న్యూఢిల్లీ: అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ తాజాగా ‘ఏవియో’ డిజిటల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ల ట్రాఫిక్, బ్యాగేజ్ ఫ్లో, గేట్ల దగ్గర పట్టే వెయిటింగ్ సమయం, కన్వేయర్ బెల్టుపై బ్యాగ్‌లు మొదలైన వివరాలను రియల్–టైమ్‌లో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ (సీఐఎస్‌ఎఫ్), ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌కి ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బ్యాగేజ్ ఫ్లోను పర్యవేక్షించేందుకు ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు/మేనేజర్లు ఏవియోను ఉపయోగిస్తారు. విమానయాన రంగ సంస్థలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్లాట్‌ఫాం సహాయకరంగా ఉండగలదని సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment