విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేసిన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలలో పలు యాప్‌ల రూపకల్పన
ఏఐ, మెషిన్ లెరి్నంగ్ ఆధారిత అప్లికేషన్లకు తాజాగా
‘సౌత్ గోవ్–టెక్ సింపోజియం’ అవార్డులు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక విధానాలకి అనుగుణంగా సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో తీసుకొచ్చిన పలు సంస్కరణలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అవార్డులు అందిస్తున్నాయి. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు (ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు) ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి. సొంతంగా కొన్ని యాప్‌లను రూపొందించాయి. వాటిద్వారా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ అవార్డులు అందుకుంటున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) జాయింట్ మీటర్ రీడింగ్ (జేఎంఆర్) అప్లికేషన్, కృత్రిమ మేధ(ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్), మెషిన్ లెరి్నంగ్ సాంకేతికతలతో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) రూపొందించిన డే ఎహెడ్ పవర్ డిమాండ్ ఫోర్ కాస్టింగ్ మోడల్‌కు ‘సౌత్ గోవ్–టెక్ సింపోజియం’ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సింపోజియంలో ఈ అవార్డులను అందుకున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో తాజాగా వెల్లడించింది.
ఏటా రూ.750 కోట్లు ఆదా
విద్యుత్ వ్యవస్థలో సరికొత్త ఆధునిక విధానాలను అనుసరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గత ప్రభుత్వ హయాంలో జేఎంఆర్ అప్లికేషన్ రూపొందింది. దీనివల్ల ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన విద్యుత్ కొనుగోళ్లకు గడువులోగా బిల్లులు చెల్లించగలిగారు. దీంతో లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్‌పీఎస్) భారం తప్పింది. సాధారణంగా ఎల్‌పీఎస్.. మొత్తం బిల్లుపై 15 శాతం ఉంటుంది. అందులో 1 శాతం రిబేట్ పోను 14 శాతం చెల్లించాల్సి వచ్చేది. అలాగే ఇన్వాయిస్ బిల్లులపైనా రాయితీ పొందేందుకు అవకాశం కలిగింది. ఈ లెక్కన ఏడాదిలో ఏపీపీసీసీ కొన్న రూ.50 వేల కోట్ల విద్యుత్ బిల్లులో రూ.750 కోట్లు ఆదా అయ్యాయి.
గతంలోను పలు అవార్డులు
గత ప్రభుత్వంలో రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్ ఆధారిత యాప్‌లను విద్యుత్ సంస్థల కోసం ఏపీఎస్‌ఎల్‌డీసీ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్, లైన్ క్లియర్ అప్లికేషన్ పేరుతో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఐఎస్‌వోఏ అప్లికేషన్‌కు ఏపీ ట్రాన్స్‌కో స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు పొందింది.
పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించినందుకు ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును సొంతం చేసుకుంది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంతో ముందుచూపుతో రూపొందించినందువల్లే ఈ అప్లికేషన్లకు అవార్డులు లభిస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment