ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. కార్లు, బైకులు లెక్కకు మించి లాంచ్ అవుతూనే ఉన్నాయి. విదేశీ కంపెనీలు సైతం ఇండియన్ మార్కెట్లో వాహనాలను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ఈ కంపెనీలు దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.
దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి ఇండియా తిరుగులేని కంపెనీగా అవతరించింది. దేశీయ అమ్మకాల్లో మాత్రమే కాకుండా ఈ కంపెనీ లెక్కకు మించిన వాహనాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. దీంతో కంపెనీ ఎగుమతుల్లో కూడా అగ్రగామిగా నిలిచింది.
ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సమాచారం ప్రకారం.. భారతదేశం నుంచి కార్ల ఎగుమతులు సంవత్సరానికి 14.48 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగాయి.
కార్ల ఎగుమతుల్లో మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో నిలువగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కంపెనీలు ఎగుమతి చేసిన కార్ల సంఖ్య
➼మారుతి సుజుకి ఇండియా: 93,858 యూనిట్లు
➼హ్యుందాయ్ మోటార్ ఇండియా:- 58,150 యూనిట్లు
➼ఫోక్స్‌వ్యాగన్ ఇండియా: 26,553 యూనిట్లు
➼హోండా కార్స్ ఇండియా: 20,719 యూనిట్లు
➼నిస్సాన్ మోటార్ ఇండియా: 17,182 యూనిట్లు
Comments
Please login to add a commentAdd a comment