ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్‌షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం.
ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment