
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్‌ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్‌ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్‌లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడివంది.
‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్‌లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్‌కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్‌కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్‌తో భారత్‌పైకి వాటర్‌బాంబ్‌ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment