సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.
ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.
ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!
ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment