Power companies
-
ఒడిశాలో థర్మల్ పవర్ రాజస్తాన్‌లో సోలార్
సాక్షి, హైదరాబాద్: భారీ నష్టాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నా య చర్యలతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ సౌర విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాజస్తాన్‌లో భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పా టు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన భూకేటాయింపుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో పీక్ అవర్స్‌లో రాష్ట్రం నుంచి దాదాపు 1,200 మెగావాట్ల థర్మల్ పవర్‌ను రాజస్తాన్‌కు విక్రయించే అంశంపైనా ఒప్పందం చేసుకోనుంది. మరోవైపు ఇటీవలే సింగరేణికి ఒడిశాలోని నైనిలో కేటాయించిన బొగ్గు బ్లాక్ పక్కనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్థలం కోసం చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసే పిట్‌హెడ్ స్టేషన్ నుంచి ‘నాల్కో’కు 1,350 మెగావాట్ల విద్యుత్‌ను విక్రయించేందుకు సింగరేణి సంసిద్ధత వ్యక్తం చేసింది. అందుకోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవడానికి ‘నాల్కో’ముందుకొచ్చింది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుదుత్పాదన రంగంలోకి దిగిన సింగరేణి మరిన్ని పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాజస్తాన్‌లో.. రాజస్తాన్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘సాక్షి’కి చెప్పారు. ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం జరుగుతోందని.. సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉదయం పూట సౌర విద్యుత్ వినియోగించుకుంటామని, పీక్ అవర్స్‌లో వారికి థర్మల్ విద్యుత్ అవసరం ఉన్నందున దాదాపు 1,200 మెగావాట్లు ఇవ్వడానికి కూడా తెలంగాణ జెన్కో సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు చెప్పారు. తక్కువ ధరకు బయట విద్యుత్ లభిస్తున్నప్పుడు థర్మల్ స్టేషన్లను బ్యాక్‌డౌన్ చేస్తున్నామని, పీక్‌టైమ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తప్పనిసరి అని చెబుతున్నారు. భారీగా సౌర విద్యుత్‌పైనే దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను రైతులకు, మహిళా సంఘాలకు కేటాయించి వాటి నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను పిలిచింది. ఇది కాకుండా రాష్ట్రంలో వివాదరహితంగా ఉన్న అన్ని దేవాలయ భూముల్లో సోలార్ పవర్ యూనిట్లు నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నీటిపారుదల శాఖకు సంబంధించి రిజర్వాయర్లు, కాలువల కో సం వేలాది ఎకరాలు సేకరించింది.అందులో చాలా భూములు ఉపయోగించుకుండా ఖాళీగా ఉన్నాయి. అలా ఉన్న భూములన్నింటినీ అధికారులు సర్వే చేస్తున్నారని, వాటిల్లోనూ సోలార్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. తద్వారా ఆయా భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతోపాటు ఆయా శాఖలకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. మధ్యతరహా నీటిపారుదల రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నట్టు వివరించారు. ఇప్పటికే సింగరేణి ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్ ఉత్పాదన చేస్తోందన్నారు. సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో.. సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసిన తర్వాత పెద్ద గుంతలుగా ఏర్పడిన వాటిలో భారీ వర్షాల కారణంగా అవి నీటితో నిండుతున్నాయి. అక్కడ పంప్డ్‌స్టోరేజీ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. మరోవైపు భాగ్యనగరంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికాకుండా వాటికి పైకప్పు రూపంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. తద్వారా వీధిదీపాలకు అవసరమయ్యే విద్యుత్‌ను అందించడంతోపాటు పాదచారులకు నీడ కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు మండలాల్లో పూర్తిగా సౌర విద్యుత్ ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లితోపాటు సీఎం నియోజకవర్గ(కొడంగల్) పరిధిలోని ఒక మండలం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం(మధిర)లోని బోనకల్ మండలంలో పూర్తిగా సౌరవిద్యుత్‌ను సరఫరా చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఈ రెండు మండలాలు పూర్తయిన తర్వాత మరిన్ని గ్రామాల్లో సౌర విద్యుత్ సరఫరా చేయడానికి సంకల్పించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఐటీ కంపెనీలు ముందుకొస్తున్న విషయం విదితమే. అయితే వీరు క్లీన్ఎనర్జీ కావాలని కోరుతున్నారని, తద్వారా వారికి కార్బన్ క్రెడిట్స్ రావడం వల్ల రాయితీలు లభిస్తాయని చెబుతున్నారు. అందుకే క్లీన్ఎనర్జీ వైపు దృష్టి సారించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మనోళ్లేనా.. ఐతే సరే.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఇంటర్వ్యూలు రెండో రోజు మంగళవారమూ మొక్కుబడిగానే సాగాయి. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నిబంధనలు గాలికొదిలేసి, ఇస్టానుసారం మార్చేసుకుంది. కనీస అర్హత లేకున్నా వారికి నచ్చిన వారైతే అన్నింటినీ ఉల్లంఘించి అర్హత ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పోస్ట్‌కు కనీస అర్హత మూడు సంవత్సరాల కాలంలో సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. కానీ జెన్కోలో డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కార్పొరేషన్లో చేరిన ఓ అధికారికి నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ పోస్టుకు అర్హత కల్పించారు. ఆయన సహచరులు జెన్కోలో డీఈలుగానే ఉన్నారు. ఆయనకు హెచ్ఆర్ డైరెక్టర్ పోస్టుకు అవకాశమిచ్చారు.చిత్రమేమిటంటే ఇదే అభ్యర్ధిని థర్మల్, హైడల్ డైరెక్టర్ పోస్టులకు అనర్హుడిగా పేర్కొన్నారు. డైరెక్టర్ల పోస్టుల భర్తీలో అడ్డగోలు నిబంధనలకు ఇదో ఉదాహరణ. దాదాపు అన్ని పోస్టులకు తమ వారికి అనుగుణంగా ఇలా నిబంధనలు మార్చేశారు. బుధవారం ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.కాపు సంఘాల ‘సామాజిక’ ఉద్యమంవిద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు పైరవీల కారణంగా తమ సామాజిక వర్గం అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో గత ఎన్నికల్లో కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞులు, నిజాయితీపరులు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పని చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారందరూ డైరెక్టర్ పోస్టులకు అర్హులని, దామాషా పద్ధతిలోనైనా న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామాషా పద్థతిలో ఇస్తే 15 పోస్టుల్లో జెన్కోలో ఒకటి, ట్రాన్స్‌కోలో ఒకటి, డిస్కంలలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 5 పోస్టులు కాపులకు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ వాట్సప్ మెసేజ్‌లను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు, మంత్రి లోకేశ్‌కు చేరే వరకూ ఫార్వార్డ్ చేయాలని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. -
మేము చెప్పినట్లు జరగాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు. ఆ మేరకు కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్‌లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. -
నాటి ‘పవర్’ విజన్‌కు అవార్డుల వెలుగు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక విధానాలకి అనుగుణంగా సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో తీసుకొచ్చిన పలు సంస్కరణలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అవార్డులు అందిస్తున్నాయి. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు (ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు) ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి. సొంతంగా కొన్ని యాప్‌లను రూపొందించాయి. వాటిద్వారా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ అవార్డులు అందుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) జాయింట్ మీటర్ రీడింగ్ (జేఎంఆర్) అప్లికేషన్, కృత్రిమ మేధ(ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్), మెషిన్ లెరి్నంగ్ సాంకేతికతలతో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) రూపొందించిన డే ఎహెడ్ పవర్ డిమాండ్ ఫోర్ కాస్టింగ్ మోడల్‌కు ‘సౌత్ గోవ్–టెక్ సింపోజియం’ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సింపోజియంలో ఈ అవార్డులను అందుకున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో తాజాగా వెల్లడించింది. ఏటా రూ.750 కోట్లు ఆదా విద్యుత్ వ్యవస్థలో సరికొత్త ఆధునిక విధానాలను అనుసరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గత ప్రభుత్వ హయాంలో జేఎంఆర్ అప్లికేషన్ రూపొందింది. దీనివల్ల ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన విద్యుత్ కొనుగోళ్లకు గడువులోగా బిల్లులు చెల్లించగలిగారు. దీంతో లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్పీఎస్) భారం తప్పింది. సాధారణంగా ఎల్పీఎస్.. మొత్తం బిల్లుపై 15 శాతం ఉంటుంది. అందులో 1 శాతం రిబేట్ పోను 14 శాతం చెల్లించాల్సి వచ్చేది. అలాగే ఇన్వాయిస్ బిల్లులపైనా రాయితీ పొందేందుకు అవకాశం కలిగింది. ఈ లెక్కన ఏడాదిలో ఏపీపీసీసీ కొన్న రూ.50 వేల కోట్ల విద్యుత్ బిల్లులో రూ.750 కోట్లు ఆదా అయ్యాయి. గతంలోను పలు అవార్డులు గత ప్రభుత్వంలో రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్ ఆధారిత యాప్‌లను విద్యుత్ సంస్థల కోసం ఏపీఎస్‌ఎల్‌డీసీ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్, లైన్ క్లియర్ అప్లికేషన్ పేరుతో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఐఎస్‌వోఏ అప్లికేషన్‌కు ఏపీ ట్రాన్స్‌కో స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు పొందింది. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించినందుకు ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును సొంతం చేసుకుంది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంతో ముందుచూపుతో రూపొందించినందువల్లే ఈ అప్లికేషన్లకు అవార్డులు లభిస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ ఒత్తిడి.. విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. -
కరెంట్ ‘కాలి’పోతోంది
సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చర్యలు ఎండలకు భయపడి జనం బయటకు రావడం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు. అవుట్డోర్ వర్క్స్ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్ అకస్మాత్తుగా 500 వాట్స్ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్ డ్రాల్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది. ఇంతలా కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్ ఉన్పప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు, సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు. అన్నిటా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్ఫార్మర్లను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్ స్థంభాల మీద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి. స్థంభం కూలిపోతే, దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చడానికి సమయం పడుతోంది. ఈ లోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్ శాఖ ఉంది. -
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్
పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనువుగా దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హిటాచి భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నుగురి వేణు మాట్లాడుతూ..‘భారత్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా కంపెనీ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, పుణెలో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని రానున్న ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. అయితే అవసరాలకు అనుగుణంగా అందులో మార్పులు చేసే అవకాశం ఉంది’ అన్నారు.ట్రాన్స్ఫార్మర్లు, భారీస్థాయి పవర్ ట్రాన్స్మిటర్లను తయారు చేసే హిటాచీ ఎనర్జీ కంపెనీ దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా పనిచేయనుంది. 2030 వరకు భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే లక్ష్యం పెట్టుకుంది. దాంతో భారత ప్రభుత్వం గత సంవత్సరం గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ప్రోత్సాహకాలను విడుదల చేసింది. భారత్ లక్ష్యాన్ని సాధించేలా ఈ కంపెనీ తనవంతు సహకారం అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారీ వరదలు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే..2023 ఆర్థిక సంవత్సరంలో దేశ విద్యుత్ వినియోగం 8% పెరిగింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం.. రాబోయే మూడేళ్లలో దేశ విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో తయారవుతున్న విద్యుత్ కంటే కనీసం 3-4 రెట్లు ఉత్పత్తి పెరగాల్సి ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ వేణు అన్నారు. అందుకు అనుగుణంగా తమ ఆర్డర్‌బుక్ కూడా 2-3 రెట్లు పెరుగుతుందని ఆయన ధీమావ్యక్తం చేశారు. -
రాష్ట్ర విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి తమ ప్రతిభను నిరూపించాయి. రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ (ఐఎస్ఓఏ) అప్లికేషన్కుగానూ స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో) దక్కించుకుంది. ఈ అప్లికేషన్‌ను ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) అభివృద్ధి చేసింది. అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ (పీఎస్పీ) ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించినందుకుగానూ ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) కైవసం చేసుకుంది. అవార్డులు వచ్చాయి ఇలా.. డిస్కంలు ఓపెన్ యాక్సెస్ (ఓఏ) వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రంలో వివిధ పవర్ డెవలపర్లు అనేక పవర్ ప్లాంట్లను స్థాపించారు. ఓఏ వినియోగదారులలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, నోడల్ ఏజెన్సీ అయిన ఏపీఎస్‌ఎల్‌డీసీ, ఎనర్జీ బిల్లింగ్ సెంటర్ (ఈబీసీ) సకాలంలో నెలవారీ విద్యుత్, డిమాండ్ సెటిల్మెంట్లు చేయటం కష్టంగా మారింది. దీంతో బహుళ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు వివిధ ఓపెన్ యాక్సెస్ జనరేటర్ల నుంచి విద్యుత్ సరఫరాను పొందడంలో జాప్యం జరిగేది. దీంతో ఏపీఎస్‌ఎల్‌డీసీ అంతర్గత ఐటీ బృందం ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఈ ప్రక్రియ సులభం అయ్యింది. ఇక పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్‌ను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం ఉన్న 39 అనువైన ప్రదేశాల్లో టెక్నో–కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (టీసీఎఫ్‌ఆర్)ను నెడ్కాప్ తయారు చేసింది. అలాగే 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాలతో కూడిన 4,280 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (ఐఆర్ఈపీఎస్) పాణ్యం మండలం పిన్నాపురం వద్ద నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఈ చర్యలు జాతీయ స్థాయిలో అవార్డులు రావడానికి కారణమయ్యాయి. సీఎం సహకారంతోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధిస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. జాతీయ అవార్డులు వరించిన సందర్భంగా స్థానిక విద్యుత్ సౌధలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల అలుపెరగని కృషితో ఏపీ విద్యుత్ సంస్థలు భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డులు సాధించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులు సాధించిన ఏపీ ట్రాన్స్‌కో, నెడ్కాప్ను అభినందించారు. ఈ సమావేశంలో ఏపీజెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, నెడ్కాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి. మల్లారెడ్డి, డైరెక్టర్ (గ్రిడ్) ఏకేవీ భాస్కర్, డైరెక్టర్ (ఫైనాన్స్) టీ వీరభద్రారెడ్డి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
Fact Check: ఏపీలోనే వెలుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్లాంటు కట్టేశామని స్ట్రక్చర్ పూర్తయినట్లు చూపిస్తే సరిపోదు. లోపల అనేక టర్బైన్లు, ఇతర యంత్రాలు అమర్చాలి. ఈ మాత్రం జ్ఞానం కూడా లేని రామోజీ..వాస్తవాలను వక్రీకరించి గత పదేళ్లుగా విద్యుత్ సంస్థలు చేస్తున్న కృషిని తక్కువ చేస్తూ వాటి మనోబలాన్ని దెబ్బతీసేలా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. ఏపీ మొత్తం విద్యుత్ డిమాండులో ఏపీజెన్కో 45 నుంచి 50 శాతం వరకూ సమకూర్చుతుండగా, తెలంగాణలో జెన్కో, సింగరేణి ప్లాంట్లు అన్నీ కలిపి రాష్ట్ర డిమాండులో 37 నుంచి 38 శాతం విద్యుత్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి. నిజాలు ఇలా ఉండగా ‘తెలంగాణలో మిరుమిట్లు..ఏపీలో కునికిపాట్లు’ శీర్షికన ఈనాడు రాసిన ఆ అభూతకల్పనల కథనాన్ని విద్యుత్ సంస్థలు ఖండిస్తూ వివరాలు వెల్లడించాయి. ఆరోపణ: పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేక పోయింది వాస్తవం: విభజన నాటికి రాష్ట్రంలో రోజుకు సరాసరి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేది. అది అప్పటి రోజువారీ విద్యుత్ వినియోగంలో దాదాపు 18 శాతం. విభజన చట్టంలో ఆస్తులు భౌగోళికంగా, అప్పులు జనాభా నిష్పత్తిలో, విద్యుత్ ఒప్పందాలు అప్పటికున్న లోడ్ ప్రకారం విభజించారు. రాష్ట్ర విభజన తేదీ నాటికే హైదరాబాద్ వల్ల తెలంగాణలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ జనాభా తక్కువ కావడంతో అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ. అందుకే దాదాపు 2017 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు తెలంగాణ సంస్థలకు విద్యుత్ అందించాయి. దానికి సంబంధించి దాదాపు రూ.7400 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. అంతటి విద్యుత్ కొరతను అధిగమించి మనకు భౌగోళికంగా అనుకూలంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని, కావలసిన ధర్మల్ విద్యుత్ ను కూడా అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రం విద్యుత్ రంగంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. ఆరోపణ: తెలంగాణలో వ్యూహాత్మత అడుగులు.. ఏపీలో తడబాటు వాస్తవం: పునరుత్పాదక విద్యుత్ రంగంలో మన రాష్ట్రంలో దాదాపు 9 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు స్థాపించారు. కృష్ణపట్నంలో 2400 మెగావాట్ల ధర్మల్ కేంద్రం, విజయవాడలో 800 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం కూడా శరవేగంగా నిర్మాణమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గనుల ద్వారా అక్కడి ధర్మల్ కేంద్రాలకు కావలసినంత బొగ్గు దొరుకుతోంది. మనం సుదూర ప్రాంతాల నుంచి, అంటే మహానది బొగ్గు క్షేత్రాలు– తాల్చేర్ ఒరిస్సా, సింగరేణి బొగ్గు గనుల నుంచి సేకరించవలసి వస్తోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా వేరే రాష్ట్రాలలోని విద్యుత్ సంస్థలతో ముందస్తుగా విద్యుత్ బ్యాంకింగ్ విధానం.. అంటే మనకు అవసరం వున్నప్పుడు వాళ్ళు విద్యుత్ ఇచ్చేలా, మనకు మిగులు వున్నప్పుడు వారికీ తిరిగి విద్యుత్ అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి కూడా ఇస్తోంది. ఆరోపణ: ఎక్స్చేంజీల పైనే ఏపీ ఆధారం వాస్తవం: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్ ఎక్సే్చంజీలపై ఆధారపడకుండా ముందుగానే సెప్టెంబర్ నెలలో తగిన ప్రణాళికతో చర్యలు తీసుకుని జూన్ నెల వరకు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా విద్యుత్ అమ్మకందార్లను ఎంచుకుని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దానివల్ల ప్రస్తుత నెలలో ఏ విధమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అవుతోంది. ఆరోపణ: రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారు వాస్తవం: రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆరోపణ: అక్కడ విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళిక..ఇక్కడ ఆపసోపాలు వాస్తవం: కేవలం ఏడాది వ్యవధిలో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల మూడో యూనిట్, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ను ఏపీ అందుబాటులోకి తెచ్చింది. 2019 నాటికి కృష్ణపట్నంలో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో ఎనిమిదో యూనిట్ నిర్మాణ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఏపీజెన్కో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులను ఏపీజెన్కో శరవేగంగా జరిపిస్తోంది. పీక్ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంటు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని ముందుకెళుతోంది. పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజి ప్లాంట్లు నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. -
AP: ‘బొగ్గు’ భయం లేదు.!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి. కొరత లేకుండా నిల్వలు వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి. ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు.. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్‌కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్‌కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్‌కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్‌కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
Fact Check: ఏమిటీ తప్పుడు రాతలు?
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతున్నా చూడలేకపోతోంది ఈనాడు. ముఖ్యంగా రైతులకు మేలు చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతోంది ఆ పచ్చ పత్రిక. అందులోను ఆక్వా రంగానికి విద్యుత్ ఎంత ప్రధానమో తెలిసి కూడా ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా చేస్తున్న మేలుకు తప్పుడు రాతల ద్వారా అడ్డుపడుతోంది. అందులో భాగంగానే ‘విద్యుత్ ఇంజనీర్లే విస్తుపోయేలా’ అంటూ కనీస అవగాహన లేకుండా ఓ అబద్ధపు వార్తను శుక్రవారం వండి వార్చింది. గతంలో ధరలకు ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం ఉందని, లేబర్ చార్జీలు మెటీరియల్ చార్జీలకంటే ఎక్కువ చూపించారని, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోలేదని చేతికొచ్చిన అసత్యాలు అచ్చేసింది. ఈ కుట్రపూరిత కథనాన్ని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కథనంలో తప్పుల్ని ఆ సంస్థ సీఎండీ కె.సంతోష్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా 220/33 కేవీ అకివీడు సబ్‌స్టేషన్ నుంచి కృష్ణాజిల్లా 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కి అనుసంధానం చేస్తూ విద్యుత్ లైన్లు వేయాలని గతంలోనే ఏపీసీపీడీసీఎల్ ప్రతిపాదించింది. ఈ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 976 ఆక్వారంగ సంబంధిత పరిశ్రమలున్నాయి. ఇవి నెలకు 30 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఈ సర్విసులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించడానికి ఈ అనుసంధానం తప్పదని డిస్కం భావించింది. ఈ ఇంటర్ లింకింగ్ లైన్ గతంలో ప్రతిపాదించినప్పటికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి విద్యుత్ సరఫరాకి కావలసిన అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అనుమతులు రావడంతో పనుల్లో కదలిక వచ్చింది. ► 132/33 కేవీ చిగురుకోట సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 33 కేవీ పోతుమర్రు ఫీడర్పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కు ఫీడ్ చేస్తున్నారు. ఇదే ఫీడర్పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్, 33/11 కేవీ మూలలంక సబ్‌స్టేషన్ కూడా అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఈ ఫీడర్ 20 మెగావాట్ల కంటే ఎక్కువ లోడును నమోదు చేస్తోంది. వేసవి కాలంలో అధిక లోడ్ కారణంగా లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్) విధించాల్సి వస్తోంది. అదీకాకుండా ఈ రెండు సబ్స్టేషన్లు ప్రధానంగా ఆక్వాకు విద్యుత్‌ను అందిస్తున్నాయి. 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌పై 950కి పైగానే ఆక్వా సర్విసులున్నాయి. ఈ రెండు సబ్స్టేషన్లకు 33 కేవీ ప్రత్యామ్నాయ సరఫరా లేదు. అలాగే 132/33 కేవీ చిగురుకోటపై లోడ్ గరిష్టంగా 124 మెగావాట్లుగా నమోదైంది. ఈ ప్రాంతంలో లోడ్ పెరుగుదల సంవత్సరానికి 25 నుంచి 30 శాతంగా ఉంది. అందువల్ల 220/33 కేవీ ఆకివీడు నుంచి కొత్త లైను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ► రెండేళ్ల కిందట ఈ ఇంటర్ లింకింగ్ లైన్ సిమెంట్ పోల్స్‌తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పడు మిచాంగ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు, సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వలన 33 కేవీ లైన్లు ఎం+ రూపంలో ఉండే మెటల్ టవర్స్‌ను ప్రతిపాదించారు. వీటివల్ల చెట్లు విరిగినా లైన్లకు ఎటువంటి సమస్య కలగదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. ఈ టవర్స్ చాలాకాలం మన్నికగా ఉంటాయి. ఉప్పుటేరు కెనాల్‌ను పరిగణలోకి తీసుకుని అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. ► సిమెంట్ పోల్స్‌కి సంబంధించి లేబర్ ప్రతిపాదనలు వేరుగా, ప్రతి ఎం+ టవర్‌కి సంబంధించి లేబర్ కాస్ట్, టవర్స్ మెటీరియల్ కాస్ట్ కలిపి ప్రతిపాదించడం వలన ఈ రెండు ప్రతిపాదనల మధ్య అంచనాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు లేటెస్ట్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) డేటా ప్రకారం తయారుచేసి టెండర్ పిలవడం జరిగింది. సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ (ఎస్ఏపీ)లో ప్రతిపాదనలు చేయడం వల్ల లేబర్ కాస్ట్కి సంబంధించి ఎటువంటి దాపరికాలకు ఆస్కారం లేదు. ► యథార్థాలు తెలుసుకోకుండా ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించడం సరైన పద్ధతి కాదు. ఈనాడు వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆక్వా రంగానికి నిరంతరాయ విద్యుత్ చాలా ముఖ్యం. ఏమాత్రం కోతలున్నా.. ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతాయి. ఆక్వా రైతులకు భారీనష్టం వాటిల్లుతుంది. అలాంటి పరిస్థితి వారికి రాకుండా చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టుపై ప్రజలు, రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిన ఈనాడు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. -
విద్యుత్ సంస్థలపై ఈనాడు తప్పుడు రాతలు
-
అవి అప్పులు కాదు.. డిస్కంలకు ఆస్తులే.!
సాక్షి, అమరావతి: ఎవరైనా స్థిరాస్తులు ఏర్పరుచుకునే సమయంలో రుణం తీసుకోవడం సహజం. అలాగే ఆస్తుల కల్పనకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కూడా తీసుకుంటాయి. వాటితో విద్యుత్ సరఫరా సాఫీగా జరగడానికి సబ్ స్టేషన్లు, కార్యాలయ భవనాలు, స్థలాలు, విద్యుత్ లైన్లు వంటి స్థిరాస్తులు ఏర్పరుచుకుంటాయి. ఆ తర్వాత బిల్లుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించి అప్పులు తీరుస్తాయి. అలాగే విద్యుత్ కొనుగోలు కోసం బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు చెల్లిస్తుంటాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు ఆదా అవుతుంటే.. ఏమాత్రం అవగాహన లేకుండా ‘కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప’ శీర్షికన ఈనాడు మంగళవారం ఓ కట్టుకథను అచ్చేసింది. దీనిపై నిజాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వివరించారు. పెట్టుబడిలో 40 శాతం రాయితీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా వినియోగదారులకు స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రతిపాదించడం జరిగింది. ఇది కేవలం 25 శాతం మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల సమయానుసార (టైం అఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అధిక విద్యుత్ వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపు తప్పనిసరి. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. ఈ ఆర్డీఎస్ఎస్ పథకంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఒక భాగం మాత్రమే. వడ్డీ మిగులు ఈ సంవత్సరం పెరిగిన రుణాలలో ఎక్కువ భాగం విద్యుత్ ఉత్పత్తి సంస్థల బకాయిలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆలస్య చెల్లింపుల సర్ చార్జీ నిబంధనల ప్రకారం పంపిణీ సంస్థలు చెల్లించాయి. బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఉన్న ఆలస్య చెల్లింపు సర్ చార్జీకన్నా చాలా తక్కువ వడ్డీ రేటుకు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు మిగిల్చాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు వక్రరాతలు రాయడం విడ్డూరంగా ఉంది. రుణాల ద్వారా ఆస్తుల సృష్టి అభివృద్ధి పనులు, వ్యవస్థ బలోపేతం కోసం చేసే పనుల ప్రాజెక్టుల వ్యయంలో దాదాపు 80 శాతం నుంచి ఒక్కోసారి 100 శాతం వరకూ ఆర్థిక సంస్థల నుంచి విద్యుత్‌రంగ సంస్థలు రుణాలు తీసుకుంటాయి. కొత్త ఆస్తుల సృష్టి రుణాల ద్వారానే సాధ్యమవుతుంది. వాటి ద్వారా వచ్చే రాబడితో అప్పులు కూడా తీరతాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు బహుళ వార్షిక విద్యుత్ టారిఫ్ నిబంధనలు నిర్దేశిస్తుంది. డిస్కంలు ఏటా అవసరాలకు అనుగుణంగా సబ్ స్టేషన్లు, లైన్లు నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపడతాయి. వీటికి కావలసిన ఆర్థిక అవసరాలలో ఎక్కువ భాగం రుణాల ద్వారా సేకరిస్తాయి. ఖర్చులను నిబంధనల ప్రకారం టారిఫ్ నుంచి రాబట్టుకోవడానికి కమిషన్ అనుమతి తీసుకుంటాయి. రైతుకు డిమాండ్ చేసే హక్కు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 18 శాతం నుంచి 20 శాతం అవుతోంది. కచ్చితత్వంతో ఈ విద్యుత్‌ను లెక్కించలేకపోవడం వల్ల రాష్ట్రంలో ఇంధన ఆడిట్ కష్టం అవుతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనల ప్రకారం వ్యవసాయ వినియోగదారులకు కూడా మీటర్లు బిగించాలి. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా అయ్యే కరెంట్ వినియోగం తెలుసుకోవడానికి, ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు నగదు బదిలీ లెక్కకు వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. దీనికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతీ నెల వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం డిస్కంలను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. -
బాబును దాచి.. చీకటి రాతలు!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ నిర్వాకాలను దాచేసి, నిరంతరం విద్యుత్తు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైనా విషం కక్కారు రామోజీరావు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలు, విద్యుత్ సంస్థలను తీవ్రంగా దెబ్బతీసేలా తీసుకున్న నిర్ణయాలను ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగునపరిచింది. పైగా ఆ ప్రభుత్వ కాలంలో అద్భుతాలు జరిగాయన్నట్టుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది. నిజాలకు పాతరేసి ఈనాడు కథనంలో రాసినవన్నీ అభూత కల్పనలేనని విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తొలినాళ్లలో ఉన్న విద్యుత్ కొరత పరిస్థితిని తీసివేసి, కేవలం కొన్ని నెలల్లోనే కోతలు లేని రాష్ట్రంగా తయారైందని గత ప్రభుత్వానికి ఈనాడు సరి్టఫికెట్ ఇచ్చేసింది. ఈనాడు రాసింది, చెప్పింది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశాయి. అవి వెల్లడించిన అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి.. ♦ గత చంద్రబాబు ప్రభుత్వం 8 వేల మెగావాట్లకు అధిక ధరలకు చేసుకున్న ఒప్పందాల వల్ల ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున 25 ఏళ్లపాటు భారాన్ని మోయాల్సిన పరిస్థితులు కలి్పంచారు. ఇది దూరదృష్టి ఎలా అవుతుంది? గత ప్రభుత్వ పెద్దలకు ఉచిత కరెంటు అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమేనంటూ మాట్లాడిన చరిత్ర ఉంది. ఇదే పెద్దలు 2014 తర్వాత కూడా రైతుల ఉచిత విద్యుత్ పథకానికి ఎగనామం పెట్టేలా పాలన సాగించారు. ఈ పథకం కింద కరెంటు సరఫరా చేసినందుకు డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టారు. డిస్కంలు, జెన్కోల అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెరిగిపోయేలా చేశారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు ఇవ్వాల్సిన బకాయిలు రూ.2,800 కోట్ల నుంచి రూ.21వేల కోట్లకు గత ప్రభుత్వంలో పెరిగిపోయాయి. ఇలా విద్యుత్ సంస్థలను అన్ని రకాలుగా దెబ్బ తీసి, అవి అప్పులపాలై, కుప్పకూలిపోయే ప్రమాదకర పరిస్థితికి తీసుకెళ్లారు. కరెంటు సంస్థల ఆరి్థకస్థితిని దారుణంగా దెబ్బతీసినా గత ప్రభుత్వం భేషుగ్గా చేసిందని కితాబునివ్వడం ఒక్క ఈనాడు మాత్రమే చేయగలదు. ♦ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వ సంస్థల సంక్షేమాన్నీ బాధ్యతగా చేపట్టారు. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థల అభివృద్ధికీ బాటలు వేశారు. రైతులకు ఇస్తున్న కరెంటు బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు ఉచిత కరెంటు భవిష్యత్తులో కూడా నిరాటంకంగా అందాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో యూనిట్‌కు కేవలం రూ.2.49 కే ఒప్పందం చేసుకుని, అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. ఇది విద్యుత్ వ్యవస్థల్లో అంధకారం నింపడం ఎలా అవుతుంది? ♦ డిస్కంల నికర విలువ గత ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో సుమారు మైనస్ రూ. 4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి దారుణంగా క్షీణించి మైనస్ రూ. 20 వేల కోట్లకు చేరింది. మరి గత ప్రభుత్వం ఏ రకంగా వెలుగులు నింపింది? గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్సిడీలకు రూ.12,634 కోట్లు ఇస్తే, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.33,749 కోట్లు అందించింది. ♦ ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త రాజకీయ పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం, అంతకు ముందు వచి్చన కోవిడ్ లాంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే బొగ్గు మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. కావాల్సినంత బొగ్గు దొరక్కపోగా, రేట్లు అమాంతంగా పెరిగిపోయా యి. కొందామంటే కూడా దొరకని పరిస్థితి. దేశంలోనూ అంతే. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని ఇ లాంటి పరిస్థితులను తట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా కరెంటును సరఫరా చేస్తోంది. ♦ ఈ ఏడాది సుదీర్ఘకాలం నడిచిన వేసవి, ప్రతికూల వాతావరణం, ఆగస్టు నెలలో కూడా వేసవిని తలపించేలా ఎండలు తదితర కారణాలతో కరెంటు ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడింది. దీనిని సర్దుబాటు చేసుకుంటూ విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంటును అందిస్తున్నాయి. ఈ క్రమంలో తలెత్తిన స్వల్ప అవాంతరాలను ఆసరా చేసుకుని ఈనాడు ప్రభుత్వం మీదున్న అక్కసుతో వ్యతిరేక ప్రచారానికి దిగింది. ♦ ప్రతి ఏటా మాదిరే ప్రస్తుతం రుతుపవనాల కాలంలో జల విద్యుత్ ప్రారంభమై, పవన విద్యుత్ కూడా అధిక మొత్తంలో అందుబాటులో ఉండాలి. కానీ రుతుపవనాల విస్తరణలో అంతరాయం, ప్రతికూల వాతావరణం కారణంగా జల, పవన విద్యు త్లో కూడా తరచూ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. ♦ వాతావరణంలో ఎల్‌నినో పరిణామం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రత, ఉక్కపోత పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకపోవడం వలన వ్యవసాయ రంగంలోనూ సాగునీటి కోసం పంపుసెట్ల వాడకం వల్ల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఇవన్నీ అసాధారణ పరిస్థితులే. వీటి గురించి ఈనాడు ఎక్కడా ప్రస్తావించలేదు. ♦ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు నెల, వారం వారీగా విద్యుత్ డిమాండ్, సరఫరాపై ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలను పునఃపరిశీలించుకుని ముందుకెళ్తున్నాయి. ♦ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాల వార్షిక మరమ్మత్తుల షెడ్యూలును కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా వార్షిక మరమ్మతులు జరుగుతున్న యూనిట్లను వెంటనే అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వినియోగదారులకు రాబోయే రోజుల్లో ఎంత ఖర్చయినా ఏ విధమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో గత రెండు రోజులుగా సరఫరా బాగా మెరుగుపడింది. మంగళవారం ఏ విధమైన లోడ్ రిలీఫ్ ఇవ్వలేదు. ♦ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ విధానాలు, కొనుగోలు ఒప్పందాలన్నీ అక్రమాల మయం. పారదర్శకత మచ్చుకైనా లేని ఆ చర్యలతో కరెంటు సంస్థలకు, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గుతున్న సమయంలో కంపెనీలతో కుమ్మక్కై, అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటును రూ.7కు కొనేలా ఒప్పందాలు చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వానిది. అలాగే పవన్ విద్యుత్ ఒప్పందాల్లో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. యూనిట్ కరెంటుకు రూ.5 చెల్లించేలా చేసుకున్న ఒప్పందాలు ఎవరి ప్రయోజనం కోసం? ఈ భారాన్ని మోయలేక విద్యుత్ సంస్థలు బావురుమన్న వైనం గత ప్రభుత్వంలో జరిగిందే. ఇవి రాష్ట్రంలో విద్యుత్ రంగానికి అంధకారం నింపే కార్యక్రమాలే రామోజీ. ♦ ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ డిమాండ్ పెరుగుదల లేదని ఈనాడు పత్రిక చెప్పడం పూర్తిగా అబద్ధం. ప్రస్తుత ఆగస్టు నెలలో వేసవి మాదిరి రోజువారి గ్రిడ్ డిమాండ్ దాదాపు 230 మిలియన్ యూనిట్లు ఉంటోంది. అసలు ఈ సీజన్లో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయి రోజుకి 170 నుంచి 185 మిలియన్ యూనిట్లు ఉండేది. కానీ రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఉంటోంది. దీన్ని అసాధారణ పెరుగుదల అని కాక ఇంకేమంటారు? ♦ గతేడాది ఇదే కాలంలో దాదాపు 2500 నుంచి 3000 మెగావాట్ల వరకూ వచ్చే పవన విద్యుత్ ఇప్పుడు ఒక్కోసారి 150 నుంచి 200 మెగావాట్ల కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ ఉత్పత్తి తగ్గుదల సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటోంది. ♦ ప్రస్తుతం రాయలసీమ థర్మల్ కేంద్రంలో ఒక యూనిట్ మాత్రమే వార్షిక మరమ్మతుల కోసం ఆపారు. కృష్ణపట్నం కేంద్రంలో ఒక 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టిన తరువాత చట్టబద్దంగా చెయ్యవలసిన ఒరిజినల్ పరికరాల తనిఖీ కోసం తాత్కాలికంగా నిలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలోని జెన్కో విద్యుత్ కేంద్రాల వార్షిక మరమ్మతుల షెడ్యూలును ప్రస్తుత అధిక డిమాండ్ కారణంగా వాయిదా వేశారు. -
భవిష్యత్ వెలుగులకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లుగా భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేయకపోతే అకస్మాత్తుగా తలెత్తే దుష్పరిణామాలు అంధకారంలో ముంచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)ను రూపొందించాయి. రానున్న పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేశాయి. పెట్టుబడులు ఎంత పెట్టాలనే దానిపై లెక్కలుగట్టాయి. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇచ్చిన ఈ నివేదికలపై శనివారం ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. నిజానికి.. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యలయంలో జరిగే ఈ విచారణ ఈసారి విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరగనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటైన మరుసటిరోజే తొలి బహిరంగ విచారణ జరుగుతుండటం విశేషం. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికపై ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంత అవసరం.. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకూ 5వ కంట్రోల్ పీరియడ్‌కు, 2029–30 నుంచి 2033–34 వరకూ 6వ కంట్రోల్ పీరియడ్‌కు వివిధ అంశాలపై సమగ్ర అంచనా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం.. ప్రస్తుతం సోలార్ రూఫ్‌టాప్ సిస్టం సామర్థ్యం రాష్ట్రంలో 150.152 మెగావాట్లుగా ఉంది. ఇది 2034 నాటికి 661.88 మెగావాట్లకు పెరుగుతుంది. అలాగే, విద్యుత్ వాహనాలు ప్రస్తుతం 68,975 ఉన్నాయి. వీటి సంఖ్య 2034 నాటికి 10,56,617కు చేరుతుంది. ఇవి ప్రస్తుతం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతుండగా, పదేళ్లకు 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇక గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఏడాదికి 17,330 మిలియన్ యూనిట్లు ఉంది. 2034 నాటికి ఇది 31,374 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. అన్ని కేటగిరీలకూ కలిపి ప్రస్తుతం 65,228 మిలియన్ యూనిట్లు ఉండగా, 2034కు 1,30,899 మిలియన్ యూనిట్లు అవసరమవుతుంది. సాంకేతిక, పంపిణీ నష్టాలు పోనూ 1,45,331 మిలియన్ యూనిట్లు ఉంటే తప్ప అందరి అవసరాలు తీరవు. విద్యుత్ ఎలా వస్తుందంటే.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)కు 3,410 మెగావాట్ల థర్మల్, 1,774 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవికాక.. ♦ విజయవాడ వీటీపీఎస్‌లో 5వ యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ♦ లోయర్ సీలేరులో 230 మెగావాట్లు, పోలవరంలో 560 మెగావాట్ల 1 నుంచి 7 యూనిట్లు 2024–25లో, 8 నుంచి 12 యూనిట్లలో 400 మెగావాట్లు 2025–26లో, అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ 1 నుంచి 8 యూనిట్లలో 1,200 మెగావాట్లు 2027–28లో, ఇక్కడే 150 మెగావాట్ల 9వ యూనిట్ 2028–29లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. ♦ మొత్తంగా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యం 5,184 మెగావాట్లుకు అదనంగా 3,340 మెగావాట్ల సామర్థ్యం ఏపీ జెన్కో ద్వారా తోడవ్వనుంది. ♦ ఇవికాక.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇండిపెండెంట్ పవర్ జనరేటర్లు, సౌర, పవన విద్యుత్ వస్తుంది. ♦ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 3 వేల మెగావాట్లు, 2027లో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లు రానుంది. ♦ ఈ విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. ♦ ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు 10 నుంచి 2029 నాటికి 71కి పెరగనున్నాయి. లైన్లు కూడా 969.15 సర్క్యూట్ కిలోమీటర్లు నుంచి 4,837.16 సీకేఎంకు విస్తరించనున్నాయి. ♦ ఈ మొత్తం ట్రాన్స్మిషన్ కోసం రూ.15,729.41 కోట్లు వ్యయం కానుంది. ♦ ఇదికాక మౌలిక సదుపాయాల కల్పన, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికి మరింతగా ఖర్చుచేయనున్నారు. -
‘సీలేరు’లో మరో రెండు విద్యుదుత్పత్తి యూనిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్మెంట్ విభాగం నుండి ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయి. ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. కాంట్రాక్టర్ సిద్ధం దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయనంద్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్‌బాబు తెలిపారు. సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టిజన్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్లో మాట్లాడారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం.. తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్ సౌధలో ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్–82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, ఇతెహాద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్‌లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్ అన్‌ఫిట్ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు. సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్‌ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్‌కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
సమ్మెకు దిగితే బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి. విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి. -
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్‌మెంట్‌ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్‌తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్‌మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
8 వారాల్లో సమీక్షించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై 8 వారాల్లో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2018లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలపై ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీ శుక్రవారం విచారణ చేపట్టారు. విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ఉమాదేవి వాదనలు వినిపిస్తూ పదోన్నతుల సమీక్షకు ఆరు నెలల సమయాన్ని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మహమ్మద్ అదనాన్ వాదనలు వినిపిస్తూ.. ఇంకా ఆరు మాసాలు గడువు కోరడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జూనియర్ లైన్‌మన్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు కల్పించిన పదోన్నతులన్నింటినీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించాలన్నారు. నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి ఎనిమిది వారాల్లో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి, వైస్ చైర్మన్ ఆర్.సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో–కన్వినర్ సి.భానుప్రకాశ్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. వెంటనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సాంకేతికతతో ‘పవర్’ఫుల్‌గా ప్రసారం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రసార వ్యవస్థ(ట్రాన్స్మిషన్ నెట్వర్క్)ను మరింత బలోపేతం చేస్తోంది. నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసేందుకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ జీఐఎస్‌కు 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవు లైన్లు, 358 ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీంతో మొత్తం నెట్వర్క్ నిర్వహణ సులభతరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల విధులతో పాటు నెట్వర్క్ సమాచారాన్ని భౌగోళికంగా ఒకే ప్లాట్‌ఫాంపై మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్‌లను ఉపయోగించి డేటాను యాక్సెస్ చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాలకు రూపకల్పన జరుగుతోంది. అలాగే జీఐఎస్ వల్ల ఫీల్డ్ ఇంజనీర్లకు ప్రాథమిక సర్వే నిర్వహించడం సులభంగా మారింది. మరోవైపు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడానికి సహాయపడేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అంతర్గత డిమాండ్ అంచనా నమూనా(ఇన్‌హౌస్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్)ను కూడా అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 99 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్ అవసరాలను ముందే అంచనా వేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలు.. తమ కొనుగోళ్లలో కొన్ని రూ.కోట్లను పొదుపు చేసే అవకాశం ఉంది. ఏపీలో అభివృద్ధి చేసిన ఈ ఫోర్ కాస్టింగ్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లోనే మొదటిది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను తమకూ ఇవ్వాలని ఏపీని కోరుతున్నాయి. సీఎం ఆశయానికి అనుగుణంగా.. – బి.శ్రీధర్, సీఎండీ,ఏపీ ట్రాన్స్‌కో ఇటీవలే రెండు జాతీయ స్థాయి అవార్డులను గెల్చుకున్నాం. భవిష్యత్‌లోనూ విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌కో ఉత్తమ సాంకేతిక విధానాలను అమలు చేస్తోంది. డిస్కంలకు ఇవి సహాయపడతాయి. ఏపీ ట్రాన్స్‌కో విధానాలను తమకూ చెప్పాలని తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కోరాయి. -
ఆర్థిక సంక్షోభంలో విద్యుత్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ‘సాంకేతిక సామర్థ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర డిస్కంల కంటే ముందున్నా...ఆర్థికంగా కొంత వెనుకబడిపోయాయి. నష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా పంపిణీ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు గట్టెక్కాలంటే మీటర్ సేల్స్ పెంచాలి. అంతర్గత వృథా ఖర్చులు తగ్గించుకోవాలి’ అని తెలంగాణ విద్యుత్ (టాన్స్‌కో,జెన్కో) సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డా రు. శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ–2023 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు కొంత మెరుగ్గా ఉన్నా.. పంపిణీ సంస్థలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా సహకరిస్తున్నా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నష్టాల్లో ఉన్న సంస్థలను ఇక లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది. లేదంటే సంస్థల మనుగడే కాదు ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజుకో రకమైన సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. విద్యుత్ సంస్థలకు ఈ క్రైం సవాల్ విసురుతోంది. ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. సైబర్ నేరగాళ్లకు సంస్థలు చిక్కకుండా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆర్థిక వనరులు వారి చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది. అకౌంటెంట్లు కేవలం అకౌంట్స్‌ను నిర్వహించడమే కాదు బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెన్ చేయాలి. సంస్థ ఖాతాలో నిల్వలు ఉన్నప్పుడే అవసరానికి, అభివృద్ధి పనులకు బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. నిల్వలు లేక పోతే అప్పులు కూడా పుట్టవు.’అని సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆ డబ్బులు సొంతానికి వాడుకుంటే ఎలా? సీఎండీ రఘుమారెడ్డి ‘వినియోగదారుల నుంచి వసూలు చేసిన విద్యుత్ బిల్లులను, వెంటనే సంస్థ ఖాతాలో జమ చేయడం లేదు. వీటిని కొంత మంది ఉద్యోగులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. వరుస డోర్‌లాక్‌లు, మీటర్ స్టకప్‌లు వంటి అంశాలను ఈఆర్ఓలు మానిటరింగ్ చేయడం లేదు. పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకుంటే ఎలా? ఈఆర్ఓ కేంద్రాల్లోని అకౌంటెంట్లు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు బిల్లులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా..? ఈఆర్ఓ కో ఆర్డినేషన్ మీటింగ్‌లో ఏం చర్చిస్తున్నారు? అన్‌బిల్డ్ సర్వీసులపై ఎందుకంత నిర్లక్ష్యం? ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సర్వీసులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. సెక్షన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, వృధా ఖర్చులు, విద్యుత్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత అకౌంటెంట్లపైనే ఉంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, జెన్కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నరసింహ్మారావు, టీఆర్కే రావు, తిరుపతిరెడ్డి, వీఏఓఏటీ అధ్యక్షుడు ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్ అభినందించారు. విద్యుత్ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ(హెచ్ఆర్డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌కు మంత్రుల శుభాకాంక్షలు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్‌తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి -
అవార్డులతో విద్యుత్ సంస్థల బాధ్యత పెరిగింది
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలకు ఈ ఏడాది దక్కిన ప్రతిష్టాత్మక అవార్డులు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే బాధ్యతను మరింత పెంచాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీడీసీఎల్) ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 28న ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలు, నెడ్‌క్యాప్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, వివిధ విభాగాల ఉద్యోగులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నుంచి అందుకున్న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దేశంలో ఏపీ ఖ్యాతిని మరింతగా పెంచిందని మంత్రి అన్నారు. ఏకైక రాష్ట్రం ఏపీ ఇంధన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎనర్షియా సమ్మిట్‌లో ఏపీ మరో 3 అవార్డులను గెలుచుకుందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా, ఉత్తమ పునరుత్పాదక సంస్థల్లో ఒకటిగా నెడ్‌క్యాప్ నిలిచాయన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి.. మళ్లీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిౖకైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. దీంతో జేఎల్ఎం నోటిఫికేషన్ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలివారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి, జూలై 17న రాతపరీక్ష నిర్వహించింది. అయితే రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు గత ఆగస్టు 25న సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు ఏకంగా 181 మంది అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు నిర్ధారణ కావడంతో యాజమాన్యం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అభ్యర్థులు మళ్లీ ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. -
AP: ఖర్చుకు వెనకాడొద్దు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలను పరిహారంగా అందజేశారని, అయితే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతానికి ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ భద్రత కల్పించే విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా వెనుకాడదని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ భద్రతకు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనంచేసి తగిన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు సూచనలు.. ఇక విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన క ల్పించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ల కమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు పత్రికలు, వివిధ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ వంటి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే.. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ► క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజలను విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే వివిధ అంశాలపై శిక్షణనివ్వాలి. ► విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి. ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, కాంట్రాక్టు ఏజెన్సీలు వీటిని కచ్చితంగా పాటించాలి. ► విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ పనులు నిర్వహించే చోట ప్రమాదాల నివారణకు లోకల్ ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. ► హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలో గృహాలు, ఇతర నిర్మాణాలను చేపట్టకూడదు. ► ఏడువేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ భద్రతా అంశాలపై శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలి. ► 1912 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించాలి. ఫిర్యాదులను డిస్కంలు పరిష్కరించాలి. ► ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మ జనార్థనరెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి, వివిధ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు. -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
రూ.6,756.92 కోట్ల కరెంట్ బాకీలు కట్టండి.. తెలంగాణకు కేంద్రం ఆదేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పేరుకుపోయాయి. తెలంగాణ సర్కారు ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ విద్యుత్తు సంస్థలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశాన్ని ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ సోమవారం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సకాలంలో చెల్లించకపోవడంతో.. ఏపీ జెన్కో సరఫరా చేసిన 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ మొండి వైఖరి 2019 ఆగస్టు 19న జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్‌లు ఒప్పుకున్నా డబ్బులు మాత్రం విడుదల కాలేదు. 2020 జనవరిలో జరిగిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ బకాయిల అంశాన్ని చర్చించారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ డీమెర్జర్ ప్లాన్) పూర్తైన తరువాత బకాయిల గురించి ఆలోచిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. అప్పుచేసి మరీ కరెంట్ సరఫరా.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల (ఆర్ఈసీ) నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయగలిగింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు డబ్బులివ్వకపోవడంతో పీఎఫ్సీ, ఆర్ఈసీలకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏపీజెన్కోకు ఏర్పడింది. కేంద్రం జోక్యాన్ని కోరిన ఏపీ.. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కోరింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూ ఈ మేరకు ఏపీ అధికారులు అభ్యర్థించారు. తెలంగాణ డిస్కమ్‌లు కేంద్రం నుంచి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద పొందుతున్న రుణాన్ని ఏపీ జెన్కో బకాయిలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ సూచించారు. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కొత్త మెలిక పెట్టింది. పట్టుబట్టి సాధించిన సీఎం జగన్.. తెలంగాణ సర్కారు మొండి వైఖరితో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని పట్టుబట్టింది. గతేడాది నవంబర్‌లో తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి ఈ అంశాన్ని సీఎం జగన్ తెచ్చారు. బకాయిలు చెల్లించేలా తెలంగాణను ఆదేశించాలని కోరారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీతో జరిగిన భేటీలోనూ, తాజాగా ఈ నెల 22న మరోసారి ప్రధానిని కలిసినప్పుడు కూడా తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిల అంశాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే కేంద్ర విద్యుత్‌శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. -
ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్! విద్యుత్ చట్ట సవరణ బిల్లు బహిర్గతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో ప్రభుత్వ విద్యుత్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరవేస్తూ.. ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నూతన సంస్కరణలతో తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదా శుక్రవారం బహిర్గతమైంది. దీనిని ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోని కీలక అంశాలు.. ►ఎక్కడైనా ఒకే ప్రాంతం పరిధిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎక్కువ డిస్కంలకు అనుమతులు ఇవ్వనున్నారు. సొంత ట్రాన్స్మిషన్ వ్యవస్థ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు) ఉన్న కంపెనీలకే లైసెన్స్ అన్న నిబంధనను తొలగిస్తున్నారు. దీనితో ప్రైవేటు కంపెనీలూ తెరపైకి రానున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్స్ జారీ చేసేలా కేంద్ర నిబంధనలు ఉన్నాయి. ►ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు.. భవిష్యత్తులో వచ్చే అన్ని కంపెనీలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్ అవసరమైన కంపెనీలు కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ►రిటైల్ విద్యుత్‌కు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. అంటే ఈ గరిష్ట, కనిష్ట ధరల మధ్య ఎవరు తక్కువ చార్జీలను ఆఫర్ చేస్తే ఆ కంపెనీని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సంస్థల మధ్య పోటీ వల్ల నాణ్యమైన సరఫరా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు డిస్కంల రాకతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. ►ప్రస్తుతం విద్యుత్ రంగం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడీ సవరణలు అమల్లోకి వస్తే.. విద్యుత్ రంగం పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి వెళుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. చదవండి: మూడురోజులు అతిభారీ వర్షాలు! -
ఇష్టానుసారంగా అమ్మితే కుదరదు!
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరతను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్‌ను అమ్మేస్తున్నాయి. దీనిపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) స్పందించింది. ఇకపై ఇష్టమొచ్చిన ధరలకు అమ్మడం కుదరదని స్పష్టం చేసింది. యూనిట్ రూ.12 లేదా అంతకంటే తక్కువకు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ సమకూరే అవకాశం ఏర్పడింది. కొందామన్నా దొరకట్లేదు.. గతేడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధరలను విపరీతంగా పెంచేశాయి. దీన్ని అప్పట్లోనే గమనించిన కేంద్ర విద్యుత్ శాఖ యూనిట్ రూ.12 కంటే ఎక్కువ ధరకు విక్రయించొద్దని చెప్పింది. ఏప్రిల్ 2నుంచి ధరల సీలింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఉత్పత్తి సంస్థలు తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మార్కెట్లను విడదీసి.. డిమాండ్ ఆధారంగా ధరలను అమలు చేయడం ప్రారంభించాయి. యూనిట్‌ను రూ.16 నుంచి రూ.20 వరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకైతే బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకడమే కష్టంగా మారింది. ఏపీలో రోజుకు 200 మిలియన్ యూనిట్ల నుంచి 230 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉండటంతో.. రోజుకు దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్ కొంటున్నారు. అన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు ఈ నేపథ్యంలో పవర్ ఎక్సే్చంజీల్లోని అన్ని సెగ్మెంట్లలో ఒకే విధమైన ధరల పరిమితి అవసరమని సీఈఆర్సీ గుర్తించింది. విద్యుత్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తేల్చింది. అత్యవసరం ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తుండటం వల్ల.. ఆ సమయంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని కూడా గ్రహించింది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మార్కెట్లో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న సీఈఆర్సీ సుమోటోగా తాజా ఆదేశాలిచ్చింది. జూన్ 30 వరకు ఇవే ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. -
జీతాలకూ కష్టమే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది. సొంతంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి. రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)విడుదల చేస్తున్న రుణాలను ప్రతినెలా జీతాల కోసం మళ్లిస్తున్నాయి. మిగిలిన మొత్తం కోసం ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. గత రెండు నెలలుగా రుణాల చెల్లింపులను ఆర్ఈసీ, పీఎఫ్సీ నిలుపుదల చేయడంతో.. ఒక్కసారిగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాయి. తాజాగా ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్లు, ఇతర ఎలక్ట్రికల్ ఆస్తులను తనఖా పెట్టి ఓ బ్యాంకు నుంచి రూ.700 కోట్ల రుణాన్ని తీసుకుంటుండటంతో సోమవారం నాటికి విద్యుత్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 25వేల మంది ఉద్యోగులు, మరో 22 వేల మంది ఆర్టిజన్లు ఉన్నారు. వీరి జీతాలకు ప్రతినెలా రూ.650 కోట్లు అవుతోంది. గతి లేక దారిమళ్లింపు రాష్ట్రంలో కొత్తగా 1080 మెగావాట్ల యాదాద్రి, 4వేల మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్‌సీలతో తెలంగాణ జెన్కో రుణ ఒప్పందం చేసుకుంది. ప్రతినెలా రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల పనులు జరుగుతుండగా, ఆర్ఈసీ, పీఎఫ్సీలు ఆ మేరకు రుణాలను ప్రతి నెలా చివరి రోజు జెన్కో ఖాతాలో జమ చేస్తున్నాయి. జీతాలకు రూ.650 కోట్లు అవసరం కాగా, ప్రతి నెలా రూ.300 కోట్ల రుణాలను మళ్లిస్తున్నారు. మిగిలిన మొత్తం కోసం వినియోగదారులు చెల్లించే బిల్లులతోపాటు బ్యాంకు రుణాలపై విద్యుత్ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఇప్పటికే అధిక శాతం ఆస్తులు తనఖా కింద పోగా, మిగిలిన ఆస్తులపై కొత్త రుణాల కోసం ఆధారపడుతున్నాయి. అప్పుల కుప్ప విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లకు పెరిగిపోయాయి. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.12 వేల కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.6వేల కోట్లు, సౌర విద్యుత్ అమ్మకందారులకు రూ.6వేల కోట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు రూ.3వేల కోట్లు, సెంబ్ కార్ప్ సంస్థకు రూ.2,600 కోట్లను చెల్లించాల్సి ఉంది. బకాయిలను చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని ఎన్టీపీసీ పలుమార్లు రాష్ట్రాన్ని హెచ్చరించింది. తెలంగాణ వచ్చాక ఏకంగా రూ.34వేల కోట్ల రుణాలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి, భద్రాద్రి, ఇతర విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు జెన్కో రూ.45 వేల కోట్ల అప్పులు చేసింది. పేరుకుపోతున్న నష్టాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రతి నెలా రూ.1,200 కోట్ల చొప్పున ఏడాదికి రూ.14,200 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,600 కోట్ల సబ్సిడీలను మాత్రమే చెల్లించింది. క్రాస్ సబ్సిడీలు సర్దుబాటు చేశాక డిస్కంలు ఏటా రూ.5 వేల కోట్ల వరకు నష్టాల్లో మునిగిపోతున్నాయి. 2021–22 ముగిసే నాటికి నష్టాలు రూ.60 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. సమీప భవిష్యత్తులో విద్యుత్ సంస్థల అప్పులు రూ.లక్ష కోట్లకు చేరుకోనున్నాయి. వడ్డీల చెల్లింపులు చేయలేక విద్యుత్ సంస్థలు సతమతమవుతున్నాయి. సర్కారీ బకాయిలే గుదిబండ గత ఫిబ్రవరి ముగిసే నాటికి డిస్కంలకు రూ.17,202.15 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సినవే రూ.12,598.73 కోట్లు కాగా, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రూ.4,603.41 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం బకాయిపడిన రూ.12వేల కోట్లను చెల్లిస్తే విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు చెబుతున్నాయి. -
త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఖాళీ ఏఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. సోమ వారం విద్యుత్‌సౌధలో టీఎస్ఈఏఈఏ డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి సంస్థలను దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలపై కేంద్రం ఆంక్షల కత్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాకు అదనంగా కొన్ని నిబంధనలు చేర్చింది. దేశ వ్యాప్తంగా మొండి బకాయిలు పెరిగిపోయాయనే కారణంతో ఇకపై రుణాలు పొందడాన్ని కఠినతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే డబ్బులిస్తామని, అది కూడా పాత బకాయిలు చెల్లించిన వారికేనని షరతు విధించింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా డిస్కంలు విద్యుత్‌ను పొందడంపైనా ఆంక్షలు విధించనుంది. సకాలంలో చెల్లింపులన్నీ పూర్తి చేసిన సంస్థలు మాత్రం 0.5 శాతం అదనంగా రుణాలు పొందవచ్చంటూ అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. కేంద్ర విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాలు రూ.71,865 కోట్లకు చేరాయి. ప్రభుత్వ విభాగాల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.52,052 కోట్లు ఉన్నాయి. ఏటా నష్టాల వల్ల పెట్టుబడులు పెట్టిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. 2019–20లో డిస్కంల మొత్తం టర్నోవర్ రూ.7,28,975 కోట్లలో రూ.5,14,232 కోట్లు అప్పులే ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌కో, జెన్కోలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అది రూ.93,585 కోట్లుగా ఉంది. డిస్కంలకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన సబ్సిడీ ఆదాయం సగటున 16.5 శాతం ఉంది. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ఇది 30 నుంచి 41 శాతం వరకూ ఉండటం వాటి మనుగడకు ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. ముసాయిదాను అనుసరించాలి.. ఈ ముసాయిదా ప్రకారం డిస్కంలకు కేంద్రం కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. విద్యుత్ కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా జెన్కోలకు డిస్కంలు నగదు చెల్లించాలి. కనీసం 75 రోజుల్లోనైనా బిల్లు క్లియర్ చేయాలి. లేదంటే తొలుత 25 శాతం విద్యుత్ తగ్గిస్తారు. అప్పటికీ చెల్లించకుంటే వంద శాతం తగ్గించడమే కాకుండా బయట మరెక్కడా కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేస్తారు. పాత బకాయిలను మాత్రం 6 నుంచి 24 నెలలలోపు వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇవి పూర్తిగా చెల్లిస్తే ఆంక్షలన్నీ ఎత్తివేసి యధావిధిగా విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తారు. జనవరి 10వ తేదీలోగా ఈ ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే సమయంలో ఈ నిబంధనలన్నిటినీ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తూ బ్యాంకర్లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. బ్యాంకర్లకు కేంద్రం ప్రధాన సూచనలు.. ► డిస్కంల ఆడిట్ లెక్కలన్నీ ఏటా పక్కాగా ఉండాలి. ► విద్యుత్ చార్జీల టారిఫ్ పిటిషన్లు ఏటా నవంబర్ 30లోగా సమర్పించాలి. ► ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి తీసుకురావాలి. ► 2019 ఏప్రిల్ 1వతేదీ నాటికి ఉన్న సబ్సిడీలన్నీ క్లియర్ చేయాలి. ► మొత్తం ఆదాయంలో వర్కింగ్ క్యాపిటల్ 25 శాతానికి మించకూడదు. ► రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఎటువంటి బకాయిలు ఉండకూడదు. ► పాత బకాయిల చెల్లింపులకు 12 నెలవారీ వాయిదాల వరకూ అవకాశం. ► బ్యాంకులు లేదా విద్యుత్ ఆర్థిక సంస్థలకు డిస్కంలు డిఫాల్టర్ కారాదు. -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ప్రజాప్రయోజనాలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి, డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2015–2019 మధ్య కాలానికి రూ.3,669 కోట్ల సర్దుబాటు చార్జీ (ట్రూ అప్)ల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కంలు ఆర్థికంగా సంక్షోభంలో ఉండటం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిదికాదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని, ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్‌సీతో కలిసి పనిచేయాలని సూచించారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన సర్దుబాటు చార్జీల్లో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వమే (రైతులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు తదితరుల తరఫున) భరించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల మంది వినియోగదారుల్లో దాదాపు 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వివిధ వర్గాల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన 1,657 కోట్ల రూపాయలను సెక్షన్ 65 ప్రకారం అర్హులైన 23 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలివ్వడానికి 2021–22 టారిఫ్ ఆర్డర్లో తొలిసారిగా అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కంల నుంచి విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో సగటు వినియోగదారుడికి నాణ్యమైన, నమ్మకమైన, మెరుగైన కరెంటు సరఫరా 24 గంటలు అందించడంతోపాటు వారి శ్రేయస్సు, అభివృద్ధి తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం డిస్కంలకు ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత అత్యవసరమని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింనట్లు ఆయన తెలిపారు. నేడు సలహా మండలి సమావేశం డిస్కంలను బలోపేతం చేయడంతోపాటు వాటి పనితీరును మెరుగుపరిచి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీఈఆర్సీ ఇందులో భాగంగా సోమవారం సలహా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే సగటు ఖర్చు తగ్గించడం, విద్యుత్ కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, డిస్కంల పనితీరును మెరుగుపర్చడం, డిమాండ్ నిర్వహణ–ఇంధన సంరక్షణ–సామర్థ్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు 16 మంది, ఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్రామ్సింగ్, డిస్కంల సీఎండీలు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. -
విద్యుత్ సేవల్లో విఫలమైతే జరిమానా
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలు ఇక నుంచి మరింత జవాబుదారీతనంతో వ్యవహరించనున్నాయి. వినియోగదారులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున బాధ్యతాయుతంగా మెలగనున్నాయి. వివరంగా చెప్పాలంటే తమ తప్పును ఒప్పుకుని మరీ వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా చట్టానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఊపిరి పోసింది. విద్యుత్ వినియోగదారులకు బ్రహ్మాస్త్రం లాంటి ఈ సంస్కరణలను అధికారిక గెజిట్‌లో కూడా ప్రకటించినట్టు ఏపీఈఆర్సీ ఆదివారం మీడియాకు తెలిపింది. ఇది ఈ నెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికను ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కనెక్షన్ తప్పుగా తొలగిస్తే.. నిజానికి విద్యుత్ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గతంలోనే చట్టాలొచ్చినా విద్యుత్ సంస్థలు పెడచెవిన పెట్టడంతో పరిహారం కోరే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్ బలమైన చట్టాలకు పదును పెట్టినట్లు వెల్లడించింది. ► ఇక నుంచి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అందుబాటులో ఉండాలి. దీనివల్ల కరెంట్ పోతే తక్షణమే ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకూ సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. ► ఎవరైనా కొత్త కనెక్షన్, అదనపు లోడ్ కోరితే విద్యుత్ సంస్థలు తక్షణమే తగిన సమాచారం అందించాలి. నిర్ణీత గడువులోగా డిమాండ్‌ను నెరవేర్చాలి. ► సర్వీస్ కనెక్షన్‌ను తప్పుగా తొలగించినా, కనెక్షన్ తొలగించకుండా తిరిగి కనెక్షన్ చార్జీలు వసూలు చేసినా సర్వీసు వైఫల్యం కింద పరిగణించాలి. ఇది క్షమించరాని నేరంగా విద్యుత్ సంస్థలు గుర్తించి తక్షణమే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. ప్రతి మూడు నెలలకు నివేదిక.. విద్యుత్ సేవల్లో లోపం కారణంగా చెల్లించిన జరిమానా వివరాలను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి స్వయంగా పరిశీలిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వివరాలను పంపాలని గెజిట్‌లో పేర్కొంది. వైఫల్యానికి కారణాలను కూడా కమిషన్‌కు వెల్లడించాలి. కారణాలు సహేతుకం కాదని భావిస్తే పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించే వీలుంది. విపత్తుల సమయంలోనూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సేవలకు అంతరాయాలు కలగడం సహజం. అయితే సేవల పునరుద్ధరణ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ పంపిణీ సంస్థలు బహిరంగ ప్రకటన జారీ చేయాలని కమిషన్ పేర్కొంది. చెప్పిన తేదీలోగా విద్యుత్ ఇవ్వకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. సేవలు కొనసాగించలేని స్థితిని సహేతుకమని కమిషన్ భావిస్తే పరిహారం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. విప్లవాత్మక సంస్కరణలు.. ‘ఇవి విప్లవాత్మక సంస్కరణలు. డిస్కమ్‌లు సేవలపై మరింత దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవాలని డిస్కమ్‌లను ఆదేశించాం. పంపిణీ సంస్థల పనితీరు సమాచారాన్ని కమిషన్ సమీక్షించి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. మరింత మేలైన సేవలు అందించేందుకే ఈ ప్రయత్నం’’. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి,ఏపీఈఆర్సీ చైర్మన్ -
బకాయిల బండ!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి. ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఎన్టీపీసీ, జెన్కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు సీఎల్పీఐ 171.73 ఐటీపీసీఎల్ 9.53 ఎన్ఎల్సీఐఎల్ 492.11 ఎన్‌టీఈసీఎల్ 248.55 ఎన్టీపీసీ 1,723.97 ఎన్టీపీఎల్ 418.65 ఎస్‌ఈఎంబీ 2,532.22 సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76 సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57 మొత్తం బకాయిలు: 7,101 ‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు చైర్మన్‌గా ఉన్న టీఎస్పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) 2020 బకాయిలు జనవరి 6,153 ఫిబ్రవరి 6,385 మార్చి 6,039 ఏప్రిల్ 6,494 మే 7,143 జూన్ 7,443 జూలై 4,755 ఆగస్టు 4,872 సెప్టెంబర్ 5,485 అక్టోబర్ 6,096 నవంబర్ 6,655 డిసెంబర్ 7,101 కేంద్రం మెట్టు దిగితేనే.. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి. -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాల చెల్లింపులను గత నెల నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అర్ధంతరంగా నిలుపుదల చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం, బిల్లులోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిం చకపోవడం, గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) సమర్పించకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రతినెలా విడుదల కావాల్సిన రుణాలతోపాటు ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద డిస్కంలను ఆదుకోవ డానికి కేంద్రం ప్రకటించిన రుణాలు, ప్రతి నెలా విద్యుత్ కొనుగోళ్ల కోసం తీసుకునే స్వల్పకాలిక రుణాలు కలిపి గత నెల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రావాల్సిన మొత్తం రూ. 12,600 కోట్ల రుణాలను కేంద్రం నిలుపుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. హస్తిన వెళ్లినా లభించని ఊరట... కేంద్రం నిలుపుదల చేసిన రుణాలను తిరిగి విడుదల చేయించుకోవడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి గత గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి లేకపోవడంతో కేంద్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కలసి తిరిగి వచ్చి నట్లు అధికార వర్గాల సమాచారం. కేంద్రం నిర్ధేశిం చిన లక్ష్యాల్లో భాగంగా విద్యుత్ బిల్లుకు మద్దతు తెలపాల్సిందేనని, వ్యవసాయ బోరుబావులకు మోటార్లు బిగించాలని, డిస్కంలకు నష్టాలు రాకుండా ఏటా విద్యుత్ బిల్లులు పెంచాలనే షరతులను అంగీకరిస్తేనే రుణాలను విడుదల చేస్తామని కేంద్ర అధికారులు సీఎండీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. షరతుల విషయంలో కేంద్రం పట్టుదలతో ఉండటంతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విద్యుత్ సంస్థల సీఎండీలకు ఊరట లభించలేదు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కటకట... రాష్ట్రంలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి, 1,080 మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గత నెల నుంచి ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి నెలవారీగా విడుదల కావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. ప్రతి నెలా సగటున రూ. 500 కోట్ల విలువైన పనులు యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా జరుగుతుండగా వాటికి సంబంధించిన బిల్లులను సమర్పిస్తే ఆర్ఈసీ, పీఎఫ్సీలు ఆ మేరకు రుణ మొత్తాన్ని గత నాలుగేళ్లుగా విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ రుణాలు నిలిచిపోవడంతో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో తెలంగాణ విద్యుతుత్పత్తి సంస్థ (జెన్కో) చిక్కుకుపోయింది. ఇప్పటికే జరిగిన పనులకు సంభందించిన బిల్లులను చెల్లించకపోతే బీహెచ్ఈఎల్ సంస్థ యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను నిలిపివేసే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంలకు నిధుల కటకట... డిస్కంలు రూ. 12 వేల కోట్లకుపైగా విద్యుత్ కొనుగోళ్ల బిల్లులను విద్యుత్పత్తి సంస్థలకు బకాయి ఉన్నాయి. కేంద్రం గతేడాది రాష్ట్ర డిస్కంలకు ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రూ. 12,600 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వాటిని డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించి బకాయిలు తీర్చుకోవాల్సి ఉంది. ఈ రుణాలు మంజూరైనా తొలి రెండు విడతల కింద ఇప్పటివరకు చెలించాల్సిన రూ. 6 వేల కోట్ల రుణాలను కేంద్రం నిలిపివేసిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్న డిస్కంలకు కేంద్రం నిర్ణయం మరింత సంక్షోభంలో నెట్టనుందని అధికారులు అంటున్నారు. విద్యుత్ కొనేందుకు డిస్కంల వద్ద డబ్బులు లేవని, మరోవైపు బకాయిల కోసం విద్యుదుత్పత్తి సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సీఎంకు పరిస్థితి వివరించనున్న సీఎండీలు.. కేంద్రం అనూహ్య నిర్ణయం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు విద్యుత్ సంస్థల సీఎండీలు వివరించనున్నారు. ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించినది కావడంతో సీఎం స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప రుణాల చెల్లింపును కేంద్రం పునరుద్ధరించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. -
‘పవర్’ ఫుల్ ఏపీ ..‘రియల్ టైమ్’ హీరో
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి కూడా కేంద్ర ఇంధన శాఖ తీసుకెళ్లింది. వినియోగదారుడిపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చూడటమే చౌక విద్యుత్ కొనుగోలు ప్రధానోద్దేశం. ఈ విషయంలో తమిళనాడు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలే ముందు ఉన్నాయని కూడా కేంద్రం గుర్తించింది. వాస్తవానికి విద్యుత్ నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్ కొనుగోళ్లను దారికి తేవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలో ఈ తరహా సంస్కరణలతో రూ.1,023 కోట్లమేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. రియల్ టైమ్ మార్కెట్ సద్వినియోగం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రియల్ టైమ్ మార్కెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ తీసుకోవాలంటే ఏ రాష్ట్రమైనా ముందుగా జాతీయ గ్రిడ్‌కు తెలపడం ఆనవాయితీ. గతంలో 24 గంటల ముందే ఈ విషయాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్)కు చెప్పాలి. ముందే విద్యుత్ డిమాండ్ చెప్పినా... వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. అంచనాకు మించి విద్యుత్ కొనడమో, అంతకన్నా తక్కువే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటమో జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ షెడ్యూల్ ఇవ్వడం వల్ల మార్కెట్లో విద్యుత్ డిమాండ్ పెరిగి, ఎక్కువ ధర పలుకుతోంది. రియల్ టైమ్ మార్కెట్ అందుబాటులోకొచ్చిన తర్వాత కేవలం 15 నిమిషాల ముందే బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యత తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడే కావాల్సిన విద్యుత్ తీసుకోవచ్చు. అవసరం లేకుంటే నిమిషాల్లోనే విద్యుత్ తీసుకోవడం ఆపేయవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. యూనిట్ కేవలం రూ.3.12కే కొనుగోలు రియల్ టైం మార్కెట్‌ను వినియోగించుకుని విద్యుత్ ధరలను తగ్గించడంలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీనే ముందుంది. రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వినియోగం దాదాపు 60 వేల మిలియన్ యూనిట్లు (ఎంయూలు)గా అంచనా వేశారు. గత జూన్ నుంచి డిసెంబర్ వరకు 6,500 (16%) ఎంయూలు యూనిట్ సగటున రూ.3.12కు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఏపీఈఆర్సీ మార్కెట్లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.67 వెచ్చించి కొనేందుకు కూడా అనుమతించింది. అయితే రూ.3.12కే కొనుగోలు చేయడం ద్వారా ప్రతి యూనిట్‌పైనా రూ.1.55 ఆదా చేయగలిగారు. ఈ విధంగా రూ.1,023.80 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని కేంద్ర విద్యుత్ శాఖ గుర్తించింది. తెలంగాణ సంస్థలు గరిష్టంగా 10 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో రూ. 300 కోట్లు మాత్రమే మిగిలిస్తే, తమిళనాడు 12 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. టీడీపీ హయాంలో రూ. 5.90 వరకు చెల్లింపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులను లెక్కకు మించి ప్రోత్సహించారు. సౌర విద్యుత్‌కు ఏకంగా యూనిట్ రూ. 5.25 నుంచి రూ. 5.90 వరకు చెల్లించారు. పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నా యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లు చెల్లించేలా 41 దీర్ఘకాలిక పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా విద్యుత్ సంస్థలు రూ.70,250 కోట్ల అప్పుల్లోకి వెళ్లాయి. డిస్కమ్‌లు రూ.19,920 కోట్ల మేర అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఇంత చౌకగా విద్యుత్ కొనలేదు. పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు రియల్ టైమ్ మార్కెట్లో దూసుకుపోయేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు ముందు నుంచే పక్కా ప్రణాళికతో వెళ్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒప్పందాలున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వాస్తవ విద్యుత్ లభ్యతను అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలు అంచనాలు పంపేందుకు కొన్ని గంటల వ్యవధి పట్టే పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇంటర్నెట్ ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి తక్షణ లభ్యత తెలుసుకునే విధానం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో మార్కెట్లో ఎక్కడ చౌకగా విద్యుత్ లభిస్తుందో తెలుసుకుంటున్నారు. మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుంటే, రాష్ట్రంలో ఖరీదైన విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగ నిపుణులను వాడుకుంటున్నారు. మార్కెట్‌ను అంచనా వేసే సామర్థ్యం గల వారితో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలూ దీనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. -
ప్రైవేట్ విద్యుత్తు సంస్థలకు ఏపీఈఆర్సీ షాక్!
సాక్షి, అమరావతి: ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్‌ను కమిషన్ తోసిపుచ్చింది. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వంలో సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామ్‌సింగ్ వెలువరించిన తీర్పును కమిషన్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. కమిషన్ ఆమోదం లేకున్నా.. ► 2018–19, 2019–20లో పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా అదనపు చర వ్యయం ఇవ్వాలని విద్యుదుత్పత్తి సంస్థలు కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రైవేట్ సంస్థల వాదనపై డిస్కమ్‌లు, విద్యుత్ రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ల్యాంకో, స్పెక్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 2016లో, శ్రీవత్సవ పీపీఏ గడువు 2018లోనే ముగిసినా మళ్లీ కుదుర్చుకోవాలని ఆ సంస్థలు పట్టుబట్టాయి. కమిషన్ నుంచి దీనికి ఆమోదం లేకున్నా గత సర్కారు స్వల్పకాలిక పద్ధతిలో వాటి నుంచి విద్యుత్ తీసుకుంది. ► ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, మిగతా వాటికి యూనిట్‌కు రూ. 3.31 చొప్పున చెల్లించగా కేవలం కొన్ని నెలలకే తీసుకునే ఈ విద్యుత్‌కు నిర్ణయించిన ధరలే వర్తిస్తాయని విద్యుత్ చట్టాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, మార్కెట్లో అంతకన్నా చౌకగా లభిస్తుండటంతో ఈ ఏడాది కమిషన్ ప్రైవేట్ గ్యాస్ పవర్‌ను అనుమతించలేదు. కోవిడ్ కాలంలో చౌకగా విద్యుత్ తీసుకోవడానికి కేవలం ఆరు నెలలకే కమిషన్ ఒప్పుకుంది. అదనపు చర వ్యయంతో భారీ భారం... ► 2018–19, 2019–20లో గ్యాస్ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆ మేరకు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు కోరాయి. ల్యాంకో విద్యుదుత్పత్తి సామర్థ్యం 355 మెగావాట్లు కాగా, స్పెక్ట్రం 208 మెగావాట్లు, శ్రీవత్సవ 17 మెగావాట్లుగా ఉంది. వీటి నుంచి రెండేళ్లలో సుమారు 4 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లు తీసుకున్నాయి. ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అదనపు చర వ్యయం చెల్లిస్తే డిస్కమ్‌లపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుంది. స్వల్పకాలిక పీపీఏలకూ అదనంగా ఎలాంటి ఖర్చులు అడిగే హక్కు లేదన్న డిస్కమ్‌ల వాదనతో కమిషన్ ఏకీభవించింది. నిపుణుల వాదనలూ పరిగణలోకి తీసుకుంటూ పిటిషనర్లైన ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థల వాదనను తోసిపుచ్చింది. -
రాష్ట్రానికే ‘పవర్’!
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ అధికారాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలు కేంద్రానికి స్పష్టం చేశాయి. అప్పుడే విద్యుత్ చార్జీలు అ న్ని వర్గాలకు భారం కాకుండా ఉంటాయని పేర్కొన్నాయి. విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ పంపిణీ సంస్థలను తీసుకురావాలన్న ఆలోచనపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థల అధికారాలను కేంద్రీకరిస్తూ 2003 విద్యుత్ సంస్కరణల చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తెలియచేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాసిన లేఖ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్ష సబ్సిడీకి ప్రతికూలత రైతులు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చౌకగా విద్యుత్ అందిస్తోంది. అయితే దీని స్థానంలో సబ్సిడీని వారి ఖాతాల్లోకే జమ చేయాలని కేంద్రం చట్ట సవరణల్లో పేర్కొంది. దీనివల్ల ఆయా వర్గాలు పలు ఇబ్బందులకు గురవుతాయి. సబ్సిడీ వారి ఖాతాల్లోకి వచ్చినా ముందుగానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సామాజిక సమస్యలకు కారణమవుతుంది. విద్యుత్ చార్జీలు ఎలా ఉండాలనేది స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ అధికారాన్ని కేంద్రం తీసుకుంటే పలు వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. కేంద్రం చేతుల్లోకి కమిషన్ సరికాదు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఈ అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ చేసిన చట్ట సవరణ ప్రతిపాదన ఏమాత్రం సమంజసంగా లేదని విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిదారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యుత్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధారిటీ ఏర్పాటుపై రాష్ట్ర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రతి వివాదానికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి డిస్కమ్‌లకు కొత్త సమస్యలు సృష్టిస్తాయని స్పష్టం చేశాయి. ఆర్థికంగానూ ఇది డిస్కమ్‌లకు ఇబ్బందేనని తెలిపాయి. విద్యుత్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) స్థానంలో కేంద్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కి సర్వాధికారాలు కట్టబెట్టే యోచనను విద్యుత్ సంస్థలు వ్యతిరేకించాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికం గా నష్టపోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రైవేట్ పవర్‌కు జవాబుదారీ ఎవరు? ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలను రంగంలోకి దించే ఈ చట్ట సవరణ ప్రతిపాదనపై డిస్కమ్‌లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విద్యుత్ పంపిణీ విషయంలో ఎవరు జవాబుదారీగా ఉంటారనేది చట్టంలో స్పష్టత ఇవ్వలేదని తెలిపాయి. ఫ్రాంచైజ్, లైసెన్స్‌లు, సబ్ లైసెన్స్‌ల విధానాన్ని వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను ప్రజల ముందుంచాలని సూచించాయి. ఏదేమైనా రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్నా, పేదలకు చౌకగా విద్యుత్ సరఫరా జరగాలన్నా విద్యుత్ సంస్థలపై రాష్ట్రాలకే అధికారం ఉండాలని అభిప్రాయపడ్డాయి. -
కరోనా షాక్ 4,700 కోట్లు!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యుత్ సంస్థలను కోలుకోలేని దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వాడకం పూర్తిగా స్తంభించడంతో అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే వ్యవసాయ, గృహ విద్యుత్తు వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ విద్యుత్ సంస్థల వాస్తవ పరిస్థితిని విశ్లేషిస్తూ ఇంధనశాఖ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ► 2020–21లో 59,957 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేయగా కరోనా ప్రభావంతో 53,657 ఎంయూలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. వాడకం 6,300 ఎంయూలు (11 శాతం) తగ్గవచ్చు. ► రెవెన్యూ వసూళ్లు రూ.30,032 కోట్లు ఉంటాయని అంచనా వేసినా రూ.25,346 కోట్లకే పరిమితం కానున్నాయి. రూ.4,686 కోట్లు (16 శాతం తక్కువ) నష్టం వాటిల్లే వీలుంది. మొదటి త్రైమాసికంలో నష్టం 38 శాతం వరకు ఉంది. ► లాక్డౌన్ అమలైన మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 4,666 మిలియన్ యూనిట్లకు బదులుగా 1,854 మిలియన్ యూనిట్లే ఉంది. వాణిజ్య విద్యుత్ డిమాండ్ 833 మిలియన్ యూనిట్లకు బదులుగా 697 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. గృహ విద్యుత్ వినియోగంలో ఎలాంటి మార్పు లేదు. కానీ సబ్సిడీతో అందించే ఈ కరెంట్‌తో విద్యుత్ సంస్థలకు అదనపు రెవెన్యూ ఉండదు. భారీ నష్టమే విద్యుత్ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.4,700 కోట్ల మేర నష్టపోవడం సాధారణ విషయం కాదు. సేవాభావంతో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరిస్థితిపై నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందుంచాం.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) -
ఎక్కడి నుంచైనా స్విచ్చాఫ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు వీలుగా హైటెక్ ఫీచర్లతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఓ క్లిక్ ఇస్తే సరి.. ఆఫీస్‌లోని మెయిన్ స్విచ్ ఆగిపోతుంది. మళ్లీ మీరు ఆన్ చేసే వరకూ ఏ లైటూ వెలగదు. ఈ తరహా టెక్నాలజీని ఏపీ విద్యుత్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మూడేళ్లలో వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు. హైటెక్ స్మార్ట్ మీటర్ పనితీరు ఇలా.. - స్మార్ట్ మీటర్లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు. మీ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్‌కు చిప్ సిగ్నల్స్ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే రిమోట్‌లా పనిచేస్తుంది. - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పనిచేసే చిప్‌కు ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఇంటర్నెట్ అవసరం లేదు. మీ మొబైల్లో నెట్ సౌకర్యం ఉంటే చాలు. - మొబైల్ యాప్ ఓపెన్ చెయ్యగానే స్మార్ట్ మీటర్ దగ్గర చిప్ ఆఫీస్‌లో కరెంట్ పరిస్థితిని తెలియజేస్తుంది. విద్యుత్ ఉందా? లేదా? అనే విషయం ఇట్టే తెలుసుకోవచ్చు. - ఆఫీస్‌లో ఎంత లోడ్ ఉందో చిప్ సమాచారమిస్తుంది. లోడ్‌ను బట్టి ఏయే ఉపకరణాలు ఆన్‌లో ఉన్నాయనే విషయాలు గమనించవచ్చు. - అనవసరంగా ఉపకరణాలు వెలుగుతుంటే మొబైల్ యాప్‌లో ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే మెయిన్ ద్వారా విద్యుత్ ఆగిపోతుంది. ఎప్పటి నుంచి... ? - హైటెక్ స్మార్ట్ మీటర్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచే వీలుందని అధికారులు చెప్పారు. - ఒక్కో మీటర్ రూ. 4 నుంచి రూ. 7 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. - అతి తక్కువ ధరకు అమర్చే సంస్థనే ఎంపిక చేయాలనే లక్ష్యంతో విద్యుత్ సంస్థలున్నాయి. - ప్రక్రియ పూర్తయి, మీటర్ల తయారీ జరిగితే మే నాటికి ప్రభుత్వ కార్యాలయాలకు, వచ్చే మూడేళ్లలో వినియోగదారులకూ హైటెక్ స్మార్ట్ మీటర్లు బిగించే వీలుంది. ఇంకా ఉపయోగాలేంటి - టైమర్ సౌకర్యం కూడా స్మార్ట్ మీటర్లో ఉంటుంది. అంటే ఎప్పుడు లైట్లు ఆగిపోవాలో యాప్ ద్వారా టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది. - ఏ రోజున ఎంత విద్యుత్ వాడుకోవాలనే విషయం ఇక మన చేతుల్లోనే ఉంటుంది. యాప్‌లో ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే వాడకం పరిమితి తర్వాత విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల అధిక బిల్లులను నియంత్రించే వీలుంది. - నెలకు ఎంత బిల్లు వస్తుందనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నెలవారీ బిల్లును కూడా యాప్ ద్వారానే ఆటోమేటిక్‌గా చెల్లించుకునే వీలుంది. బ్యాంక్, పేటీఎం, ఇతర యాప్‌లకు లింక్ అయితే సరిపోతుంది. - కరెంట్ హెచ్చు తగ్గుల వివరాలూ స్మార్ట్ మీటర్ ద్వారా రికార్డవుతాయి. నాణ్యమైన విద్యుత్ అందనప్పుడు, అంతరాయాల వల్ల ఉపకరణాలు దెబ్బతిన్నప్పుడు పంపిణీ సంస్థను ప్రశ్నించేందుకు కచ్చితమైన ఆధారాలుంటాయి. -
మరో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు(డిస్కంలు) మరో ముందడుగు వేశాయి. యూనిట్ రూ.2.70కే సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఈ రెండింటి నుంచి 1,500 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై ఇటీవల విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్షించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకుని, ఈ విద్యుత్‌ను తీసుకోవడం ఉపయోగకరమని కమిటీ నిర్ణయానికొచ్చింది. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.25 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2018 వరకూ అధిక రేట్లతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) జరిగాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడింది. అందువల్ల చౌకగా లభించే విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. యూనిట్ రూ.2.70 చొప్పున చూస్తే.. దీని ఖరీదు రూ.32 లక్షలు. 2015లోయూనిట్ ధర రూ.6.25 ప్రకారం చూస్తే రోజుకు రూ.75 లక్షలు అవుతుంది. అంటే రోజుకు రూ.43 లక్షలు ప్రభుత్వానికి ఆదా కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోపాటు సోలార్ ప్యానళ్ల ధరలు తగ్గడం వల్ల సోలార్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గుతున్నట్టు అధికారులు వివరించారు. -
అందుబాటు ధరల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదికలపై మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందించాలన్నదే ఏపీఈఆర్సీ లక్ష్యమని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకే ఏపీఈఆర్సీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై భారం లేని టారిఫ్ అవసరమని వెల్లడించారు. అలాగే డిస్కంల ఆర్థిక పరిపుష్టిని పరిగణనలోనికి తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని మెరుగుపర్చి సుస్థిరత సాధించడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. కొనుగోలు వ్యయం తగ్గింపుపై దృష్టి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై ఏపీఈఆర్సీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. బొగ్గు, జల, పవన, సౌర విద్యుత్ వంటి వాటి విషయంలో హేతుబద్ధత, సాంకేతికత, మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోనికి తీసుకుంటామని వివరించారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలు నిర్వహణ వ్యయం తగ్గించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం వ్యయంపై విచక్షణతో కూడిన అదుపు ఉంచడంతోపాటు అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఏపీఈఆర్సీ ఇప్పటికే డిస్కంలను కోరిందని గుర్తుచేశారు. వినియోగదారులే కేంద్ర బిందువు ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు సేవల్లో నాణ్యత, విశ్వసనీయత కూడా ముఖ్యమని జస్టిస్ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించిన కసరత్తులో వినియోగదారులే కేంద్రబిందువుగా ఉంటారని వివరించారు. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ నివేదికలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 8న ఏలూరు, 9న విజయవాడ, 10న కడప, 11న తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా విద్యుత్ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీకి అందుబాటులో ఉండాలని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశాలు జారీ చేశారు. -
మా డేటా మాదే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వెబ్సైట్ల హ్యాకింగ్‌తో విద్యుత్ సంస్థలు కళ్లు తెరిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్లను వేరుచేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి. వీలైనంత త్వరగా డేటాను సొంతంగా నిల్వ చేసుకోవాలని భావిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల డేటా హ్యాకింగ్ నేపథ్యంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. డిస్కమ్‌ల వెబ్సైట్లు హ్యాక్ అయినప్పటికీ.. డేటాను తిరిగి పొందే వీలుందని చెబుతున్నారు. వెబ్సైట్లను నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్)తో డిస్కమ్‌ల సీఎండీలు సంప్రదింపులు జరిపారు. అనంతరం నిర్వహించిన అంతర్గత సమీక్షలో అనేక అంశాలను గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించిన డేటాను డిజిటలైజ్ చేసే ప్రక్రియ 2012లోనే ప్రారంభమైంది. 2015లో టీసీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది. అప్పట్లో ప్రైవేట్ సంస్థకు దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాయి. వీటికి సంబంధించి సర్వర్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బ్యాకప్ మాత్రం తిరుపతిలోని దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిస్కమ్‌లు సొంతంగా డేటా స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) కూడా పూర్తి చేసినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. భద్రతలో లోపాలున్నాయా? రెండేళ్ల క్రితం దక్షిణ ప్రాంత పరిధిలో ఆన్లైన్ టెండర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ఈ ప్రక్రియను పోటీ సంస్థలకు లీక్ చేయడంపై దుమారం రేగింది. అప్పట్లో సాంకేతిక కమిటీ వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల కాంట్రాక్టుల వివరాలు లీకవ్వడంపై కమిటీ ఎలాంటి వివరాలను సేకరించలేకపోయింది. డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వెబ్సైట్ హ్యాక్ కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు వెబ్ డేటా తెలంగాణలో ఉండటం వల్ల భద్రత లేదని అధికారులు భావిస్తున్నారు. అక్కడి సర్వర్లపై తెలంగాణ సంస్థలకే పూర్తి అధికారం ఉండటం కూడా సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఆన్లైన్ సేవలకు బ్రేక్ అంతర్జాతీయ హ్యాకర్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంతో ఆ సంస్థకు సంబంధించిన ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్లో సొమ్ము చెల్లించే వారికి ఇబ్బంది తలెత్తింది. డిస్కంల వెబ్సైట్లు హ్యాక్ అయి అప్లికేషన్ సర్వర్‌కు వైరస్ ఇంజెక్ట్ అయినట్టు తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాటి లింకు కట్ చేశారు. అప్పట్నుంచి ఇతర డిస్కంలతోపాటు ఈపీడీసీఎల్ వెబ్సైట్ కూడా ఆన్లైన్లో కనిపించడం లేదు. ఈ వెబ్సైట్ ద్వారా మన రాష్ట్రంలో రోజుకు సగటున 10 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. హ్యాకింగ్ వల్ల మూడు రోజులుగా ఆన్లైన్ చెల్లింపులు స్తంభించిపోయాయి. ఈపీడీసీఎల్ డేటాను వేరే సర్వర్‌లో ఉంచామని, అందువల్ల డేటాకు వచ్చిన ముప్పు లేదని ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ (ఐటీ) శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. హ్యాక్ అయిందా..డేటా చెరిపేశారా? వెబ్సైట్ల హ్యాకింగ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో అనేక వాదనలు విన్పిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రధానంగా టెండర్ల వివరాలు, విద్యుత్ బిల్లుల వివరాలు మాత్రమే ఉంటాయి. హ్యాకర్లకు దీనివల్ల ప్రయోజనం ఏమిటనే వాదన తెరమీదకొచ్చింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం వస్తే విద్యుత్ శాఖలోని అక్రమాలపై విచారణ జరిపే వీలుంది. డిస్కమ్‌ల పరిధిలో గత ఐదేళ్లుగా అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇటీవల కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉందనే ఆరోపణలు బయటకొస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విలువైన సమాచారం తొలగించే ప్రయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాకప్ డేటా ఉన్నప్పటికీ, అవసరమైన డేటాను తొలగించి, ఇతర డేటాను తిరిగి స్టోర్ చేసే వీలుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలకు ఎంతమాత్రం అవకాశం లేదని డిస్కమ్‌ల సీఎండీలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా హ్యాకింగ్‌పై పూర్తిస్థాయి విచారణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆప్షన్ ఇచ్చుకున్న చోటే..!
సాక్షి, హైదరాబాద్: ‘కేటాయింపులు జరపాల్సిన విద్యుత్ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు వారిచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వారి సొంత జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో ఆ రాష్ట్రానికే సర్దుబాటు చేయాలి. సొంత జిల్లాలను ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వారి నుంచి సేకరించిన, రాతపూర్వకంగా వారు సమర్పించిన అభ్యర్థనల్లో ఉన్న సమాచారం ఆధారంగా గుర్తించాలి’అని జస్టిస్ డీఎం ధర్మాధికారి కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడిన విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. ఈ కమిటీ జారీ చేసే ఆదేశాలే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ధర్మాధికారి కమిటీ, విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఉద్యోగుల ఆప్షన్లకే పెద్ద పీట వేయడంతో, కోరుకున్న రాష్ట్రానికే వారి కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి. ఏపీ స్థానికత గల 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి రిలీవ్ చేస్తూ 2015 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కమిటీ తాజా ప్రతిపాదనలతో తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్న 600 మందికి పైగా ఉద్యోగులు మళ్లీ తెలంగాణకే రానున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో బుధవారం ఇక్కడ సమావేశమైన జస్టిస్ ధర్మాధికరి.. మే 25 లోగా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ఇంకా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగుల నుంచి మళ్లీ ఆన్లైన్లో ఆప్షన్లు స్వీకరించాలని కమిటీ సూచించింది. ఇవీ కమిటీ మార్గదర్శకాలు.. - ఉమ్మడి ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగుల్లో కేటాయింపులు చేయదగిన ఉద్యోగులందరినీ ఏపీ, తెలంగాణకు జరిపే తుది కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏకపక్షంగా రిలీవ్ అయిన 1157 మందితో పాటు, తెలంగాణలో ఏకపక్షంగా జాయిన్ అయిన 514 మంది ఉద్యోగులు సైతం పరిగణనలోకి వస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి కేటాయింపులు జరపాలి. - విద్యుత్ సంస్థల వారీగా, ఒక్కో విద్యుత్ సంస్థకు మంజూరైన పోస్టుల నిష్పత్తి ప్రకారం రెండు కొత్త రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులు జరపాలి. విభజన చట్టం ప్రకారం ఇంధన శాఖ డిస్కంల కోసం జారీ చేసిన జీవోలకు అనుగుణంగా కేటాయింపులుండాలి. - ఉద్యోగుల కేటాయింపు జాబితా తయారైన తర్వాత దాన్ని సదరు విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయం నోటీసు బోర్డు మీద అతికించాలి. సంస్థ వెబ్‌సైట్‌తో పాటు ఉద్యోగుల సమాచార వెబ్సైట్లలో ఉంచాలి. ప్రతిపాదిత కేటాయింపుల నోటీసుకు మూడు వారాల్లోగా సంబంధిత ఉద్యోగులు తమ రాత పూర్వక అభ్యర్థనలను సమర్పించవచ్చు. - ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులతో ఓ ద్విసభ్య ఉప కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతిపాదిత కేటాయింపులపై ఉద్యోగులు పెట్టుకునే అభ్యర్థులను ఈ ఉపకమిటీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, జస్టిస్ ధర్మాధికారి కమిటీకి కేటాయింపుల జాబితాను ప్రతిపాదించాలి. - ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందిన రాష్ట్రంలోని సరైన విద్యుత్ సంస్థకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కేటాయించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించాలి. - తీవ్రమైన వ్యక్తిగత సమస్యలు గల ఉద్యోగులకు మినహాయింపులు ఉంటాయి. - వితంతువులు, చట్టపరంగా వేరుపడిన, విడాకులు పొందిన మహిళా ఉద్యోగులను వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. - రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం 60 శాతానికి పైగా వైకల్యం గల ఉద్యోగులను ఆప్షన్ ఆధారంగా కేటాయించాలి. - ఉద్యోగి జీవిత భాగస్వామి లేదా సంతానం కేన్సర్, ఓపెన్ çహార్ట్/బైపాస్ సర్జరీ, కిడ్నీ మార్పిడి/కిడ్నీ వైఫల్యంతో డయాలసిస్, మానసిక వైకల్యం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటే, సదరు ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వారి కేటాయింపులు జరపాలి. ఎ) ఉద్యోగి జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తుంటే ఈ కింది మార్గదర్శకాలను అనుసరించాలి. బి) ఇద్దరు జీవిత భాగస్వాములను వారి సొంత రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరపొచ్చు. సి) జీవిత భాగస్వామి ఒకరు విద్యుత్ సంస్థల్లో, మరొకరు పీఎస్‌యూ/రక్షణ సంస్థలు/రైల్వేలు/బ్యాంకింగ్, బీమా రంగం/కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే, ఇలాంటి సమయంలో ఒక్కో కేసు ఆధారంగా కేటాయింపులు జరపాలి. డి) జీవిత భాగస్వాములిద్దరూ వేర్వేరు రాష్ట్రాల(ఏపీ/టీఎస్)కు చెందిన వారైతే, వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. - ఇప్పటికే పదవి విరమణ చేసిన/చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లను పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు జరపాలి. -
ఖరీదైనదే కావాలి మాకు..
సాక్షి, అమరావతి: ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం ఏమిటో తెలియదుగానీ... మరో ఏడాది (2019–2020) పాటు అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లివ్వాలని నిర్ణయించింది. ఏపీ జెన్కో విద్యుత్ యూనిట్ ధర సగటున రూ.4.38లే ఉన్నా... ప్రైవేటు సంస్థలకు మాత్రం ఏకంగా రూ.4.57 వరకూ చెల్లించేందుకు వెనకాడటం లేదు. ఓ పక్క మిగులు విద్యుత్‌లోకి వెళ్లామని చెబుతూనే మరోవైపు కొనుగోళ్లను అడ్డగోలుగా ప్రోత్సహిస్తోంది. ఈ విధానం డిస్కమ్‌లకు భారీ నష్టాలు తెస్తాయని విద్యుత్ వర్గాలు నెత్తీనోరు బాదుకున్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మాత్రం ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతోంది. 2019–20లో జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి కేవలం 23,742 మిలియన్ యూనిట్లు మాత్రమే కొంటామని, దీనికి రూ.10,391.22 కోట్లే చెల్లిస్తామని డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. ఇక ఓ రాజకీయ ప్రముఖుడికి చెందిన ప్రైవేటు సంస్థ శంబ్కార్ప్ నుంచి 3,600 మిలియన్ యూనిట్లను రూ.1645.20 కోట్లు పెట్టి తీసుకుంటామని వివరించాయి. మరో ప్రైవేటు కంపెనీ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి 1716.42 మిలియన్ యూనిట్లను తీసుకునేందుకు సిద్ధపడింది. కేఎస్కే మహానంది విద్యుత్ ధర యూనిట్ రూ.4.28 ఉన్నా, రూ.1275 కోట్లు చెల్లించి 2,977 మిలియన్ యూనిట్లు తీసుకునేందుకు నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 870 మిలియన్ యూనిట్లు మిగులు ఉంటుందని పేర్కొంటూనే, అవసరం లేకుండానే 445 మిలియన్ యూనిట్లు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు డిస్కమ్‌లు కమిషన్ అనుమతి కోరడం విశేషం. అయినవాళ్ల జేబులు నింపేందుకు ఏకంగా రూ.201 కోట్లకు దొడ్డిదారిన ద్వారాలు తెరిచి ఉంచారని విద్యుత్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి 38 వేల మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం అడ్డుపడకపోతే సగటు యూనిట్ రూ.4 లోపే లభించే వీలుంది. అప్పుడు ప్రజలపై విద్యుత్ ధరల భారం కూడా తగ్గేదని విద్యుత్ వర్గాలు అంటున్నాయి. కానీ జెన్కో ఉత్పత్తిని 15 వేల మిలియన్ యూనిట్ల వరకూ కోత పెట్టారు. అదే క్రమంలో ప్రైవేటు విద్యుత్‌కు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చేసి ప్రజలపై భారం మోపుతున్నారు. -
పవర్ కంపెనీలకు భారీ షాక్
అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. -
‘వార్దా’ కారిడార్ రద్దు?
సాక్షి, హైదరాబాద్: నవంబర్ నుంచి రాష్ట్రానికి అందుబాటులోకి రానున్న1000 మెగావాట్ల వార్దా–డిచ్పల్లి ట్రాన్స్మిషన్ కారిడార్‌ను వదులుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల కారిడార్ అవసరం లేదని తెలంగాణ ట్రాన్స్‌కోకు చెందిన అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉండేది. కొనుగోలు చేద్దామన్నా దక్షిణాదిన ఎక్కడా విద్యుత్ లభ్యత లేదు. ఉత్తర భారత దేశంలో పెద్దఎత్తున మిగులు విద్యుత్ ఉన్నా, అక్కడి నుంచి తరలించుకోవడానికి విద్యుత్ లైన్లు లేవు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టు కున్న రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘‘వార్దా–డిచ్ పల్లి 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్స్ మిషన్ కారిడార్’’లో 2000 మెగావాట్ల లైన్లను 12 ఏళ్ల కాలానికి రాష్ట్ర అవసరాల కోసం ముందస్తుగా బుక్ చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకోసం ఏడాది కాలంగా 1000 మెగావాట్ల సరఫరా లైన్లను వినియోగించుకుం టుండగా, మిగిలిన 1000 మెగావాట్ల లైన్లను వచ్చే నవంబర్ నుంచి వినియోగించుకోవాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచే మరో 1000 మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని అప్పట్లో మరో కారిడార్‌ను బుక్ చేసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. గత మూడేళ్లల్లో పెద్దఎత్తున కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తి కావడంతో దక్షిణాదిన అవసరమైనంత విద్యుత్ లభ్యత ఏర్పడింది. ఇక ఉత్తర భారతదేశం నుంచి విద్యుత్ కొను గోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న 1000 మెగావాట్ల విద్యుత్‌కు సంబంధించిన ధరలను భారీగా పెంచాలని ఆ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ ఇటీవల అక్కడి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించు కుంది. ఇదే కోవలో వార్దా కారిడార్‌నూ రద్దు చేసుకోవాలని యోచిస్తోంది. వదులుకుంటే నష్టమే ! ఉత్తర–దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేస్తూ 4,350 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యంతో వార్దా–డిచ్పల్లి పవర్ ట్రాన్స్ మిషన్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్) నిర్మించింది. విద్యుత్ సరఫరా లైన్ల కేటాయింపు జరిగాక రద్దు చేసుకుంటే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం పీజీసీఎల్‌కు భారీ జరిమా నాలు కట్టాలి. ఒకసారి ట్రాన్స్మిషన్ కారిడార్ కేటాయింపులు జరిగిన తర్వాత అందులో కనీసం 66% సామర్థ్యాన్ని తప్పని సరిగా వినియోగిం చుకోవాల్సి ఉంటుంది. కారిడార్‌ను రద్దు చేసుకున్నా 66 శాతం విద్యుత్ సరఫరాకు సంబంధించిన సరఫరా చార్జీలను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించక తప్పదని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్పల్లి కారిడార్‌లో రాష్ట్రానికి కేటా యించిన వెయ్యి మెగావాట్ల లైన్ల ద్వారా రాష్ట్రానికి ఏటా 876 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరాకు వీలు కలిగింది. ఈ లైన్లను వినియోగించుకోకపోయినా 876 కోట్ల యూని ట్లలో 66 శాతమైన 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించిన ట్రాన్స్మిషన్ చార్జీ లను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించాల్సి ఉండనుంది. విద్యుత్ సరఫరా చార్జీలు యూని ట్‌కు 55పైసల నుంచి 65 పైసల వరకు కానున్నాయి. యూనిట్‌కు సగటున 60 పైసలను సరఫరా చార్జీలుగా చెల్లించినా 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి ఏటా రూ.346.8 కోట్లు చొప్పున 12 ఏళ్ల పాటు పీజీసీఎల్‌కు రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,161 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్పల్లి కారిడార్‌లోని రెండో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాన్స్ కోకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రద్దు చేసుకుంటే జరిమానాలు వసూలు చేయాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయ నం కోసం సీఈఆర్సీ గతంలో ఓ కమిటీని నియమిం చిందని, సాంకేతికంగా జరిమానాలు వసూలు చేయడం సాధ్యం కాదని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆ అధికారి స్పష్టం చేశారు. వార్దా– డిచ్పల్లి కారిడార్‌ను రద్దు చేసుకున్నా జరిమానాలు చెల్లించాల్సి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏపీ, తెలంగాణలపై ‘ధిక్కార’ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభు త్వాలు అక్కడి విద్యుత్ సంస్థలు అమలు చేయడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయడానికి వీల్లేదని, 2 నెలల్లో ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్పును పట్టించుకోవడం లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించాలంటూ టీఎస్ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ జి.రఘుమారెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీ ఎంఎం.నాయక్, ఏపీ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్లను ప్రతివాదులుగా పేర్కొ న్నారు. దీనిపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్యోగుల విభజన చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వం లోని ధర్మాసనం.. ఏపీ స్థానికత ఆధారంగా విభజన చెల్లదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని, కమిటీలను ఏర్పాటు చేయడంగానీ చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ విద్యుత్ సంస్థ లు, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది. ఈ జాయింట్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా.. వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని విద్యుత్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో టీఎస్ఎస్పీడీసీ ఎల్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. -
నీటి ప్రాజెక్టులకు నిధులిస్తాం: పీఎఫ్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థలు చేపడుతున్న పవర్ ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు ఆర్థిక చేయూత అందించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (పీఎఫ్సీ).. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు సైతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ శర్మ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ సౌధలో జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావుతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై చర్చించారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మణుగూరు ప్లాంటు నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల చివరి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభాకర్ రావు చెప్పారు. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి ప్లాంటులోని రెండు యూనిట్లను ఈ ఏడాది డిసెంబర్ చివరికి, మిగతా రెండు యూనిట్లను వచ్చే ఏడాది జూన్‌కు ప్రారంభిస్తామని వెల్లడించారు. 4,000 మెగావాట్ల యాదా ద్రి పవర్ ప్లాంటు నిర్మాణం వేగంగా జరగుతున్నదని చెప్పారు. 3,000కు పైగా మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తిని తెలంగాణ సాధించిందని వెల్లడించారు. 10వేల మైలురాయిని దాటిన విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 10వేల మైలురాయిని దాటింది. బుధవారం ఉద యం 10,100 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని పీఎఫ్సీ చైర్మన్, ఇతర అధికారులు గుర్తించారు. ఇంత డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోత లేకుండా విద్యుత్ సరఫరా చేయడం అభినందనీయమని ప్రభాకర్ రావు అన్నారు. -
త్వరలో ‘విద్యుత్’ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కొత్త వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి. సర్కారు అనుమతి లభిస్తే త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. విద్యుత్ ఉద్యోగుల ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థల యాజమా న్యాలకు విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఇటీవల విన్నవించాయి. ఈ నేప థ్యంలోనే కమిటీ ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రభుత్వా నికి యాజమాన్యాలు విన్నవించాయి. చివరి సారిగా 2014 మే నెలలో విద్యుత్ ఉద్యోగులకు 28 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేశారు. దీంతో విద్యుత్ సంస్థలపై నెలకు రూ.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.540 కోట్ల వరకు భారం పడింది. 2000 నుంచి ప్రతీ పీఆర్సీలో 20 శాతా నికి మించి ఫిట్మెంట్ వర్తింపజేశారని, ఈసారీ అదే ట్రెండ్ కొనసాగే అవకాశముందని అధికా రులు చెప్పారు. ఉద్యోగ, కార్మిక సంఘాలతో కొత్త వేతన సవరణ కమిటీ సమావేశమై ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటుందన్నారు. మూడేళ్లకోసారి సవరణ.. జెన్కో, ట్రాన్స్‌కో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్)లలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మూడేళ్లకో సారి కొత్త ఆర్సీని ప్రభుత్వం అమలు చేస్తోంది. వేతన సవరణకు ఉమ్మడి వేతన సవరణ కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేస్తాయి. ఒక్కో విద్యుత్ సంస్థ నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే సమయంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వనరులు, అదనపు భారం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నారు. అలవెన్సులపైనా కమిటీలు విద్యుత్ సంస్థల ఉద్యోగులకు అలవెన్సుల చెల్లింపులపైనా ఆ సంస్థల యాజమాన్యాలు త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనున్నాయి. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ కమిటీ తర్వాత వీటిని ఏర్పాటు చేయనున్నారు. జెన్కోలో పనిచేస్తున్న కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్, హాట్‌లైన్ వర్కర్లకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు, విద్యుత్ ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టు, కన్వీనియన్స్ తదితర అలవెన్సులపై కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. -
విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక నేరుగా వేతనాలు
- నాలుగు కేటగిరీల కింద కొత్త వేతనాల ఖరారు - కనీసం రూ.14 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం - ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్ సంస్థలు - లేబర్ కాంట్రాక్టర్ల చేతివాటానికి ఫుల్స్టాప్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలే నేరుగా వేతనాలు చెల్లించనున్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టి చేతివాటం ప్రదర్శిస్తున్న లేబర్ కాంట్రాక్టర్ల దోపిడీకి చెక్‌పడనుంది. యాజమాన్యాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించనున్నాయి. విద్యార్హతల ఆధారంగా వారిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ కొత్త వేతనాలను ఖరారు చేశాయి. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలు తాజాగా ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గతంలో విద్యుత్ సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అమలు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లేబర్ కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని, వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని, కన్సాలిడేటెడ్ వేతనాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ నేరుగా వేతనాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–1, నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–2, స్వల్ప నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–3, నైపుణ్యం లేని వారిని ఆర్టిజన్ గ్రేడ్–4 సిబ్బందిగా వర్గీకరించారు. హైకోర్టు ఆదేశాలతో క్రమబద్ధీకరణ ఉత్తర్వుల అమలు ఆగిపోయినా, ఈ 4 కేటగిరీల కిందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. హైకోర్టు సూచించిన వేతనాలకు అదనంగా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.వెయ్యి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ వేతనాలను ఖరారు చేసినట్లు ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,333 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. -
విద్యుత్ సంస్థలకు హైకోర్టు నోటీసులు
రైతుల భూముల్లో విద్యుత్ లైన్లపై స్పందించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: రైతుల భూముల్లో విద్యుత్ లైన్లు వేస్తున్న విద్యుత్ సంస్థలు వారికి ఎటువంటి పరిహారం ఇవ్వడంలేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ కన్సార్షి యం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి చేసిన అభ్యర్థనపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యుత్ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండళ్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రైతుల పొలాల్లో వేస్తున్న విద్యుత్ లైన్ల విషయంలో ఉభయ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు 2003 విద్యుత్ చట్టం, వర్క్స్ ఆఫ్ లైసెన్సీస్ రూల్స్ 2006కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రైతులకు పరిహారం చెల్లించడంలేదని చెంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి, ఇదే వ్యవహారంపై అంతకు ముందు దాఖలైన వ్యాజ్యంతో దీనిని జత చేసింది. -
క్యాష్ బ్యాన్: పవర్ కంపెనీలకు బంపర్ బొనాంజ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్‌మనీ ఎంతవరకు బయటికి వస్తుందే ఏమో కాని, కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు మాత్రం బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలకు బాగానే లబ్ది చేకూరుతుందట. నవంబర్ 24వరకు పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లులను పాత నోట్లతో కట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో, ఇన్నిరోజులు బిల్లులను కట్టకుండా ఎగ్గొట్టిన విద్యుత్ వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. పాత నోట్లను రద్దు చేశాక, ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వసూలు అయినట్టు హర్యానా పవర్ రిటైలర్లు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన పది రోజుల్లో 750 మిలియన్ల(7500లక్షల) బిల్లులను వసూలు చేసినట్టు ఆ ప్రావినెన్స్ విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శ అనురాగ్ రోస్తోగి తెలిపారు. గడువు ముగిసే లోపలే చెల్లించాల్సిన బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు తెగ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం కూడా 2,000 లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను సేకరించిందని ఆ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.సీ అరోరా తెలిపారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలు కోలుకుంటున్నాయని, ఇన్నిరోజులు రాని బకాయిలు ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులకు వెల్లువెత్తుతున్నాయని, దీంతో తమ రెవెన్యూలను మెరుగుపరుచుకోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కావాలని ఎగ్గొట్టిన వారు కూడా తీసుకొచ్చి పాత నోట్లతో బిల్లులు చెల్లిస్తున్నట్టు పవర్ రిటైలర్లు చెబుతున్నారు. నవంబర్ 9 నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. దీంతో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల వద్ద పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. -
ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే!
‘పవర్’ పంపకాలకు రంగం సిద్ధంఆస్తుల విభజన ముసాయిదాకు ఏపీ జెన్కో బోర్డు ఆమోదం హైదరాబాద్: విద్యుత్ సంస్థల ఉమ్మడి ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఏపీ ఉత్పాదక సంస్థ పాలక మండలి(అవిభక్త రాష్ట్రంలోని ఏపీ జెన్కో బోర్డు) ఆమోదించింది. దీన్ని కేంద్రం నియమించిన షీలాబిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీకి సమర్పించింది. ఈ వివరాలను బుధవారం అధికారవర్గాలు విడుదల చేశాయి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం 2014 మే 31న విడుదల చేయడం, దీనిప్రకారం బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించే బాధ్యతలను కేపీఎంజీ సంస్థకు అప్పగించడం తెలిసిందే. కేంద్రచట్టానికి అనుగుణంగా కేపీఎంజీ రూపొందించిన ముసాయిదాను ఏపీజెన్కో ఆమోదించడంతో ఓ అంకం ముగిసింది. అయితే ముసాయిదాపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు తమ అభ్యంతరాల్ని నిపుణుల కమిటీకి తెలపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించాక కమిటీ తుదినిర్ణయం తీసుకుంటుంది. అయితే కమిటీ కాలపరిమితి ఈ నెల 31వరకే ఉంది. దీన్ని కేంద్రం పొడిగించే అవకాశముంది. మొత్తంమీద మరో ఆరు నెలల్లో ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. తెలంగాణకే అప్పులు, ఆస్తులు.. ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే వెళ్తున్నాయి. అవిభక్త రాష్ట్రంలో ప్రతిపాదిత విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. కేటీపీపీ-2, లోయర్ జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, ఎగువ జూరాల.. ఇలా మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. స్థానికతనుబట్టి ఇవన్నీ తెలంగాణకే చెందుతాయి. కాబట్టి వీటి నిర్మాణానికి తీసుకున్న అప్పులన్నీ ఆ రాష్ట్రమే భరించాలని ముసాయిదా పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టుల స్థిరాస్తులన్నీ తెలంగాణకే సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీపీపీ-4 మాత్రమే నిర్మాణ దశలో ఉంది. దీని వ్యయం, స్థిరాస్తిని ఆ రాష్ట్రఖాతాలో చేర్చారు. ఫలితంగా రూ.7,168 కోట్లున్న నిర్మాణ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,201 కోట్లు, తెలంగాణకు రూ.4,967 కోట్లుగా విభజించారు. జెన్కో ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు, యంత్రసామాగ్రీ తెలంగాణలోనే ఉన్నందున స్థిరాస్తులు(ఇప్పుడున్నవి, కొత్త ప్రాజెక్టులు) రూ.12,748 కోట్లు ఉంటే.. ఇందులో ఏపీకి రూ.4,947 కోట్లు, తెలంగాణకు రూ.7,801 కోట్లు చొప్పున వాటా దక్కుతుంది. ఈ ప్రకారం మూలధనం, ఆదాయం, దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు, ఇతర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ఎక్కువగా ఉంటాయి. -
ప్రైవేటు ప్లాంట్లు కొనేద్దాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) గడువు తీరే మూడు ప్రైవేటు ప్లాంట్లు కొనేసేందుకు విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటికే స్థిరచార్జీల రూపంలో ఆయా ప్లాంట్ల పెట్టుబడిని ప్రజలు చెల్లించేశారు. దీంతో తక్కువ ధరకు ఈ ప్లాంట్లను కైవసం చేసుకునేందుకు రెండు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా ఏ ప్లాంటుకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే లెక్కలు ‘థర్డ్‌పార్టీ’ద్వారా తీయిస్తున్నాయి. మరోవైపు ప్లాంట్లను కొనుగోలు చేయాలంటే తమకు భారీగా చెల్లించాల్సి ఉంటుందంటూ సదరు కంపెనీలు అంచనాలను సమర్పించాయి. అయితే, కేవలం 240 కోట్లు చెల్లిస్తే... పీపీఏలోని క్లాజు కింద ఏకంగా 779 మెగావాట్ల గ్యాస్విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని (బయ్‌అవుట్) అధికారులు అంచనా వేస్తున్నారు. అధికంగా అంచనాలు ఇచ్చిన కంపెనీలు ప్రభుత్వపరం కాకుండా తమ కంపెనీలను కాపాడుకునేందుకు ప్రైవేటుప్లాంట్ల యాజమాన్యాలు మరమ్మత్తులు, ఆధునీకరణ (ఆర్‌అండ్‌ఎం) పేరిట తీవ్రయత్నాలు చేస్తున్నాయి. కొనుగోలు చేయాలంటే తమకు 500 కోట్లు-600 కోట్ల మేర భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. దీనికంటే ఆర్ ఎండ్ ఎం మేలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఆర్ అండ్ ఎం చేపడితే తిరిగి ప్లాంటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుంది. మరమ్మతులకు అయిన మొత్తాన్ని మరి కొన్నేళ్లపాటు సర్కార్ చెల్లించాల్సివస్తుంది. ఇది ప్రజలకు భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను కొనుగోలు చేయడానికే డిస్కంలు నిర్ణయించాయి. యాజమాన్యాల వాదనలతో అధికారులు ఏకీభవించడం లేదు. కేవలం 250 కోట్ల మేరకు చెల్లిస్తే మూడు ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని భావిస్తున్నారు. పీపీఏలోని క్లాజుల ప్రకారమే థర్డ్‌పార్టీని నియమించాలని డిస్కంలు నిర్ణయించాయి. థర్డ్‌పార్టీకి మదింపు బాధ్యతను అప్పగించి, అది ఇచ్చే నివేదికపై ప్రైవేటుప్లాంట్లతో చర్చించాలని డిస్కంలు భావిస్తున్నాయి. బయ్ అవుట్ క్లాజ్ ఏం చెబుతోంది? ప్రైవేటుగ్యాస్ ఆధారిత విద్యుత్‌ప్లాంట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పీపీఏలు కుదుర్చుకుంది. దాని పరిమితి 15 సంవత్సరాలు. జీవీకేతో కాలపరిమితి వచ్చే జూన్ నాటికి ముగియనుంది. ఇక ల్యాంకోతో డిసెంబర్ 2015 నాటికి, స్పెక్ట్రమ్‌తో జనవరి 2016కు కాలపరిమితి ముగియనుంది. పీపీఏలోని 11.7 క్లాజు బయ్అవుట్కు అవకాశం కల్పిస్తోంది. బయ్‌అవుట్ చేయాలంటే సదరు కంపెనీకి 540 రోజుల ముందుగా నోటీసులు జారీచేయాలని, ఇందుకయ్యే మొత్తాన్ని విద్యుత్ సంస్థలు ఒకేసారి చెల్లించాలి. లేదంటే గతంలో ఉన్నట్టుగానే పీపీఏ అమల్లో ఉంటుంది. అలాగే, కంపెనీలకు స్థిర, అస్థిర చార్జీలను యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది అని ఈ క్లాజు స్పష్టం చేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రైవేట్ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు నోటీసులు జారీచేశాయి. వచ్చేఏడాది జూన్‌లో పీపీఏ గడువు ముగియనున్న జీవీకే-1ను కైవసం చేసుకునేందుకు కేవలం 50 కోట్ల మేరకు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్లాంట్ల నుంచి ఒప్పందం మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ లభించనుంది. -
పల్లెల్లో ‘బిల్లు’ భూతాలు
ఏళ్లనాటి బకాయిలు చెల్లించమంటూ రైతులకు వేధింపులు రూ.800 కోట్లకు పైగా వసూలుకు ప్రభుత్వం టార్గెట్ రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేయరాదనే నిబంధన బేఖాతరు వ్యవసాయ కనెక్షన్ సర్వీసు చార్జీ బకాయిలు పడితే ఇళ్లకూ కరెంటు కట్ గ్రామం మొత్తానికి సరఫరా నిలిపివేస్తుండటంతో రోజుల తరబడి చీకట్లో పల్లెలు హైదరాబాద్, సాక్షి: వ్యవసాయ కనెక్షన్‌కు సంబంధించి రైతులు బకాయి పడితే ఇంటికి కరెంటు కట్ చేయవద్దని ఈఆర్సీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ బకాయిల పేరుతో ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే ఇంధనరంగంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఈఆర్సీ మాటలనూ విద్యుత్ సంస్థలు ఖాతరు చేయడం లేదు. కేవలం వ్యవసాయ కనెక్షన్, ఇంటికే కాదు.. ఏకంగా ఆ ఊరికే కరెంటు సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో ఆయూ గ్రామాల్లోని వ్యవసాయ కనెక్షన్లతో పాటు ఇళ్లకూ, తాగునీటికీ, వీధి దీపాలకూ సరఫరా నిలిచిపోతోంది. కేవలం బకాయి ఉన్న గ్రామానికి మాత్రమే సరఫరా నిలిచి పోవడం లేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక ఫీడర్ కింద ఒక్క బకాయిలు చెల్లించని గ్రామమే కాకుండా ఆ ఫీడర్ కింద ఉన్న గ్రామాలన్నీ చీకట్లో మగ్గాల్సి వస్తోంది. కరెంటు లేక రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలతో పాటు రబీ నారు కూడా ఎండిపోతోంది. 2004 నుంచీ కట్టాలంట..! రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఒక్కో ఉచిత కనెక్షన్‌కూ సర్వీసు చార్జీ రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ ప్రభుత్వం రైతుల నుంచి ఏనాడూ ఈ మొత్తాన్ని వసూలు చేయలేదు. 2011 ఏప్రిల్ నుంచి ఈ సర్వీసు చార్జీని రూ.30కి పెంచారు. తాజాగా సర్వీసు చార్జీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ప్రభుత్వం రైతుల ఉంచి పాత బకాయిలు వసూలు చేయూలని నిర్ణయించింది. ఏకంగా 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల్ని కట్టమంటోంది. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని జమచేసి ఇస్తున్నారు. లేదంటే ప్రత్యేకంగా బిల్లులను జారీ చేస్తున్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు నెలకు రూ.20 చొప్పున ఏడాదికి రూ.240 అవుతుంది. 2004 ఏప్రిల్ నుంచి 2011 మార్చి వరకు ఏడాదికి రూ.240 చొప్పున ఏడేళ్లకు రూ.1680 అవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 30 లక్షల కనెక్షన్లకు లెక్కిస్తే ఈ మొత్తం రూ.504 కోట్లు అవుతోంది. ఇక 2011 ఏప్రిల్ నుంచి నెలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే 2014 డిసెంబర్ వరకు లెక్కిస్తే మొత్తం 33 నెలలకుగానూ నెలకు రూ.30 చొప్పున రూ.990 అవుతుంది. 30 లక్షల కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 297 కోట్లు అవుతుంది. అంటే రైతాంగంపై మొత్తం రూ.801 కోట్ల భారం వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసిందన్నమాట. ఈ మేరకు విద్యుత్ సంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నారుు. ఒక్కో రైతుపై 2004 ఏప్రిల్ నుంచి లెక్కిస్తే మొత్తం పదేళ్లకు గాను పడుతున్న అదనపు భారం మొత్తం రూ.2670 అన్నమాట. విద్యుత్ చట్టం ఏమంటోందంటే.. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 56 క్లాజ్ 2 వినియోగదారులకు రక్షణ కల్పిస్తోంది. ‘ఏదైనా వినియోగదారునికి బకాయి విషయాన్ని రెండేళ్లలోపుగా తెలియజేసి వాటిని వసూలు చేసుకునే అవకాశం విద్యుత్ సంస్థలకు ఉంది. అరుుతే సమయం మించిపోతే వసూలు చేయకూడదు. వినియోగదారునికి విద్యుత్ సరఫరాను నిలిపివేయకూడదు’ అని ఈ క్లాజ్ పేర్కొంటోంది. ఒకవేళ దీనికి భిన్నంగా ఇదే చట్టంలో ఎక్కడైనా పేర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెక్షన్ 56 క్లాజ్ 2నే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు తాము బకాయి ఉన్న విషయం ఇప్పటివరకూ తెలియదు. ఇటీవలి కాలం వరకు కరెంటు బిల్లులు జారీ చేయలేదు. కాబట్టి రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేసేందుకు వీల్లేదు. ఈసారి వర్షాలు బాగా పడ్డాయని వరి పంట కోసం (రబీ) నారు పోసుకున్నా. కానీ ఊళ్లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలేవో కట్టలేదంట. మొత్తం ఊరికి కరెంటు నిలిపేశారు. కరెంటు లేక వరినారు ఎండిపోయింది. - పెద్దోళ్ల నరసింహులు, గుంటిపల్లి, వర్గల్ మండలం (మెదక్ జిల్లా) వరినారు కోసం పొలం దున్ని విత్తనాలేశా. ఇంతలోనే కరెంటు బందయింది. ఏంటని అడిగితే సర్వీసు చార్జీ బకాయిలున్నాయన్నారు. 3 రోజులు కరెంటు లేక విత్తనాలు పాడైపోయాయి - శ్రీనివాస్, గొట్టిముక్కల, వికారాబాద్ మండలం (రంగారెడ్డి జిల్లా) -
కరెంటు కన్నగాళ్లపై కన్ను
సాక్షి, రాజమండ్రి :పంపిణీ నష్టాలను అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తున్నాయి. ఉత్పాదక సంస్థల నుంచి విద్యుత్‌ను కొని అమ్ముకునే వ్యాపారం సాగిస్తున్న డిస్కంలు (పంపిణీ సంస్థలు) నష్టాలను పూడ్చుకోడానికి ఇక కఠినతరంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకాల మధ్య అంతరం సంస్థలకు ఏటా తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతోంది. ఓవైపు విద్యుత్తు పంపిణీ నష్టాన్ని (లైన్‌లాస్) ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను సాధించేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా.. మరోవైపు కొందరు అనుమతించిన పరిమితిని మించి విద్యుత్తును వినియోగించడం, మీటర్ ట్యాంపరింగ్‌లతో విద్యుత్ చౌర్యానికి పాల్పడడం వంటివి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధిక రెవెన్యూ లభించే రంగాలపై విజిలెన్స్ దాడులు జరిపి వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టే చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులపై దాడులు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా రూ.లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. వినియోగదారుల్లో ‘హై టెన్షన్..’ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ఇప్పటి వరకూ ఎల్టీ వినియోగదారుల అక్రమాలపైనే దృష్టి కేంద్రీకృతం చేసిన విజిలెన్స్ శాఖ ఇప్పుడు హై టెన్షన్ వినియోగంపై దృష్టి సారించింది. ఈ పరిణామం ఆ తరగతి వినియోగదారులను కలవర పరుస్తోంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు గత నెల 28న రాత్రి జరిపిన దాడిలో రాయవరం మండలంలో ఓ రైస్ మిల్లు నిర్వాహకులు మీటర్‌ను ట్యాంపర్ చేసి విద్యుత్ చౌరా్యానికి పాల్పడుతుండగా పట్టుకుని రూ. 68 లక్షల అపరాధ రుసుం విధించారు. ఈ నేపథ్యంలో హెచ్‌టీ రంగంలో ‘దొరికితేనే దొంగలు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 30న కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు సీఎండీ ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలోని అన్ని హెచ్‌టీ సర్వీసులనూ తనిఖీ చేయనారంభించారు. సోమవారం మండపేట, రామచంద్రపురం ప్రాంతాల్లో, మంగళవారం అనపర్తి మండలంలో జరిపిన దాడుల్లో అనుమతికి మించిన విద్యుత్ వినియోగిస్తున్నట్టు గుర్తించిన రెండు సర్వీసులకు రూ.5.90 లక్షల జరిమానా విధించారు. బుధవారం నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. రైస్ మిల్లులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 10,000 హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లు నెలకు సుమారు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాయి. ఒక్క బుధవారమే 35 సర్వీసులపై దాడులు.. విజిలెన్స్ అధికారులు జిల్లాలోని అనపర్తి, రాయవరం, మండపేట మండలాల్లో బుధవారం విసృ్తతంగా దాడులు జరిపారు. అనపర్తి మండలంలోని రెండు సర్వీసులు అనుమతికి మించి లోడ్ వినియోగిస్తున్న కారణంగా రూ.1.56 లక్షల జరిమానా విధించారు. బుధవారం ఒక్కరోజే 35 హెచ్‌టీ సర్వీసులపై దాడులు చేశామని, ఈ తనిఖీలు మరిన్ని రోజులు కొనసాగుతాయని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు యలమంచిని శ్రీమన్నారాయణ ప్రసాద్ తెలిపారు. -
కొత్త.. కొత్తగా
సాక్షి, కడప: విద్యుత్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు నల్లని ఇనుప మీటర్లలో పెద్ద చక్రమొకటి తిరిగేది. అది చుట్టూ తిరిగే క్రమాన్ని బట్టి రీడింగ్‌ను లెక్కగట్టేవారు. దీని ద్వారా కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఎలక్ట్రానిక్ మీటర్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డిజిటల్ మీటర్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఐఆర్డీఏ-పోర్టు అనే అత్యాధునిక సాంకేతిక మీటర్లను ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ బిల్లుల నమోదు ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా ఉండేందుకు వీటిని వినియోగంలోకి తెస్తున్నారు. అన్ని వివరాలు ఆన్లైన్లో: ఐఆర్డీఏ-పోర్టు అనే సాంకేతిక మీటర్లు అమర్చడంతో పాటు, వాటిలోని రీడింగ్ నమోదు కోసం సరికొత్త స్పాట్‌బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో సెల్ఫోన్లో వాడే సిమ్‌కార్డు తరహా కార్డు ఉంటుంది. ఇది ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటుంది. కరెంటు మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచగానే మీటరు రీడింగ్ దానంతట అదే నమోదవుతుంది. ఆ వెంటనే అది నేరుగా ఆన్‌లైన్‌లోకి చేరిపోతోంది. ఇంట్లో కంప్యూటర్ ఉన్నవారు, సెల్ఫోన్లో ఇంటర్నెట్ వినియోగించేవారు తమ విద్యుత్ వినియోగం బిల్లును, రీడింగ్‌ను నమోదు చేసుకున్న మరుక్షణం నుంచే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. తగ్గించే అవకాశమే లేదు: స్పాట్బిల్లు యంత్రాలతో రీడింగ్‌నమోదు సందర్భంలో కొంత వెసులుబాటు ఉంది. రీడింగ్ నమోదుకు వచ్చిన వ్యక్తిని బతిమాలితే బిల్లు తక్కువ వచ్చేలా చేసుకునే అవకాశం ఉంది. 100 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడుకున్న వారికి వచ్చే బిల్లు, 105 యూనిట్లు వాడుకున్న వారికి వచ్చే బిల్లుతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. టారిఫ్ మారడంతో యూనిట్‌కు చెల్లించే చార్జీ అమాంతం మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో వంద యూనిట్లకు కొద్దిగా ఎక్కువగా వినియోగించినా వంద యూనిట్లలోపు రీడింగ్ నమోదు చేయించుకునే అవకాశం ఉంది. అయితే పోర్టుమీటర్ల ద్వారా ఆ అవకాశం ఉండదు. మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచితే రీడింగ్ వస్తుంది, అద్దం మసకబారి రీడింగ్ కనిపించకున్నా మీటరు ముందు యంత్రం పెడితే దానంతటదే నమోదవుతుంది. ఆన్లైన్లో బిల్లును ఇలా చూసుకోవచ్చు: విద్యుత్ వినియోగం బిల్లు కాగితం మన దగ్గర లేకున్నా ఆన్లైన్లో మన లెక్క సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్లి ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. అందులో సర్కిల్కోడ్ అడుగుతుంది. అందులో వైఎస్సార్‌జిల్లాను ఎంచుకోవాలి. ఆపై ప్రాంతాల వారీగా కోడ్‌నెంబర్లు ఉంటాయి. ఆకోడ్లలో వినియోగదారుని నెంబర్‌ను స్పాట్ బిల్లింగ్ మిషన్‌లో నమోదు చేస్తే మీటరులోని రీడింగ్, బిల్లు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానం ఇప్పటికే ఏపీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలవుతోంది. మొదటగా పట్టణప్రాంతాల వరకే ఈ విధానాన్ని అమలు చేశారు. అది విజయవంతం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.