hydropower station
-
పోలవరం విద్యుత్ కేంద్రం.. ఓ దిష్టిబొమ్మే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే కూటమి ప్రభుత్వం కుదించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ప్రశ్నార్ధకంగా మారింది. ఏడాది పొడవునా కారు చౌకగా విద్యుత్తునందించే ఈ కేంద్రం ఇప్పుడు దిష్టిబొమ్మలా మారనుంది. దీనివల్ల ప్రజలు చౌక విద్యుత్‌ను కోల్పోయి, ఈమేరకు విద్యుత్‌ను బయట కొనుగోలు చేస్తే ప్రజలపై చార్జీల భారం పడుతుందని, పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలిగి, ఉపాధి అవకాశాలూ దెబ్బ తింటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాల తరహాలో ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలోనూ కరెంటు ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే కుదించడం ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలన్నింటికీ గండి కొట్టేసింది. కేవలం ఓ బ్యారేజ్‌గా మార్చేస్తోంది. దీనివల్ల ‘హెడ్’ తగ్గిపోయి జల విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. గోదావరికి భారీగా వరద వచ్చే రోజుల్లో మాత్రమే అదీ.. అరకొరగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాబు కమీషన్ల కక్కుర్తితో ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారంవిభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంతో సహా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మించి ఇస్తామని విభజన చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో పోలవరం జల విద్యుత్ కేంద్రం అంచనా వ్యయం రూ.4,124.64 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. దీంతో పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం చెబితే.. దానికీ చంద్రబాబు అంగీకరించారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారాన్ని చంద్రబాబు మోపారు.రివర్స్ టెండరింగ్‌తో రూ.560 కోట్లు ఆదాపోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్లను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు 4.8 శాతం అధిక ధరకు 2018లో చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమంగా కట్టబెట్టిన ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.టీడీపీ సర్కారు నిర్ణయించిన కాంట్రాక్టు విలువనే రూ.3216.11 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించి 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్ నిర్వహించారు. దీని ద్వారా 12.6 శాతం తక్కువ ధరకు పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.550 కోట్లు ఆదా అయ్యాయి. ఆ తర్వాత పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రెజర్ టన్నెళ్లతో సహా కీలకమైన పనులు 2024 మే నాటికే పూర్తయ్యాయి.గోదావరి సిగలో కలికితురాయిని దిష్టిబొమ్మగా మార్చేశారుపోలవరం ప్రధాన డ్యాంకు ఎడమ వైపున ఒక్కోటి 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లతో మొత్తం 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో 35.52 మీటర్ల స్థాయి నుంచి విద్యుదుత్పత్తి చేసేలా టర్బైన్లను అమర్చుతారు. 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి 1,40,291.04 క్యూసెక్కులు అవసరం. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే హెడ్ పెరుగుతుంది. అప్పుడే ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అందుకే ఈ విద్యుత్ కేంద్రాన్ని గోదావరి సిగలో కలికితురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించడం వల్ల విద్యుదుత్పత్తి జరగదని, ఈ విద్యుత్ కేంద్రాన్ని దిష్టిబొమ్మగా మార్చేశారని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. -
భారత్‌పై చైనా వాటర్ బాంబ్!
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్‌ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్‌ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్‌లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడివంది. ‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్‌లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్‌కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్‌కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్‌తో భారత్‌పైకి వాటర్‌బాంబ్‌ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది. -
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
హస్తినకు రండి.. చర్చిద్దాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై మరో దఫా చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల అధికారులతో కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఆర్కే కనోడియా తెలంగాణ, ఏపీలతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు. రెండో బోర్డుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తామని తెలుపుతూ ఆరు ఎజెండా అంశాలను లేఖలో పొందుపరిచారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించడం, బోర్డుకు రాష్ట్రాల నిధుల విడుదల, కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, నీటి నిర్వహణ, బోర్డుల పరిధి, తదుపరి అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. పెండింగ్ వివాదాల పరిష్కారమే లక్ష్యం.. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటికి బోర్డులు పరిష్కారం చూపలేకపోతున్నాయి. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో ఉండా లని బోర్డు పట్టుబడుతుండగా తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నప్పుడు, బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదని అంటోంది. జలాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడటం కోసం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేర కు కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ రెండు బోర్డుల పనితీరును పర్యవేక్షిం చడానికి అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చైర్మన్‌గా వ్యవహరించే అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సభ్యులు. కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి ఐదేళ్లకు పైగా కావస్తున్నా ఇప్పటికీ వాటి పరిధి.. వర్కింగ్ మాన్యువల్‌ను కేంద్రం ఖరారు చేయలేదు. అపెక్స్ కౌన్సిల్ భేటీపై ఈ సమావేశంలో స్పష్టత తీసుకోనుంది. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణ కు 15.9 టీఎంసీల కేటాయింపులు న్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదని పునరుద్ధరణ పనులకు ఏపీ సహకారం అందించాలని కోరుతోంది. 1978 గోదా వరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉందని, ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే అని చెబుతోంది. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కానందున దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని, బోర్డులను కోరింది. కేంద్రమే దీనికి పరిష్కారం చూపాల్సి ఉంది. -
పులిచింతల విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితం
చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జల విద్యుత్ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవుల్లపల్లి ప్రభాకర్‌రావు జాతికి అంకితం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జలవిద్యుత్ ప్లాంట్ నాలుగో యూనిట్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యుత్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి రూ. 22 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ప్రభుత్వ సహకారం, ఇంజనీర్ల కృషితో ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ పనుల్లో ఇప్పటి వరకు రూ. 486 కోట్ల విలువగల పనులు పూర్తయినట్లు చెప్పారు. మిగతా పనులను కూడా అంచనా వ్యయానికి మించకుండా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద నీటి మీద ఆధారపడి 220 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాగర్ దిగువన ఉన్న టెయిల్‌పాండ్ రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సీఎండీ (ట్రాన్స్‌కో) జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ (గ్రిడ్) జె. నర్సింహారావు, డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) జగత్‌రెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ జెన్కో) అశోక్‌కుమార్, డైరెక్టర్ (ఎన్పీడీసీఎల్) గణపతిరావు, డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, ఎస్ఈలు సద్గుణ కుమార్, శ్రీనివాసరెడ్డి, సీఈలు సురేశ్‌కుమార్, రత్నాకర్, ఈఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి స్వల్పంగా జరుగుతోంది. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయం నుంచి 515 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 0.249 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 55.3581 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 835.20 అడుగులుగా నమోదైంది. డిమాండ్ తక్కువగా ఉండటంతో ఉత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు. -
శ్రీశైలానికి భారీగా వరద నీరు
ఎగువన వర్షపాతం నమోదు కావడంతో.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరీవాహకప్రాంతాలైన జూరాల, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయానికి సోమవారం వరద ప్రవాహం మొదలైంది. జూరాల నుంచి 6వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసిన విషయం తెల్సిందే. జలాశయ పరిసర ప్రాంతాలలో 1.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 62.94 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 840.70 అడుగులకు చేరుకుంది. -
సా‘గరం’ తగ్గింది
తెలుగు రాష్ట్రాల మధ్య ముగిసిన నీటి పంచాయితీ గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు ఫలప్రదం రెండు రాష్ట్రాల్లో పంటలు కాపాడుకోవాలని నిర్ణయం సాగర్ నీటిని అవసరాలను బట్టి వాడుకోవడానికి అంగీకారం సీఎంల సూచనలతో ఇరు రాష్ట్రాల మంత్రుల సంయుక్త ప్రకటన డి కాలువ నుంచి నీటి విడుదల 7 వేల క్యూసెక్కులకు పెంపు జలవిద్యుత్ కేంద్రం నుంచి 2 వేల క్యూసెక్కులు, గేట్ల నుంచి మరో 5 వేల క్యూసెక్కులు ఏపీకి.. సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నీటి పంచాయితీ ముగిసింది. సాగర్ కుడికాలువకు కనీసం మూడు రోజుల పాటు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్న ఆంధ్రప్రదేశ్ వినతికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వివాదం సామరస్యంగా పరిష్కారమైంది. కుడికాల్వకు నీటి విడుదల విషయంలో నాగార్జున సాగర్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు శనివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సాగర్ బాధ్యత కమిటీకి.. రెండు రాష్ట్రాల్లో సాగర్ ఆయకట్టు కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి డ్యామ్‌లో ఉన్న నీటిని వాడుకోవాలని చంద్రబాబు, కేసీఆర్ నిర్ణయించారు. వాటాలను పక్కనబెట్టాలని, హక్కుల గురించి కాకుండా ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే భావనకు వచ్చారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఇరు రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాలన్న గవర్నర్ సూచనపైనా వారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఇదే తరహా జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీవో అమలు కాలేదు. ఇక పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు కాస్త వెసులుబాటు లభించి ఖరీఫ్ సాగు ఆలస్యం కాకుండా చూడవచ్చని భేటీలో చంద్రబాబు పేర్కొన్నారు. పులిచింతల పునరావాస కార్యక్రమాలను నల్లగొండ జిల్లాలో వేగవంతం చేయాలని ఆయన కోరగా... కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నల్లగొండ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. గంటపాటు భేటీ.. తొలుత ఇద్దరు సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్‌దాస్, ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చారు. అంతకుముందే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు గవర్నర్‌ను విడిగా కలసి సాగర్ వివాదానికి సంబంధించిన లెక్కలను, సమస్య పరిష్కారానికి రూపొందించిన మార్గాలను వివరించారు. ఆ తర్వాత గవర్నర్ సమక్షంలో కేసీఆర్, చంద్రబాబు దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. కొద్దిసేపటి తరువాత ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావును సమావేశం జరుగుతున్న గదిలోకి పిలిచి... తాము తీసుకున్న నిర్ణయాలను సీఎంలు వివరించారు. ఇరు రాష్ట్రాల్లో పంటలను కాపాడుకునేందుకు సాగర్ నీటిని అవసరమైన మేరకు వాడుకునేలా అంగీకారం కుదిరిందని, వివాదం ముగిసిందని సంయుక్త ప్రకటన చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రులు విలేకరులతో మాట్లాడారు. సమన్వయంతో వ్యవహరిస్తాం: దేవినేని ఉమా ‘‘ఏ ఆయకట్టుకు ఎంత నీరు అవసరమనే విషయాన్ని పరిశీలించి, నీటి విడుదలపై ఈఎన్సీలు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో, సంయమనంతో వ్యవహరిస్తాయి. ఇద్దరు మంత్రులం, అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుకుని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. పంటలకు అవసరమైన మేరకు నీటి విడుదలపై వెంటనే నిర్ణయం తీసుకుంటాం.’’ పంటలు ఎండిపోవద్దనే..: హరీశ్‌రావు ‘‘ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాగర్‌లో ఉన్న నీటిని అవసరాల మేరకు వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కుడి, ఎడమ కాలువలు, డెల్టా, ఏఎమ్మార్పీ కింద ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి.. అందుబాటులో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలనేదే మా లక్ష్యం. డ్యామ్‌పైకి రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లకుండా ఇరువైపులా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. కేవలం ఇంజనీర్లు మాత్రమే డ్యామ్ మీదకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది’’ కుడికాలువకు 7 వేల క్యూసెక్కులు.. నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటి తర్వాత ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు ప్రాథమికంగా చర్చలు జరిపారు. కుడికాలువకు కనీసం మూడు రోజుల పాటు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్న ఏపీ ఈఎన్సీ సూచనకు అనుగుణంగా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి నీటి విడుదలను ప్రారంభించి రాత్రికి ఐదు క్యూసెక్కులకు పెంచారు. జల విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటికే విడుదలవుతున్న రెండు వేల క్యూసెక్కులతో కలిపి ఏపీ రైతులకు మొత్తంగా ఏడు వేల క్యూసెక్కుల నీరు లభ్యం కానుంది. అయితే మూడు రోజుల తర్వాత మార్చి 15వ తేదీ వరకు రోజూ 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. కాగా.. శుక్రవారం సాగర్ వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో... ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాలు డ్యామ్‌కు ఇరువైపులా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించాయి. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవోలు, ఐజీ సంజీవ్, ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 316 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించారు. తెలంగాణ వైపు కూడా దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. అయితే చర్చలు ఫలించి కాలువలకు నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
కృష్ణ వరదతో జాగ్రత్త: కేంద్ర జల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతున్నందున ముప్పు పొంచి ఉందని కేంద్ర జలసంఘం రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. దాన్ని ఎదుర్కోడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. ‘‘ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో వరద నీరు బాగా పెరుగుతోంది. శనివారం ఉదయానికల్లా నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరవచ్చు’’ అంటూ ప్రభుత్వానికి పంపిన హెచ్చరికల్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయానికి 24 గంటల వ్యవధిలో 6.8769 టీఎంసీల నీరు వచ్చి చేరింది! దాంతో నీటి నిల్వ శుక్రవారం సాయంత్రానికి 204 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం డ్యాం, పవర్ హౌస్, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాల్లో రోడ్లపై కొండ చరియలు విరిగిపడటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.