
ఫిష్ చిప్స్ కావలసినవి:
చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)
మైదా పిండి– అర కప్పు
మొక్కజొన్న పిండి– పావు కప్పు
బేకింగ్ పౌడర్– కొద్దిగా
బ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి– అర టీ స్పూన్
సోడా వాటర్– కొద్దిగా
ఉప్పు– తగినంత
మసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్‌లా చేసుకోవాలి)
నూనె– డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి.
సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
చికెన్‌తో స్పైసీ ఎగ్స్
కావలసినవి:
గుడ్లు– 5 లేదా 6
బోన్‌లెస్ చికెన్– 1 కప్పు
కారం– 2 టీ స్పూన్లు
పసుపు– చిటికెడు
గరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే
చికెన్ మసాలా– 1 టీ స్పూన్
ఉప్పు– తగినంత
మిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్‌కి
తయారీ: ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి.
అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.
(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..)
Comments
Please login to add a commentAdd a comment