సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
స్కిల్ డెవలప్‌మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్‌లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్‌మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: సూపర్‌సిక్స్‌కు ఎగనామం
Comments
Please login to add a commentAdd a comment