ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ ..
నగర జీవితంలో ఒత్తిడి తప్పదు. ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ తప్పవు. ‘సిటీ’జనులు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, డయాబెటిస్, ఆర్థరైటిస్, హైపోథైరాయిడిజం, చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. జీవనశైలి కారణంగా కొన్ని, కాలుష్యం కారణంగా మరికొన్ని... ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామంటోంది ‘రెవా’.
అమెరికాలో శిక్షణ పొందిన తమ వైద్య బృందం, అత్యంత అధునాతన వైద్య పరీక్షా సౌకర్యాలు ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకైనా ఇట్టే చెక్ పెట్టగలవని ‘రెవా’ నిర్వాహకులు చెబుతున్నారు. ‘రెవా’ 360 డిగ్రీస్ కంప్లీట్ హెల్త్ సొల్యూషన్‌స ప్రోగ్రామ్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను సమర్థంగా నయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో తిరిగి వ్యాధుల బారిన పడకుండా తమ నిపుణులు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని అంటున్నారు.