
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది.
ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment