![Ceva Logistics to acquire majority stake in third party logistics services provider Stellar Value Chain Solutions - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/22/stellar-value-chain-solutions.jpg.webp?itok=UK4JuVBY)
ముంబై: థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలు అందించే స్టెల్లార్ వేల్యూ చెయిన్ సొల్యూషన్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సెవా లాజిస్టిక్స్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్‌కు చెందిన మొత్తం వాటాలను దక్కించుకోనుంది. తద్వారా భారత్‌లో తన కార్యకలాపాలను సెవా మరింతగా విస్తరించగలదని స్టెల్లార్ వెల్లడించింది. అయితే డీల్ విలువ ఎంతనేది మాత్రం తెలపలేదు.
లాజిస్టిక్స్ రంగ వెటరన్ అన్షుమన్ సింగ్ 2016లో స్టెల్లార్ వేల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేశారు. డీల్‌లో భాగంగా స్టెల్లార్‌కు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 75 లక్షల చ.అ. కార్పెట్ ఏరియా గల 70కి పైగా గిడ్డంగులు, 8,000 మంది పైచిలుకు పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు సెవాలో భాగమవుతారు.
అన్షుమన్ సింగ్ యథాప్రకారం సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు సెవా లాజిస్టిక్స్‌కు భారత్‌లో ప్రస్తుతం 35 నగరాల్లో 27,00,000 చ.అ. విస్తీర్ణంలో గిడ్డంగులు ఉన్నాయి. టాప్ 5 గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్యానికి స్టెల్లార్‌లో వాటాల కొనుగోలు ఉపయోగపడగలదని సెవా లాజిస్టిక్స్ సీఈవో మాథ్యూ ఫ్రైడ్‌బర్గ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment