dealer ship
-
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
కియాలో డీలర్షిప్ ఇస్తామంటూ మోసం
హిమాయత్‌నగర్: ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్షిప్ నీదేనంటూ గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్షిప్ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఏ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రమణకుమార్ కియా కార్ల డీలర్షిప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. దీంతో ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను కియా కంపెనీకి సంబంధించిన వ్యక్తినని తెలిపాడు. ఇండియా డీలర్షిప్ ఇస్తామంటూ నమ్మించాడు. పలు డాక్యుమెంట్స్ తదితర ఖర్చులంటూ రూ.11లక్షలు దోచుకున్నారు. డీలర్షిప్ ఆలస్యం కావడంతో ఇదంతా బోగస్ అని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.25 లక్షలు స్వాహా.. క్రిప్టో కరెన్సీలో లాభాలు ఇస్తామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన గుంజన్‌శర్మ క్రిప్టోకరెన్సీలో బినాన్స్ కొనుగోలు చేసి వాటిని జీడీఎక్స్ అనే యాప్‌లో పెట్టుబడిగా రూ.25లక్షలు పెట్టాడు. ఆ మొత్తానికి లాభాలు చూపిస్తున్నారే కానీ డబ్బు డ్రా చేసేందుకు ఇవ్వట్లేదు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్ ) -
ఈశ్వరయ్యా... ఇదేందయ్యా..!
ఒంటిమిట్ట: ఆయన పేరు ఈశ్వరయ్య. ఉద్యోగం.. మండల తహశీల్దార్. ఆయనకు అధికార పార్టీపై ఎందుకో అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. సదా మీ సేవలో అంటూ వారి ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడమే విధిగా పెట్టుకున్నట్లున్నారు. అందుకే.. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే తడవు. మండలంలోని పలువురు చౌక దుకాణ డీలర్లను కార్యాలయానికి పిలిపించి ‘మీ పైన ఫిర్యాదులు వస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోండి.. మీకే మంచిది.. లేదంటే డీలర్షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదేంటి ఇన్నేళ్లుగా లేని సమస్య ఇప్పుడేం వచ్చిందబ్బా అంటూ డీలర్లు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కొత్తమాధవరం గ్రామ డీలర్ నాగమురళిని పిలిపించి రాజీనామా చెయ్.. నీకే మంచిదంటూ బెదిరింపు ధోరణిలో సూచించారు. ‘అధికార పార్టీ నాయకుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ డీలర్‌షిప్పులను కొనసాగిస్తే నాకు తలనొప్పులు తప్పవు. ఎందుకొచ్చిన సమస్య.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైదొలగండి అని సదరు తహశీల్దార్ డీలర్లకు ఉచిత సలహా ఇస్తున్నారు. స్టాకు కోసం డీడీ తీసి ఉంటే డీడీలను వెనక్కు తీసుకోండ ని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తాము ఓట్లు వేశామనే అక్కసుతోనే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తహశీల్దార్ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసేలా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నా : తహశీల్దార్ ఈ విషయంపై తహశీల్దార్ ఈశ్వరయ్యను వివరణ కోరగా తనకు కొంత మంది డీలర్లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందువల్ల వారిని పిలిపించి డీలర్‌షిప్‌లు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు చూపించండని కోరగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు. -
మాకే కావాలి..!
బద్వేలు అర్బన్: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది నియోజకవర్గంలోని చౌకదుకాణాల డీలర్ల పరిస్థితి. అధికారంలోకి వచ్చిరాగానే తెలుగుతమ్ముళ్లు డీలర్‌షిప్‌లపై కన్నేశారు. ముందుగా ఇన్చార్జిల కింద కొనసాగుతున్న చౌకదుకాణాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయా మండలాల తహశీల్లార్లకు ఫోన్లు చేసి చౌకదుకాణాల వివరాలను తెలుసుకుంటున్నారు. జరుగుతున్న విషయాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం155 చౌకదుకాణాలు ఉన్నాయి. ఇందులో 116 దుకాణాలకు రెగ్యులర్ డీలర్లు ఉండగా 39 ఇన్చార్జిల కింద నడుస్తున్నాయి. వీటిలో 39 చౌకదుకాణాలను కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్నారు అధికారులపై ఒత్తిళ్లు నియోజకవర్గంలో ఇన్చార్జి డీలర్లతో కొనసాగుతున్న చౌకదుకాణాలను తెలుగుతమ్ముళ్లకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బద్వేలు మండలంలో 10, గోపవరంలో 8, పోరుమామిళ్లలో 3, కలసపాడులో 2, కాశినాయనలో 5, అట్లూరులో 8, బి.కోడూరులో 3 చౌకదుకాణాలు ఇన్చార్జి డీలర్ల నిర్వహణలో ఉన్నాయి. వీరిని తొలగించేందుకు ముఖ్య నేతల ద్వారా అధికారులపై తెలుగుతమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన కొందరు ఇన్చార్జి డీలర్లు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ డీలర్లపైనా కన్ను ప్రస్తుతం ఇన్చార్జి డీలర్లపై దృష్టి పెట్టిన తెలుగుతమ్ముళ్లు రెగ్యులర్ డీలర్లకు కూడా ముహూర్తం పెడుతున్నట్లు సమాచారం. ఏదో ఒక సాకు చూపి డీలర్‌షిప్‌ను తొలగించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. డీలర్‌షిప్‌ల వ్యవహారంలో తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేం దుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు.