ఆటోమేటిక్‌ ప్రెజర్‌ సర్ఫేస్‌ మెషిన్‌ | Easy To Use This New Automatic Pressure Surface Machine | Sakshi
Sakshi News home page

ఆటోమేటిక్‌ ప్రెజర్‌ సర్ఫేస్‌ మెషిన్‌

Published Sun, Mar 10 2024 11:18 AM | Last Updated on Sun, Mar 10 2024 11:18 AM

Easy To Use This New Automatic Pressure Surface Machine - Sakshi

వెరైటీ ఫుడ్‌ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్‌ ఉంటే ఆ టెన్షన్‌ ఎందుకు? ఈ ఆటోమేటిక్‌ ప్రెజర్‌ సర్ఫేస్‌ మెషిన్‌ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్‌ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్‌ వైర్‌లెస్‌ మెషిన్‌గా పని చేస్తుంది ఇది. డివైస్‌కి ముందు వైపు పవర్‌ ఆన్‌/ఆఫ్‌ బటన్‌ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్‌లెస్‌ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్‌(హోల్స్‌తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్‌ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) 

ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్‌ కుకింగ్‌ వేర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement