
ప్రయాణికులు, భాగస్వాములకు మరింత మెరుగైన అనుభూతిని అందించే దిశగా తమ విమానాశ్రయాల్లో డిజిటల్ సొల్యూషన్స్‌ను విస్తృతంగా వినియోగించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ (ఏఏహెచ్‌ఎల్) తెలిపింది. డిజిటల్ వ్యూహంలో భాగంగా ఏవియో, అదానీ వన్‌యాప్, ఎయిర్‌పోర్ట్ ఇన్ ఏ బాక్స్ లాంటి స్మార్ట్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించనున్నట్లు వివరించింది.
కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోవడంలో ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, గ్రౌండ్ హ్యాండ్లర్స్, సర్వీస్ ప్రొవైడర్లకు ఏవియో సహాయపడుతుంది. మరోవైపు, ఎయిర్‌పోర్ట్ సర్వీసున్నింటినీ ఒకే చోట అందించే డిజిటల్ ప్లాట్‌ఫాం అదానీ వన్‌యాప్ ఉపయోగపడుతుంది. దేశంలో తొలిసారిగా ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యేకమైన సర్వీసులను, అదానీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రాం ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్‌పోర్ట్ ఇన్ ఏ బాక్స్ ప్లాట్‌ఫాం ప్రస్తుత కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను పటిష్టపర్చుకోవడంతో పాటు భవిష్యత్ విస్తరణ అవసరాల్లోనూ సహాయకరంగా ఉంటుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఏహెచ్‌ఎల్‌కి ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి, జైపూర్, లక్నో విమానాశ్రయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..