Solutions
-
రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు
మనిషికి వృద్ధాప్యం అనేది గడ్డుకాలమని చాలామంది అంటుంటారు. అలాంటి కాలం త్వరలో రానుంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 25 ఏళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాల్ విసురుతున్న వృద్ధాప్య జనాభాప్రస్తుతం భారతదేశంలో వృద్ధుల సంఖ్య దాదాపు 10.40 కోట్లు (104 మిలియన్లు), ఇది 2050 నాటికి 31.90 కోట్లకు (319 మిలియన్లు) చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య దశలో శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వృద్ధులు దీర్ఘకాలం జీవించగలుగుతారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రెండున్నర దశాబ్దాల్లో వృద్ధుల సంఖ్య మూడు రెట్లుఅసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోఛామ్) నేషనల్ కౌన్సిల్ ఆన్ సీఎస్ఆర్, చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ వృద్ధులకు వారి స్వతంత్రతను కాపాడుకునేందుకు, చురుకుగా ఉండటానికి అనువైన విధానాలను అనుసరించడం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం అనేది 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక సవాళ్లలో ఒకటిగా మారింది. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వృద్ధాప్య సంరక్షణపై కార్పొరేట్ రంగం, సమాజం, ప్రభుత్వాలు క్రియాశీల సహకారం అందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.వృద్ధాప్య సమస్యలను నియంత్రించే యోగాన్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుభాష్ మంచాంద ఇదే అంశంపై మాట్లాడుతూ వృద్ధులకు వచ్చే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలను నియంత్రించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాభ్యాసం వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధులు క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సుభాష్ మంచాంద పేర్కొన్నారు.సమతుల ఆహారంతో ఆరోగ్యంఢిల్లీలోని ఎయిమ్స్‌లో గల వృద్ధాప్య క్లినిక్ మాజీ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యం కోసం, ప్రజలు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలని, తగినంతసేపు నిద్రించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
హైకావా అప్లయెన్సెస్ తో ఎక్స్పర్ట్ ఏసి సొల్యూషన్స్.. జొఇనింగ్ హాండ్స్
-
భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు స్టెల్లార్
ముంబై: థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలు అందించే స్టెల్లార్ వేల్యూ చెయిన్ సొల్యూషన్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సెవా లాజిస్టిక్స్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్‌కు చెందిన మొత్తం వాటాలను దక్కించుకోనుంది. తద్వారా భారత్‌లో తన కార్యకలాపాలను సెవా మరింతగా విస్తరించగలదని స్టెల్లార్ వెల్లడించింది. అయితే డీల్ విలువ ఎంతనేది మాత్రం తెలపలేదు. లాజిస్టిక్స్ రంగ వెటరన్ అన్షుమన్ సింగ్ 2016లో స్టెల్లార్ వేల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేశారు. డీల్‌లో భాగంగా స్టెల్లార్‌కు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 75 లక్షల చ.అ. కార్పెట్ ఏరియా గల 70కి పైగా గిడ్డంగులు, 8,000 మంది పైచిలుకు పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు సెవాలో భాగమవుతారు. అన్షుమన్ సింగ్ యథాప్రకారం సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు సెవా లాజిస్టిక్స్‌కు భారత్‌లో ప్రస్తుతం 35 నగరాల్లో 27,00,000 చ.అ. విస్తీర్ణంలో గిడ్డంగులు ఉన్నాయి. టాప్ 5 గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్యానికి స్టెల్లార్‌లో వాటాల కొనుగోలు ఉపయోగపడగలదని సెవా లాజిస్టిక్స్ సీఈవో మాథ్యూ ఫ్రైడ్‌బర్గ్ తెలిపారు. -
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
హ్యాకథాన్‌తో వ్యాపార సమస్యలకు పరిష్కారాలు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవిక సవాళ్లకు హ్యాకథాన్లతో తగు పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ కాప్సే తెలిపారు. ఇప్పటిదాకా తాము నిర్వహించిన అయిదు హ్యాకథాన్స్లో 1,100 పైచిలుకు ఐడియాలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో కస్టమర్ల ధృవీకరణను సరళతరం చేసేందుకు ఉద్దేశించిన యాప్, ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించే ట్రావెల్ యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించారు. కొన్ని ఐడియాలు .. ఒక క్లయింటుకు 1,00,000 డాలర్ల పైగా ఆదా చేసినట్లు విశాల్ చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)తో కలిసి నిర్వహించిన హ్యాకథాన్‌లో భారత్, అమెరికా, బ్రిటన్, ఫిలిప్పీన్స్, మెక్సికోలోని 3,000 మంది పైగా ఫస్ట్‌సోర్స్ ఉద్యోగులు పాల్గొన్నట్లు విశాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది క్లయింట్లతో కలిసి వీటిని నిర్వహించే యోచన ఉన్నట్లు వివరించారు. ఏటా ఆరు–ఎనిమిది హ్యాకథాన్ ఈవెంట్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐడియాలను ఆహ్వానించడం మొదలుకుని షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించే వరకు ప్రతి ఈవెంట్ సుమారు నాలుగు నుంచి ఆరు వారాల పాటు సాగుతుందని ఆయన చెప్పారు. -
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్‌గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 1980 నుండి రెట్టింపు అవుతూ వస్తుంది. 2014లో, 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 600 మిలియన్లకు పైగా స్థూలకాయులు ఉన్నారు. 2014లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 41 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 'CRAP': కు దూరంగా ఉండండి. అంటే కార్బోనేటేడ్ పానీయాలు,శుద్ధి చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. స్థూలకాయానికి దూరంగా ఉండాలంటే ఈ పదార్థాలకు కచ్చితంగా నో చెప్పాల్సిందే. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేద్దామా? అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కింగ్‌లాగా బ్రేక్ ఫాస్ట్ ఉండాలి అలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహారంతో రోజు ప్రారంభించాలి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే ఆకలి ఎక్కువై ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లే అవకాశం ఉంది. మనం ఏం తాగుతున్నాం: ఈ మధ్య కాలంలో లెమన్ టీ, గ్రీన్ టీ పై అవగాహన బాగా పెరిగింది. గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ, అల్లం టీ, తులసి, పుదీనా టీ ఇలాంటి సహజ మూలికల టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు క్రమేపీ కరుగుతాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీరుతాగడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నీరు మన శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరుస్తుంది. వంటింట్లో డైట్ మేక్-ఓవర్ : వంటగదిలో "జంక్" ఫుడ్‌ని పూర్తిగా తొలగించేద్దాం. దీనికి బదులు వంట గదిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కనిపించేలా పెట్టుకోండి. ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి. రుచికోసం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే..రుచికి రుచితోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మోర్ ఎక్సర్సైజ్: ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం చురుగ్గా ఉండటం. ఎక్కువ సేపు కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. లిఫ్ట్‌కు కాకుండా సాధ్యమైన ప్పుడల్లా మెట్లు ఎక్కడం. అలాగే మన రోజువారీ షెడ్యూల్లో సైక్లింగ్, నడక, స్కిప్కింగ్ లేదా స్విమ్మింగ్‌తోపాటు, పెంపుడు జంతువుతో షికారు చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది. మింగేయకండి.. నమలండి: తిన్నది ఎంతైనాగానీ ఆహారాన్ని బాగా నమలండి. తిన్న ప్రతిసారీ మీ పోర్షన్ పరిమాణాన్ని తగ్గించుకుంటే..తక్కువ కేలరీలు తగ్గుతాయి. ప్రతీ ముద్దా ఎంత ఎక్కువ నమిలితే అంత మంచిది. తద్వారా కేలరీల మోతాదు తగ్గుతాయి. పోషకాలు పెరుగుతాయి. ఇంటి భోజనమే అమృతం: ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వేస్ట్ అయిపోతోందనో, టేస్టీగా ఉందనో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినడం ఉత్తమం. లేదంటే ఆ తరువాత అద్దం ముందు నిలబడి, ఏం తిన్నా.. ఇక్కడికే వస్తోంది అనుకోవాలి పెరుగుతున్న నడుమును చూసి. -
సకాలంలో కాలేయాన్నికాపాడుకోండి!
మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే వృత్తుల కారణంగానైనా... లేదా మన జీవనశైలిలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన ఆల్కహాల్ తీసుకోవడం వల్లనైనా ఇటీవల ఫ్యాటీలివర్ డిసీజ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోనూ గ్రేడ్‌లో ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కేవలం మంచి ఆరోగ్యకరమైన నడవడిక, మన జీవనశైలిలో భాగంగా ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామంతో మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ కండిషన్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. కానీ అంతకు మించి దాటితే మాత్రం కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గ ఉండకపోవచ్చు. అందుకే సకాలంలోనే గుర్తించి మొదటి లేదా రెండో దశలోనే ‘ఫ్యాటీ లివర్’ను నిలువరించాలి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, దానితో వచ్చే అనర్థాలేమిటి వంటి అనేక అంశాపై అవగాహనను కలిగించేదే ఈ కథనం. ఈ మధ్యకాలంలో మన జీవనశైలిలో నగరీకరణ /పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ లు చాలా ఎక్కువగా ఉండటం, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు పెరుగుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ ఎంతమాత్రమూ లేని వృత్తులే అన్నిచోట్లా ఉన్నాయి. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్తో పాటు ఫ్యాటీలివర్ అనే కండిషన్ చాలామందిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే... మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా... మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దాంతో క్రమంగా కాలేయం కణాలు తమ సహజ గుణాన్నికోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతుంటాయి. ఇలాంటి కండిషన్‌నే ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్... దశలు... ఫ్యాటీలివర్‌లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ : ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా మాత్రమే కొవ్వు పేరుకుంటుంది. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు సైతం నశిస్తాయి. కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. మూడో దశ : ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోతుంద. పూర్తిగా కొవ్వులు నిండినట్లుగా అయిపోతుంది. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. ఇది జరగకపోతే రోగి మనుగడే అసాధ్యం అవుతుంది. కారణాలివి... ఫ్యాటీలివర్‌లో మన ప్రమేయంతో నివారించుకోగలిగే కారణాలతో పాటు మనం నివారించలేని కారణాలూ ఉంటాయి. నివారించగల కారణాలు ఉదాహరణకు మద్యం అలవాటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ కండిషన్ ఎక్కువ. మద్యం అలవాటును మానుకోవడం అన్నది మనం నివారించుకోగలిగే అంశం. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా కొంతవరకు మన చేతుల్లో ఉన్నదే. ఇక మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తీసుకోవడం కూడా మనం నివారించుకోగలిగే అంశమే. నివారించుకోలేని కారణాలు మంచి జీవనశైలి మార్గాలతో వాటిని కొంతవరకు మాత్రమే నివారించగలిగినప్పటికీ డయాబెటిస్, నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నవి మనం ప్రయత్నపూర్వకంగా నివారించలేని కారణాలు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలో మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణ అంశం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో మనం రెండో దశగా పేర్కొనే ఎన్‌ఏఎస్‌హెచ్ దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో దాదాపు 50 శాతం మందిలో డయాబెటిస్ ఉంటుంది. ఇక సిర్రోసిస్ దశకు చేరినవారిలో 95% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన ఎన్ఏఎస్హెచ్కూ, అక్కడి నుంచే మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాలలో పరిస్థితులు మొదటి దశ నుంచి నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కనిపించినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ నివారణ మార్గాలు బరువు నియంత్రించుకోండి: మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో విధిగా తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు స్కిన్ లేని చికెన్, చేపలు వంటివి తీసుకోండి. నూనెల్లో మంచినూనెకు బదులు ఆలివ్ ఆయిల్ వాడడం మేలు. పొట్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా వాడాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోండి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి. ఇందుకోసం వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి: ఆల్కహాల్‌కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. వ్యాయామం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉన్న చోట్ల ఒంటికి పని చెప్పండి. అంటే లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, కొద్దిపాటి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం మంచిది. ఫ్యాటీలివర్ డిసీజ్ లక్షణాలు ∙తొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది ఉన్నట్లు తెలుస్తుంది. ∙కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల కనిపించే పరిణామం ఇది. ఫ్యాటీలివర్ నిర్ధారణ పరీక్షలు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది. దానితోపాటు లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానితో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న సంగతీ తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ పెరుగుదలనూ పరిశీలించే పరీక్షలు చేయించాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే అది పూర్తిగా మానేయాలి. ఒకవేళ ఆల్కహాల్ లేనివారిలో కనిపిస్తే వారి జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను తప్పక అనసరించాలి. చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ∙రోగి వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో అని పరిశీలించి దానికి అనుగుణంగా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. -
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా దరఖాస్తుకు ఎన్సీఎల్టీ ఓకే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్ ప్రవేశానికి అర్హమైనదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్ఎఫ్ఎల్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద ఆర్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర బీఎస్ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్ సర్క్యూట్ (ఒక రోజులో స్టాక్ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది. -
హైదరాబాద్‌లో ఇన్నోవ్యాప్టివ్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాన్ని ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్ సర్వీస్ సెంటర్‌ను సైయింట్ చైర్మన్ బి.వి. మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ దేశీయంగా తమ వాణిజ్యాన్ని అభివృద్ధి పర్చాలని మోహన్ రెడ్డి సూచించారు. వినియోగదారులకు సేవలందించడంలో సాంకేతికత, నాణ్యత, నైపుణ్యత, విశ్వాసం, సమయ పాలన, మార్కెట్ మెళకువలు, నూతన ఆవిష్కరణలు, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్ అనే అంశాలు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్ రవండే మాట్లాడుతూ 5 మిలియన్ డాలర్లతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 150 వర్కింగ్ స్టేషన్లతో గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. త్వరలో హైదరాబాద్, బెంగుళూర్ నగరాలలో మరో మూడు మిలియన్ డాలర్ల వ్యయంతో లోకోడ్, నో– కోడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇన్నోవ్యాప్టివ్ సంస్థ ప్రస్తుతం ఆమెరికాలోని హోస్టర్‌లో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. కేంద్రం కార్యాలయంతో పాటు 16 దేశాల్లో సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ ఆపరేషన్స్ వైస్ ప్రసిడెంట్ అభిషేక్ పరకాల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమర్‌ప్రతాప్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ అమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఎక్స్టీరియర్ సొల్యూషన్స్‌లోకి అపర్ణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ అపర్ణ ఎంటర్ప్రైజెస్ అల్యూమినియం ఎక్స్టీరియర్స్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశించింది. హాంగ్‌కాంగ్ సంస్థ క్రాఫ్ట్ హాల్డింగ్స్తో కలిసి అపర్ణ క్రాఫ్ట్ ఎక్స్టీరియర్స్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేసింది. అపర్ణ క్రాఫ్ట్ బ్రాండ్‌లో అల్యూమినియం ఎక్స్టీరియర్స్ తయారీ, విక్రయం చేపడతామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఎండీ అశ్విన్ రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. జేవీలో తమ కంపెనీకి 74 శాతం వాటా ఉంటుందన్నారు. బాచుపల్లి వద్ద రూ.30 కోట్లతో తయారీ కేంద్రం నెలకొల్పామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఈడీ అపర్ణ రెడ్డి వెల్లడించారు. జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ విభాగం ద్వారా తొలి ఏడాది రూ.100 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధితో రూ.850 కోట్ల టర్నోవరు నమోదు చేయబోతోందన్నారు. -
5జీ టార్గెట్: జియో న్యూ ప్లాన్స్
సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో టెలికాం సేవల రంగంలో మరింత దూసుకుపోతోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను కొనుగోలు చేయనుంది. అమెరికాకు చెందిన రాడీసిస్‌తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది. ఓపెన్ టెలికాం సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాడిసిస్ కార్పొరేషన్ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది. 2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. రాడిసిస్‌కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్‌కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని, తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్ టీమ్ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఒరెగాన్లోని హిల్స్ బోరోలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు ఉన్నారు. ఈ డీల్ ముగిసిన తరువాత రాడిసిస్ డీలిస్ట్ కానుంది. -
సమస్యలకు సత్వర పరిష్కారం
ఆదిలాబాద్‌అర్బన్: అనునిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సత్వర పరిష్కారం చూపుతున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నా రు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని సీపీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వెళ్లినా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నారని, సమస్య చిన్నదిగా ఉన్నట్లయితే వెంటనే స్పందించి అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నామని అన్నారు. కార్యాలయంలో, గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. గ్రీవెన్స్ అర్జీలను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక విభాగం ఉన్నందున ఎక్కడ సమస్య పెండింగ్‌లో ఉంది.. ఎప్పుడు పరిష్కారం అవుతుంది.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అర్జీదారుడి సెల్‌ఫోన్‌కు సందేశం పంపిస్తున్నామని అన్నారు. అనంతరం గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఒక్కొక్కరి నుంచి అర్జీ స్వీకరిస్తూ సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. కాగా, కలెక్టరేట్ సమావేశ మందిరానికి మరమ్మతులు జరుగుతున్నందున డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం కొనసాగలేదు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి మేము కొన్నేళ్ల గ్రామంలో నివాసం ఉంటున్నాం. ఇంతవరకు సొంత ఇళ్లు, భూములు లేవు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించాలి. గుడిసెలు వేసుకొని తడకల మధ్యన జీవనం కొనసాగిస్తున్నాం. అధికారులు స్పందించి రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలి. దళిత బస్తీ కింద భూములు పంపిణీ చేయాలి. – చప్రాల గ్రామ మహిళలు, మం : బేల తాగునీటి సౌకర్యం కల్పించాలి మాది ఆదిలాబాద్ మండలం వాన్వాట్ గ్రామ పంచాయతీ పరిధి మాంగ్లీ గ్రామం. మా గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇప్పటికే చెలిమెలు, బావిలోని నీరును తాగుతున్నాం. అవి కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మళ్లీ తాగునీరు దొరకడం కష్టంగా మారుతుంది. గ్రామంలో మొత్తం 15 కుటుంబాలు నివాసం ఉంటాయి. చెలిమె నీరు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. రోడ్డు, పాఠశాల, అంగన్వాడీ సౌకర్యాలు కల్పించాలి. – మాంగ్లీ గ్రామస్తులు, మం : ఆదిలాబాద్ తాగునీటికి ఇబ్బందులు మాది మండలంలోని టెంబీ గ్రామ పంచాయతీ పరిధి హర్కాయి, బీమ్లానాయక్ తండా గ్రామాలు. కొన్నేళ్ల నుంచి వేసవి వచ్చిందంటే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఐదు కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై తెచ్చుకుంటున్నాం. గేదెలు, మేకలు, ఆవులు, పశువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. పక్కనే ఉన్న అనంతపూర్ గ్రామంలో తాగునీరు ఎక్కువగా ఉంది. పైపుల ద్వారా ఆ గ్రామం నుంచి సరఫరా చేయాలి. – హర్కాయి, భీమ్లానాయక్తండా, మం: బజార్హత్నూర్ -
పసుపు తవ్వే పరికరం ఇదిగో..!
తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం. బెడ్ పద్ధతికి అనువుగా నూతన పరికరం.. ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు. పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు. రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం.. పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం. – ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను.. ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను. – నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, సాక్షి -
సమస్యల పరిష్కారానికి కృషి
∙ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ అరుణకుమారి శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాకుళం ఆర్టీసీ రెండో డిపో మేజనేజర్ నంబాళ్ల అరుణకుమారి అన్నారు. డిపో పరిధిలో ఆ డిపో మేనేజర్ నంబాళ్ల అరుణకుమారి బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి నాలుగు వినతులు వచ్చాయి. బందరువానిపేటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన డి.శ్రీనివాసరావు అనే వ్యక్తి కోరగా ఈ రూట్ శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలోకి వస్తుందని, ఆ డిపో డీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళతానని ఆమె చెప్పారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నడిపే కృష్ణా పుష్కరాల ప్రత్యేక బస్సులను నగరంలోని గుజరాతిపేట వద్దనున్న లక్ష్మీటాకీస్ మీదుగా నడపాలని ఆ ప్రాంతానికి చెందిన యజ్ఞేశ్వరరావు కోరారు. దీనిపై డీఎం అరుణకుమారి స్పందిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున పోలీసుల వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి డే అండ్ నైట్ కూడలి, కొత్తబ్రిడ్జి మీదుగా నడుపుతున్నామని చెప్పారు. బత్తిలి రూట్లో ప్రయాణికులు చెయ్యెత్తినచోట నిలుపుదల చేయడం లేదని సంతోష్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. దీనికి సమాధానంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఆపాలని సిబ్బంది ఆదేశించామన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణానికి వెళ్లేందుకు సాయంత్రం 5గంటల సమయంలో నాన్‌స్టాప్ బస్సు నడపాలని వెంకటరామిరెడ్డి అనే ప్రయాణికుడు కోరారు. దీనికి స్పందించిన డీఎం అరుణకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళం–విశాఖ రూట్ శ్రీకాకుళం ఒకటో డిపో పరిధికి వస్తుందని, ఈ విషయాన్ని ఒకటవ డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. -
బాధితులకు సృజనాత్మక సహాయం!
మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. తమిళనాడులో వర్షం, వరద బాధితులను జనం ఆదుకుంటున్న తీరు చూస్తే సరిగ్గా అదే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతి త్వరగా బాధితులను ఎలా ఆదుకోవచ్చన్న విషయాన్ని ఆలోచించి ఆ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కొందరు డబ్బు, ఆహారం వంటివి అందిస్తుంటే...మరి కొందరు ఉడతాభక్తిగా తమ సృజనను ఉపయోగించి, స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. వరద ముప్పు నుంచి బాధితులను ఒడ్డున పడేయడమే కాక... సౌకర్యాలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇళ్ళలోసైతం నీరు చేరిన పరిస్థితుల్లో వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు పడవలను అందుబాటులోకి తెచ్చినా... అవి లేని ప్రాంతాల్లో స్థానికంగా, సులభంగా దొరికే డ్రమ్ములు, వెదురు కర్రలను వినియోగించి కొందరు సాయపడుతున్నారు. ఇళ్లు కూలి ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోడానికి వారికి వెదురుతో గుడిసెలు కట్టి పునరావాసం కల్పిస్తున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డవారికి 'సేలం సిటిజెన్స్ ఫోరమ్' ఈ వెదురు ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. 96 చదరపు అడుగుల వైశాల్యం, సోలార్ లైట్లతో నిర్మించే ఈ ఇంట్లో నలుగురు నివాసం ఉండొచ్చు. అలాగే కరెంటు అందుబాటులో లేని ప్రదేశాల్లో.. ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఛార్జింగ్ చేసేందుకు కొందరు తమ సృజనను వినియోగిస్తున్నారు. సిల్వర్ నాణేలు, బ్యాటరీలు అందుబాటులోకి తెచ్చి మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారు. అలాగే చీకట్లో దీపాలుగా కొవ్వొత్తులకు బదులు క్రేయాన్స్ స్టిక్స్ ను అందిస్తున్నారు. ఇవి కనీసం ఇరవై నిమిషాలపాటు నిలకడగా వెలగడంతో బాధితులకు తక్షణ అవసరం తీరుతోంది. మరోవైపు వరద కారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఔషధ మూలికలు, ఆకులతో తయారుచేసిన సిద్ధ వైద్యానికి సంబంధించిన నీలవెంబు కషాయాన్నిబాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక బ్యాంకుల్లో బ్యాలెన్సులున్నా డబ్బు తీసుకునేందుకు ఏటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న వారి కోసం కొన్ని బ్యాంకులు మొబైల్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ అవసరానికి డబ్బును అందిస్తున్నాయి. -
తాగునీటి సమస్యను పరిష్కరిద్దాం
ఇబ్బందులున్న గ్రామాల వారీగా నివేదికలు ఇవ్వండి సాక్షి, రంగారెడ్డి జిల్లా : యుద్ధప్రాతిపదికన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రఘునందన్‌రావు మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల వివరాలను తక్షణమే సమర్పించాలని స్పష్టం చేశారు. గ్రామాల వివరాలను సమర్పించిన వెంటనే నివారణ చర్యలు చేపడతామని, ఈ మేరకు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు తాగునీటి సరఫరాకు పరిష్కారం చూపుతామని చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, లబ్ధిదారులకు ఫలితాన్ని అందించడంలో ఇబ్బందులుంటే వెంటనే ప్రత్యేకాధికారులు జోక్యం చేసుకుని తగిన సూచనలివ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ జనాభా రిజిస్టర్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రత్యేకాధికారులకు సూచించారు. కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. ప్రీమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి దరఖాస్తుల అప్లోడ్పై శ్రద్ధ తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 33 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించినందున అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
కెమెరాలు పరిష్కారమా?
రోగుల బంధువుల నుంచి తమకు రక్షణ కావాలని, ఆస్ప త్రులలో సీసీ కెమెరాలను పెట్టాలని ఇటీవలి కాలంలో డాక్టర్లు మొత్తుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు తమ షాపుల్లో వీటిని వాడుతున్నారు. కానీ ఆ పేరుతో మనం సీసీ కెమెరాల నిర్బంధంలో ఉన్నామనే విషయం చాలామందికి తెలీదు. జనం రహస్యాలు, దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్న ట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆస్పత్రుల యాజమాన్యాలు, కొందరు డాక్టర్లు మాత్రం ఈ మాటలను తమకు ఆసరాగా చేసుకుంటున్నారు. రోగి కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై వారు దృష్టి పెడుతున్నారు. అందరు డాక్టర్లు కాకపోయినా ఎక్కువ మంది డాక్టర్లు మాత్రం రోగి దగ్గర ఎలా డబ్బులు లాగాలి అనే సీసీ కెమెరాలను వాడుతున్నారు. అసలే ప్రాణం బాగులేని సమయంలో హాస్పిటల్‌కు వెళతారు. అప్పు డు రోగి కుటుంబ సభ్యులు, బంధువులు మానసికాందోళనతో ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసు కుంటున్నారు. సామాన్య ప్రజలకు జరుగుతున్న ఈ అన్యా యాన్ని అరికట్టాలి. వైద్యసేవలో ఉండవలసిన నైతిక ధర్మాన్ని అందరూ పాటించేలా చూడాలి. తలారి సుధాకర్ కోహెడ, కరీంనగర్ జిల్లా -
జన చైతన్య భూమిక
రేపు ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’ ‘ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ... పరిష్కారాలు సూచించేదే ఆధునిక వీధి నాటకం...’ అంటూ తనదైన శైలిలో వీధి నాటకాలను సామాన్యుల మధ్యకు తీసుకెళ్లిన కళాకారుడు సఫ్దర్ హష్మీ. 1989 జనవరి 1న ఢిల్లీ సమీపంలో ‘హల్లాబోల్’ వీధినాటికను ప్రదర్శిస్తుండగా సఫ్దర్ హష్మీ హత్యకు గురయ్యారు. దేశంలోని ప్రజా కళాకారులంతా ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఆధునిక వీధి నాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కళాకారుడికి నివాళిగా సఫ్దర్ హష్మీ పుట్టినరోజైన ఏప్రిల్ 12న ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’ జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా వీధి నాటకంపై పరిశోధన చేసి ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగస్థల, కళల శాఖాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డిని పలకరిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘‘ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చడానికి వీధి నాటకానికి మించిన ఆయుధం మరొకటి లేదు. ప్రజల్ని ఆలోచింప చేస్తుంది. ఉత్సాహపరుస్తుంది. విజ్ఞానాన్ని ఇస్తుంది. కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు, కవులు, పండితుల దగ్గరికి వెళ్లి కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవారు. అంటే కళాకారులే ప్రేక్షకుల దగ్గరికి వెళ్లడమన్నమాట. తర్వాత ఆడిటోరియం నాటక ప్రదర్శనలు వచ్చాక ప్రేక్షకులే ప్రదర్శనల దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆధునిక వీధి నాటకం ప్రజల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లడం మొదలుపెట్టింది. ఎక్కడ ప్రజలుంటే అక్కడే వేదిక. బస్ స్టాండుల దగ్గర మొదలుపెడితే... పదిమంది గుమిగూడిన ప్రతి ప్రదేశమూ వీధి నాటకానికి వేదికే. మనదేశంలో వీధి నాటకాలకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘బాదల్ సర్కార్’ ఆద్యుడని చెప్పేవారు. అప్పట్లో ఉద్యమాలకూ, అణచివేతపై తిరుగుబాటుకూ వీధి నాటకం ఓ ఆయుధం. ప్రజల్ని చైతన్యపరచడానికి దీన్నో బ్రహ్మాస్త్రంలా ప్రయోగించేవారు. నేను చేసిన పరిశోధనలో మన రాష్ట్రానికి చెందిన తిరునగరి రామాంజనేయులు మొదటిసారి ఆధునిక వీధి నాటకాన్ని పదర్శించినట్టు తేలింది. ‘వెట్టి చాకిరి’తో... 1948లో తెలంగాణా స్వాతంత్య్ర పోరాట ఉద్యమకాలంలో అప్పటి గ్రామీణ సమాజంలో వెట్టిచాకిరీ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, అమీనా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ గ్రామ సేవకుడి కథను రామాంజనేయులు ‘వెట్టిచాకిరీ’గా ప్రదర్శించారు. ఈ వీధి నాటిక ఒక్క ఖమ్మం జిల్లాలోనే వందసార్లకు పైగా ప్రదర్శించబడిందట. అలాగే మన రాష్ట్రం అత్యధిక వీధి నాటకాలు ప్రదర్శించిన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. వీధి నాటకం... వేదికలు, మేకప్‌లు, హంగూ ఆర్భాటమేమీ అక్కర్లేని ప్రసారమాధ్యమం. పైగా స్పందన కూడా వెంటనే ఉంటుంది. చైతన్యానికి చేయూత ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వీధి నాటక కళకు ఆదరణ మధ్యలో కొంత తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. మన రాష్ట్రంలో చాలా స్వచ్ఛంద సంస్థలు మా రంగస్థల విద్యార్థులతో అవగాహన నాటికలు వేయించుకున్నారు. ఎయిడ్స్, నిరక్షరాస్యత, బాలకార్మికులు, భ్రూణహత్యలు, వరకట్నాలు, మూఢనమ్మకాలు... ఇలా చాలా అంశాలపై వీధి నాటకాలు వేయించి ప్రజల్లో అవగాహన తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. నా వరకూ అయితే ఇలాంటి వీధి నాటకాల్ని ఉచితంగానే ప్రదర్శన చేయిస్తున్నాను. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కూడా తమ పథకాలను ప్రజలకు తెలియజెప్పడానికి వీధి నాటకాలను నమ్ముకుంటున్నారు. టీవీలు, రేడియోలు, సెల్ఫోన్లు... ఆధునిక పరికరాలేవీ చేయలేని పని వీధి నాటకం చేసిపెడుతుందన్నది వారి నమ్మకం. అదే నిజం కూడా. పాఠ్యాంశాల్లో చేర్చాలి... నాటకాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో లేని మరో ప్రత్యేకత మన రాష్ట్రానికి ఉంది. మన రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో రంగస్థల కళల శాఖ ఉంది. ఎన్నుంటే ఏం లాభం... నాటక రంగంపై ప్రేక్షకులకు అభిమానం తగ్గుతోంది. వారి మనసులో ప్రదర్శనలకు ఉన్న చోటు వారి పిల్లలను రంగస్థలానికి పంపడంవైపు ఉండడం లేదు. విదేశాలలో అయితే పాఠశాల పుస్తకాల్లో రంగస్థల నాటక అంశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి విద్యార్థీ గొప్ప కళాకారుడు కావాలని వారి ఉద్దేశం కాదు. నటనను బోధించడం వల్ల హావభావాల్లో, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడంలో ప్రతి విద్యార్థీ నిష్ణాతుడు అవుతాడు. కనీసం దీనికోసమైనా మన పాఠ్యపుస్తకాల్లో కళకు చోటు కల్పిస్తే ఆసక్తి ఉన్నవారు కళాకారులుగా మారతారు, లేనివారు మంచి వ్యక్తిగా ఎదుగుతారు. ఈ మధ్యకాలంలో చాలాచోట్ల వీధినాటకాల్లో యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అనిపిస్తుంది...వీధి నాటకానికి మళ్లీ పూర్వపు వైభోగం వస్తుందని! - భువనేశ్వరి మహిళలంతాచితక్కొట్టారు తనికెళ్ల భరణిగారు రాసిన ‘గో గ్రహణం’ నాటకాన్ని మేం మహరాష్ట్రలోని నాగపూర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అందులో ఓ భర్త పాత్ర తన భార్యను కొట్టే సన్నివేశం ఉంది. నేను భర్త పాత్ర పోషించాను. ఆ దృశ్యం చూసిన మహిళలు ఒక్కసారిగా మీదకొచ్చి నన్ను చితక్కొట్టారు. ‘ఇది నాటకం...’ అంటూ ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే... అంత త్వరగా ప్రేక్షకుల మదిని తాకే శక్తి ఒక్క వీధి నాటకానికే ఉంటుంది. - ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డి రంగస్థల కళల శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
రెండో రోజూ సందడిగా ట్రావెల్ మీట్
సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి : రాష్ట్రంలోనే తొలిసారి నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రావెల్‌మీట్ రెండవరోజూ సందడిగా కొనసాగింది. బేగంపేట పర్యాటకభవన్‌లో నిర్వహిస్తున్న ఈ మీట్లో భాగంగా ఉదయం హెరిటేజ్ టూరిజం ప్రమోషన్-బాటిల్‌నెక్, సొల్యూషన్స్ అనే అంశంపై పర్యాటక రంగ ప్రముఖులు ఎస్.కె.మిశ్రా, జి.కిషన్‌రావు, నరేంద్రలూథర్, వినోద్ డేనియల్ తదితరులు మాట్లాడారు. రెండో సెషన్లో లగ్జరీ, లీజర్, లైఫ్‌స్టైల్ టూరిజం అనే అంశంపై సుభాష్ గోయల్, గిరీష్ సెహగల్, అకేష్ భట్నాగర్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ప్రదర్శనను ప్రారంభించారు. మధ్యాహ్నం సెషన్లలో పాకశాస్త్ర ప్రావీణ్యం-స్థానిక ఆహారం అనే అంశంపై సంబంధిత రంగ ప్రముఖులు బి.ఆర్.రావు, చలపతిరావులతో పాటుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆలమ్‌లు మాట్లాడారు. అనంతరం సినిమా పర్యాటకం, స్థానిక ప్రాంతాల అభివృధ్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనిలో సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డీవోటీ జాయింట్డెరైక్టర్ బాలసుబ్రమణ్యారెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జీఎన్రావులు పాల్గొని మాట్లాడారు.