Tibet
-
నిశ్శబ్దం వీడకుంటే ముప్పు తప్పదు!
టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అతి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దిగువన ఉన్న నదీ తీర దేశమైన భారత్‌కి తెలియజేయకుండా చైనా ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది! మనకు ఉత్తరాన ఉన్న పొరుగు దేశంతో సంబంధాలను నెలకొల్పుకోవడంలో ఉన్న సంక్లిష్టతను ఈ పరిణామం మరోసారి గుర్తు చేసినట్లయింది. పర్యావరణపరంగా దుర్బలమైన, భూకంపాలకు గురయ్యే భౌగోళిక ప్రాంతంలో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుతో విపత్తుల ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారత్ తన నిశ్శబ్ద దౌత్యాన్ని వీడి, చైనాతో అధికారిక మార్గాలలో తన ఆందోళనలను బలంగా నమోదు చేయాలి.చాలా సంవత్సరాలుగా సన్నాహక దశలో ఉన్న చైనా ప్రతిపాదిత యార్లుంగ్ త్సాంగ్పో ప్రాజెక్టును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఇది భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎగువ నదీ తీర దేశంగా ఉంటున్న చైనాకు ఇతర దేశాలతో సహకరించడానికి, నదికి దిగువన ఉన్న దేశాల ప్రయోజనాలను కాపాడటానికి ఇష్టపడని దురదృష్టకరమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనాతో సంబంధాలు క్లిష్టంగా ఉన్న భారతదేశానికి ఈ ప్రాజెక్టు ద్వారా మరో ప్రధానమైన చీకాకు తలెత్తుతోంది.జిన్హువా వార్తా సంస్థ వివరాలను అందించకుండానే ఈ వెంచ ర్ను ‘గ్రీన్ ప్రాజెక్ట్’గా ప్రశంసించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ డ్యామ్ నిర్మాణంలో మొత్తం పెట్టుబడి 1 ట్రిలియన్ యువాన్లు అంటే 137 బిలియన్ డాలర్లను దాటవచ్చు. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు దాదాపు 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా. ప్రస్తుతం చైనాలో ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ గోర్జెస్ ఆన కట్టలోని 88.2 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ తయారీ డిజైన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కానుంది. దీంట్లో భాగంగా నాలుగు నుండి ఆరు వరకు 20 కిలోమీటర్ల సొరంగాలను తవ్వుతారు. నది ప్రవాహంలో సగాన్ని వీటి ద్వారా మళ్లిస్తారు. అయినప్పటికీ, ఇది దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపదని ఉవాచ!ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ యార్లుంగ్ త్సాంగ్పో నదికి చెందిన పెద్ద మలుపు ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. అక్కడ నది యూటర్న్ తీసుకొని 20 కి.మీ కంటే కొంచెం దిగువన భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్ తీవ్ర పర్యవసానాలు మనకు అనేక విధాలుగా గ్రహింపునకు వస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ నది సియాంగ్ పేరుతో చలామణి అవుతుంది. నీటి ప్రవాహానికి ఇది తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. ఇది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు చెందిన ప్రధాన వాహిక. అస్సాం ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతం టిబెట్‌లో 2,93,000 చదరపు కిలోమీటర్లు. భారతదేశం, భూటాన్లలో 2,40,000 చదరపు కిలోమీటర్లు. బంగ్లాదేశ్‌లో 47,000 చదరపు కిలోమీటర్ల మేరకు బ్రహ్మపుత్ర విస్తరించి ఉంది. ఈ నది నీటిలో ఎక్కువ భాగం మన భూభాగంలోనే ప్రవహిస్తుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్... నదీ ప్రవా హాలను, తత్ఫలితంగా దిగువ నివాసితుల జీవనోపాధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.ప్రధాన ప్రాజెక్టుకు అనుసంధానంగా మెకాంగ్ ఎగువ ప్రాంతా లలో చైనా చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం,కృత్రిమ జలపాతాలను సృష్టిస్తుండటం కూడా క్రమవిరుద్ధమైన హెచ్చుతగ్గులకు దారితీయనుంది. దీంతో కొన్ని ప్రాంతాలు ఎండిపోనున్నాయి. చేపల లభ్యత తగ్గుతుంది. దిగువ మెకాంగ్ బేసిన్ లో సారవంతమైన ఒండ్రు నిక్షేపాలకు చోటు లేకుండా పోతుంది. ఇది మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలలోని నదీ తీర ప్రాంత ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా – ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారతదేశం, బంగ్లాదేశ్‌లకు అనూహ్య ప్రతికూల పరిణామాలను కలిగించనుంది.2004లో టిబెట్‌లోని సట్లెజ్ ఉపనది అయిన పరేచు నదిపై ఒక కృత్రిమ సరస్సు ఏర్పడినప్పుడు క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఒక బృందం చేసిన అత్యవసర కసరత్తు ఈ వ్యాసకర్తకు గుర్తుంది. ఆ సమయంలో చైనాతో మనకు సాపేక్షంగా మంచి సంబంధాలు ఉన్నందున, మన భౌగోళిక వనరులు, ఇతర మార్గాల ద్వారా పోగుపడిన సమాచారం ద్వారా మనకు ముందస్తు నోటీసు, డేటా లభించాయి. సరస్సు ఘనీభవించే ముందు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పైగా నివారణ చర్యల కారణంగా తదుపరి సంవత్సరం భారత దేశంలో దిగువన పరిమిత నష్టం మాత్రమే జరిగింది. కానీ, తాజాగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ నుండి పుట్టుకొచ్చే ప్రమాదాలు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయి. ఎంతో సహనంతో కూడిన దౌత్యంతోనే మనం బీజింగ్‌తో పరి మిత సహకారాలను ఏర్పాటు చేసుకోగలిగాం. వాటిలో బ్రహ్మపుత్ర నదికి చైనా రుతుపవనాల సీజన్ డేటాను అందించడంపై మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం, సట్లెజ్ నదికి రుతుపవ నాల సీజన్ డేటా పంచుకోవడం, ‘ట్రాన్ ్స–బోర్డర్ నదులపై సహకా రాన్ని బలోపేతం చేయడం’ ఉన్నాయి. మొదటి రెండు ఎంఓయూ లను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించడం జరుగుతుంది. వీటికి ఇప్పుడు గడువు ముగిసిపోయింది. అంతర్జాతీయ జలమార్గాల నౌకాయానేతర ఉపయోగాల చట్టం– 1997 నాటి ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానాలపై చైనా కానీ, భారత్ కానీ సంతకం చేయలేదు. అయితే, ఈ సమావేశం చేపట్టిన రెండు కీలక సూత్రాలు... భాగస్వామ్య జలాల ‘సమాన మైన, సహేతుకమైన వినియోగం’, దిగువ రాష్ట్రాలకు ‘హాని కలిగించకూడ దనే బాధ్యత’ అనేవాటికి పూర్తి ఔచిత్యం ఉంది. భారత్ బాధ్యతా యుతమైన ఎగువ నదీ తీర దేశంగా ఉంది. పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఉదారమైన ప్రయోజనాలను కూడా భారత్ అందిస్తోంది. దురదృష్టవశాత్తూ, చైనా గురించి అలా చెప్పలేం.జనవరి 3న భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ : ‘‘నదీ జలాలపై స్థిరమైన వినియోగదారు హక్కులు భారత్‌కు ఉన్నాయి. దిగువ నదీ తీర దేశంగా, నిపుణుల స్థాయి, దౌత్య మార్గాల ద్వారా, చైనా భూభాగంలోని నదులపై నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టులపై మా అభిప్రాయాలను, ఆందోళనలను వ్యక్తం చేశాం. తాజా నివేదిక తర్వాత దిగువ ప్రాంతాల దేశాలతో సంప్రదింపుల అవసరంతో పాటు వీటిని కూడా మళ్లీ పునరుద్ఘాటించాం’’ అన్నారు. భారతదేశం ఇప్పటివరకు నిశ్శబ్ద దౌత్యాన్ని ఎంచుకుంది. అయితే, టిబెట్‌లో ప్రస్తుతం ఉన్న నదీ ప్రవాహ ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, భారీ నీటి మళ్లింపు, నిల్వను కలిగి ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారీ పరిమాణం, దానిలోని చిక్కుల దృష్ట్యా, మనం ఇప్పుడు కొత్త ఆందోళనలో ఉన్నాం. ప్రాజెక్టుకు చెందిన సాంకేతిక పరామి తులు, పర్యావరణ ప్రభావ అధ్యయనాలపై మనం వివరణలు కోరాలి. దిగువ ప్రాంతాలకు, ‘సమానమైన, సహేతుకమైన విని యోగం’, ‘గణనీయమైన హాని కలిగించకూడదనే బాధ్యత’ వంటి సూత్రాలను గౌరవించాలని చైనాను కోరాలి. వాస్తవానికి, ప్రాజెక్ట్‌పై పూర్తి సంప్రదింపులు, పరస్పర అవగాహన వచ్చే వరకు తదుపరి పనులను నిలిపివేయాలని మనం అధికారికంగా అడగాలి.నిశ్శబ్ద దౌత్యానికి కూడా తనదైన పరిమితులు ఉంటాయి. చైనాతో అధికారిక మార్గాలలో, ప్రజాక్షేత్రంలో కూడా మన ఆందో ళనలను బలంగా చెప్పాలి. పర్యావరణ నిబంధనలు, స్థానిక జనాభా ప్రయోజనాలపై రాజీ పడకుండా, జలవిద్యుత్, ఇతర ప్రాజెక్టులను మరింత అత్యవసరంగా అమలు చేయాలి. తద్వారా బ్రహ్మపుత్ర జలాలపై భారతదేశ ప్రస్తుత వినియోగదారు హక్కులను పెంచు కోవాలి. నిజానికి, భారీ నీటి నిల్వ ప్రాజెక్టులపై అత్యంత జాగ రూకతతో ముందుకు సాగడంపై గతంలో పంచుకున్న ఆలోచనలకు ఈ మెగా ప్రాజెక్ట్ విరుద్ధంగా ఉంది. అశోక్ కె కంథా వ్యాసకర్త చైనాలో భారత మాజీ రాయబారి -
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం
-
టిబెట్‌ను వణికించిన భూకంపం
బీజింగ్: చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో చోటుచేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజెపై ఎక్కువగా పడింది. అక్కడ నివాస భవనాలు కూలడం వంటి ఘటనల్లో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా జియోలాజికల్ విభాగం అంటోంది.ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, అధికారులు ఆహార పదార్థాలు, మంచినీరుతోపాటు కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, కిల్టులు, బెడ్లు తదితరాలను హుటాహుటిన పంపించారు. జిగాజె ప్రాంతాన్ని షిగస్తె అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌తో సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో షిగస్తె ఒకటి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంగా భావించే పంచన్ లామా ఉండేది షిగస్తెలోనే. భూకంప కేంద్రం డింగ్రి కౌంటీలోని త్సొగోలో ఉంది.భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని లొబుట్సెకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూ ప్రకంపనల ప్రభావంతో నేపాల్‌లోని కవ్రెపలన్చౌక్, సింధుపలన్చౌక్ ధడింగ్, సొలుకుంభు జిల్లాలతోపాటు రాజధాని కఠ్మాండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. -
భారత్‌కు అందే జలాలపై ప్రతికూల ప్రభావం ఉండదు
బీజింగ్: భారత్‌తో సరిహద్దుల్లోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది. -
భారత్‌పై చైనా వాటర్ బాంబ్!
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్‌ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్‌ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్‌లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడివంది. ‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్‌లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్‌కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్‌కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్‌తో భారత్‌పైకి వాటర్‌బాంబ్‌ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది. -
నెట్టింట హల్చల్: అరుదైన యాపిల్స్, ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ యాపిల్ ప్రత్యేకతే వేరు కాదా. యాపిల్ పండు లాంటి బుగ్గలు, ఎర్రటి యాపిల్ ఇలాంటివి ఇప్పటి దాకా విన్నాం. బొద్దుగా ఎర్రగా ఉన్న పిల్లల్ని ముద్దుగా ‘యాపిల్’ అని పిలుచుకోవడం కూడా తెలుసు. ఆ తరువాతి కాలంలో గ్రీన్ యాపిల్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడు బ్లాక్ యాపిల్స్ కూడా వచ్చాయి. మీరు ఎపుడైనా చూశారా? చదువుతూ ఉంటేనో నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? మరి వీటి ధర ఎంత తెలుసా? నెట్టింట తెగ వైరల్ లవుతున్న ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ వివరాలన్నీ తెలుసు కోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. డాక్టర్ అవసరం లేకుండా జీవించాలంటే రోజుకు ఒక యాపిల్ అయినా తినాలనేది. అలా విటమిన్లు, ఫైబర్, పోషకాలు ఇతర శ్రేష్టమైన గుణాలు ఇందులో మెండు. అందుకే యాపిల్ అంటే అంత ప్రత్యేకత. రెడ్ యాపిల్‌లోని లక్షణలతో పోలిస్తే బ్లాక్ రంగులో ఉండే యాపిల్స్ అసాధారణమైన తీపి, అధిక సహజ గ్లూకోజ్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. మందమైన చర్మంతో నిగనిగలాడే ఈ యాపిల్స్ చైనాలోని ఉన్నత స్థాయి రిటైలర్లు మాత్రమే విక్రయిస్తారు. అయితే ధర మాత్రం ఒక్కో పండుకు రూ.500 వరకూ ఉంటుంది. ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అంతేకాదు సాధారణంగా యాపిల్ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడితే, బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల సమయం పడుతుందట. అందులోనూ నిటారుగా ఉన్న పర్వత సానువుల్లో వీటిని పండిస్తారు. ఈ నేపథ్యంలోనే రైతులు వీటి సాగులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారట. వీటిని పెద్ద ఎత్తున సాగు చేయడం కూడా కష్టమే అవుతుంది. హార్వెస్టింగ్ సీజన్ కేవలం రెండు నెలలు మాత్రమే. అందులోనూ 30 శాతం పండ్లు మాత్రమే మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి మార్కెట్లోకి వస్తాయి. అందుకే వీటికి అంత డిమాండ్. Apples are generally red, green, yellow, but if the right geographical conditions are met, they can apparently grow dark purple, almost black, as well. These rare apples are called Black Diamond and they are currently only grown in the mountains of Tibet. pic.twitter.com/j4XXrDlS4X — Massimo (@Rainmaker1973) November 16, 2023 -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే!
సరిహద్దు విషయంలో పొరుగుదేశం చైనా తీరు మారలేదు. స్టాండర్డ్ మ్యాప్ పేరుతో డ్రాగన్ కంట్రీ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ‘ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్’ పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మ్యాప్ పొరుగు దేశాలతో చైనా జాతీయ సరిహద్దులను డ్రాయింగ్ పద్దతి ద్వారా చూపుతోంది. చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ తమ భూభాగంలోనివిగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. భారత్‌లోని వివాదాస్పద భూభాగాలతోపాటు, తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడా తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. చదవండి: ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్ The 2023 edition of China's standard map was officially released on Monday and launched on the website of the standard map service hosted by the Ministry of Natural Resources. This map is compiled based on the drawing method of national boundaries of China and various countries… pic.twitter.com/bmtriz2Yqe — Global Times (@globaltimesnews) August 28, 2023 అయితే దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై చైనాతోపాటు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలకు వివాదాలు కలిగి ఉన్నాయి. కాగా 1962లో భారత్‌తో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకున్న చైనా.. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. అయినా చైనా తన తీరును మార్చుకోలేదు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
చైనా వింత చేష్టలు!
దౌత్యం ఒక ప్రత్యేక కళ. అవతలి పక్షం నుంచి రాబట్టుకోవాలన్నా, మనం ఇచ్చేది ఘనంగా కనబడేట్టు చేయాలన్నా నేర్పుతో, ఓర్పుతో, చాకచక్యంతో మాట్లాడాల్సివుంటుంది. చైనాది మొరటు పద్ధతి. అక్కడి పాలకులకు ఆంతరంగికంగా ఇబ్బందులెదురైనా, సరిహద్దు అవతల తనకు నచ్చని పరిణామం చోటుచేసుకున్నా వెంటనే తన సైనికులను హద్దు దాటించి అలజడి రేకెత్తించటం అలవాటు. అలాంటిది కుదరనప్పుడు నామకరణ మహోత్సవానికి దిగటం రివాజు. తాజాగా చైనా చేసిందదే. ఒక ప్రాంతానికి దక్షిణ టిబెట్ ప్రాంతమని పేరెట్టి, మాండరిన్ భాషాపదమైన జంగ్ నన్‌గా దాన్ని వ్యవహరిస్తూ మన అరుణాచల్ ప్రదేశ్ అందులో భాగమని ఎప్పటినుంచో వాదిస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కు సమీపంలోని పట్టణంతో సహా 11 ప్రాంతాలకు తన సొంత పేర్లతో తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో అయిదు పర్వత శిఖరాలు, రెండు జనావాస ప్రాంతాలు, రెండు నదులు, మరో రెండు ఇతర స్థలాలు ఉన్నాయి. లోగడ 2017లో ఒకసారి, 2021లో మరోసారి చైనా ఈ నామకరణ మహోత్సవాలు చేసింది. చైనా దబాయింపులపై ఎప్పటి కప్పుడు మన దేశం అభ్యంతరం చెబుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా పేర్ల జాబితా విడుదల చేస్తూ ‘చారిత్రక, పాలనాపర అంశాల ప్రాతిపదికగా’ కొత్త పేర్లు పెట్టామని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పుకుంటోంది. చరిత్ర తిరగేస్తే జనం ఒకచోటు నుంచి మరో చోటుకు స్వేచ్ఛగా సంచరిస్తూ వెళ్లటం, ఎక్కడ జీవనం సవ్యంగా గడుస్తుందనిపిస్తే అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవటం కనబడుతుంది. ఈ ఆవాసాలకూ, దారిలో తారసపడే ప్రదేశాలకూ, నదులకూ, పర్వతాలకూ పేర్లు పెట్టడం కూడా మామూలే. దేశాలు తమ తమ సరిహద్దుల్ని ఖరారు చేసుకోవటం ఇంచుమించు 17వ శతాబ్దంలో మొదలైంది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దుల విషయంలో సమస్య ఏర్పడినప్పుడల్లా చరిత్రలో ఆ ప్రాంతాలకు మాండరిన్ భాషలో ఫలానా పేరుందని, కనుక అది తమదేనని మర్కట తర్కానికి దిగటం చైనాకు తెలిసిన విద్య. మన దేశంతో మాత్రమే కాదు... దక్షిణాసియాలో ఇంచుమించు చాలా దేశాలతో దానికి ఇదే తగువు. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని రెండు ప్రధాన ద్వీప సమూహాల్లోని స్ప్రాట్లీ, పరాశల్ దీవుల విషయంలో బ్రూనై, ఇండొనేసియా, మలే సియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాంలతో చైనాకు లడాయి నడుస్తోంది. శతాబ్దాల క్రితం చైనీ యులు చేపల వేటకు ఉపయోగించిన మార్గాన్ని ‘ఖరారు’ చేసి ఆ ప్రాంతమంతా తనదేనని వాదించటం చైనాకే చెల్లింది. ఆ లెక్కన హాంకాంగ్ మొదలు బోర్నియో వరకూ గల దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని 35 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 90 శాతం చైనాదే అవుతుంది! తూర్పు చైనా సముద్ర ప్రాంతంలోని సెంకాకు దీవులు జపాన్ అధీనంలో ఉండగా హఠాత్తుగా ఆ ప్రాంతాన్ని దియోయూ అంటారనీ, అది తనదేననీ 1950లో పేచీకి దిగింది. చైనా ఇలా పేర్లు మార్చినప్పుడల్లా అది జారీచేసే పాస్‌పోర్టుల్లోనూ, అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసే ప్రకటనల్లోనూ ఆ కొత్త పేర్లు వచ్చి కూచుంటాయి. దేశదేశాల్లో ఉండే చైనా పౌరులు వాటిని పదే పదే వల్లిస్తారు. ఈ తంతు అంతా పూర్తి చేశాక తన భూభాగాన్ని అవతలి పక్షం ‘చట్టవిరుద్ధంగా’ ఆక్రమించుకున్నదని అదును చూసుకుని గొడవ మొదలెడుతుంది. వివాదాలు ముదిరి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు కెళ్లినప్పుడు ఆ ప్రాంతం తన పాలనా నిర్వహణలోనే ఉన్నదని చెప్పుకోవటం, దానికున్న పేరు తాను పెట్టిందేనని నిరూపించుకోవటం, సంబంధిత మ్యాప్‌లు చూపటం అవసరమవుతుంది. ఇలా చడీచప్పుడూ లేకుండా చిన్నగా వివాదం ప్రారంభించటం, ఆనక దాన్ని పెద్ద సమస్యగా మార్చటం చైనాకు అలవాటు. వియత్నాంతో ఉన్న వివాదం విషయంలో అది మరింత వింతగా ప్రవర్తించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా వాదనకు అనుగుణమైన మ్యాప్ ముద్రించి ఉన్న టీ షర్టులతో 2018లో 14 మంది చైనా పర్యాటకులు వచ్చినప్పుడు వియత్నాం ప్రజలు ఆగ్రహంతో రగిలి పోయారు. ఆ టీ షర్టులు తీసేవరకూ బయటకు అడుగుపెట్టనీయబోమని విమానాశ్రయ అధికారులు చెప్పటంతో గత్యంతరంలేక వారు మార్చుకోవాల్సి వచ్చింది. చూడటానికి ఇది తుంటరి చేష్టగా కనబడుతుంది. పెద్ద పట్టించుకోవటం ఎందుకనిపిస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న చర్యలే మున్ముందు అక్కర కొస్తాయన్నది దాని ఆలోచన. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది. దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మన దేశం మొదటినుంచీ అన్నివిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా దలైలామాను మన అధికార పక్ష నేతలు కలిసినప్పుడో, అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్రమంత్రులు పర్యటించినప్పుడో నిరసన స్వరం వినిపించటం చైనాకు అలవాటు. మరికొన్ని వారాల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) మంత్రుల స్థాయి సదస్సుకు చైనా రక్షణ మంత్రి మన దేశం రావాల్సివుంది. జూలైలో ఆ సంస్థ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వస్తారు. ఎస్సీఓకు ప్రస్తుతం మన దేశం సారథ్యం వహి స్తోంది. ఇలాంటి సమయంలో కొత్త తగువు రేకెత్తించాలన్నది చైనా ఎత్తుగడ కావొచ్చు. మన దేశం చెప్పినట్టు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన భౌగోళిక వాస్తవాలు మారిపోవు. వివాదాలు పరిష్కారమై పోవు. వివేకం తెచ్చుకుని హుందాగా వ్యవహరించటం నేర్చుకుంటే గౌరవం నిలబడుతుంది. చిల్లర తగాదాలతో కాలక్షేపం చేద్దామనుకుంటే అది చైనాకే చేటు తెస్తుంది. -
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide . — Subramanian Swamy (@Swamy39) August 3, 2022 చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్ భూభాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. చదవండి: కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం! -
చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో
బీజింగ్: చైనాలోని సౌత్‌వెస్ట్ నగరం చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని సౌత్‌వెస్ట్ చాంగ్కింగ్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం ఉదయం టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్ గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకుని వెంటనే ల్యాండ్ చేశారు. కానీ విమానం ల్యాండింగ్ చేసిన తరువాత అది కంట్రోల్ తప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. దీంతో పాటు విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది అందులోని ప్రయాణికులని, సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడగా అస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA — BST2022 (@baoshitie1) May 12, 2022 చదవండి: Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం -
రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు. అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు. -
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు. అరుణాచల్ మా దేశంలో అంతర్భాగం: భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. -
చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..!
లాసా: భారత్‌పై చైనా తన కుతంత్రాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వాణిజ్యపరంగా, భౌగోళికంగా భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మురం చేసింది. దాయదాది దేశం పాకిస్థాన్‌తో స్నేహం చేస్తూ చైనా ఇష్టరీతినా వ్యవహరిస్తోంది. 2013 నుంచి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కింద పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా ప్రారంభించింది. ఈ కారిడర్‌పై భారత్ అంతర్జాతీయంగా చైనా కుతంత్రాలను వెలుగులోకి తెచ్చింది. చదవండి: బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్‌ను చట్టవిరుద్దమైందని భారత్ పేర్కొంది. ఈ కారిడార్ జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలగుండా వెళ్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది లోక్‌సభలో వెల్లడించింది. భారత్‌పై చైనా కుతంత్రాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. తాజాగా టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లలో దాదాపు 30 విమానాశ్రయాలను చైనా నిర్మించినట్లు వార్తలు వస్తోన్నాయి. చైనా ఆర్మీకి ఆయుధాలను, సైనికుల రవాణా సులభంగా ఉండేందుకుగాను 30 సివిల్ ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఉరుమ్కి, కష్గర్, లాసా, షిగాట్సే ఇతర ప్రదేశాలలో ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దులోని మారుమూల ప్రాంతాలలో చైనా, పౌర సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుందని చైనా అధికారిక మీడియా నివేదించింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందడంతో వాయు రవాణా సౌలభ్యం మరింత సులభమవుతోందని చైనా ఆర్మీ అధికారి చెప్పారు. ఈ విమానశ్రాయాలతో డబ్ల్యుటిసి జిన్జియాంగ్, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతాలతో పాటు భారత సరిహద్దును పర్యవేక్షించనుంది.టిబెట్‌లో చైనాలో మౌలిక సదుపాయాలను పెంచుతోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరగా ఉన్న టిబెటన్ సరిహద్దు పట్టణమైన నింగింగ్తో ప్రావిన్షియల్ రాజధాని లాసాను కలిపే హైస్పీడ్ బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. టిబెటిన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన తొలి చైనా నాయకుడు. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇటీవల నింగిచిని సందర్శించారు, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన మొదటి చైనా నాయకుడు. చదవండి: Old Phones: చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ! -
పోటాపోటీ.. చైనా దూకుడు
స్పేస్ రేస్.. ఇప్పుడు ఒక హాట్ బిజినెస్‌గా మారింది. ఈ బిజినెస్‌లో కుబేరుల ఎంట్రీతో ప్రస్తుతం బిలియన్ల డాలర్ల వ్యాపారం నడుస్తోంది. ఈ రంగంలో అమెరికాతో పాటు రష్యాలు నువ్వా-నేనా అన్నట్లు పోటీతత్వం ప్రదర్శిస్తున్నాయి. మధ్యలో దూరుతున్న చైనా.. అంతరిక్ష పరిశోధనల్లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే స్పేస్ స్టేషన్ ద్వారా పరిశోధనలు ముమ్మరం చేసిన డ్రాగన్ కంట్రీ.. త్వరలో మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఓ భారీ స్పేస్ అబ్జర్వేటరీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. అయితే అది సొంత గడ్డపై కాదు. టిబెట్ క్వింఘై ప్రావిన్స్‌లోని లెంగూ టౌన్లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. చైనాలో గత రెండేళ్లుగా అసాధారణమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనివల్ల అంతరిక్ష పరిశోధనలకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి. స్పేస్ రేసులో పురోగతి దిశగా అడుగులు వేస్తున్న టైంలో ఈ పరిస్థితులకు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ దశలో తమ ఆధీనంలో ఉన్న లెంగూ టౌన్‌పై చైనా కన్నుపడింది. ఈ ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది. పైగా జనాభా తక్కువ. అందుకే సంపూర్ణ వ్యవస్థను పరిశీలించేందుకు నిర్మించబోతున్నట్లు వెల్లడించింది. పైగా ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేశ స్పేస్ ఏజెన్సీ ఉపయోగించనంత టెక్నాలజీని.. ఈ అబ్జర్వేటరీ సెంటర్ కోసం చైనా ఉపయోగించబోతోంది. ఇదీ చదవండి: స్పేస్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్!! వచ్చే ఏడాదే! 1959లో చైనా లెంగూ టౌన్‌ను ఆక్రమించుకుంది. ఇక్కడ సాలీనా 18మిమీ వర్షపాతం, 3,500 గంటల సూర్యరశ్మి ఉంటుంది. పైగా 200 కిలోమీటర్లలోపు రవాణా సౌకర్యం ఉంది. అందుకే ఈ ఏరియాను ఎంచుకుంది చైనా. వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ ద్వారా ఈ పరిశోధనల్ని నిర్వహించబోతున్నారు. 2021 చివరిల్లా టెలిస్కోప్ సెటప్ పూర్తి కానుందని, 2022 నుంచి పని ప్రారంభిస్తుందని చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. -
టిబెట్‌లో జిన్‌పింగ్ పర్యటన.. అధ్యక్ష హోదాలో తొలిసారి
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అరుదైన పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిన్‌పింగ్ చైనాకు రాజకీయంగా సున్నిత ప్రాంతమైన టిబెట్‌లో పర్యటిస్తున్నారని.. ఆ దేశ అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గత మూడు దశాబ్దాల్లో చైనా అధ్యక్షుడు టిబెట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. చైనా జాతీయ మీడియా సీసీటీవీ శుక్రవారం విడుదల చేసిన ఫుటేజీలో, విమానం నుంచి దిగిన జిన్‌పింగ్‌కు సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో చైనీస్ జెండాలను పట్టుకుని ఊపుతూ, సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన దృశ్యాలు ఉన్నాయి. బుధవారం టిబెట్ ఆగ్నేయంలోని నియింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, రెండు రోజుల వరకు కూడా జిన్‌పింగ్ పర్యటన గురించి అధికారిక మీడియాలో ప్రస్తావించలేదు. "అన్ని జాతుల కార్యకర్తలు, ప్రజల ఆదర స్వాగతం అనంతరం జిన్‌పింగ్ న్యాంగ్ నది వంతెన వద్దకు వెళ్లి.. యార్లుంగ్ త్సాంగ్పో నది, న్యాంగ్ నది జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు’’ అని సీసీటీవీ వెల్లడించింది. జిన్‌పింగ్ గతంలో రెండుసార్లు టిబెట్‌లో పర్యటించారు. 1998 లో ఒకసారి ఫుజియాన్ ప్రావిన్స్ పార్టీ చీఫ్‌గా, 2011 లో మరోసారి ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో టిబెట్‌లో పర్యటించారు. అధ్యక్ష హోదాలో టిబెట్‌లో పర్యటించడం మాత్రం ఇదే ప్రథమం. టిబెట్‌ను సందర్శించిన చివరి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్. 1990 లో జియాంగ్ టిబెట్‌లో పర్యటించారు. కొన్ని శతాబ్దాలుగా తమ నియంత్రణలో ఉన్న టిబెట్‌ని 1951 లో శాంతియుతంగా విముక్తి చేశామని.. అంతేకాక గతంలో అభివృద్ధి చెందని ఆ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు, విద్యను తీసుకువచ్చింది తామే అని చైనా చెప్పుకుంటుంది. కానీ బహిష్కరించబడిన చాలా మంది టిబెటన్లు చైనా ప్రభుత్వం తమ నేలపై మతపరమైన అణచివేతకు పాల్పడుతూ.. వారి సంస్కృతిని నాశనం చేస్తుందని ఆరోపించారు. 2008లో చైనా చర్యల వల్ల ఈ ప్రాంతంలో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. చైనా టిబెట్ వివాదం ఎప్పుడు మొదలైంది.. చైనా, టిబెట్ మధ్య గొడవ.. టిబెట్ చట్టబద్ధ హోదాకు సంబంధించినది. టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది. కానీ టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని, తమపై చైనా అధికారం నిరంతరంగా కొనసాగలేదని చెబుతారు. మంగోల్ రాజు కుబ్లాయ్ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ను ఆక్రమించింది. కానీ మూడేళ్లలోనే టిబెటన్లు వారిని తరిమికొట్టి.. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటించారు. 1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు. దాంతో దలైలామా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు. -
డ్రాగన్ పన్నాగం: సరిహద్దులో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం
బీజింగ్: సరిహద్దు వివాదాలు పూర్తిగా సమసిపోకముందే డ్రాగన్ దేశం చైనా మరో పన్నాగానికి తెర తీసింది. ఈసారి భారత్-టిబెట్ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్ రైలును ప్రారంభించింది. తద్వారా బలగాలను ఈ ప్రాంతంలోకి వేగంగా చేరవేసేందుకు అవకాశం కలుగుతుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. టిబెట్‌లో ఇదే తొలి బుల్లెట్ ట్రైన్. అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించడం ద్వారా చైనా వ్యూహాత్మక అడుగు వేసినట్లయింది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచువాన్-టిబెట్ రైల్వే టిబెట్‌లో నిర్మించిన రెండో రైలు మార్గం. గతంలో క్వింఘాయ్-టిబెట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. సరిహద్దులో భద్రతను పరిరక్షించడంతో ఈ కొత్త రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని.. కనుక దీన్ని తర్వగా పూర్తి చేయాలని నవంబర్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు గతంలో 48 గంటల సమయం పడుతుండగా.. తాజాగా బుల్లెట్ ట్రైన్ ప్రారంభంతో ఇది 13 గంటలకు తగ్గబోతోంది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు కీలక అడుగు కానుంది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
చైనా భారీ ప్రాజెక్టు; భారత్‌పై ప్రభావం!
బీజింగ్: హిమాలయ నదుల్లో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు డ్రాగన్ దేశ అధికార మీడియా వెల్లడించింది. చైనా సొసైటీ ఫర్ హైడ్రోపవర్ ఇంజనీరింగ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా విద్యుదుత్పత్తి కార్పొరేషన్ చైర్మన్ యాన్ జియాంగ్ మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా జరుగలేదు. చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమలో ఇదొక నూతన అధ్యాయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని టిబెట్‌లో యార్లాంగ్ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించనుంది’’ అని వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అదే విధంగా టిబెట్- అరుణాచల్ సరిహద్దులోని మెడాగ్ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, జాతీయ భద్రత, నదీ జలాలు, అంతర్గత భద్రత తదితర అంశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(జాతీయ అసెంబ్లీ) వచ్చే ఏడాది ఆమోదించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాల గురించి తీర్మానం చేస్తూ చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గత నెలలో నిర్ణయం తీసుకుంది. (చదవండి: వైరస్ భారత్ నుంచి వచ్చిందంటూ చైనా వాదనలు) చైనా వైఖరిపై విమర్శలు ఇక ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మాణాల నేపథ్యంలో ఇటు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్‌కు బ్రహ్మపుత్రతో పాటు ఇవి కూడా అనుకూలమైనవనని నిపుణులు ఇప్పటికే తేల్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటినీ కాదని, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపైనే చైనా దృష్టి పెట్టడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారేలా చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం వక్రబుద్ధితోనే బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. (చదవండి: మాంసం ముద్దలు విసురుతూ నిరసన) కాగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాలకు నష్టం చేకూర్చేవిధంగా వ్యవహరించవద్దని భారత్ ఇప్పటికే చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. డ్రాగన్ దేశ నిర్ణయాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే దిగువ ప్రాంత ప్రయోజనాలు కాలరాసే విధానాన్ని సహించబోమని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 2006లో సరిహద్దు నదీ జలాల విషయంలో తలెత్తిన సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా ఎక్స్పర్ట్ లెవల్ మెకానిజం(ఈఎల్ఎం)ను ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక బంధంలో భాగంగా ఇప్పటికే రూపొందించిన ఎంఓయూల నేపథ్యంలో బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులకు సంబంధించిన వరద జలాలు, హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని చైనా భారత్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. -
ఇదే చైనా కుటిల నీతి..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా వ్యూహాలు, ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ఏ విధంగా వ్యవహరిస్తుంది వంటి అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్రమిత ప్రాంతాల్లో చైనా పాటించే విధనాలు ఏంటో చూడండి. ప్రపంచంలో ప్రతి దానికి చైనా తన సొంత పేర్లు పెడుతుంది. భూమి కానీ.. మనుషులు కానీ ఏదైనా సరే. బలవంతంగా ఆక్రమించిన ప్రాంతంలో మనుషులను తన డిక్షన్లోకి మార్చుకుంటుంది డ్రాగన్ దేశం. దానిలో భాగంగానే ముస్లింలను చైనా సంస్కృతిలో కలపడానికి గాను ఇస్లామిక్ పేర్ల మీద నిషేధం విధించింది. అంతేకాక వారికి సంబంధించిన మత గ్రంథాలను తనకు అనుకూలంగా మార్చుకుంది చైనా. ఆఖరికి మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సైతం వదలలేదు. అక్కడి మీడియా, ప్రెస్ నోట్లలో వారి పేర్లను చైనీస్‌లోకి అనువాదం చేసి సు జీషెంగ్, టాంగ్నాడే తెలాంగ్పు అని పేర్కొంటుంది. విషయాలను స్వంతం చేసుకోవడమే ఇక్కడ దాని ప్రధాన ఆలోచన. (చదవండి: వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలు రద్దు!) ఇక చైనా తాను ఆక్రమించిన ప్రాంతాల చరిత్రను మార్చడానికి వాటికి కొత్త పేర్లను పెడతుంది. 1950-60 మధ్య టిబెట్ విషయంలో ఇదే జరిగింది. దాని పేరును జిజాంగ్(వెస్ట్రన్ త్సాంగ్)గా మార్చగా.. తూర్పు తుర్కెస్తాన్ పేరును జిన్జియాంగ్గా మార్చింది. జిజాంగ్ అంటే పాశ్యాత్య ధూళి అని అర్థం. టిబెట్లను అవమానించే ఉద్దేశంతో చైనా ఈ పేరు పెట్టింది. పేరు మార్చడం పూర్తయ్యాక ఆ ప్రాంతానికి సంబంధించి అసంబద్ధమైన వాదనలను తెర మీదకు తెస్తుంది. టిబెట్ విషయంలో ఇదే జరగింది. టిబెటన్ బౌద్ధమతం ఇన్నర్ మంగోలియాలో ఉద్భవించింది అనే హాస్యాస్పదమైన వాదనను తెరమీదకు తెచ్చింది. ఇక్కడ చైనా ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టిబెటన్ల మీద భారతీయ ప్రభావాన్ని దూరం చేయడం. ఇస్లామిక్ పేర్లను నిషేధించడం ముస్లిం ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించిన చైనా అక్కడి వారిని పూర్తిగా తనలో కలుపుకుంటుంది. దానిలో భాగంగానే ఇస్లామిక్ పేర్లను నిషేధిస్తుంది. ప్రస్తుతం జిన్జియాంగ్గా పిలువబడే తూర్పు తుర్కెస్తాన్‌లోని చురుకైన ప్రాంతాల్లో నుంచి ఇస్లాం ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడానికి చైనా దేశంలో 29 ఇస్లామిక్ పేర్లను నిషేధించింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఈ పేర్లతో జననమరణాలను రిజిస్టర్ చేయడం.. పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకోవడం అసాధ్యం. అంతేకాక ఈ పేరు ఉంటే పాఠశాలలు మొదలు.. యూనివర్సిటీల వరకు ఎక్కడా ప్రవేశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించవు. ఇక్కడ చైనా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉయ్ఘర్ సమాజాన్ని పూర్తిగా లొంగదీసుకుని తనలో కలుపుకోవడమే. (చదవండి: ముదురుతున్న వివాదం) ఇంటర్నెట్‌ని ప్రభావవంతంగా వాడటం చైనా జనాభా 1.42 బిలియన్లు. ప్రపంచ మొత్తం జనాభాలో ఐదొంతుల మంది ఇక్కడే ఉన్నారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఇంటర్నెట్కి ఉందని అర్థం చేసుకున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ఇంటర్నెట్‌ని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంది. చైనా విదేశాంగ విధానాలకు అనుగుణంగా దేశీయ, ప్రపంచ రంగాలపై అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి షాంఘై యూనిట్ 61398 వంటి పీఎల్ఏ సైబర్ క్రైమ్ బ్రిగేడ్‌ను సీసీపీ చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. గ్రంథాలు, పుస్తకాలను అనువదించడం టిబెటన్ జనాభాను చైనీస్ భాషలో చదవమని బలవంతం చేయడానికి చైనా వేదాంత సంస్థలలోని అన్ని బౌద్ధ గ్రంథాలను అనువదించడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2018 లో లాసా జోఖాంగ్ ఆలయాన్ని తగలబెట్టడం.. టిబెటన్ బౌద్ధమతంలో అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన ప్రదేశాలలో పాత బౌద్ధ గ్రంధాలన్నింటినీ తగలబెట్టే ప్రయత్నం చేసింది. వీటిని నాశనం చేసి చైనీస్ భాషలో కొత్త పుస్తకాలు ప్రచురించింది. ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశం ఇక మీదట ఆక్రమిత టిబెట్‌లోని కొత్త తరం సన్యాసులు బీజింగ్‌కు దగ్గరగా ఉండటమే కాక వారి మీద సీసీపీ ప్రభావంతో ఉంటుంది. ఇటువంటి చర్యలతో, చైనా అది ఆక్రమించిన కమ్యూనిటీలు, భూముల గుర్తింపును పూర్తిగా మార్చివేస్తోంది. దీనిలో భాగంగా హాన్ సమాజం, మధ్య సామ్రాజ్యం జాంగ్గువో మినహా అన్నింటినీ తుడిచివేసింది. -
‘గ్రీన్‌లైన్’పై చైనా గురి
న్యూఢిల్లీ: గత నెలాఖరులో లద్దాఖ్‌లో చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ– పీఎల్ఏ) పెద్ద పన్నాగమే పన్నింది. లద్దాఖ్‌తో టిబెట్ సరిహద్దును చైనా ‘గ్రీన్‌లైన్’తో నిర్వచిస్తోంది. ఈ గ్రీన్‌లైన్ పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలోని ఫింగర్–4 పర్వత ప్రాంతం మీదుగా వెళుతూ... దక్షిణతీరంలోని చుషుల్ లోయ మొత్తాన్ని చైనా భూభాగంగా చూపిస్తుంది. 1960లో చైనా తయారుచేసిన మ్యాప్ ఇది. ఆగస్టు 29– 30 మధ్యరాత్రి వేళ పీఎల్ఏ దుస్సాహసానికి దిగింది. ఈ గ్రీన్‌లైన్ మేరకు భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా పెద్ద ఎత్తున బలగాలతో ముందుకు కదిలింది. వాస్తవా«ధీన∙రేఖ వద్ద ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించింది. ‘పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని కీలకమైన అన్ని పర్వత ప్రాంతాలపై, చుషుల్‌లో మోహరించడం ద్వారా భారత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ప్రత్యర్థి కదలికలకు చెక్ పెట్టింది. లేకపోతే మొత్తం చుషుల్ లోయను పీఎల్ఏ తమ స్వాధీనంలోకి తీసుకునేది. ఎలాగైనా గ్రీన్‌లైన్‌ను చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆరోజు చైనా సైన్యం ముందుకు కదిలింది. భారీ ట్యాంకులు, భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్స్, భారీ తుపాకులను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి భారత సైన్యాన్ని వెనుకడుగు వేసేలా బెదరగొట్టాలని చూసింది. అయితే వెంటనే అప్రమత్తమైన భారత్... ఫింగర్–4పై, పాంగాంగ్ దక్షిణ తీరంలో తమ బలగాల మోహరింపులో మార్పులు చేర్పులు చేసింది. తదుపరి అడుగు వేయడానికి చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేసింది. అలా డ్రాగన్ దురాక్రమణ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది’ అని భారత సైనిక ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రెండు చోట్ల ఎదురెదురుగా... ఒకవైపు శుక్రవారం రష్యాలో ఇరుదేశాల రక్షణశాఖ మంత్రుల సమావేశం జరిగినప్పటికీ... సరిహద్దుల్లో మాత్రం చైనా ఇంకా తన దుందుడుకు చర్యలను ఆపడం లేదు. చుషుల్ లోయలోని రెచిన్ లా ప్రాంతంలో, బంప్ అనే మరోచోట భారత్– చైనా సైన్యాలు ఎదురెదురుగా మోహరించాయి. సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని చైనా పెంచుతూనే ఉంది. బంప్‌కు అభిముఖంగా, వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న బ్లాక్‌టాప్ శిఖరంపై పీఎల్ఏ 150 మంది సైనికులను, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ను మోహరించింది. -
చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా
వాషింగ్టన్: చైనాపై ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికా యోచిస్తోంది. డ్రాగన్ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, అమెరికాలో ఆ వైరస్ మృత్యుహేల నేపథ్యంలో ఇప్పటికే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్తున్న విషయం తెలిసిందే. హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీఘర్ ముస్లింలపై వేధింపులు, టిబెట్‌లో భద్రతాపరమైన ఆంక్షలు.. మొదలైన వాటి విషయంలో అమెరికా ఆగ్రహంగా ఉంది. ‘ప్రసిడెంట్ ట్రంప్‌ను కాదని నేను ముందే చెప్పలేను. కానీ చైనాపై అమెరికా తీసుకోనున్న చర్చల గురించి మీరు త్వరలోనే వింటారు’ అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కొత్త వీసా రూల్స్‌తో కష్టాలే నూతన వీసా నిబంధనల వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులను, అనిశ్చితిని ఎదుర్కొంటారని యూఎస్‌లోని భారత దౌత్యాధికారి పేర్కొన్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీలు, కాలేజీలు తమ విద్యా సంవత్సర ప్రణాళికలను ఇంకా ప్రకటించని ప్రస్తుత పరిస్థితుల్లో జారీ అయిన ఈ నిబంధనలు భారతీయ విద్యార్థులను మరింత అనిశ్చితిలోకి, మరిన్ని కష్టాల్లోకి తీసుకువెళ్తాయని భారతీయ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సంబంధిత అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ఉన్నతవిద్యలో భాగస్వామ్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. పూర్తిగా ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్ధులు స్వదేశాలకు వెళ్లాల్సిందేనని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో ఎక్కువగా నష్టపోయేవారిలో భారతీయ విద్యార్థులే అధికం. -
చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!
హాంకాంగ్: చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఒకే దేశం- ఒకే పాలసీ విధానాన్ని ఎండగడుతూ సోషల్ మీడియాలో #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమాన్ని చేపట్టారు. అదే విధంగా మైనార్టీలపై అకృత్యాలు, అణచివేతకు పాల్పడుతున్న చైనా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఇప్పుడూ.. ఎప్పుడూ ఒకే చైనా లేదు. ఉండబోదు కూడా. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. జిన్జియాంగ్లో నివసించే ఉగర్ ముస్లింలు, టిబెటన్లు, తైవాన్ ప్రజలు, మంచూరియన్లు, హాంకాంగ్ వాసులను జిన్‌పింగ్ నేతృత్వంలో చైనా ప్రభుత్వం అణచివేస్తోంది. పశ్చిమ దేశాలు డ్రాగన్, దాని నియంత షీను పొగడటం మానేయాలి! ఒకే చైనా అనేది ఓ అభూతకల్పన. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా చైనా ఆగడాలపై మౌనం వీడాలి’’అంటూ ట్విటర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు.(చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు) (చైనాకు లడఖ్ ఒక వేలు మాత్రమే) చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు.. ఇక గాల్వన్ లోయ ప్రాంతంలో భారత జవాన్లపై ఘాతుకానికి తెగబడిన చైనాపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డ్రాగన్ దుశ్చర్యకు నిరసనగా.. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణు అవతారమైన రాముడు.. చైనా డ్రాగన్‌పై బాణం సంధిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను హాంకాంగ్ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు చెబుతున్న భారత నెటిజన్లు.. #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టిబెటన్లు సైతం వీరికి తోడయ్యారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) ‘‘ప్రపంచానికి చైనా పెద్ద తలనొప్పిగా మారింది. చైనా ఒకే దేశం- ఒకే వ్యవస్థ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి! చైనా కబంధ హస్తాల నుంచి టిబెట్ స్వాతంత్ర్యం పొందేలా చేయాలి. చైనా ఉత్పత్తులను అందరూ బహిష్కరించాలి’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఉగర్లపై డ్రాగన్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పటికే వేలాది మందిని అనధికారికంగా నిర్బంధ క్యాంపులకు తరలించింది. ఇక స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన తైవాన్ సరిహద్దుల్లో సైతం చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదే విధంగా హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ఇటీవల జాతీయ భద్రతా చట్టానికి డ్రాగన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.(డ్రాగన్ దూకుడు.. తైవాన్ హెచ్చరికలు!) 印度朋友連中印大戰精美poster都整好了https://t.co/pdU9nS6Zra - 分享自 LIHKG 討論區 pic.twitter.com/ttl7XLPsmi — HoSaiLei🇺🇸🇬🇧🇧🇪🇯🇵🇮🇳 (@hkbhkese) June 16, 2020 1. Honkong isn't a part of China 2. Taiwan is an independent nation 3. Macau isn't a part of China 4. Tibet is an independent nation 5. China is harrasing Uighurs in Xinjiang 6. Also it's time to get our Aksai Chin back!! China is a threat to entire world.#JunkOneChina pic.twitter.com/6rJOoo30ht — श्रीमंत आदित्य पंत हिन्दू (देशस्थ ब्राह्मण) (@AdityaBangali1) June 19, 2020 -
చైనాకు లడఖ్ ఒక వేలు మాత్రమే
లాసా: లడఖ్ గాల్వన్ లోయలో చైనా దొంగదెబ్బ తీయడంపై టిబెట్ నేత లబ్సాంగ్ సంగాయ్ భారత్‌ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సరిహద్దులో దుశ్చర్యకు పాల్పడ్డ చైనా తీరు చూస్తుంటే అది "ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్ స్ట్రాటజీ" అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. "ఈ సిద్ధాంతం ప్రకారం అరచేతిగా భావించే టిబెట్‌ను మావో జిడాంగ్ సహా ఇతర చైనా నేతలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మిగతా ఐదు వేళ్లను ఆక్రమించుకునే దిశగా కుయుక్తులు పన్నుతున్నారు. (చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా) ఇందులో ఇప్పటికే మొదటి వేలు లడఖ్‌పై డ్రాగన్ దేశం దృష్టి సారించగా మిగతా వేళ్లు నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌కు రానున్న కాలంలో ముప్పు తప్పదు" అని తెలిపారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని గత 60 సంవత్సరాలుగా టిబెట్ నేతలు భారత్‌ను హెచ్చరిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాగా భారత్-చైనా మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోగా 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!)