Automatic
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్‌గా పని చేస్తుంది ఇది. డివైస్‌కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్‌తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్‌ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్‌ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్‌కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్ స్టోర్‌కు వెళుతుంటారు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి, క్యాష్ పే చేస్తుంటాం. అయితే దుబాయ్‌లోని ఆ స్టోర్‌లో క్యాషియర్ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈలోని దుబాయ్ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి.. -
స్మార్ట్ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతులు. ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ను ఏర్పాటు చేసుకుని చీడపీడలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంట నష్టాన్ని నివారించుకుంటున్నారు. పనిలో పనిగా సస్యరక్షణ ఖర్చు సగానికి తగ్గినట్టే. నాణ్యత పెరగడమే కాదు.. ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సూత్రాలను ‘స్మార్ట్’గా పాటిస్తూ పండ్ల తోటల్లో ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ ద్వారా చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు అనంతపురం రైతులు. దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల తోటలు సాగు చేసే పెద్ద రైతులకు వెదర్ స్టేషన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. తోటల యాజమాన్యాన్ని ‘స్మార్ట్’ సాధనాలతో సులభతరం చేసుకోవడమే కాక ఖర్చును తగ్గించుకుంటూ అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆటోమేటిక్ స్మార్ట్ వెదర్ స్టేషన్ సోలార్ సిస్టమ్‌తో నడుస్తుంది. భూమి రకాన్ని బట్టి 3 ఎకరాలకు ఒకటి సిఫారసు చేస్తున్నారు.. ఒకే పంటను సాగు చేసే రైతులు ఒక పరికరంతోనే సత్ఫలితాలను పొందుతున్నారు. రూ.50 వేల వ్యయంతో దీన్ని తోట మధ్యలో అమర్చుకోవాలి. భూమి లోపల కనీసం 2–3 మొక్కలను కలుపుతూ ఒక అడుగు లేదా 15 అంగుళాల లోతులో సెన్సార్‌ను పెడతారు. అలాగే, రాబోయే 14 రోజుల్లో ఉండే ఉష్ణోగ్రతలను అంచనా వేసేందుకు టవర్‌కు మధ్యలో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. గాలివేగం, తేమశాతం తెలుసుకునేందుకు టవర్‌కు రెండో వైపు 2.5–3 అడుగుల ఎత్తులో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. భూమిలో ఉండే సెన్సార్ మొక్కల వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతోంది? వేర్ల దగ్గర తేమ శాతం, ఒత్తిడి ఎలా ఉందో చెబుతుంది. అలాగే రెండో సెన్సార్ ఉష్ణోగ్రతలను, మూడో సెన్సార్ ద్వారా గాలిలో తేమ శాతం, గాలి వేగం గురించి చెబుతుంది. రెయిన్ గేజ్ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. 3 సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని తనే విశ్లేషించుకొని రైతులకు తగిన సూచనలు, సలహాలతో మెస్సేజ్‌లు పంపుతుంది. మంచి ఫలితాలొస్తున్నాయి నేను 25 ఎకరాల్లో దానిమ్మ, 10 ఎకరాల్లో ద్రాక్ష పండ్లు సాగు చేస్తున్నా. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాబాసాహెబ్ ఘోరే శిక్షణా కార్యక్రమంలో వీటి ప్రయోజనాల కోసం తెలుసుకున్నా. రెండేళ్ల క్రితం వీటిని మా తోటల్లో ఏర్పాటు చేశాం. చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే సిఫార్సులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏర్పాటు చేసిన ఫసల్ కంపెనీ ఏడాది పాటు ఉచితంగా సేవలందించింది. మా జిల్లాలో 10 మంది రైతులు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి రాగా, పెట్టుబడులు పోను రూ.2–3 లక్షల వరకు నికరాదాయం వస్తో్తంది. – గౌని పాతిరెడ్డి, కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా (9440752434) ఇంట్లో నుంచే తోట యాజమాన్యం నేను 64 ఎకరాల్లో దానిమ్మ, బత్తాయి, బొప్పాయి తోటలు సాగు చేస్తున్నా. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు. పంట ఏ తెగులు బారినపడుతుందో అన్న దిగులు లేదు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్లొస్తాయి. సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే చాలు. గతంతో పోలిస్తే∙నీరు 50% ఆదా అవుతుంది. 25% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దిగుబడి పెరిగింది. పండ్ల నాణ్యత 50% పెరిగి మంచి రేటు కూడా వస్తోంది. – సుగాలి చిన్న నాగరాజు, యలగలవంక తండా, బేలుగుప్ప మం., అనంతపురం జిల్లా (7702828062) చీడపీడలను ఇట్టే పసిగడుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది.. ఫలానా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.. ఫలానా తెగులు సోకే ప్రమాదం ఉంది.. మరో గంటలో వర్షం పడే అవకాశం ఉంది వంటి హెచ్చరికలు పంపిస్తుంది. భూమిలో ఉండే సెన్సార్ ఆధారంగా ఏ సమయంలో ఎంత మేరకు నీరు పెట్టాలో చెబుతుంది. పోషక లోపాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. చీడపీడలకు పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఎంత మోతాదులో ఎటు నుంచి పిచికారీ చేయాలో కూడా చెబుతుంది. టవర్‌కు ఉండే రెయిన్ గేజ్ ఆధారంగా పంటపొలం వద్ద ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడింది? ఆ ప్రభావం పంటలపై ఏ మేరకు ఉంటుందో కూడా రైతులకు తెలియజేస్తుంది. టవర్ లోపల సిమ్ కార్డు నిక్షిప్తం చేసి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు టెక్ట్స్ మెసేజ్ రూపంలో రైతుకు సమాచారం వస్తుంది. రైతు తోటలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే ప్రత్యేక యాప్ ద్వారా మెసేజ్ రూపంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతాయి. ఏమైనా తెగుళ్లు సోకినట్టు గుర్తిస్తే తప్ప అనవసరంగా మందులు కొట్టే అవసరం ఉండదు. సిఫారసు చేసిన పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులో స్ప్రే చేయడం వలన అదనపు ఖర్చు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన మందు స్ప్రే చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది. తెగుళ్లు, చీడపీడలు సోకకుండా ముందస్తుగా గుర్తించడం వలన పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. పురుగుమందుల వినియోగం తగ్గడంతో ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పొలంలో వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెట్టుబడి ఖర్చు 20% తగ్గడంతోపాటు, నాణ్యత 50%, దిగుబడి 25% వరకు పెరుగుతుంది. 20% పైగా అదనపు ఆదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి (చదవండి: ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం! స్మెదిక్‌లో సిక్కు జాతీయుల ఫార్మింగ్ సిటీ) -
రైళ్లకు రక్షణ ‘కవచం’.. కిలోమీటర్‌కు 50 లక్షల వ్యయం.. తేడా వస్తే బ్రేకులే!
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’ సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదీ ప్రణాళిక.. ♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్‌కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్‌కు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. కవచ్ పనిచేస్తుందిలా.. కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది. -
రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ముక్కు మూసుకోవాల్సిన పని లేదు! రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. -
తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!
హైవేలపై పోలిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో ఆటోమాటిక్ కార్లను డ్రైవ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారణంగా మార్కెట్లో ఆటోమాటిక్ కార్ల వినియోగం మునుపటి కంటే ఎక్కువగా ఉంది, ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 ఆటోమాటిక్ కార్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'క్విడ్' లాంచ్ చేసిన తరువాత విపరీతమైన అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఈ కారుకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. క్విడ్ RXT 1.0 EASY-R వేరియంట్ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి, 67 బీహెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కె10: భారతీయ మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఆటోమాటిక్ కార్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకటి. ఇందులో VXI AGS మోడల్ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 65.7 బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: మారుతి ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన, ఎక్కువ మంది కొనుగోలు చేసే కారు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో VXI (O) AGS ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 5.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కూడా మారుతి ఆల్టో కె10 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ అందిస్తుంది. మారుతి సుజుకి సెలెరియో: మారుతి సుజుకి సెలెరియో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే హ్యాచ్‌బ్యాక్. సెలెరియో ఆటోమేటిక్ వెర్షన్ ప్రారంభ ధరలు రూ. 6.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1.0-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 65.7 బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా తక్కువ ధరలు లభించే బెస్ట్ ఆటోమాటిక్ కారు. దీని ప్రారంభ ధర రూ. 6.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. -
TTD: డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు
సాక్షి, తిరుపతి: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని అన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాన్నారు. ‘‘తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం’’ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చునని ధర్మారెడ్డి పేర్కొన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు కాగా, హుండీ ద్వాతా రూ.123.07 కోట్లు ఆదాయం చేకూరింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కాగట కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు. చదవండి: ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ -
డ్రైవింగ్ టెస్ట్.. ఇకపై అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్‌గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్‌లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి,చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం ఇలా మొత్తం ఇక్కడ 13 ట్రాక్‌లు ఉన్నాయి. ఎంవీ(మోటార్ వెహికల్)కు సంబంధించి 5 ట్రాక్‌లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్‌పిన్ ట్రాక్, బ్యాలన్స్ బ్రిడ్జి ట్రాక్, రఫ్ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్ వంటి ట్రాక్‌లు ఉన్నాయి. ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్)లో కూడా 5 ట్రాక్‌లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్లు ఉంటాయి. హెచ్ఎంవీ (హెవీ మోటార్ వెహికల్)లో మూడు ట్రాక్‌లు మాత్రమే ఉండగా, హెచ్ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్ చేశారు. ఈ ట్రాక్‌ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్‌లోను బొలెట్స్ (సెన్సర్‌ను అమర్చిన పోల్స్) అమర్చారు. దీంతో పాటు ఆర్ఎఫ్ రీడర్స్ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డులు –13, సిగ్నల్ స్తంభాలు 13, కంప్యూటర్ పరికరాలు 15, మానిటర్ 2, ఒక కియోస్క్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్, నెట్ వర్కింగ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్ ట్రయల్‌కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్ రూమ్ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. డ్రైవింగ్ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. ఆటోమెటిక్ పద్ధతి ద్వారా ఎల్ఎల్ఆర్ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ ట్రయల్‌కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్ఎల్ఆర్ నంబరు నమోదు చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్ రూమ్‌లో బయోమెట్రిక్ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్‌లోకి వెళ్లేముందు ఆర్ఎఫ్ రీడర్‌కు ట్యాగ్‌ను మ్యాచింగ్కు చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ సిగ్నల్‌ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్ వద్ద ట్యాగ్‌ను మ్యాచింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్‌లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్ మార్క్ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్ రూపంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్ ట్రయల్‌లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్ పడనుంది. పనులు పూర్తయ్యాయి ట్రాక్ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్ విధానం ద్వారానే ట్రయల్ ఉంటుంది. సెన్సార్ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి. – బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు -
టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020లో జారీ చేసిన ప్రెస్ నోట్ 3లోని నిబంధనలు దీనికి వర్తిస్తాయని పేర్కొంది. దీని ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాల ఇన్వెస్టర్లు, లేదా అంతిమంగా ప్రయోజనాలు పొందే వారు సరిహద్దు దేశాలకు చెందినవారైతే మాత్రం దేశీయంగా టెలికంలో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్ విధానం అమలవుతోంది. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలను గట్టెక్కించేందుకు ఇటీవల ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎఫ్‌డీఐల పరిమితిని కూడా కేంద్రం 100 శాతానికి పెంచింది. మరోవైపు, టెల్కోలు సమరి్పంచాల్సిన పనితీరు, ఆర్థిక బ్యాంక్ గ్యారంటీ పరిమాణాన్ని 80 శాతం మేర తగ్గిస్తూ టెలికం శాఖ (డాట్) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్సు నిబంధనల సవరణ నోట్‌ను జారీ చేసింది. దీని ప్రకారం టెల్కోలు తాము తీసుకునే లైసెన్సు కింద అందించే ప్రతి సర్వీసుకు రూ. 44 కోట్ల పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. పాత నిబంధన ప్రకారం ఇది రూ. 220 కోట్లుగా ఉండేది. అలాగే కొత్త నిబంధన ప్రకారం ప్రతి సర్కిల్‌కు గరిష్టంగా రూ. 8.8 కోట్ల ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో ఇది రూ. 44 కోట్లుగా ఉండేది. కోర్టు ఆదేశాలు లేదా వివాదానికి సంబంధించి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలకు ఇది వర్తించదు. తాజా సవరణతో టెల్కోలకు ఊరట లభించనుంది. గ్యారంటీల కింద బ్యాంకులో తప్పనిసరిగా ఉంచే మొత్తంలో కొంత భాగం చేతికి అందడం వల్ల నిధులపరంగా కాస్త వెసులుబాటు ఉంటుంది. -
కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్
RBI Auto-Debit Payments Rules: డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు ముఖ్యగమనిక. ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధన ఇవాల్టి (అక్టోబర్ 1) నుంచి అమలు అయ్యింది. కొత్త రూల్ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై ఐదు వేలకు మించి ఆటోమేటిక్ చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ కన్ఫర్మేషన్ జరగాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించాలని చెల్లింపుదారులను ఆర్బీఐ అప్రమత్తం చేస్తోంది. అక్టోబర్ 1, 2021 నుంచి ఐదు వేలకు మించిన ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులు.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ఉంటేనే ఆ ట్రాన్జాక్షన్ సక్రమంగా జరిగేది. అంటే ఆటోమేటిక్‌గా కట్ కాకుండా.. ఓటీపీ కన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల భద్రత కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ప్యాక్‌లు, ఫోన్ రీఛార్జీలు, బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్(ఐదు వేలకు మించినవి) ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు ఆటోమేటిక్ కార్డు చెల్లింపులు, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర ఈఎంఐపేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిటింగ్ ఫెసిలిటీ ఉండేది ఇన్నాళ్లూ. అయితే ఇకపై ఇలా కుదరదు. మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది ఆర్బీఐ. కాకపోతే తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకొనున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఆర్బీఐ. ఈ తరుణంలో ఇప్పటికే చాలా బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ మెసేజ్‌లను, మెయిల్స్‌ను పెట్టేశాయి. చదవండి: లోన్ తీసుకునేవాళ్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్స్ -
ఈఎంఐ పేమెంట్స్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Auto-Debit For EMI Payments: హోం లోన్స్ ఇతరత్ర నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ మోడ్‌ను ఆశ్రయిస్తున్నారా? బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్, మొబైల్ వాలెట్స్ వాడుతున్నారా? అయితే అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతున్న కొత్త నిబంధనలను తెలుసుకోండి. ఈ తేదీ నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ సంస్థలుగానీ ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం కస్టమర్ల నుంచి ‘అదనపు ధృవీకరణ’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎలాంటి వాటిపై ప్రభావం అంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. ఎక్స్ట్రా ఛార్జీలు?? హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్ మోడ్‌లో కట్ అయ్యేవిధంగా కొందరు సెట్ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది. ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బీఐతో చర్చలకు.. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్లైన్ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఖాతాదారులు, యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రకటిస్తూనే.. మరోవైపు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఆర్బీఐతో చర్చలకు సిద్ధం కావడం కొసమెరుపు. చదవండి: నిలువునా ముంచేసిన బ్యాంకు.. ఊరట అందించిన ఆర్బీఐ -
వాహనాల ఫిట్నెస్ టెస్ట్.. ఇక ఆటోమేటెడ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆటోమేటెడ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల నాణ్యతను, పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం తాజాగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు అక్టోబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ► ఆటోమెబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సంబంధించిన 40 అంశాలను ఈ ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు తనిఖీ చేసి సదరు వాహనం సామర్థ్యాన్ని నిగ్గు తేలుస్తాయి. ► బస్సులు, లారీలు, ఆటోరిక్షాలు తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలను ఈ ఫిట్నెస్ కేంద్రాల్లోనే తనిఖీలు చేయవలసి ఉంటుంది. ► ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులే అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో స్వయంగా తనిఖీలు చేసి వాహనాల సామర్థ్యాన్ని ధృవీకరిస్తుండగా రానున్న ఆ రోజుల్లో ఆ పనిని యంత్రాలు చేయనున్నాయి. ► మరో వైపు ఈ ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల (ఏవిఎఫ్ఎస్) నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం నిర్వహించే పరీక్షలను పూర్తిగా ప్రైవేట్ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఫిట్నెస్ కేంద్రాలను సైతం ప్రైవేటీకరించేందుకు తాజాగా రంగం సిద్ధమైంది. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఊతం వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ..నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేట్ సంస్థలు ఏ మేరకు కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నాయో నిర్ధారించడం సాధ్యం కాదని రవాణాశాఖ సాంకేతిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్లను ఆర్టీఏలే నిర్వహించే విధంగా మార్పులు చేయాలంటున్నారు. పక్కాగా తనిఖీలు... ► వాహనం ఇంజన్ సామర్ధ్యం, బ్రేకులు, టైర్లు, కాలుష్య కారకాల తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలు మొదలుకొని వైపర్లు, సైడ్ మిర్రర్లు, షాకబ్జర్వర్స్, డైనమో, బ్యాటరీ తదితర 40 అంశాలను ఈ యంత్రాలు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి. ► ఎలక్ట్రికల్, మెకానికల్ లోపాలను గుర్తిస్తాయి. ► వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారకాలను గుర్తించి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లకు అర్హత ఉన్నదీ లేనిదీ ఈ యంత్రాలే నిర్ధారిస్తాయి. ► గంటకు 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించే విధంగా పూర్తిస్థాయిలో కంఫ్యూటరీకరించిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ► ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్టెక్టర్లు నిర్వహించే తనిఖీల్లో శాస్త్రీయత కొరవడినట్లు ఏఆర్ఏఐ నిపుణులు భావిస్తున్నారు. మొక్కుబడిగా నిర్వహించే ఈ తనిఖీల వల్ల కాలం చెల్లిన, డొక్కు వాహనాలకు తేలిగ్గా అనుమతి లభిస్తుందనే అభిప్రాయం ఉంది. ► ఇలా ఉత్తుత్తి తనిఖీలతో రోడ్డెక్కే వాహనాలు రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
‘ఆటో’ అవకాశాలను అందిపుచ్చుకునేలా..
సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు ►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్‌లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్‌కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తాయి. ►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్‌లోని తమ యూనిట్లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది. -
వాట్సాప్ మరో అద్భుతమైన అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట అవే ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్ సెట్టింగ్స్ విభాగంలో అందజేసే ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే ఏదైనా సెన్సిటివ్ మెసేజ్‌ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే..డిజప్పియర్డ్ మెసేజెస్ లోకి వెళ్లి, ఆఫ్, 5 సెకండ్స్, గంట అనే అప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది గ్రూపు చాటింగ్‌లో గానీ, వ్యక్తిగత చాటింగ్‌లో గానీ ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఒక్కసారి డిలీట్ అయిన తరువాత ఇవి చాట్‌లో ట్రాక్‌లో కూడా అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది. ఇటీవల వాట్సాప్ స్టేటస్ స్టోరీలను డైరెక్టుగా ఫేస్బుక్ స్టోరీలో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితేతాజా అప్డేట్పై వాట్సాప్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. చదవండి : వాట్సాప్ అప్డేట్ -
కొత్త కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ మాయం
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతున్నా కొద్దీ కార్లు నడపడం చాలా సులువు అవుతూ వస్తోంది. ఇప్పటికే చాలా కార్లలో గేర్‌కు బదులుగా ఆటో గేర్ సిస్టమ్ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హ్యాండ్ బ్రేక్‌ను మాత్రం డ్రైవరే వేయాల్సి వచ్చేది. ఆ విధానానికి స్వస్తి చెబుతూ మొట్టమొదటి సారిగా జాగ్వర్ కార్లలో బటన్ సిస్టమ్ వచ్చింది. బటన్ నొక్కితే చాలు హాండ్ బ్రేక్ దానంతట అదే పడిపోతోంది. జాగ్వర్ కార్లను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ల్యాండ్ రోవర్, లెక్సెస్, మెర్సిడెస్ బెంజి, పోర్షే ఖరీదైన కార్లు కూడా పుష్ బటన్ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 32 కార్ల కంపెనీల వాహనాలను అధ్యయనం చేయగా ఇప్పటికే జాగ్వర్, ల్యాండ్ రోవర్, లెగ్సస్, మెర్సిడెస్, పోర్షే కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ పూర్తిగా కనుమరుగైంది. ఇక షో రూముల్లో పరిశీలిస్తే ప్రతి పది కంపెనీల కార్లలో మూడు కంపెనీల కార్లలో మాత్రమే ఇంకా హ్యాండ్ బ్రేక్ వ్యవస్థ ఉంది. డేషియా, సుజికీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ హ్యాండ్ బ్రేకర్ల వ్యవస్థనే ఉపయోగిస్తున్నాయి. హ్యాండ్ బ్రేక్ వేసి ఉందా, లేదా అన్న విషయం డాష్ బోర్డులో రెడ్ మార్కుతో కనిపిస్తుంది. హ్యాండ్ బ్రేకుల్లో కూడా ఆటోమేటిక్ వ్యవస్థ వస్తోంది. కొండలు, గుట్టలు ఎక్కుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొండ ఎక్కుతున్నప్పుడు కారు ముందుకు పోలేక వెనక్కి జారుతున్నప్పుడు ఈ ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేసి హ్యాండ్ బ్రేక్ దానంతట అదే పడుతుంది. డ్రైవర్ అవసరం లేని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తోన్న నేపథ్యంలో డ్రైవర్ మరింత సులువుగా కార్లు నడిపే దిశగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. -
ఈ రోడ్డుపై చార్జింగ్ చేసుకోవచ్చు!
బ్రెస్సెల్స్: సమీప భవిష్యత్‌లో వాహనాలన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయా? శిలాజ ఇంధనాలకు విద్యుత్ సరైన ప్రత్యామ్నాయమా? అంటే స్వీడన్ పరిశోధకులు అవుననే చెబుతారు. చెప్పడమే కాదు.. రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్బెర్గ్ వరకూ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశమంతటా అమలు చేసేందుకు స్వీడన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని 70 శాతం తగ్గించాలని స్వీడన్ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు మధ్యలో విద్యుత్ ట్రాక్ ఈరోడ్ ఆర్లాండా, వాహనాల తయారీ సంస్థ డీఏఎఫ్, టెక్నాలజీ కంపెనీలు, విద్యాసంస్థలు, స్వీడన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాక్ హోం ఎయిర్పోర్ట్ నుంచి రోజెర్స్బెర్గ్లోని ఓ సరుకుల సరఫరా కేంద్రం వరకూ దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన చేయి లాంటి నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్ ప్రారంభిస్తుంది. ఈ మార్గంలో కారు లేదా ట్రక్కు వెళుతున్నంతవరకూ బ్యాటరీలు చార్జ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కారు లేదా ట్రక్కు నిలిచిపోతే, విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. ఈ వ్యవస్థలో భాగంగా ఒక్కో వాహనం ఎంత విద్యుత్‌ను వినియోగించుకుంటుందో లెక్కించి సదరు కారు లేదా లారీ ఓనర్ నుంచి నగదును వసూలు చేస్తారు. దీనివల్ల విద్యుత్ కొరతతో వాహనాలు ఆగిపోవడమన్న సమస్యే తలెత్తదు. ఈ పైలెట్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో స్వీడన్ ప్రభుత్వం 70 శాతం భరిస్తోంది. లాభదాయకం.. సురక్షితం ఈ ప్రాజెక్టులో విద్యుత్ ట్రాక్ ఉన్న రోడ్డును 50 మీటర్లకు ఓ సెక్షన్ చొప్పున విభజిస్తారు. తద్వారా వాహనాలు సంబంధిత సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా జరుగుతుంది. లేదంటే ఆగిపోతుంది. దీనివల్ల గణనీయంగా ఇంధనాన్ని, శక్తిని ఆదా చేయొచ్చు. దేశమంతటా రోడ్లపై ఇలాంటి ట్రాక్‌లను పరచడం వల్ల విద్యుత్ వాహనాల తయారీ ఖర్చు, బ్యాటరీల పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ ట్రాక్‌లను ఓ కి.మీ మేర అమర్చాలంటే దాదాపు రూ.8.46 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ మొత్తం ట్రామ్ కారు ఏర్పాటు వ్యయంతో పోల్చుకుంటే 50 రెట్లు తక్కువ. ఇక ఈ ట్రాక్‌ల కారణంగా చార్జింగ్ స్టేషన్ల కోసం వాహనదారులు వెతకాల్సిన బాధ తప్పుతుంది. వరదలు సంభవించినా, రోడ్డంతా ఉప్పు ఉండిపోయినా ఉపరితలంపై విద్యుత్ సరఫరా ఒక ఓల్ట్కు మించదనీ, ప్రజలు నిక్షేపంగా చెప్పులు వేసుకోకుండా నడవొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంధన కొరత అన్నదే లేకుండా ప్రజలు తమ వాహనాలు నడుపుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
ఆటోమేటిక్ దంతితో లాభాలు
పుట్టపర్తి అర్బన్ : ఖరీప్ సీజన్లో సాగుచేసిన వివిధ పంటల్లో కలుపు తొలగించడానికి వినియోగించే ఆటోమేటిక్ దంతి (కలుపు తీసే పనిముట్టు) తో లాభాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. సుమారు వెయ్యి రూపాయల ఖర్చుతో సైకిల్ చక్రంతో తయారు చేసిన దంతితో ఖర్చు లేకుండా కలుపు తొలగించవచ్చని గంగిరెడ్డిపల్లి రైతు కుళ్లాయప్ప చెప్పారు. ఒక యంత్రంతో ఒక మనిషి అలుపు లేకుండా రోజుకు ఎకరా పైన కలుపు తీయవచ్చన్నారు. ప్రస్తుతం వేరుశనగ, కంది,పంటల్లో కలుపు తీయడానికి ఎద్దులు దొరకడం కష్టంగా ఉండడం, కూలీలు దొరకక పోవడంతో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు. -
గైట్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
రాజానగరం: బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్ కళాశాల ఆటోమొబైల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. అకడమిక్ ప్రాజెక్టులో భాగంగా హెచ్ఓడీ వి.సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో టీడీఎస్ సుబ్బారెడ్డి, జి.మణికంఠ, కె.మురళీకృష్ణ, కె.దుర్గాశ్రీకాంత్ దీనిని రూపొందించారు. తొలుత ఒక బస్సు మోడల్ని తయారుచేశారు. ఇదే కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న టి. వెంకటశివారెడ్డి సహకారంతో బస్సు క్యాబిన్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అత్యవసర ద్వారం తెరుచుకుని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ముందుగా నిర్ణయించిన మొబైల్ నంబర్లకు సంఘటన జరిగిన ప్రాంతం వివరాలను సంక్షిప్తంగా మెసేజ్ పంపిస్తుంది. ఈ వ్యవస్థకు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్డీఎస్ఎస్) అని పేరుపెట్టారు. -
మహీంద్రా ఎక్స్‌యూవీ500.. ఆటోమేటిక్
ధర రూ. 15.36 లక్షల నుంచి ప్రారంభం మైలేజీ 13.85 కి.మీ. న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియమ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ) మోడల్లో ఎక్స్‌యూవీ500లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.15.36 లక్షల(ఎక్స్ షోరూమ్, నవీ ముంబై) నుంచి ప్రారంభమవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. వచ్చే నెల 5 నుంచి ఈ ఎస్యూవీ విక్రయాలు ప్రారంభిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కేటగిరీలో ఆల్ వీల్ డ్రైవ్‌తో కూడిన ఆరు గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్ ఉన్న ఏకైక ఎస్యూవీ ఇదేనని వివరించారు. 2011లో ఎక్స్‌యూవీ500ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 1.5 లక్షల వాహనాలను విక్రయించామని పేర్కొన్నారు. ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు.. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఓఆర్వీఎమ్లపై లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్, డ్యుయల్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారు 13.85 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
మెట్రో స్టేషన్లలో ‘ఆటోటాప్’ సేవలు
న్యూఢిల్లీ: స్టేషన్లలోని ప్రవేశద్వారాల వద్ద ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ యంత్రాల ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్‌కార్డులను రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని ఢిల్లీ మెట్రో బుధవారం నుంచి ప్రారంభించింది. ఆటోటాప్‌గా పిలిచే ఈ రీచార్జి సేవలు నగరవ్యాప్తంగా 54 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వర్గాలు తెలిపాయి. ఇందర్‌లోక్- ముండ్కా కారిడార్‌లోని అన్ని స్టేషన్లు, ఛత్తర్పూర్- హుడా సిటీసెంటర్ మార్గంలోని తొమ్మిది స్టేషన్లు, లైన్ 1లోని దిల్షద్‌గార్డెన్, షహద్రా, వెల్కమ్, సీలంపూర్, శాస్త్రిపార్క్ స్టేషన్లు, లైన్ 3, 4లో కార్కర్డూమా, నిర్మాణ్‌విహార్, లక్ష్మీనగర్, ప్రగతిమైదాన్, బారాఖంబా రోడ్డు, ఆర్కే ఆశ్రమ్‌మార్గ్, జంధేవాల న్, రాజేంద్రప్లేస్ స్టేషన్లలో ఆటోటాప్ సేవలను పొందవచ్చు. డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, మరికొందరు సీనియర్ అధికారులు బారాఖంబా రోడ్డు స్టేషన్లో ఆటోటాప్ సేవలను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీళ్లు స్వయంగా తమ స్మార్ట్‌కార్డులను నూతన పద్ధతిలో రీచార్జ్ చేసుకున్నారు. ఆటోటాప్ సేవల కోసం డీఎంఆర్సీ ఐసీఐసీఐ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. రీచార్జ్ సేవలు పొందాలనుకునే ప్రయాణికులు తమ డెబిట్/క్రెడిట్‌కార్డుల నుంచి నిర్ణీత మొత్తం మినహాయించుకునేందుకు అనుమతిస్తూ ‘స్టాండిం గ్ ఇన్స్ట్రక్షన్స్ ఫారం’పై సంతకం చేయాలి. ఈ ఫారాలను స్వీకరించడానికి ఐసీఐసీఐ బ్యాంకు సికందర్పూర్, హుడాసిటీ సెంటర్, బాదర్పూర్, నెహ్రూప్లేస్, గోవింద్‌పురి, లజ్‌పత్‌నగర్, కైలాష్ కాలనీ స్టేషన్లలో తమ సిబ్బందిని నియమించింది. ఆసక్తి గల ప్రయాణికులు తమ వివరాలను మెట్రో స్టేషన్ల వినియోగదారుల సేవాకేంద్రాల్లో అందజేస్తే బ్యాంకు అధికారులు ఫోన్లో సంప్రదించి వివరాలు ఇస్తారు. బ్యాంకు ఆటోటాప్ సేవలను యాక్టివేట్ చేయడానికి వారం రోజులు పడుతుంది. ఈ సదుపాయం ఉన్న వినియోగదారుడి కార్డులో నగదు రూ.100 కంటే తగ్గితే వెంటనే రూ.200 జమవుతాయి. రాబోయే ఎనిమిది నెలల్లో అన్ని స్టేషన్లలోనూ ఈ సదుపాయాన్ని ప్రవేశపెడతామని డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి.