
బీజింగ్ : భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపం నుంచి చైనా నిర్మించి 409 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ రహదారి టిబెట్ రాజధాని లాసా నుంచి చైనాలోని నైచీ ప్రాంతాన్ని కలుపుతుంది. మధ్యలో అరుణాచల్ ప్రదేశ్‌కు సరిహద్దుకు అత్యంత సమీపం నుంచి వెళుతుంది. టోల్ ఫ్రీ అయిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవే మీద గంటకు సగటున 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. టూరిస్టుల కోసమే ఈ రహదారి అని చైనా అధికారులు చెబుతున్నా.. సైనిక అవసరాలకే ఈ హైవేని ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే టిబెట్‌లోని అన్ని రకాల రహదారులను చైనా మిలటరీ అవసరాల కోసమే వినియోగిస్తోంది.