Viral: Chinese Astronomers To Build Observatory In Tibetan Plateau - Sakshi
Sakshi News home page

టిబెట్‌ నేలపై చైనా భారీ అబ్జర్వేటరీ, అక్కడే ఎందుకంటే..

Published Fri, Aug 20 2021 10:26 AM | Last Updated on Fri, Aug 20 2021 5:31 PM

China Astronomers Observatory Project At Tibetan Plateau - Sakshi

స్పేస్‌ రేస్‌.. ఇప్పుడు ఒక హాట్‌ బిజినెస్‌గా మారింది. ఈ బిజినెస్‌లో కుబేరుల ఎంట్రీతో ప్రస్తుతం బిలియన్ల డాలర్ల వ్యాపారం నడుస్తోంది. ఈ రంగంలో అమెరికాతో పాటు రష్యాలు నువ్వా-నేనా అన్నట్లు పోటీతత్వం ప్రదర్శిస్తున్నాయి. మధ్యలో దూరుతున్న చైనా.. అంతరిక్ష పరిశోధనల్లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌ ద్వారా పరిశోధనలు ముమ్మరం చేసిన డ్రాగన్‌ కంట్రీ.. త్వరలో మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఓ భారీ స్పేస్‌ అబ్జర్వేటరీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. అయితే అది సొంత గడ్డపై కాదు. టిబెట్‌  క్వింఘై ప్రావిన్స్‌లోని లెంగూ టౌన్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

చైనాలో గత రెండేళ్లుగా అసాధారణమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనివల్ల అంతరిక్ష పరిశోధనలకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి. స్పేస్‌ రేసులో పురోగతి దిశగా అడుగులు వేస్తున్న టైంలో ఈ పరిస్థితులకు చైనాకు ఇబ్బందికరంగా మారాయి.  ఈ దశలో తమ ఆధీనంలో ఉన్న లెంగూ టౌన్‌పై చైనా కన్నుపడింది. ఈ ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతంలో  ఉంది. పైగా జనాభా తక్కువ. అందుకే సంపూర్ణ వ్యవస్థను పరిశీలించేందుకు నిర్మించబోతున్నట్లు వెల్లడించింది. పైగా ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేశ స్పేస్‌ ఏజెన్సీ ఉపయోగించనంత టెక్నాలజీని.. ఈ అబ్జర్వేటరీ సెంటర్‌ కోసం చైనా ఉపయోగించబోతోంది. 

ఇదీ చదవండి: స్పేస్‌లో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌!!

వచ్చే ఏడాదే!
1959లో చైనా లెంగూ టౌన్‌ను ఆక్రమించుకుంది. ఇక్కడ సాలీనా 18మిమీ వర్షపాతం, 3,500 గంటల సూర్యరశ్మి ఉంటుంది. పైగా 200 కిలోమీటర్లలోపు రవాణా సౌకర్యం ఉంది. అందుకే ఈ ఏరియాను ఎంచుకుంది చైనా. వైడ్‌ ఫీల్డ్‌ సర్వే టెలిస్కోప్‌ ద్వారా ఈ పరిశోధనల్ని నిర్వహించబోతున్నారు. 2021 చివరిల్లా టెలిస్కోప్‌ సెటప్‌ పూర్తి కానుందని, 2022 నుంచి పని ప్రారంభిస్తుందని చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement