
పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభ మవుతున్నాయి. ఈ సమయంలో పుష్కర స్నానాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యేక బ్రహ్మపుత్ర పుష్కరాల టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజీ (రూ.14,500 ప్లస్ జీఎస్‌టీ)లో గౌహతి, షిల్లాంగ్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక 11 రోజుల ప్యాకేజీ(రూ.17500 ప్లస్ జీఎస్‌టీ)లో గౌహతి, షిల్లాంగ్, కోల్‌కత్తా ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా కామఖ్య శక్తిపీఠం, శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్ కాళీమాత మందిరం, హౌరా బ్రిడ్జి తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తారు. వివరాలకు 8106201230, 7032666925నెంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment