Pressure
-
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్‌లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్‌సిక్స్‌కు ఎగనామం -
ప్రెజర్ నుంచి ప్లెజర్‌కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్‌కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్‌పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్‌లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్‌లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
అకడమిక్ ప్రెజర్‌తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్‌సెట్‌కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్‌ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్‌ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్‌లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్‌నవూలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి
సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (ఓట్ ఫర్ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్‌డీ, ఏడీఆర్ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4న చేపట్టింది. అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్స్ ట్యాంపరింగ్గానీ ఏమైనా మార్పులుగానీ జరిగాయా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్డీలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.విచారణ నిర్వహించాల్సిందేఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్‌కు, కౌంటింగ్ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం లోక్‌సభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్ ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి -
Karimnagar: ఒత్తిడి తట్టుకోలేక మెడికో ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: ఎంబీబీఎస్ చదవడం కష్టంగా ఉందని మానసిక ఒత్తిడికి గురైన ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కోమళ్ల ప్రహ్లాదరావు–పద్మజ దంపతులు నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు. కూతురు కోమళ్ల శిరీష(20) కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువు కష్టంగా ఉందని పలుమార్లు శీరీష తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శిరీష శనివారం ఉద యం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తల్లి పద్మజ మధ్యా హ్నం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరేసుకొని ఉండటాన్ని చూసి ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ ఒత్తిడి.. విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్‌ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌ను ఎంచుకోండి (ఒక స్లైస్‌లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్‌తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్‌లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్‌లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్‌గా పని చేస్తుంది ఇది. డివైస్‌కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్‌తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్‌ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
చిన్నవయసులోనే గజినీలుగా మరుతున్నారు.. విటమిన్ బి12 కారణమే
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది. ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్లోనే.. మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధిక ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రతే లేదు యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ ఆర్.తార, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్ -
దారుణం: భాగస్వామిని ప్రెషర్ కుక్కర్‌తో బాది..
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్‌తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ఇదీ జరిగింది.. దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
Basara IIIT: మరో బలవన్మరణం
సాక్షి, నిర్మల్: భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం.. విద్యార్థుల్ని బలిగొంటోందా?. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరో అఘాయిత్యం జరిగింది. మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ప్రకటించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ క్యాంపస్‌లోనే చదువుతున్న తన సోదరుడితో మాట్లాడాడు కూడా. ఈ క్రమంలో గదిలో అచేతనంగా వేలాడుతూ కనిపించిన జాదవ్‌ను హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించింది ట్రిపుల్ ఐటీ సిబ్బంది. అయితే అప్పటికే జాదవ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఉద్రిక్తత జాదవ్ క్యాంపస్‌లో చేరి నెల కూడా కాలేదు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బబ్లూ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాల్సిన నేపథ్యంలో భైంసా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. వీసీ విచారం నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ మానసిక సమస్యలతో చనిపోయాడు. మధ్యాహ్నాం ఉరివేసుకోని అత్మహత్యచేసుకున్నాడు. ఇది విచారకరమైన ఘటన. కిందటి నెల 31వ తేదీన అడ్మిషన్ తీసుకున్నాడు. అతని అన్న కూడా ట్రిపుల్ ఐటీలోనే చదువుతున్నాడు. మధ్యాహ్నాం అతనితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న సమస్యను బబ్లూ సోదరుడితో కూడా చెప్పుకోలేదు. ఆత్మహత్యకు పాల్పపడటం బాధాకరం. ::: వీసీ వెంకటరమణ నాలుగో ఘటన ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సర కాలంలో నలుగురు మృత్యువాత చెందారు. డిసెంబర్లో ఒకరు, ఈ ఏడాది జూన్‌లో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు జాదవ్ మృతితో ఆ సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. విద్యార్థుల బలవన్మరణాలపై క్యాంపస్ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే.. ప్రాణం తీసుకునేంత ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు చేరుకుంటున్నారు? అసలు వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగ నిపుణులు. -
బీపీ ఉంటే ఆవేశపడరు..ఆవేశ పడటం వల్లే అది..
రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి. ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట. మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్డ్ సాల్ట్‌తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది. అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం. గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం. ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి. రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి. ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
ప్రొఫెసర్ సాహసం.. నీటి అడుగులో 100 రోజులు! అన్నీ అక్కడే..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్‌గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు. వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్‌గా పనిచేశారు. 2012లో కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. 'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు. చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన -
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
మనస్థాపానికి గురై అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
-
కంటి నిండా నిద్ర కరవయిందా?
సెల్ఫ్ చెక్ చాలామంది తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నా, అందుకు సరైన నిద్రలేకపోవడం కూడా ఒక కారణమనుకోరు. మీకు కూడా నిద్ర రాని సమస్య ఉందా? తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్ పూర్తి చేయండి. 1. రాత్రి వేళ నడుం వాల్చాక గంటలకొద్దీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పగలు కాస్త కుదురుగా కూర్చుంటే చాలు, నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 3. అర్ధరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపోలేరు. ఎ. అవును బి. కాదు 4. పగలు చాలా ఆందోళనగా, చికాకుగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. మీటింగ్‌లలో వద్దనుకున్నా నిద్ర వస్తుంది. ఎ. అవును బి. కాదు 6. డ్రైవ్ చేస్తున్నప్పుడో, బస్సులో వెళుతున్నప్పుడో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. నిద్రలేవగానే మీరు ఫ్రెష్‌నెస్ ఫీల్ కారు. ఎ. అవును బి. కాదు 8. నిద్రలో గురకపెడతారని సన్నిహితులు మీకు చెబుతుంటారు. ఎ. కాదు బి. అవును 9. పనిపై ఏకాగ్రత చూపలేరు. ఎ. అవును బి. కాదు 10. స్లీపింగ్ పిల్స్ తరచూ వాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు 7 దాటితే మీరు నిద్ర కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని అర్థం. ఇందుకు కారణాలేమిటో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.. ‘బి’లు 7 కన్నా ఎక్కువ వస్తే నిద్ర గురించి ఆందోళన చెందనక్కర లేదు. -
విద్యార్థులపై ‘ప్రత్యేక’ ఒత్తిడి
సూర్యాపేట : రవికృష్ణ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఫోన్ చేశాడు. ఇంతలోనే స్కూల్ నుంచి రవికృష్ణ తల్లికి ఫోన్వచ్చింది. వేసవి సెలవుల్లోనే పదో తరగతికి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఫలానా తేదీ నుంచి పంపండి.. మీ పిల్లాడు రాకపోతే వెనుకబడిపోతాడు. మీ ఇష్టం అంటూ చెప్పారు. తల్లిదండ్రులు కుమారుడ్ని ఊరికి పంపకుండా పాఠశాలకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది రవికృష్ణ ఒక్కడిదే బాధే కాదు.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లోని చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఇదే. మానసిక ఆనందాన్ని కోల్పోతున్న పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పోటీతత్వం పెరగడంతో రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు చదువు అంటూ పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఆనందాన్ని కోల్పోతూ యాంత్రికంగా మా రిపోతున్నారు. కనీసం సెలవు రోజుల్లోనైనా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు కూడా కరువవుతున్నాయి. పాఠశాల యజమాన్యాలు చెప్పిన విధంగానే తల్లిదండ్రులు మద్దతిస్తూ.. పిల్లలను ఆటపాటలకు దూరం చేస్తున్నారు. పట్టింపులేని అధికారులు మామూలుగానే సెలవు రోజుల్లో విద్యాశాఖాధికారులు, ఇటు ఇంటర్ అధికారులకు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవు. పేరుకే సెలవులు కానీ పనిచేస్తున్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలల విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ఈ నిబంధనలను ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు బుట్టదాఖలు చేస్తున్నాయి. -
వాకింగ్ జాగింగ్
ఒత్తిడిని ఎదుర్కోవడం ఆధునికుల్లో అత్యధికుల్ని బాధిస్తోన్న ఒత్తిడికి వ్యాయామంలో పరిష్కారం లభిస్తుందనేది చాలా కాలంగా చాలా మంది వైద్యులు చెబుతున్నదే. అయితే దీని కోసం జిమ్‌లూ, ఇతరత్రా కసరత్తులూ ఏవీ అక్కర్లేదనీ వాటన్నింటికన్నా మిన్నగా కేవలం వాకింగ్‌తో ఒత్తిడికి చెక్ పెట్టవచ్చునని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. మ్యాక్స్ బూపా వాక్ ఫర్ హెల్త్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 97శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, జైపూర్ నగరాలకు చెందిన వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉపకరిస్తున్న యాప్స్... ఇందులో 42శాతం మంది వృద్దులు ఒత్తిడిని ఎదుర్కోవడంలో వాకింగ్‌ను మించింది లేదని చెప్పగా, వాకింగ్ తర్వాత ఒత్తిడి, హైపర్ టెన్షన్ తగ్గిందని 50శాతం మంది మధ్యవయస్కులు చెప్పారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే ఇందులో 40శాతం మంది వాకింగ్ యాప్స్ తమను నడకవైపు బాగా చైతన్యపరిచాయని వెల్లడించారు. వీరిలో 60శాతం మంది గాడ్జెట్స్ వాడడం వల్ల తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోగలుగుతున్నామన్నారు. మిగతా నగరాలతో పోల్చినప్పుడు ఢిల్లీ, ముంబయిలో అత్యధికంగా 70, 72 శాతం మంది గాడ్జెట్స్ వినియోగిస్తున్నారు. నడక లోపిస్తే ఆరోగ్యం పడకే... వాకింగ్ కేవలం కేలరీలను ఖర్చు చేయించడంతో ఊరుకోదు. హ్యాపీ హార్మోన్‌గా పేరుపడిన ఎండార్ఫిన్‌ను సైతం విడుదల చేస్తుంది. అది అయితే అదే సమయంలో రెగ్యులర్‌గా నడవని వారు డిప్రెషన్‌కు తొందరగా లోనవుతున్నారని సర్వే తేల్చింది. నడకకు దూరంగా ఉన్నవారిలో 15శాతం మంది డిప్రెషన్, హై స్ట్రెస్ లెవల్స్‌కు లోనవుతున్నారని వివరించింది. వాకింగ్‌తో మానసికపరమైన ఇతరత్రా ప్రయోజనాలూ కలుగుతున్నాయని సర్వే చెబుతోంది. నడక ద్వారా తమకు ఆత్మశోధనకు అవకాశం కలుగుతోందని 19శాతం మంది మధ్యవయస్కులు, స్వావలంబన అనుభూతి కలుగుతోందని 21శాతం మంది వృద్దులు అంటున్నారు. సాకులూ ఉన్నాయి... అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చికిత్సను అందుకోవడంలో మరికొన్ని భిన్న కోణాలను సైతం ఈ సర్వే ఎత్తి చూపింది. పాల్గొన్నవారిలో పలువురు వాకింగ్‌కు దూరంగా ఉండడానికి చెబుతున్న కారణాలలో... 43శాతం మంది తమకు వాకింగ్‌కు అవసరమైన సమయం లేదని అంటుంటే, 29శాతం మంది వాకింగ్‌ను బోర్ కొట్టించేదిగా భావిస్తున్నారు. 21శాతం మందికి వాకింగ్‌కు వెళ్లేందుకు సరైన తోడు దొరకడం లేదు. అలాగే మరో 21శాతం మందికి అసలు వాకింగ్ తమ మానసిక ఆరోగ్యానికి ఇంతగా ఉపయోగపడుతుందనే అవగాహనే లేదు. -
ఆధికార పార్టీ వేధింపులు తట్టుకోలేక..
-
వాటర్‌లో వర్కవుట్స్
జలకాలాడాలని అన్పించనిదెవరికి? సిక్సిటీస్లో ఉన్న వారిని కూడా సిక్స్టీన్కు లాక్కువచ్చేస్తుంది. కేరింతలు కొట్టేంత కిక్కు ఇచ్చేస్తుంది. జల‘కళ’లో ఉన్న మహాత్యమే అది. నీళ్ళు చూస్తే కలిగే ఉత్సాహమే వేరు. నీలిరంగులో నిర్మలంగా ఆహ్వానించే మంచి నీటి ముత్యాలు వంటిని తాకిన వెంటనే మనసులోని ఒత్తిడి నంతా చేతితో తీసినట్టు... ఓ అద్భుతమైన ఫీలింగ్. ఎక్సర్సైజ్లు కూడా అంతే. కాసేపు జిమ్‌లోనో, పార్కులోనో కసరత్తులు చేస్తూ గడిపితే మనసులోని చిరాకులు పరాకులు అన్నీ ఫటాఫట్. మరి ఇంత హాయినిచ్చే ఈ రెండిటినీ ఎంచక్కా జోడించేస్తే... ఒళ్ళంత తుళ్ళింత కల్గించే వాటర్నీ, వంటిని వంపులు తిప్పే వర్కవుట్లనీ జతచేసి... వాటర్వర్కవుట్స్ చేస్తే... డబుల్ మజా, డబుల్ పవర్ మన సొంతమవడం ఖాయం. మండుతున్నట్టు, మంట పక్కనే ఉన్నట్టు ఎండలు. ఇలాంటి వేడి వాతావరణంలో చెమట్లు కక్కుతూ నాలుగ్గోడల మధ్య వ్యాయామాలు చేయా లంటే çసహజంగానే చాలా మంది వెనకాడుతుం టారు.అయితే వ్యాయామానికి వ్యాయామం, చల్లదనానికి చల్లదనం రెండూ ఉంటాయని ఈ సీజన్లో ఈతకు మాత్రం సై అంటారు. కేవలం స్విమ్మింగ్‌తో సరిపెట్టేయకుండా నీళ్ళలోనే ఉంటూ బోలెడన్ని వర్కవుట్లు చేయాలని ఆశించే వారికి మంచి మార్గం ఆక్వా ఎరోబిక్స్. ఏమిటీ వాటర్ ఎరోబిక్స్? నీళ్ళలో వర్కవుట్స్ చేయడం అనేది చాలా కాలం క్రితమే విదేశాల్లో మొదలైంది. దాదాపు ప్రతి రిసార్ట్, స్పా, క్లబ్‌లలో వీటికోసం అవసరమైన ఏర్పాట్లు ఉంటాయక్కడ. కొన్ని యూరప్ దేశాల్లో అయితే ఇవి ఓ ఉత్సవంలా సాగుతాయి. పూర్తి వినోదభరితంగా ఉంటాయి. రొటీ¯Œ కు భిన్నంగా, వ్యాయామానికి వినోదం జోడింపుగా ఈ వాటర్ వర్కవుట్స్ సాగు తాయి. దాదాపు కంఠం వరకూ నీళ్ళలో నిలబడి గాలిలోకి చేతులు జాపుతూ చేసే ఎరోబిక్స్, తక్కువ బరువుతో చేసే వెయిట్ ట్రయినింగ్, స్ట్రెచ్చింగ్... వంటివన్నీ ఇందులో భాగమే. వీటినన్నింటిని కలిపి ఆక్వా ఎరోబిక్స్గా వ్యవహరిస్తారు. విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వ్యాయామశైలి ఇప్పుడు మన మెట్రోలకూ విస్తృతంగానే విస్తరించింది... ఇంకా విస్తరిస్తోంది. లాభాలివే... నీళ్ళలో వ్యాయామం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీటికి సాంద్రత ఎక్కువని తెల్సిందే. ఇది గాలికన్నా ఎక్కువగా దాదాపు 12 రెట్లు నిరోధక శక్తిని కోరుతుంది. నీళ్ళలో కదలికలు కాస్త కఠినంగా అన్పించడానికి కారణమిదే. దేహంలోని కేలరీలు ఎక్కువగా ఖర్చు అవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. తద్వారా మన బాడీ టోనింగ్కూ ఉపకరిస్తుంది. నేలమీద చేసే ఎరోబిక్స్‌లో గంట వర్కవుట్కు 250–400 కేలరీలు ఖర్చయితే వాటర్‌లో చేసే ఈ ఎరోబిక్స్కు కనీసం 650–700 కేలరీలు ఖర్చవుతాయి. మిగిలిన అన్ని రకాల ఎరోబిక్స్ వ్యాయామాలతో పోల్చినపుడు ఇది సురక్షితమైనది. ఆరోగ్యకరమైంది. బాడీమజిల్ని, బోన్స్ని, జాయింట్స్‌ని ఒత్తిడికి గురిచే యదు. ఎందుకంటే దాదాపు 90 శాతం దాకా మన బరువుకు నీటి సపోర్ట్ లభిస్తుంది.రన్నింగ్, లేదా మరే ఇతర ఫ్లోర్ ఎక్సర్సైజ్లు చేసేవారికి వచ్చే సమస్యలకు భిన్నంగా ఈ వ్యాయామాల వల్ల ఎటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. నిర్విరామంగా దేహం నీళ్ళలో నానుతూ చల్లబడుతూ ఉండడం వల్ల సహజంగా వర్కవుట్ల కారణంగా పుట్టే వేడి చెమట వంటి ఇతరత్రా ఇబ్బందులు కలగవు. స్విమ్మింగ్ తెల్సి ఉండాలా? ఆక్వా ఎరోబిక్స్ చేయడానికి స్విమ్మింగ్ తెల్సి ఉండనక్కర్లేదు. స్విమ్మర్స్ కాని వాళ్ళు కూడా చేయవచ్చు. అయితే స్విమ్‌సూట్ మాత్రం తప్పనిసరి. అదే విధంగా ఆక్వా షూస్, స్విమ్ క్యాప్స్ వంటివి కూడా అవసరం. నీళ్ళలో ఉండగా స్థిరత్వాన్ని అందించేందుకు షూస్ ఉపకరిస్తాయి. మీ తల వెంట్రుకలు ముఖంపై పడి ఇబ్బంది పెట్టకుండా క్యాప్స్ కావాలి. వర్కవుట్స్ ఎలాంటివంటే.. బయట చేసే చాలా రకాల వర్కవుట్స్‌ని నీళ్ళలో కూడా చేయవచ్చు. నడవడం, రన్నింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు కూడా. జంపింగ్ జాక్స్ తరహా వ్యాయామాలు కూడా బావుంటాయి. దేహంలోని అన్ని మజిల్స్కూ ఇవి పని కల్పిస్తాయి. స్కైయింగ్ మోషన్ బ్యాక్, ఫోర్త్, లంగ్స్ ఇన్ ఛెస్ట్ డీప్ వాటర్, కిక్ బాక్సింగ్ మూవ్స్... వంటివి కూడా దీనిలో భాగంగా మార్చుకోవచ్చు. పరికరాలున్నాయి... ఈ వర్కవుట్ల కోసం ప్రత్యేకమైన పరికరాలు కూడా లభిస్తున్నాయి. బరువు తక్కువగా అన్పించే ఆక్వా డంబెల్స్ వీటిలో ఒకటి. ఈ డంబెల్స్‌తో బైసప్స్, ట్రైసప్స్, షోల్డర్స్‌కు నీళ్ళలో ఉండే వ్యాయామాలు చేయవచ్చు.ఇంకా నూడుల్స్ వంటి విభిన్న రకాల ఎక్విప్మెంట్ కూడా వినియోగించవచ్చు. అవసరమైన వస్తువులు... దాదాపు స్విమ్మింగ్‌కు అవసరమైన వన్నీ దీనికి కూడా అవసరమే. ఆక్వాబ్లాక్స్, ఫ్లోటేషన్ బెల్ట్స్, గ్లోవ్స్, కిక్బోర్ట్స్, ఆక్వాస్టెప్... వంటి వన్నీ కావాలి. ఎవరికి లాభం? వీటిని ప్రతిఒక్కరూ ప్రయత్నించవచ్చు. వయసుల కు లింగబేధాలకు అతీతంగా. క్రీడాకారులు, నృత్యక ళాకారులు, ఆరోగ్యార్ధులు, కొన్ని రకాల దీర్ఘకాలవ్యా« దులున్న వాళ్ళు, విభిన్న రకాల వ్యాయామాల పట్ల ఆసక్తి ప్రదర్శించేవారు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్దితుల వల్ల వ్యాయా మం చేయలేకపోతున్న వాళ్ళు... ఇలా అందరూ చేయదగ్గది. వారంలో 5 రోజులు చేస్తే చాలు. జాగ్రత్తలివే ►ఒంటరిగా వీటిని చేయాలనుకోవద్దు. నీళ్ళలోకి దిగేటపుడు దానిలోతు గురించి ఖచ్చితంగా తెల్సుకోవాలి. ►నీళ్ళు చాలా లోతుగా ఉంటే బ్యాలెన్స్ కోల్పోవడం, సరైన శైలిని కూడా విడవడం జరుగుతుంది. ►వ్యాయామానికి ముందుగా వార్మప్, ముగిసిన తర్వాత కూల్డవున్ ఎక్సర్సైజ్లు తప్పనిసరిగా చేయాలి. ►వాతావరణం బాగా చల్లగా ఉన్నపుడు మరింత చల్లనినీటిలో చేయడం వద్దు. నిర్ణీతవేడి నీళ్ళలో ఉండేలా చూసుకోవాలి. ► వాటర్ వర్కవుట్లంటే నొప్పి కలగనివి. ఏదైనా ప్రత్యేకమైన వర్కవుట్ వల్ల ఇబ్బందులñ దురైతే చేయడం మానేయాలి. ►మీ పరిస్ధితి, సామర్ధ్యాలను బట్టి వ్యాయామాలలో వేగాన్ని నిర్ణయించుకోవాలి. ►నీళ్ళలో వర్కవుట్ కదా అని నీళ్ళు తాగడంలో నిర్లక్ష్యం వద్దు. ప్రారంభంలోనూ, ముగిసిన తర్వాత మీ అవసరాన్ని బట్టి నీళ్ళు తాగుతుండాలి. ►కొత్తగా ప్రారంభిస్తున్నపుడు వైద్యుల సలహా, పర్యవేక్షకుని సూచనలు తప్పనిసరి. ఉపయోగాలెన్నో... ►యస్.సత్యబాబుటెంపరేచర్ కంట్రోల్ ఉన్న స్విమ్మింగ్‌ఫూల్ ఈ వాటర్ వర్కవుట్స్‌కు అనుకూలం. ► అన్నిరకాల ‘కార్డియో’వ్యాయామాలు నీళ్ళలో చేయవచ్చు. ►వాకింగ్ వంటి తేలికపాటి ఎక్సర్‌సైజ్‌తో ప్రారంభించాలి. ►మాయిశ్చరైజర్, వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్లను వాడాలి. ►నేలపైచేసే ఎక్సర్‌సైజ్‌లతో పోల్చితే వాటర్వర్కవుట్స్లో హార్ట్‌రేట్ తక్కువగా ఉంటుంది. కానీ లాభాలు మాత్రం ఎక్కువ. – యస్.సత్యబాబు తక్కువ బరువుండే ఆక్వా డంబెల్స్‌ను ఉపయోగించి చేసే వర్కవుట్స్‌ను ప్రారంభించాలిలా డంబెల్స్‌తో చేసేపుడు లోతు తక్కువగా ఉన్న చోటు ఎంచుకుని చేయాలి. నీళ్ళ నిరోధకశక్తిని ఎదుర్కుంటూ చేతుల్ని నలువైపులా తిప్పుతూ చేసే వర్కవుట్ ఇది. వంటికి తగిలించుకునే ఆక్వా న్యూడుల్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లకు ప్రత్యేకం. నీళ్ళలో నిదానంగా తేలుతూ కూడా వర్కవుట్స్ చేయడానికి న్యూడుల్స్ ఉపకరిస్తాయి. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించ డమే. అదే నీటిలో అయితే ఆనందాన్ని ఆస్వాదించడం కూడా.