బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు | 2 Boats With 100 Passengers Collide In Brahmaputra River In Assam | Sakshi
Sakshi News home page

బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు

Published Wed, Sep 8 2021 6:00 PM | Last Updated on Wed, Sep 8 2021 6:31 PM

2 Boats With 100 Passengers Collide In Brahmaputra River In Assam - Sakshi

గుహవాటి: అసోంలో ఘోర సంఘటన జరిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు

బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌- ఎస్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

చదవండి: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాజీనామా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement