శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది.
కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment