
ముంబై: హర్యానాలోని జజ్జర్ లాజిస్టిక్స్ పార్క్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించనున్నట్లు ట్రాన్సిండియా రియల్టీ తాజాగా పేర్కొంది. సరుకు రవాణా దిగ్గజం ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌తో విడివడిన తదుపరి ట్రాన్సిండియా వాటా విక్రయ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా లాజిస్టిక్స్ పార్క్‌ను రూ. 625 కోట్లకు విక్రయించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇతర పార్క్‌లలోనూ 10 శాతం వాటా విక్రయానికి సైతం ఇతర సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది.
ఇందుకు రూ. 60 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకోనున్నట్లు వెల్లడించింది. వెరసి అన్ని రకాల చెల్లింపుల తదుపరి రూ. 400 కోట్లకుపైగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను కంపెనీ వృద్ధి ప్రణాళికలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ గతంలో ట్రాన్సిండియా రియల్టీ అండ్ లాజిస్టిక్స్ పార్క్స్ లిమిటెడ్‌గా కార్యకలాపాలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment