సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్ అభినందించారు. విద్యుత్ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్‌లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది.
ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ(హెచ్‌ఆర్‌డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు.
సీఎం జగన్‌కు మంత్రుల శుభాకాంక్షలు
పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్‌తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment