తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు! | Most affordable automatic cars in india details | Sakshi
Sakshi News home page

తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

Published Sun, Feb 26 2023 5:12 PM | Last Updated on Sun, Feb 26 2023 6:11 PM

Most affordable automatic cars in india details - Sakshi

హైవేలపై పోలిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో ఆటోమాటిక్ కార్లను డ్రైవ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారణంగా మార్కెట్లో ఆటోమాటిక్ కార్ల వినియోగం మునుపటి కంటే ఎక్కువగా ఉంది, ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 ఆటోమాటిక్ కార్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రెనాల్ట్ క్విడ్:

రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'క్విడ్' లాంచ్ చేసిన తరువాత విపరీతమైన అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఈ కారుకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. క్విడ్ RXT 1.0 EASY-R వేరియంట్ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి, 67 బీహెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10:

భారతీయ మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఆటోమాటిక్ కార్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకటి. ఇందులో VXI AGS మోడల్ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 65.7 బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో:

మారుతి ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన, ఎక్కువ మంది కొనుగోలు చేసే కారు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో VXI (O) AGS ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 5.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కూడా మారుతి ఆల్టో కె10 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ అందిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో:

మారుతి సుజుకి సెలెరియో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే హ్యాచ్‌బ్యాక్. సెలెరియో ఆటోమేటిక్ వెర్షన్ ప్రారంభ ధరలు రూ. 6.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1.0-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 65.7 బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్:

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా తక్కువ ధరలు లభించే బెస్ట్ ఆటోమాటిక్ కారు. దీని ప్రారంభ ధర రూ. 6.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement