బ్రహ్మపుత్రపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణంపై చైనా ప్రకటన
బీజింగ్: భారత్‌తో సరిహద్దుల్లోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది.
పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment