వివిధ షేర్లపై జీఎస్టీ బిల్లు ప్రభావం
వివిధ షేర్లపై జీఎస్టీ బిల్లు ప్రభావం
Published Wed, Aug 3 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ముంబై: ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు జీఎస్ టీ బిల్లు (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ) అంచనాలపై భారీగా లాభపడ్డాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈబిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చర్చను మొదలుపెట్టిన కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కేంద్రం బిల్లుపై ప్రతికూలంగా స్పందించారు. తన వ్యాఖ్యలతో సభలో కాక పుట్టించారు. దీంతో సభలో చర్చ వాడి వేడిగా సాగుతోంది. అటు ఈ అనిశ్చితితో మదుపర్ల లాభాల స్వీకరణ, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి.
అయితే బిల్లుకు పార్లమెంటు లో ఆమోదం లభిస్తే 29 రాష్ట్రాల్లో, అనేక పరోక్ష పన్నులు, పన్నుల విధింపు ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈనేపథ్యంలో మార్కెట్ లోని 10 షేర్లకు సానుకూలంగా మారనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
హీరో మోటార్ కార్ప్: 8 శాతం తగ్గనున్న ఆన్-రోడ్ ధరలతో ఎంట్రీ లెవర్,ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఈ కంపెనీ లాభపడనుంది.
మారుతి సుజుకి : ఆన్ రోడ్ ధరలతో తగ్గింపుతో ఎంట్రీ లెవల్ కారు సెగ్మెంట్ లో .. 8 శాతం ధరలు తగ్గనున్నాయి. దీంతో ఈ సెగ్మెంట్ లో 80 శాతం వాటాను కలిగివున్న మారుతి అతిపెద్ద లబ్దిదారుగా అవతరిస్తుంది.
అమర్ రాజా బ్యాటరీస్: అసంఘటిత రంగం నుంచి వ్యవస్థీకృత సెగ్మెంట్ వాణిజ్యంలోకి మారడం.. బ్యాటరీ విభాగంలో అమర్ రాజా బ్యాటరీస్ శుభపరిణామం.
ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ : ప్రస్తుత 25 శాతం నుంచి పన్ను రేట్లు సుమారు 18 శాతానికి తగ్గితే అసంఘటిత కంపెనీల నుంచి పోటీ తగ్గి ఈ రెండు భారీగా లాభపడనున్నాయి. ఎందుకంటే అసంఘటిత, సంఘటిత ప్లేయర్స్ మధ్య ధర అంతరం తగ్గి క్రమంగా వారినుంచి పోటీ తగ్గుతుంది దీంతో ఈరంగాలకు జీఎస్ టీ ఆమోదం సానుకూలం.
షాపర్స్ స్టాప్ : ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అంశం దీనికి కూడా సానుకూలం అంశం. అన్ ఆర్గనైజ్డ్ రంగంనుంచి పోటీ తగ్గుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
సెంచరీ ప్లై:జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తే ప్లైవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం 65-70 శాతం మార్కెట్ వాటా కలిగి మేజర్ కంపెనీ సెంచరీకి శుభపరిణామం. అసంఘటిత సెక్టార్ నుంచి ఇది వ్యవస్థీకృత విభాగంలోకి షిప్ట్ అవుతుంది.
టీసీఐ: అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీలు తొలగించడం ద్వారా హబ్-అండ్-స్పోక్ మోడల్డ్ వేర్ హైస్ చెయిన్లు లాభం. ప్రధానంగా ఖర్చుల తగ్గడంతో సామర్థ్యాలను భరోసా పెరుగుతుంది.
గతి: ఎనలేని ఆదాయం అవకాశాలల కల్పనతో ఈ కామర్స్ సొల్యూషన్స్ గతికి పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇది భారతదేశం లో ఇకామర్స్ విస్తరణకు దారితీయనుంది.
హావెల్స్ , వి-గార్డ్ , సింఫనీ , క్రాంప్టన్ కన్జ్యూమర్: పన్ను రేట్లను : పన్నుశాతం తగ్గడంతో ఈ కంపెనీలు భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం పన్ను 26-29 శాతంనుంచి 18 శాతానికి తగ్గనుంది.
ఎసీసీ: జీఎస్టీ బిల్లు ఆమోదం ప్రధానంగా సిమెంట్ కంపెనీలకు లాభాలపంట పండిస్తున్నాయి. ఎఫెక్టివ్ రేట్లు తగ్గింపు , సరఫరా వ్యయాల తగ్గింపు ద్వారా ప్రయోజనం ఉంటుంది.
ప్రతికూలం
జీఎస్ టీ ఆమోదం పొందితే సిమెంట్ ,టుబాకో సెక్టార్ లపై ఒత్తిడి పడనుంది. ప్రధానంగా 40 శాతం పన్నుతో టొబాకో కంపెనీ ఐటీసీకి చెంపెపెట్టులాంటిదే. అలాగే ఇంటర్ స్టేట్ టాక్స్ పరిణామంతో కమర్షియల్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో అశోక్ లే లాండ్ కు కష్టాలు తప్పవు. విలువైన మెటల్స్ పై 2-6 శాతం పన్నుతో బంగారు , వజ్రాల ఆభరణాల తయారీదారు టైటాన్ కు ప్రతికూలంగా ఉండనుంది. అంతేకాదు బ్రాండెడ్ ఆభరణాలు రేట్లు భారీగా పెరగనున్నాయి. అలాగే ప్రింట్ మీడియాషేర్లకు కూడా ప్రతికూలమనే చెప్పాలి. ప్రింట్ ప్రకటనలు, ప్రసరణ ఆదాయం జిఎస్టి పరిధిలోకి వస్తే, ముద్రణ సంస్థలు ప్రతికూల ప్రభావం ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు నివేదిస్తున్నాయి.వీటిలో హిందూస్తాన్ మీడియా , హెచ్టి మీడియా , జాగరణ్ ప్రకాషన్ , డిబి కార్పొరేషన్ ప్రధానమైనవి.
Advertisement
Advertisement