారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. వీరిలో ముగ్గురు అటవీ అధికారులతో సహా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ఇందులో చిరుత క్యాంపస్ చుట్టూ తిరుగుతూ, ముళ్ల కంచెపై దూకుతూ కనిపిస్తోంది. జనాలపై మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కారుపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జోర్హాట్ శివారల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడి నుంచే చిరుతపులి క్యాంపస్‌లోకి చొరబడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులకు చిరుత చిక్కలేదు. చిరుతను పట్టుకుని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
రైలు ఢీకొని ఏనుగు, దాని బిడ్డ మృతి
అస్సాం జోర్హాట్ జిల్లాలో రైలు ఢీకొని ఏనుగు దాని 10నెలల బిడ్డ చనిపోయాయి. ఆదివారం రాత్రి 10:50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న ఓ ఏనుగల మందను నాగినిమోరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏనుగు దాని పిల్లను రైలు 50 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలై అవి చనిపోయినట్లు సమాచారం. ఏనుగు వయసు 21 ఏళ్లు, దాని బిడ్డ వయసు 10నెలలు అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్‌పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్‌లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్‌లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు
గుహవాటి: అసోంలో ఘోర సంఘటన జరిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్- ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
దారుణం: మరో మాట లేకుండా ప్రాణాలు తీశారు
దిస్పూర్: అస్సాంలోని టీ తోటల ప్రాంతాల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులపై 50 మంది గుంపు విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. జోర్హాత్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతం గభోరు పర్బాత్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు దేవాశిష్ గొగోయ్ (23), ఆదిత్యదాస్ శనివారం సాయంత్రం బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు. మరియాణి పట్టణానికి సమీపాన ఉన్న టీ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న క్రమంలో దారిగుండా వెళ్తున్నఇద్దరు మహిళలను వారి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దాంతో 50 మంది గుంపు వారిపై ఒక్కసారిగా దాడికి దిగింది. మహిళలకు పెద్దగా గాయాలు కాలేదని, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వాదనలు లేకుండానే యువకులను గుంపులోనివారు చావబాదారని స్థానికులు తెలిపారు. ఇక దేవావిష్ తండ్రి, సోదరి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదని పోలీసులు వెల్లడించారు. యువకులను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటకీ ఫలితం లేకపోయిందని చెప్పారు. దేవాశిష్ ప్రాణాలు విడువగా.. ఆదిత్యదాస్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నలుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. (చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మిజోలు) -
ఎవరికి ఓటేసినా, పడేది బిజెపికే
మీరు ఏ పార్టీకైనా ఓటేయండి. ఏ మీట నొక్కినా మీ ఓటు మాత్రం పడేది భారతీయ జనతా పార్టీ కే! ఇదేదో బిజెపి బెంగాల్ అభ్యర్థి పిసీ సర్కార్ మహేంద్ర జాలం కాదు. అసొం లోని జోర్హాట్ లోకసభ నియోజకవర్గంలో అధికారులు మాక్ పోల్ పరీక్ష నిర్వహించినప్పుడు ఈ వీ ఎంలు ఇలా వింతగా ప్రవర్తించాయి. ఈ తంతు అంతా అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థుల సమక్షంలో జరిగింది. జోర్హాట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి విజయ కృష్ణ హాండిక్, బిజెపి గిరిజన నేత కామాఖ్యా తాసాలు పోటీ పడుతున్నారు. ఈ ఈ వీఎంలు మన హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఈ మధ్యే జోర్హాట్ వచ్చాయి. వాటిని పరీక్షిస్తుండగా ఈ సంగతి బయటపడింది. ఈ ఈ వీఎంలు జిల్లా కమీషనర్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అలా ఉంచినప్పుడు ఎవరైనా వీటిని ఇలా చేశారా అన్నది అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేసింది. ఒక్క జోర్హాట్ లోనే కాదు, రాష్ట్రమంతటా ఈవీఎంలను పరీక్షించాలని డిమాండ్ చేసింది. 'మేము కాంగ్రెస్ కి ఓటేసినా అది బిజెపి ఖాతాలోకే వెళ్తోంది,' అని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. తమాషా ఏమిటంటే 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే చేసిందని, తమ ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయని అసొంలో ప్రధాన ప్రతిపక్షం అసొం గణపరిషత్ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ నిరాధారమని, ఈవీఎం ఫలితాలను ఎవరూ తారుమారు చేయలేరని కాంగ్రెస్ వాదించింది. సుబ్రమణ్యం స్వామి వంటి నేతలు కూడా ఈవీఎం ఫలితాలను తారుమారు చేయవచ్చునని కోర్టుకెక్కారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ఇదే వాదనను వినిపించింది. ఇప్పుడు తనదాకా వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్ రాష్ట్రమంతటా పరీక్షించాలని డిమాండ్ చేస్తోంది.