
చైనాలో సిద్ధమైన ‘అతి ఎత్తై’ విమానాశ్రయం
టిబెట్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళిక
బీజింగ్: ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని తీవ్రంగా తహతహలాడుతున్న చైనా.. భూమ్మీద అత్యంత ఎత్తై ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించి మరో రికార్డును సృష్టించింది. ఇప్పటికే అతి పెద్ద డ్యామ్, అతి ఎత్తై రైలు మార్గం వంటి ‘అతి పెద్ద’ రికార్డుల్లోకి ఈ విమానాశ్రయం కూడా చేరింది. చైనా అధీనంలో టిబెట్‌లోని సిచువాన్ రాష్ట్రంలో నిర్మించిన ఈ విమానాశ్రయం సముద్రమట్టం నుంచి 4,411 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని ఈ నెల 16వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.