Brahmaputra river
-
భారత్‌పై చైనా వాటర్ బాంబ్!
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్‌ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్‌ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్‌లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడివంది. ‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్‌లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్‌కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్‌కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్‌తో భారత్‌పైకి వాటర్‌బాంబ్‌ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది. -
అసోంలో భారీ వర్షాలు.. 11 జిల్లాలను ముంచెత్తిన వరదలు..
వర్షాకాలం పూర్తిగా మొదలు కాకముందే అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 11 జిల్లాలను ముంచెత్తాయి. దీని కారణంగా 34 వేల మంది ప్రభావితులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోంలో ఈ ఏడాది తొలి వరదలు నమోదయ్యాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA) ప్రకారం బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. అయితే ఏ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదని పేర్కొంది. అసోం అంతటా 209.67 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపింది. వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాలు ప్రభావితమయ్యాయయని.. 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4, 675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు.. లఖింపూర్‌లో అత్యధికంగా 23,516 మంది ప్రభావితమయ్యారు, దిబ్రూగర్‌లో 3,857 మంది, దర్రాంగ్‌లో 2231 మంది, బిశ్వనాథ్‌లో 2231 మంది, ధేమాజీలో 1,085 మంది ఉన్నారు. వరదల బారిన పడిన లఖింపూర్‌లో ఎనిమిది, ఉదల్గురిలో రెండు మొత్తం 11 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 77 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. లఖింపూర్, ఉదల్గురిలో రెండు చొప్పున నాలుగు చెరువుల కట్టలు తెగిపోయాయి. బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బరీ, సోనిత్పూర్, తముల్పూర్ ఉదల్గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయని ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. భారీ వర్షాల కారణంగా దిమా హసావో కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది. కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతోంది. 34,000 people affected as #AssamFlood worsens and incessant rain continues Total 34,189 people, comprising 14, 675 women & 3,787 children reeling under the impact of the deluge#Assam #Flood #AssamRain #FloodUpdate #AssamFloods #Guwahati #GuwahatiFlood pic.twitter.com/oOKd4cg2L1 — Ritam English (@EnglishRitam) June 17, 2023 -
బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు
బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు. బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది. దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H — Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
Purnima Devi Barman: ఆ కళ్లకు వెన్నెల తెచ్చింది
పక్షి ప్రేమికులకు సుపరిచితమైన పేరు పూర్ణిమా దేవి బర్మన్. చిన్నప్పుడు తాత తనను పొలానికి తీసుకువెళ్లి ఆకాశంలోని పక్షులను చూపిస్తూ ‘అవి స్వర్గం నుంచి వస్తున్నాయి తెలుసా’ అనేవాడు. పెద్దయ్యాక పూర్ణిమకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద వాటి పరిస్థితి నరకప్రాయంగా ఉంది అని. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ‘హర్గిల ఆర్మీ’ అనే సైన్యం తయారు చేసింది. ‘ఆశావాదం మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్న పూర్ణిమ ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక అవార్డ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్‌కు’ ఎంపికైన వారిలో ఒకరు... అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. అక్కడ పక్షుల సందడి నేత్రపర్వంగా ఉండేది. తాత తనను పొలానికి తీసుకువెళుతూ ఎన్నో పక్షులను చూపిస్తూ వాటి గురించి ఎంతో మురిపెంగా చెప్పేవాడు. అలా తనకు చిన్నప్పటి నుంచి పక్షులను అభిమానించడం మొదలైంది. జంతుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పూర్ణిమ గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పీహెచ్డీ చేసే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయనే విషయం తనను భయపెట్టింది. వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలనుకుంది పూర్ణిమ. ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి పక్షులపై ఉన్న మూఢనమ్మకాలు పోయేలా వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. చిన్నగా మార్పు మొదలైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారుచేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ. తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేస్తున్నారు. ‘పక్షుల వల్ల జరిగే మేలు ఏమిటో అర్థమయ్యేలా చెప్పారు. అవి ప్రమాదంలో ఉన్నాయనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. నా వంతుగా ఏదైనా చేయాలనిపించి హర్గిల ఆర్మీలో చేరాను’ అంటుంది దాదర గ్రామానికి చెందిన వింధ్య. ‘ఇల్లుదాటి బయటికి రాగానే పక్షిని చూడడం అరిష్టమని నేను కూడా నమ్మేదాన్ని. కానీ అది ఎంత తప్పో తరువాత తెలిసింది’ అంటుంది ‘హర్గిల ఆర్మీ’ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే పచారియా గ్రామానికి చెందిన గంగ. ఒకప్పుడు ‘హర్గిల ఆర్మీ’లో తక్కువ మందు ఉండేవారు. ఇప్పుడు పదివేల మందికి పైగా ఉన్నారు! ‘నేను స్వాభావికంగా ఆశావాదిని. అలాంటి నేను కొన్ని సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దీనికి కారణం పట్టణీకరణ వల్ల చెట్లను కొట్టి వేయడం. ఒకచోట ఇల్లు కడుతున్నారంటే చెట్లు కొట్టేసేవారు. వారి దృష్టిలో చెట్లకు విలువ లేదు. అయితే విస్తృత ప్రచారం వల్ల పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. చెట్లను నరికివేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు. ఇవి మా భవిష్యత్ తరానికి మేము ఇచ్చే ఆస్తి... అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పక్షులకు అనువైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుకుంటే వాటికి మేలు చేసినట్లవుతుంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మన్. -
అయ్యో గజరాజా! పాపం ఆకలికి తట్టుకోలేక..
వైరల్: ఆకలి.. ఏ కడుపుకైనా ఒక్కటే!. గుప్పెడు పొట్ట ఉండే మనిషికే అంత ఆకలి ఉంటే.. భారీ కాయం ఉన్న ఆ జీవి మాత్రం తట్టుకోగలదా?. ఇక్కడ ఓ ఏనుగుకు వెన్ను ఎముకలు బాధాకరంగా పొడుచుకు వచ్చాయి. బక్కచిక్కిపోయి.. బలహీనంగా మారిపోయి ఆహారం కోసం అటు ఇటు తిరుగాడింది. దీనికితోడు జనాలు చేసే ఆ గోల దానిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పాపం.. ఈ విశాల ప్రపంచంలో ఆకలి తీర్చుకోలేక బాధతో అలమటించింది ఆ గజరాజు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా.. మూగజీవాలు జనవాసాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ, ఇక్కడ ఈ గజరాజు మాత్రం ఆకలికి తట్టుకోలేక వచ్చింది. అది అలా ఇలా కాదు. అందుకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆకలిగొన్న ఆ అడవి ఏనుగు.. అస్సాం కజిరంగ నేషనల్ పార్క్ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్పూజ్ నగరానికి ఆదివారం సాయంత్రం చేరుకుంది. ఏనుగు రాకతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రావడం రావడంతోనే నగరంలో అలజడి సృష్టించింది ఆ గజం. near govt. boys, tezpur pic.twitter.com/k5LQ2IW02n — vishal junak das (@junaaaak) August 27, 2022 వీధుల్లో తిరుగుతూ.. తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. లాభం లేదు. చన్మరీ ప్రాంతంలో ఓ ఇంటి వంట గదిలోకి వెళ్లింది కూడా. అక్కడ ఏం దొరకలేదు. దీంతో తేజ్‌పూర్ షిప్ పోర్ట్ గుండా చిత్రలేఖ పార్క్‌లోకి వెళ్లింది. అక్కడ వందల మంది దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆపై అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్‌కు చేరుకుని.. జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసేంది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించింది. Dear mama, I am from tezpur & this elephant passes away just in front of my house last night. I just want you to interfere in this matter and make a close watch to the animals, just see the health condition of a wild animal. Shame on every human being. Save our nature pic.twitter.com/9hZoqvK9MX — Bikash Adhikari (@BikashA03668793) August 28, 2022 తిండి కోసం అది పడే తాపత్రయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా దానిని భయపెడుతూ మరింత అలజడికి కారణం అయ్యారు. చివరికి.. ఫారెస్ట్ సిబ్బంది దానిని బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపే తరలించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. 🐘wild elephant enters tezpur. scene from chandmari-railgate area. pic.twitter.com/N5Gnt8HioK — vishal junak das (@junaaaak) August 27, 2022 అయితే.. ఏనుగు సృష్టించిన అలజడి.. విధ్వంసం వెనుక హృదయవిదారకమైన, కఠోర వాస్తవాలు ఉన్నాయి. వాటినే పలువురు నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. పాపం.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులనే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తూ.. ఆకలికి దూరం చేస్తున్న మనిషి.. ఇప్పుడు దాని ఆకలి తీర్చలేకపోవడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సోషల్ మీడియాలో!. ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దగ్గర బైక్ స్టంట్.. వాడికలా అవ్వాల్సిందే! -
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్‌లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు
గుహవాటి: అసోంలో ఘోర సంఘటన జరిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్- ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు
బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదించింది. అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే ఎత్తయిన నది కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలో భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా. భారత్ ఆందోళనలేంటి? టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్ గవర్నింగ్ హాంకాంగ్ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్ తమకు నచ్చినవారిని నామినేట్ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది. తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్ -
బ్రహ్మపుత్రపై భారత్ రిజర్వాయర్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. యర్లుంగ్ త్సంగ్ బో(బ్రహ్మపుత్ర) నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని జల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నదీ జల వివాదాలు కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
చైనా భారీ ప్రాజెక్టు; భారత్‌పై ప్రభావం!
బీజింగ్: హిమాలయ నదుల్లో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు డ్రాగన్ దేశ అధికార మీడియా వెల్లడించింది. చైనా సొసైటీ ఫర్ హైడ్రోపవర్ ఇంజనీరింగ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా విద్యుదుత్పత్తి కార్పొరేషన్ చైర్మన్ యాన్ జియాంగ్ మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా జరుగలేదు. చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమలో ఇదొక నూతన అధ్యాయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని టిబెట్‌లో యార్లాంగ్ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించనుంది’’ అని వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అదే విధంగా టిబెట్- అరుణాచల్ సరిహద్దులోని మెడాగ్ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, జాతీయ భద్రత, నదీ జలాలు, అంతర్గత భద్రత తదితర అంశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(జాతీయ అసెంబ్లీ) వచ్చే ఏడాది ఆమోదించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాల గురించి తీర్మానం చేస్తూ చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గత నెలలో నిర్ణయం తీసుకుంది. (చదవండి: వైరస్ భారత్ నుంచి వచ్చిందంటూ చైనా వాదనలు) చైనా వైఖరిపై విమర్శలు ఇక ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మాణాల నేపథ్యంలో ఇటు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్‌కు బ్రహ్మపుత్రతో పాటు ఇవి కూడా అనుకూలమైనవనని నిపుణులు ఇప్పటికే తేల్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటినీ కాదని, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపైనే చైనా దృష్టి పెట్టడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారేలా చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం వక్రబుద్ధితోనే బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. (చదవండి: మాంసం ముద్దలు విసురుతూ నిరసన) కాగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాలకు నష్టం చేకూర్చేవిధంగా వ్యవహరించవద్దని భారత్ ఇప్పటికే చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. డ్రాగన్ దేశ నిర్ణయాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే దిగువ ప్రాంత ప్రయోజనాలు కాలరాసే విధానాన్ని సహించబోమని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 2006లో సరిహద్దు నదీ జలాల విషయంలో తలెత్తిన సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా ఎక్స్పర్ట్ లెవల్ మెకానిజం(ఈఎల్ఎం)ను ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక బంధంలో భాగంగా ఇప్పటికే రూపొందించిన ఎంఓయూల నేపథ్యంలో బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులకు సంబంధించిన వరద జలాలు, హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని చైనా భారత్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. -
బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు..
పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభ మవుతున్నాయి. ఈ సమయంలో పుష్కర స్నానాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యేక బ్రహ్మపుత్ర పుష్కరాల టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజీ (రూ.14,500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక 11 రోజుల ప్యాకేజీ(రూ.17500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్, కోల్కత్తా ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా కామఖ్య శక్తిపీఠం, శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్ కాళీమాత మందిరం, హౌరా బ్రిడ్జి తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తారు. వివరాలకు 8106201230, 7032666925నెంబర్లలో సంప్రదించవచ్చు. -
తేలియాడే వ్యవసాయం
ఏడాది పొడవునా వరదలు. ఎటు చూసినా నీళ్లే. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ‘ద్వీప’మది. మరి పంటలు పండేదెలా, కడుపు నిండేదెలా? అస్సాంలో బ్రహ్మపుత్ర నది తీర ప్రాంతంలోని మజూలి ద్వీపవాసులు ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇప్పుడా సమస్య నీటి మబ్బులా తేలిపోయింది. హైడ్రోపానిక్ వ్యవసాయం అంటే తెలుసు కదా, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతున్న నగరాల్లో ఈ కొత్త తరహా వ్యవసాయం అందుబాటులోకి వచ్చింది. మట్టి అవసరం లేకుండా ఎంచక్కా మన రోజువారీ అవసరానికి తగ్గ కూరలు బాల్కనీల్లోనే పండించుకోవచ్చు. కానీ అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మజూలిలో అధికార యంత్రాం గం తమ బుర్రలకు మరింత పదునుపెట్టారు. హైడ్రోపానిక్ వ్యవసాయానికే మరింత మెరుగులు దిద్దారు. ఇంకా సహజపద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో, స్థానికంగా దొరికే వనరులతో నీళ్లల్లో తేలియాడే వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. దీంతో ఉపాధికి ఉపాధి, ఆదాయానికి ఆదాయం. హైడ్రోపానిక్ సాగు అంటే? 8 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పులో వెదురు బొంగులతో వ్యవసాయానికి అవసరమయ్యే హైడ్రోపానిక్ ట్రేని రూపొందించి అందులో విత్తనాలు వేస్తారు. మట్టిలో ఉండే పోషకాలన్నీ ఆ నీటిలో కలుపుతారు. మొక్కలు ఎదగడానికి వర్మీ కంపోజ్డ్ నీళ్లను జల్లుతారు. ట్రేలన్నీ వెదురుబొంగులతో చేసినవి కావడంతో అవి నీళ్లలో తేలుతూ ఉంటాయి. వరదలు ముంచెత్తినా పంట నీటిపాలవుతుందన్న భయం లేదు. ‘మాకున్న కాస్తో కూస్తో వ్యవసాయ భూమి నీళ్లల్లో మునిగిపోయింది. ఏం చేయాలో తెలీని స్థితి. అప్పుడే ఫ్లోటింగ్ వ్యవసాయం గురించి తెలిసింది. వర్షాలు కురిస్తే పంటలు నీట మునుగుతాయన్న బాధ లేదు. ఆ ట్రేలన్నీ హాయిగా నీళ్లల్లో తేలుతూ పచ్చగా కనువిందు చేస్తుంటాయి. ఇక మా బతుకులూ పచ్చగానే ఉన్నాయి‘ అని పవిత్ర హజారికా అనే రైతు చెప్పారు. ఎందుకీ అవసరం వచ్చింది? బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంలో ఉన్న మజూలిలో భూ ప్రాంతం ఏడాదికేడాది నీళ్లల్లో కలిసిపోతోంది. 1250 చదరపు కి.మీ.లు ఉన్న ఈ ప్రాంతంలో 75శాతం భూమిని నీరు ఆక్రమించేసింది. దీంతో అక్కడ నివాసం ఉండే 2 లక్షల మంది స్థానికుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2016లో స్థానిక అధికారులు అక్కడ రైతులకు ఈ హైడ్రోపానిక్ వ్యవసాయాన్ని పరిచయం చేశారు. మొదట్లో రైతులకు ఈ వ్యవసాయమేంటో అర్థం కాలేదు. మట్టి లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయా? అని ఆశ్చర్యపోయారు. కానీ అవసరం వాళ్లకి అన్నీ నేర్పించింది. ‘ఈ పద్ధతుల్ని అవగాహన చేసుకోవడానికి రైతులకు కొన్నాళ్లు పట్టింది. ప్రస్తుతం 620 మందిపైగా రైతులు 528 హైడ్రోపానిక్ ట్రేలలో వ్యవసాయం చేస్తున్నారు. వరి, బంగాళాదుంపలు, కంద, కూరగాయలు, మూలికలు, మిరప, కొత్తిమీర, పుదీనా, కేబేజీ పంటలు పండిస్తున్నారు. రైతులకు కాసుల పంట.. సంప్రదాయ వ్యవసాయంతో పోల్చి చూస్తే 3.58 రెట్లు అధికంగా లాభాలు వస్తున్నాయి. మొత్తం 10 ట్రేలలో 25 కేజీల వరకు పంట వస్తుంది. కూరగాయలు, ఆకుకూరల పంటలకు 2,500 రూపాయలు ఖర్చు అయితే 5 వేలవరకు తిరిగి వస్తుంది. అదే మూలికలు పెంచితే రూ.40 వేల వరకు ఆదాయం వస్తుందని ఈ ఫ్లోటింగ్ వ్యవసాయానికి మద్దతునిస్తున్న సౌత్ ఏషియా ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంస్థ చైర్‌పర్సస్ దీపాయన్ దేవ్ చెప్పారు. రాష్ట్ర సీఎం సోనోవాల్ సొంత నియోజకవర్గం మజూలీ కావడంతో ఇక్కడ ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. త్వరలోనే ఈ జిల్లా కాలుష్యరహిత జిల్లాగా మారనుంది. వెదురుకర్రల ట్రేలో సాగు -
బ్రహ్మపుత్రకు పోటెత్తిన వరద
గువహటి : అసోంలో ఎడతెరిపిలేని వర్షాలతో వరద పోటెత్తింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వరద పరిస్థితితో 62,000 మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు. జోర్హాట్లోని నిమతి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదస్ధాయిని మించి పొంగిపొర్లుతోంది. దెమాజి, లఖింపూర్, బిశ్వనాధ్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. వరద ఉధృతితో రంగనొది హైడ్రో విద్యుత ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో లఖింపూర్ జిల్లా నీట మునిగింది. కుండపోతతో కొండచరియలు విరిగిపడి గువహటిలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో వరద బీభత్సం మరింత పెరిగే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. -
21 ఏళ్ల తర్వాత పూర్తయిన అతిపెద్ద వంతెన
గువహటి : ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే మగ్గిన దేశంలోనే అతిపెద్ద వంతెన ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 21 ఏళ్ల క్రితం శంకుస్ధాపన చేసిన బోగిబీల్ రోడ్డు కం రైలు వంతెన పూర్తయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం జాతికి అంకితం కానుంది. 2002లో ఈ ప్రాజెక్టు పనులను అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రారంభించారు. 4.94 కిమీ పొడవున్న ఈ వంతెన అసోంలోని టిన్సుకియా అరుణాల్ప్రదేవ్లోని నహర్లగన్లను కలుపుతుంది. ఈ రూట్లో రెండు పట్టణాలను కలుపుతూ టిన్సుకియా-నహర్లగన్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంత పురోభివృద్ధికి ఈ వంతెన కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు.బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఈ డబుల్‌డెక్కర్ రైల్ రోడ్డు బ్రిడ్జి కోసం గత రెండు దశాబ్ధాలుగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ వంతెనపై నడిచే రైలుతో ఇరు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం పదిగంటలకు పైగా తగ్గనుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడుతున్న ఈ వంతెన ఈశాన్య సరిహద్దు రక్షణ మౌలిక వసతులకూ ఉపకరించనుంది. బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మాణం అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంతో పాటు సిస్మిక్ జోన్లో ఈ భూభాగం ఉండటం వంటి అవరోధాలను అధిగమించి దేశంలోనే అతిపెద్దదైన వంతెనను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఈశాన్య రైల్వేల సీపీఆర్ఓ ప్రణవ్ జ్యోతి శర్మ వెల్లడించారు. -
అస్సాం, అరుణాచల్‌కు వరద ముప్పులేదు: చైనా
బీజింగ్: యార్లుంగ్ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నది ప్రవాహం తిరిగి సాధారణ స్థాయికి వచ్చిందని, ఇక అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎలాంటి వరద ముప్పు లేదని చైనా సోమవారం ప్రకటించింది. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు భారత్‌కు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించింది. టిబెట్‌లో భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న యార్లుంగ్ స్పాంగ్పో నదికి అడ్డంగా భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో నదీ మార్గం మూసుకుపోయి ఈ నెల 17న కృత్రిమ సరస్సు ఏర్పడి నీటి ప్రవాహం తగ్గింది. కానీ, కొండచరియలు తొలగించిన అనంతరం ఒక్కసారిగా ప్రవాహం పెరిగి అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌కు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చైనా ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ స్థితికి వచ్చింది.. ‘అక్టోబర్ 20 నాటికి నది ప్రవాహం సాధారణ స్థితికి వచ్చింది. కొండచరియల స్థితిగతులపై నిరంతరం భారత్‌కు సమాచారం అందిస్తున్నాం’అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు. సోమవారం వరకు అరుణాచల్‌కు వస్తున్న వరద ఉధృతిని భారత్‌కు తెలిపామన్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏటా వరదల సీజన్లో మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్రకు సంబంధించిన డేటాను చైనా భారత్‌కు తెలపాలి. వరద ముప్పును ఎదుర్కొవడానికి ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌కు ఈ డేటానే ఆధారం. అయితే, అకస్మాత్తుగా కృత్రిమ సరస్సు ఏర్పడటంతో ఒప్పంద తేదీలను పొడిగించారు. -
అస్సాంలో బోటు పల్టీ.. ముగ్గురి మృతి
గువాహటి: అస్సాంలో ఘోర ప్రమాదం సంభవించింది. గువాహటి నుంచి దాదాపు 36 మందితో బ్రహ్మపుత్ర నది మీదుగా ఉత్తర గువాహటి నగరానికి వెళుతున్న నాటు పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు 10 మందిని రక్షించగా, మరో 12 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంజిన్ చెడిపోవడంతో నాటు పడవ సమీపంలోని ఓ రాయిని ఢీకొని పల్టీ కొట్టిందని కామరూప్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కమల్ కుమార్ తెలిపారు. ఈ పడవలో నిబంధనలకు విరుద్ధంగా 18 మోటార్‌సైకిళ్లను తీసుకెళ్తున్నారనీ, మొత్తం ప్రయాణికుల్లో 22 మందికే సరైన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం సోనోవాల్ విచారణకు ఆదేశించారు. -
అరుణాచల్, అస్సాంలలో వరదలు
ఇటానగర్: చైనాలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరగడంతో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ దీవిలో చిక్కుకున్న 19 మందిని శుక్రవారం వాయుసేన సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అస్సాంలోని ధేమ్‌జీ జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా బృందం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా బృందాలు 200 మందిని కాపాడాయి. అస్సాంకు చెందిన పశువులకాపరులు అరుణాచల్‌లోని తూర్పు సియాంగ్ జిల్లా వరదల్లో చిక్కుకోగా, జిల్లా అధికారుల విజ్ఞప్తి మేరకు వైమానిక దళ సిబ్బంది వారిని కాపాడింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేఘాలయలోని మూడు జిల్లాలకూ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. చైనాలో సాంగ్పోగా పిలిచే నది దిగువ వైపునకు ప్రవహించి లోహిత్, దిబాంగ్ నదులతో కలసి అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. -
భారత్ నీటిపై చైనా పెత్తనం
అస్సోం : భారత్‌కు రావల్సిన బ్రహ్మాపుత్ర నది నీటిని చైనా అక్రమంగా దారి మళ్లిస్తోందని అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ ట్వీటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ఎగువన బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని, మనకు రావాల్సిన నీటి వాటాను కూడా చైనా అక్రమంగా తరలిస్తోందని వెల్లడించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని ఆయన ట్వీటర్ వేదికగా కోరారు. భారత ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తరుణ్ గగోయ్ కోరారు. భవిషత్తులో నీటి కోసం చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మింస్తుందని భారత్ పలు సంధర్భాల్లో అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. కాగా చైనా అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు, డోక్లాం విషయంలో భారత అభ్యంతరాలను ఖాతరు చేస్తూ సరిహద్దులో తన బలగాలను మోహరించడంతో యుద్ద వాతావరణం నెలకొన్న విషయం విదితమే. #China has already been diverting #Brahmaputra water with a dam which will create water shortage for us. The artificial rainwater harvesting plan of them will create even more danger. PM @narendramodi should take it seriously or our future will be in dark. — Tarun Gogoi (@tarun_gogoi) March 28, 2018 -
బ్రహ్మపుత్రతో మరో ప్రళయం రావొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్, అస్సాం రాష్ట్రాల గుండా పారుతున్న బ్రహ్మపుత్ర నదిలోని స్వచ్ఛమైన నీరు నెలరోజుల క్రితం హఠాత్తుగా నల్లగా మారిపోవడం, ఆ నీటిలో లక్షలాది చనిపోయిన చేపలు కొట్టుకురావడం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురైన విషయం తెల్సిందే. మార్గమధ్యంలో చైనా అక్రమంగా డ్యామ్‌లు నిర్మించేందుకు ప్రయత్నించడం లేదా అందుకోసం నదిని మళ్లించడం తదితర చర్యల వల్ల ఇలా నీళ్ల రంగు మారిపోయి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అభిప్రాయపడ్డాయి. చైనా ఆగడాలను అరికట్టాలంటూ గగ్గోలు పెట్టాయి. శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాలను క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా వాస్తవాలను ఇప్పుడు నిగ్గుతేల్చారు. బ్రహ్మపుత్ర నదిలో సాధారణంగా డిసెంబర్ నెలలో బంక మట్టి, మడ్డి కలిసిన బురద శాతం 12–15 (ఎన్ఎఫ్యూ) యూనిట్లు ఉంటుంది. నెల రోజుల క్రితం ఈ నదిలో ఈ బురద 425 యూనిట్లకు చేరుకోవడంతో నీటిరంగు పూర్తిగా మారిపోయింది. ఆక్సిజన్ శాతం అడుగంటి పోవడం వల్ల లక్షలాది చేపలు చనిపోయాయి. నీరు ఇలా మారిపోవడానికి, ఆ స్థాయిలో బురద వచ్చి చేరడానికి కారణం ఏమిటీ? మన దేశంలో బ్రహ్మపుత్రగా పిలిచే నదిని చైనాలో ‘సియాంగ్’ అని టిబెట్‌లో ‘యార్లుంగ్–త్సాంగ్పో’ అని పిలుస్తారు. టిబెట్‌లో ఆవిర్భవించిన ఈ నది చైనా భూభాగంలో రెండువేల కిలోమీటర్లు ప్రవహించి అరుణాచలం గుండా, అస్సాంలోకి ప్రవేశించి ఆ రాష్ట్రంలో దిబాంగ్, లోహిత్ నదులలో కలసిపోతోంది. అందుకని ఈ నదికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా ముందుగా చైనానే అనుమానిస్తాం. చైనాకు సరిహద్దులోని టిబెట్ భూభాగంలోని గ్యాలాపెరి పర్వతం, నాంచాబార్వా పర్వతాల మధ్యనున్న ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లోయగుండా బ్రహ్మపుత్ర నది పారుతూ వస్తోంది. ఈ రెండు పర్వతాల మధ్య నది 180 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీ, ఉదయం నాలుగు గంటలకు గ్యాలాపెరి పర్వతంపై 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పటినుంచి 32 గంటల్లో ఐదుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. అన్ని ప్రకంపనలు నాలుగు పాయింట్లకన్నా ఎక్కువ తీవ్రతతోనే వచ్చాయి. నవంబరం 23న 4.7 తీవ్రతతో మరో భూప్రకంపం వచ్చింది. ఈ ప్రకంపనల కారణంగా వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండ చరియలు, మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. కొండ చెరియలు విరిగిపడడం 20 రోజులపాటు నిరంతరంగా కొనసాగింది. ఇదంతా శాటిలైట్ తీసిన కెమేరాల్లో రికార్డయింది. చైనాలోని తూర్పు సియాంగ్ జిల్లా నుంచి చైనా సరిహద్దులోని గెలింగ్ నగరానికి మధ్య దాదాపు 30 కిలోమీటర్ల పొడవున నదిలో కొండ చెరియలు, మట్టి పెళ్లలు కలిసిపోయాయి. దీనివల్ల 12 కిలోమీటర్ల పరిధిలో మూడు చోట్ల నదీ ప్రవాహానికి అడ్డుకట్టలు పడ్డాయి. 2000 సంవత్సరంలో ఏర్పడిన డ్యామ్లకన్నా ఈ మూడు డ్యామ్‌లు చిన్నగా ఉన్నాయి. ఇవి కాలక్రమంలో నది నీటిలో కలసిపోతాయా లేక మరింత పెద్దవవుతాయా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్పారు. గ్యాలాపెరి వద్ద ఏర్పడిన డ్యామ్ 100 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉందని వారు అంచనా వేశారు. 2000 సంవత్సరం, ఏప్రిల్ 9వ తేదీన మూడున్నర నుంచి 4.6 పాయింట్ల తీవ్రతతో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో నాడు కూడా భారీ ఎత్తున కొండ చెరియలు విరిగిపడి నదిలో కలసిపోయాయి. అప్పటికంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పుడే భారత్‌వైపు ఎక్కువ నష్టం జరిగింది. నాడు అరుణాచల్ ప్రదేశ్‌లో 50 గ్రామాలు ధ్వంసంకాగా, 30 మంది మరణించారు. వందకోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నాటి అరుణాచల్ ప్రభుత్వం అంచనావేసింది. కానీ ధ్వంసమైన అడవులకు, మట్టి మేటలు వేయడం వల్ల దెబ్బతిన్న ఆదివాసీల వ్యవసాయ భూములకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయలేదు. 17 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వ్యవసాయానికి ఆ భూములు పనికి రావడం లేదు. ఈసారి కొండ చెరియలు కూలిపోవడం వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించక పోయినప్పటికీ భవిష్యత్తులో పెను ప్రమాదం ముంచుకొచ్చి అరుణాచల్, అస్సాం రాష్ట్రాలను ముంచేసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి ముప్పును తప్పించేందుకు భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, అశోక ట్రస్ట్ ఫర్ రీసర్ట్ ఇన్ ఎకాలోజి అండ్ ఎన్విరాన్మెంట్’ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
మన బ్రహ్మపుత్రను చైనా చంపేస్తోందా?
సాక్షి, గువాహటి : అసోం ఆశాదీపం ఆరిపోయే ప్రమాదం ఏర్పడిందా? పేరు వినగానే ఒళ్లంతా పులకరించేట్లు ఉండే బ్రహ్మపుత్ర నది బతుకు ఆరిపోయే పరిస్థితి తలెత్తిందా? అంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం అవుననే తెలుస్తోంది. అది కూడా చైనా కారణంగానే బ్రహ్మపుత్ర నదికి ప్రమాదం తలెత్తింది. ప్రస్తుతం ఆ నది మొత్తం కూడా నల్లగా మారుతుండటంతోపాటు, బురదమయం అవుతోంది. దీనికి కారణం చైనాలోని సియాంగ్ నది. టిబెటన్ పీఠభూమిలో పుట్టి మంచుకొండల్లో నుంచి వచ్చి చైనాకు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో అది కలవడమే ఇంత దారుణ పరిస్థితికి కారణమవుతోంది. గత పది రోజుల కిందట జరిపిన పరీక్షల్లో బ్రహ్మపుత్ర నది ఇక మానవ వినియోగానికి పనికిరానిదిగా మారుతోందనే ప్రమాద ఘంటికలు వినిపించాయి. విపరీతమై కాలుష్యం బ్రహ్మపుత్ర నదిలో వచ్చి పడుతోంది. చైనాలోని సియాంగ్ నదిలో పారుతున్న కాలుష్యమంతా వచ్చి బ్రహ్మపుత్రలో పడుతోంది. దీంతో సుజలాలు కాస్త వ్యర్ధజలాలుగా మారిపోతున్న పరిస్థితి తలెత్తింది. ఇటీవల సియాంగ్ నదిలోని నీటిని తీసుకొచ్చి దానిని పరీక్షించగా అందులో 1249 నెపిలోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్(ఎన్టీయూ) ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా నది జలాల్లో ఎన్టీయూ 5 వరకు ఉంటేనే సురక్షితం. దీని ప్రకారం సియాంగ్ నదిలో ఎన్టీయూ 250 రెట్లు అధికంగా ఉందన్నమాట. ఈ నీటిని పరిశీలించిన గువాహటిలోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఫలితాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నీటి వాడకం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరించారు. 'బ్రహ్మపుత్ర నదిలోని నీటిలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గడిచిన నెల రోజుల్లో అవి విషపూరితంగా బురదమయంగా మారాయి. ఎన్నో జల ప్రాణులు ఇటీవల చనిపోయాయని గుర్తించాం. ఇది ఇలాగే కొనసాగితే బ్రహ్మపుత్ర లోయలోని పౌర సమాజం మొత్తం కూడా ప్రమాదంలోకి వెళ్లినట్లే' అని వారు చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని అసోం ఎంపీలు పార్లమెంటులో చెప్పడంతోపాటు చైనా బ్రహ్మపుత్ర నదిని చంపేస్తోందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
విలవిలలాడుతున్న ప్రాణి ప్రపంచం
గువాహటి: భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదికి వరద పొటెత్తటంతో అస్సాం అతలాకుతలం అవుతోంది. పునరావాస శిబిరాల్లోకి కూడా నీరు వచ్చి చేరటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం అధికారులకు కష్టతరంగా మారుతోంది. ప్రతిష్టాత్మక కజిరంగా జాతీయ ఉద్యావనం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పార్క్ లోకి భారీ ఎత్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో సమీపంలోని కబ్రి, అంగోలాంగ్ జిల్లాల సరిహద్దు గ్రామాలవైపు జంతువులు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడే అవకాశం ఉండటంతో 188 ప్రత్యేక కాంపులను ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు, రక్షణ గస్తీ కాస్తున్నారు. "85 శాతం పార్క్ నీటితో నిండిపోయింది. ఆదివారం బ్రహ్మపుత్ర వరదతో 6 అడుగుల కంటే ఎక్కువే నీరు వచ్చి చేరింది. 1988 వరదల కంటే దారుణమైన పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం" అని కజిరంగ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి బల్లవ సాయికియా తెలిపారు. కజిరంగ ఉద్యానవనం ఏనుగులు, పులులు, తెల్ల దున్నపోతులు, అరుదైన దుప్పిజాతులు, మరీముఖ్యంగా రైనోలకు ఆశ్రయంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలూ బ్రహ్మపుత్ర నదికి ప్రతీయేడూ ఇలా వరదలు రావటం, కజిరంగ పార్క్ లోకి నీరు చేరి జంతువులు ఇబ్బందిపాలు అవుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే రాను రాను ఈ పరిస్థితి అధ్వానంగా తయారువతోందని, జంతువులను తరలించటం చాలా కష్టతరంగా మారుతోందని సాయికియా చెబుతున్నారు. గత నెలలో వరదల మూలంగా 7 రైనోలతోసహా 107 జంతువులు చనిపోగా, అందులో 13 వరదల నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డాయి. పర్యాటక రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినటంతో సమారు 7కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ఆనకట్ట!
బీజింగ్: భారత్ ఆందోళనను బేఖాతరు చేస్తూ బ్రహ్మాపుత్ర నదిపై చైనా నిర్మించిన భారీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు మంగళవారం నుంచి పనిచేయడం ప్రారంభించింది. టిబెట్ ప్రాంతంలో 1.5 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ డ్యామ్ తో.. దిగువన నివసించేవారి ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టులోని మొత్తం ఆరు యూనిట్లను మంగళవారం పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అతి పెద్ద హైడ్రోపవర్ కాంట్రాక్టర్ అయిన చైనా గెఝౌబ్ గ్రూప్ నిర్మించిన ఈ జామ్ హైడ్రో పవర్ స్టేషన్ గ్యాకా కౌంటీలో ఉంది. టిబెట్‌లో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలిచే బ్రహ్మపుత్ర టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా పేరొందిన ఈ ప్రాజెక్టు సంవత్సరానికి 2.5 బిలియన్ కిలోవాట్ హవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రాజెక్టుపై భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభ సమయంలో ఆ డ్యామ్ నుంచి ఒకేసారి విడుదల చేసే నీటి ఉధృతి వల్ల దిగువ ప్రాంతాలలో వరదముప్పు తలెత్తే అవకాశముందని పేర్కొంది.