export
-
హ్యుండై ఎగుమతులు 37 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుండై మోటార్ ఇండియా 37 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను భారత్ నుంచి ఎగుమతి చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశం నుంచి 1999లో కంపెనీ ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 60 దేశాలకు వివిధ మోడళ్ల కార్లను సరఫరా చేస్తోంది. 2024లో సంస్థకు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతిపెద్ద ఎగుమతి మార్కెట్లుగా అవతరించాయి. గత ఏడాది హ్యుండై 1,58,686 యూనిట్లు ఎగుమతి చేసి భారత్‌లో ప్యాసింజర్ వెహికిల్స్‌కు అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. ఇక మన దేశం నుంచి హ్యుండై కార్లకు అతిపెద్ద దిగుమతిదారుగా ఆఫ్రికా తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షలకుపైగా వాహనాలను ఆఫ్రికా అందుకుంది. తొలి స్థానంలో ఐ10..గడిచిన 25 ఏళ్లలో భారత్ నుంచి 150కిపైగా దేశాలకు వాహనాలను సరఫరా చేసినట్టు హ్యుండై తెలిపింది. తమిళనాడులో కంపెనీకి తయారీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఐ10 మోడల్ ఫ్యామిలీ 15 లక్షల యూనిట్లను దాటి టాప్–1లో నిలిచింది. వెర్నా సిరీస్‌లో 5,00,000 యూనిట్లు నమోదయ్యాయి. దక్షిణ కొరియా వెలుపల హ్యుండై అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ను నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని హ్యుండై మోటార్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు ఎక్స్టర్ మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించామని, అక్కడి మార్కెట్లో భారత్‌లో తయారు చేసిన ఎనిమిదవ వాహనంగా ఈ మోడల్ గుర్తింపు పొందిందని చెప్పారు. -
దేశంలో తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్.. త్వరలో కార్యకలాపాలు
దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్ఎల్, లెక్స్షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. -
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఇది కదా ఇప్పుడు కావాల్సింది: ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే..
జీవితానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో.. ఆర్ధిక అంశాల్లోనూ అంతే పద్ధతిగా ఉండకపోతే కొంపలారిపోతాయి, అన్నది తోసిపుచ్చలేని వాస్తవం. మన జీవితంలో ఆర్ధికం, ఆరోగ్యం.. అత్యంత ప్రాధాన్యాంశాలు. డబ్బుండి ఆరోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోయినా ఆ వ్యక్తి జీవితం లేదా కుటుంబం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికీ ఆర్ధిక క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. చాలామంది చేతులు కాలాక మేలుకుంటారు. అప్పటికి వారి జీవితం నిండా మునిగిపోయి ఉంటుంది.. ఈ పరిస్థితి రాకుండా మొదటినుంచీ మెలకువతో వ్యవహరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.22 -24 ఏళ్ల వయసులో సంపాదనలో పడేటప్పుడే మనం భవిష్యత్ అవసరాలను మదింపు చేయగలగాలి. గతంలో మన పూర్వీకులకు ఆర్ధిక అంశాలపై అంత అవగాహన లేకపోవడం, పెద్ద పెద్ద కుటుంబాల వల్ల వచ్చింది వచ్చినట్లుగా ఖర్చుపెట్టేయడం, పెట్టుబడి మార్గాలు పెద్దగా లేకపోవడం.. ఇత్యాది అంశాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో అవరోధాలుగా నిలిచేవి. ఇప్పుడలా కాదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారం అందుబాటులోకి ఉంటోంది. అదే సమయంలో విభిన్న పెట్టుబడి మార్గాలు మన కళ్ల ముందు ఉంటున్నాయి. ఇది ఒక రకంగా వరమనే చెప్పొచ్చు. కానీ ఎంతమంది వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రధాన ప్రశ్న.ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది.. అన్న విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను.రాహుల్ వయసు 24 ఏళ్ళు. అతనో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెల జీతం రూ. 50,000. అందులోంచి రూ. 10,000 ఊళ్ళో ఉండే తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటాడు. అతనుండే సిటీలో రూము అద్దె, కరెంటు బిల్, తిండి ఖర్చులు, సాదరు, రవాణా ఖర్చులకు దాదాపు రూ. 20,000 దాకా అవుతుంది. మిగిలిన సొమ్ములో రూ. 10,000 వరకు హెల్త్ ఇన్సూరెన్సు(తనకు, తల్లిదండ్రులకు), డిపాజిట్లు, పెట్టుబడుల కోసం కేటాయించాడు. మిగతా రూ.10,000 ను పొదుపు చేస్తాడు. ఇదీ అతని నెలవారీ ప్రణాళిక.పొదుపు ద్వారా ఏడాదికి రూ.1,20,000 దాచుకోగలిగాడు. మరోపక్క డిపాజిట్లు, పెట్టుబడుల ద్వారా రూ. ఏడాదికి 1,50,000 దాకా కూడబెట్టాడు. ఏడాది మొత్తానికి అతను రూ.2,70,000 వెనకేయగలిగాడు. ఇందులోంచి అత్యవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కోసం ఏడాది మొత్తం మీద ఇంకో 70,000 ఖర్చు చేశాడు అనుకుందాం. నికరంగా అతని దగ్గర ఏడాది తిరిగేసరికి కనీసం రూ. 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడతను కాస్త పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చాడు.ఈ మొత్తాన్ని అనుభవజ్ఞుల సలహా, సాధకబాధకాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని రిస్కు తక్కువగా ఉండేలా చూసుకుంటూ కొంత షేర్లలోకి మరికొంత బాండ్లలోకి మళ్ళించాడు. దీనిపై వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ తన క్యాపిటల్‌కు నష్టం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ఏడాది తిరిగేసరికి ఆ రూ. 2 లక్షల మీద అతనికి రూ. 1.50 లక్షలు వచ్చాయి. ఇప్పుడతని పెట్టుబడుల్లో సొమ్ము రూ. 3.5 లక్షలు అయింది. మరోపక్క ఈ రెండేళ్లలో అతని శాలరీ ఇంకో రూ.10,000 పెరిగింది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆ పెరిగింది కాస్తా వాటికే సరిపోయేది. కాబట్టి అతని చేతికి కొత్తగా రూపాయి వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కానీ పెట్టుబడులు, పొదుపు మాత్రం క్రమం తప్పక కొనసాగిస్తూనే వచ్చాడు. ఇలా నాలుగేళ్లు గడిచాయి.శాలరీ పెరుగుతూ వస్తున్నా పెరిగే ఖర్చులు, పుట్టుకొచ్చే కొత్త అవసరాలతో అది అక్కడికి అయిపోతుంది. కానీ ఈ నాలుగేళ్లలో అతని పొదుపు 4X120000 = 4,80,000 + వడ్డీ కలిపి దాదాపు రూ.5 లక్షల దాకా జమ అయింది. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు తిరగేస్తూ రిస్క్ డోస్‌ను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చాడు. అంటే బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తూ.. షేర్లలో ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ను ఎంచుకుంటూ.. వాటి రేట్లు దిగివచ్చిన ప్రతిసారీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తద్వారా మంచి లాభాలు కళ్లజూడగలిగాడు. ఇలా మూడో ఏడాది తిరిగేసరికి తన పెట్టుబడులు రూ.6 లక్షల దాకా అయ్యాయి. మరో ఏడాది పూర్తయ్యేసరికి అవి కాస్తా రూ.12,00,000 అయ్యాయి.పొదుపు ద్వారా సమకూర్చుకున్న రూ.5 లక్షలు కలిపితే ఇప్పుడు అతని చేతిలో దాదాపు రూ.17 లక్షల దాకా ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ అన్ని లెక్కలు బేరీజు వేసుకుని రూ. 50 లక్షల రేటులో సిటీకి కాస్త దూరమే అయినప్పటికీ ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గరున్న 17 లక్షల్లో 10 లక్షలు ఇంటికోసం కేటాయించాడు. 7 లక్షలు చేతిలో ఉంచుకున్నాడు. 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. దీనిపై కాల పరిమితి ఎక్కువ పెట్టుకుని ఈఎంఐ రూ. 25,000 మించకుండా చూసుకున్నాడు.తర్వాత అతను కంపెనీ మారడంతో (ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేశాడు. మార్కెట్లో తనకున్న పొటెన్షియాలిటీ, ఉద్యోగంలో సంపాదించిన అనుభవం) శాలరీ పెరిగి దాదాపు రూ.లక్షకు చేరుకుంది. కొత్త ఉద్యోగంలో చేరితే (జాబ్ మారినప్పుడు కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని బ్యాంకులు మొత్తం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తాయి) లోన్‌కు ఇబ్బంది కావొచ్చన్న అంచనాతో జాబ్ మారడానికి ముందే చాలా తెలివిగా ఇంటి కొనుగోలుకు సిద్ధమయ్యాడు.ఇల్లు కొనడం, కొన్నాళ్లకే జాబ్ మారడం జరిగిపోయాయి. పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నాడు ఎక్కడా 'అతి' కి పోకుండా ప్లాన్‌కు తగ్గట్లే సాగుతూ వచ్చాడు. ఇంతలోనే పెళ్లి కుదిరింది. తన దగ్గరున్న సొమ్ముల్లోనే ఓ 2 లక్షలు వెచ్చించి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు.ఒక రూ.50,000 ఉద్యోగి.. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జీవితాన్ని స్థిరపరుచుకునే స్థాయికి ఎదిగాడు. ఇదంతా జరగడానికి అతను చేసిందల్లా...1. ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదు. 2. అత్యాశకు పోలేదు.3. తనకు ఉన్న దానితోనే సరిపెట్టుకున్నాడు. 4. పక్కవాళ్ళను చూసో, స్నేహితులను బట్టో అక్కర్లేని వస్తువులు కొనేయలేదు.5. లాభాలు వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేయలేదు.6. రిస్క్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప నూటికి నూరు శాతం రిస్క్ తీసుకోలేదు.7. ఆడంబరాలకు పోలేదు. మార్కెట్లో 50,000 ఖరీదు చేసే ఫోన్లు దొరుకుతున్నా తన స్థాయికి మించి 10,000-15,000 ఫోన్‌తోనే సరిపెట్టుకున్నాడు. 8. లోన్ పెట్టుకుంటే కారు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కొనేయాలని ఉబలాటపడలేదు. 9. స్థిరపడేవరకు టూర్లు, విందులు, వినోదాలు, విలాసాల జోలికి పోకూడనే నిర్ణయం తీసుకుని కచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. 10. వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలని కొనేయలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నా అతను పాటించింది మాత్రం పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ. అదే అతని జీవితాన్ని ఇప్పుడు చాలా హుందాగా నిలబెట్టింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలా చేసింది. అతను త్వరలోనే కారూ కొనుక్కోగలడు, అవసరమైతే ఖరీదైన ఫోనూ కొనగలడు. చిన్న వయసులోనే ఇంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి భవిష్యత్తులో గాడి తప్పకుండా ముందుకు సాగుతాడనే భావిద్దాం. మీరూ ఇలా చేసి చూడండి. మీ జీవితం కచ్చితంగా పూలమయం అవుతుంది. అలా కాదు.. నాకు తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యం.. అంటూ అర్ధం పర్ధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తదుపరి కథనంలో చూద్దాం. -బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు. -
త్వరలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లు
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్ఎల్, లెక్స్షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి. -
100 దేశాలు 17 కార్లు.. అగ్రరాజ్యాల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్‌ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్‌ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్‌లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది. -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
ఐఫోన్ ఎగుమతుల్లో భారత్ హవా: ఆరు నెలల్లో..
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.అమ్మకాల పరంగా యాపిల్ గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన పరిధిని భారీగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. అమెరికా.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంతో ఐఫోన్ దిగుమతులు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది.యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్ రెండూ కూడా టాటా ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలిపాయి. స్వదేశీ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. చెన్నై శివార్లలోని ఫాక్స్‌కాన్ యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలో జరుగుతున్న మొత్తం ఐఫోన్ ఎగుమతుల్లో ఇది దాదాపు సగం వాటాను కలిగి ఉంది.గత సంవత్సరం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'టిమ్ కుక్' ముంబై, న్యూఢిల్లీలోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించారు. దీంతో మన దేశంలో కూడా యాపిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో యాపిల్ మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశ యాపిల్ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.7 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించారు. -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్‌ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్‌లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడానికి 100 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టినట్లు శుక్రవారం తెలిపింది. కొత్త ఉత్పత్తి అభివృద్ధి, దేశంలో అదనపు అమ్మకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే 600 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.2026 నాటికి దేశీయంగా విక్రయాలను మూడింతలు చేయడం ద్వారా ఒక లక్ష యూనిట్లకు, అదే స్థాయిలో ఎగుమతులను చేయాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతకు అదనపు పెట్టుబడి నిదర్శనమని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. మాగ్నైట్ కొత్త వర్షన్‌ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ సైతం తయారీ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 20 మార్కెట్లకు మాగ్నైట్ ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ తయారీతో 65 మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతోందని వివరించారు. నిస్సాన్‌కు ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని టోరెస్ తెలిపారు.మూడు మోడళ్ల విడుదల..వచ్చే 30 నెలల్లో కంపెనీ మరో మూడు మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్లో రెండు మిడ్–సైజ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి ఐదు సీట్లు, ఇంకొకటి ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలన్నది ప్రణాళిక అని టోరెస్ వెల్లడించారు. ఆ సమయానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం హైబ్రిడ్, సీఎన్జీతో సహా వివిధ పవర్‌ట్రెయిన్స్‌ను కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా 32,000 యూనిట్లను విక్రయిస్తున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. 30 నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం ఉన్న ఒక శాతం నుంచి మూడు శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలు
భారతదేశంలో బియ్యం ఎగుమతుల మీద విధించిన పరిమితులను ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. 2022లో 40 శాతం లేదా 2.2 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఎగుమతి చేసింది. ఇండియా ప్రపంచంలోని దాదాపు 140 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. భారత్ తరువాత ఎక్కువ బియ్యం ఎగుమతులు చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్, వియత్నాం మొదలైనవి ఉన్నాయి.భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాల ఆహార భద్రతను తీర్చడానికి.. ఆ దేశ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతులకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేదించడమే కాకూండా.. కనీస ధరను కూడా నిర్ణయించింది. ఎగుమతికి సంబంధించిన ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే దేశంలో బియ్యం సరఫరాను పెంచడానికి 2023 జులై 20న బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. కాగా ఇప్పటికి ఆ పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
సోనాలికా చిన్న కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. నడపడం సులభం.. యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. -
'నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుంది'
భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి తయారీ రంగం కీలకమని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా భారత్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితికి చేరుకుంటుందని.. న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) 64వ సదస్సులో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఇప్పటికే భారత్ ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వేగంగా ముందుకు సాగుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఇండియా.. లిథియం అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేయగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో, అల్యూమినియం, ఐరోనిక్ ఆయిల్, వివిధ రకాల రసాయన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇది దేశంలో మంచి మార్కెట్ అని గడ్కరీ అన్నారు.కొన్ని కంపెనీలు ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా భారత్ వీటిని ఎగుమతి చేయగలదు. కరోనా మహమ్మారి సమయంలో సెమికండక్టర్ల కొరత వల్ల ఆటోమొబైల్ రంగం కొంత డీలా పడింది. ఆ తరువాత మనదేశంలోని కంపెనీలు సెమికండక్టర్లను తయారు చేయడానికి పూనుకున్నాయి. మరో రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో మనమే నెంబర్‌వన్‌గా ఉంటామని గడ్కరీ అన్నారు.దేశంలో ఈవీ మార్కెట్ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో 2030 నాటికి కోటి యూనిట్ల వార్షిక విక్రయాలు సాధ్యమవుతుంది. ఇందులో ఐదు కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. ఎగుమతులు కూడా పెరగాలని, దీనివైపుగా కంపెనీలు కృషి చేయాలని గడ్కరీ సూచించారు.ఇదీ చదవండి: హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీవాహన తయారీకి సంబంధించి మెరుగైన పరిశోధన, పరీక్షల కోసం టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం సీఐఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రూ. 450 కోట్లతో పూణేలో ప్రారంభమవుతుంది. మరోవైపు స్క్రాపేజ్ విధానానికి కంపెనీలు సహకరించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. -
ఎక్కువ కార్లను ఎగుమతి చేసిన ఐదు కంపెనీలు
ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. కార్లు, బైకులు లెక్కకు మించి లాంచ్ అవుతూనే ఉన్నాయి. విదేశీ కంపెనీలు సైతం ఇండియన్ మార్కెట్లో వాహనాలను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ఈ కంపెనీలు దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా తిరుగులేని కంపెనీగా అవతరించింది. దేశీయ అమ్మకాల్లో మాత్రమే కాకుండా ఈ కంపెనీ లెక్కకు మించిన వాహనాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. దీంతో కంపెనీ ఎగుమతుల్లో కూడా అగ్రగామిగా నిలిచింది.ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సమాచారం ప్రకారం.. భారతదేశం నుంచి కార్ల ఎగుమతులు సంవత్సరానికి 14.48 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగాయి.కార్ల ఎగుమతుల్లో మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో నిలువగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.కంపెనీలు ఎగుమతి చేసిన కార్ల సంఖ్య➼మారుతి సుజుకి ఇండియా: 93,858 యూనిట్లు➼హ్యుందాయ్ మోటార్ ఇండియా:- 58,150 యూనిట్లు➼ఫోక్స్‌వ్యాగన్ ఇండియా: 26,553 యూనిట్లు➼హోండా కార్స్ ఇండియా: 20,719 యూనిట్లు➼నిస్సాన్ మోటార్ ఇండియా: 17,182 యూనిట్లు -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డు
సాక్షి, అమరావతి: సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023–24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) చైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. ఘనీభవించిన రొయ్యలు, చేపలు అమెరికా, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వివరాలను ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. 2022–23తో పోలిస్తే ఎగుమతి పరిమాణం 2.67 శాతం పెరిగింది. 2022–23లో రూ.63,969.14 కోట్ల (8,094.31 మిలియన్ డాలర్ల) విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023–24లో రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్ డాలర్ల) విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఘనీభవించిన రొయ్యల పరిమాణం, విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. గతేడాది తీవ్రమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 7.38 బిలియన డాలర్ల విలువైన 17,81,602 టన్నుల సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా ఆల్ టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసినట్లు ఎంపెడా ప్రకటించింది. ప్రపంచస్థాయి వాణిజ్యరంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 2,549.15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా నుంచి భారత్ ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 34.53 శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత మన మత్స్య ఉత్పత్తుల దిగుమతిలో చైనా రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ ఏడాది 1,384.89 మిలియన్ డాలర్ల విలువైన 4,51,363 టన్నుల మత్స్య ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యాయి. 25.33 శాతం వృద్ధి రేటు నమోదైంది. చైనా తర్వాత స్థానాల్లో జపాన్, వియత్నం, థాయలాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలున్నాయి.రొయ్య ఎగుమతుల్లో అగ్రస్థానం అమెరికాకే ఎగుమతుల్లో 7.16 లక్షల టన్నులతో ఘనీభవించిన రొయ్యలు మొదటిస్థానంలో నిలిచాయి. వీటిద్వారా దేశానికి రూ.40,013.54 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2,97,571 టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా.. చైనాకు 1,48,483 టన్నులు, యూరోపియన్ దేశాలకు 89,697 టన్నులు, సౌత్ ఈస్ట్ ఏషియాకు 52,254 టన్నులు, జపాన్‌కు 35,906 టన్నులు, మిడిల్ ఈస్ట్ దేశాలకు 28,571 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత ఘనీభవించిన చేపలు రెండో అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వీటిద్వారా రూ. 5,509.69 కోట్ల ఆదాయం లభించింది. చేప, రొయ్యల ఆహారం, పొడి దాణా ఉత్పత్తులు ఎగుమతిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిగా నిలిచింది. వీటి ద్వారా దేశానికి రూ.3,684.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఘనీభవించిన స్క్విడ్ నాలుగో అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. దీనిద్వారా రూ.3,061.46 కోట్ల ఆదాయం లభించింది. సురిమి, సురిమి అనలాగ్స్కు చెందిన ఉత్పత్తులు ఐదోస్థానంలో నిలిచాయి. ఇవి రూ.2,414.43 కోట్ల విలువైన 1,35,327 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత రూ.2,252.63 కోట్ల విలువైన 54,316 టన్నుల ఎగుమతితో ప్రోజిన్ కాటిల్ ఫిష్ ఆరోస్థానంలో నిలిచింది. చిల్డ్ ఐటమ్స్, ఆక్టోపస్ ఎగుమతులు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. -
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుల్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్మెంట్లను కలిగి ఉంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది. -
అరటిలో ఏపీ మేటి
సాక్షి, అమరావతి: ఆంధ్ర అరటికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గ్రోత్ ఇంజన్ క్రాప్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అరటి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగులోనే కాదు.. ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల్లో కూడా అద్భుత ప్రగతిని సాధించింది. గడిచిన నాలుగేళ్లలో 1.80 లక్షల టన్నులు ఎగుమతి కాగా, ఈ ఏడాది లక్ష టన్నుల్ని ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 50 వేల టన్నులు ఎగుమతి అయ్యాయి. మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాలకే ఇప్పటివరకు ఎగుమతయ్యే అరటి ఈసారి మొట్టమొదటిసారిగా రష్యాకు కూడా ఎగుమతి అయ్యింది. ఇకపోతే అరటికి కనీస మద్దతు ధర క్వింటా రూ.800 కాగా, ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950 మధ్య పలుకుతోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న ఎరువు, కర్పూర, చక్కరకేళి, అమృతపాణి, బుడిద చక్కరకేళి, తేళ్ల చక్కరకేళి, సుగంధాలు, రస్తాలి వంటి రకాలు ఏపీలోనే సాగవుతున్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి రకం), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో 2018–19 నాటికి 1.90 లక్షల ఎకరాల్లో సాగవుతూ 50 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అరటి సాగు ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. టిష్యూ కల్చర్ ప్లాంట్ మెటీరియల్, ఫ్రూట్ కేర్ కార్యకలాపాలు, బిందు సేద్యం వంటి అధునాతన సాంకేతిక పద్ధతుల వలన ఉత్పాదకత హెక్టార్‌కు 60 టన్నులకు పైగా వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం 2023–24లో 62 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయని అంచనా వేశారు. ఫలించిన సీడీపీ ప్రాజెక్టు.. ఇక రాష్ట్రంలో అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.269.95 కోట్లతో చేపట్టిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ) సత్ఫలితాలిస్తోంది. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్–ప్రొడక్షన్) వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతరం నిర్వహణ–విలువ ఆధారిత (పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూ ఎడిషన్) కోసం రూ.74.75 కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70 కోట్లు ఖర్చుచేస్తున్నారు. నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం (ఐపీఎం), ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తోట బడుల ద్వారా 15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిచ్చారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. పీపీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన యూఏఈ, బెహ్రాన్, ఈజిప్‌్ట, సౌదీ అరేబియా, కతార్, ఇరాన్ వంటి దేశాలకు అరటి ఎగుమతి అవుతోంది. ♦ 2016–17 వరకు అరటి పంట రాష్ట్రం కూడా దాటే పరిస్థితి ఉండేది కాదు. ఆ ఏడాది తొలిసారి 246 టన్నులు ఎగుమతి చేస్తే 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులు ఎగుమతి చేశారు. ♦ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది (2019–20)లోనే రికార్డు స్థాయిలో 35వేల టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేశారు. ♦ ఆ తర్వాత వరుసగా 2020–21లో 48వేల టన్నులు, 2021–22లో 48,200 టన్నులు, 2022–23లో 49,500 టన్నులు ఎగుమతి అయ్యాయి. ♦ ఇక ఈ ఏడాది 75 వేల టన్నులను ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 50 వేల టన్నుల అరటి ఎగుమతైంది. ♦ ఈ సీజన్ ముగిసే నాటికి లక్ష టన్నులు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఒడిశా టు హైదరాబాద్.. తాజాగా పట్టుబడిన గంజాయి ‘చాక్లెట్లు’
ఖమ్మం: ఒడిశా నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించే స్మగ్లర్లకు జిల్లా రాచబాటగా మారింది. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎంత కట్టడి చేసినా.. తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నా ఎక్కడో చోట గంజాయి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇన్నాళ్లు గంజాయిని బస్తాల్లో.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాహనాల్లో ఇతర సరుకుల కింద తరలించేవారు. అనంతరం నూనెగా మార్చి కూడా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంత ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తరలిస్తుండగా ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. తాజాగా జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడగా అవాక్కవడం ఎక్సైజ్ పోలీసుల వంతు అయింది. ఒడిశా టు హైదరాబాద్.. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా గంజాయి సాగుకు పెట్టింది పేరు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అక్కడకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా తీసుకెళ్తుంటారు. తాజాగా అక్కడే గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా మహిళల చేత రవాణా చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మహిళలు ఖమ్మంలో పట్టుబడగా... తనిఖీ చేసిన అధికారులే నివ్వెరపోయారు. ఒక్కో ప్యాకెట్లో ఐదు గ్రామాల చొప్పున 40చాక్లెట్లుగా ఉండగా ఆ ప్యాకెట్‌ను రూ.90కు కొనుగోలు చేసి రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ గోల్డ్, మున్కా తదితర పేర్లతో ఈ చాక్లెట్లు ఒడిశా ప్రాంతంలోనే తయారవుతున్నట్లు తెలిసింది. చాక్లెట్లకు డిమాండ్.. గంజాయికి అలవాటు పడిన వారు పొడి కొనుగోలు చేయడం.. పీల్చడం చేస్తుంటారు. అయితే, ప్యాకెట్ల రవాణా సమయంలో తరచుగా పట్టుబడుతండడంతో అమ్మకం, కొనుగోలుదారులు చాక్లెట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఒడిశాలోని స్మగ్లర్లు గంజాయి చాక్లెట్లు తయారుచేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీటి వాడకం సులువవుతుందని, తనిఖీల్లోనూ పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక కావాల్సినప్రాంతాలకు చేరవేసి అమ్మడం సులువవుతుందని గంజాయిని చాక్లెట్ల రూపంలో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం చాక్లెట్లు పట్టుబడగా మూడు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మూడు కేజీల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. పోలీసులకు చిక్కేది కొందరే.. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారు కొందరేనని.. అది కూడా కూలీలేనని సమాచారం. అసలు సూత్రధారులు ఎక్కడా పట్టుపడకుండా తెర వెనక ఉండి దందా నడిపిస్తుంటారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో జిల్లాకు చేరుకుంటున్న పలువురు సాధారణ ప్రయాణికుల మాదిరి బస్సుల్లో వెళ్తుండగా.. ఇంకొందరు రైళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఇదే అదునుగా రద్దీగా ఉంటున్న బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసలు సూత్రధారులు దొరకనంత కాలం గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి చదవండి: కమీషన్లకు ఆశపడి.. -
ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..
దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..!
సూరత్‌లోని అత్యంత ధనవంతుడిగా ఉన్న సావ్జీ ధంజీ ధోలాకియా.. ‘ఏదీ మన చెంతకురాదు.. శోధించి.. సాధించాలి’ అని నమ్మారేమో. సులభంగా సంపద వస్తే దాన్ని నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ఆయన తన కుమారుడిని స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించారు. దాంతో ఆయన కుమారుడు ఏకంగా బేకరీలో పనిచేసేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం. రైతు కుటుంబంలో జన్మించిన సావ్జీ ధంజీ ధోలాకియా హరికృష్ట ఎక్స్‌పోర్ట్స్ పేరుతో కంపెనీ స్థాపించి వజ్రాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎగుమతి చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. సావ్జీ ధోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్‌లోని దుధాలా గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఆర్థికస్థోమత లేకపోవటంతో సావ్జీ నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత తన మామతో కలిసి సూరత్‌కు వచ్చి అక్కడే పనిచేశారు. మామయ్యకు చెందిన వజ్రాల వ్యాపారంలో సావ్జీ తన సోదరులు హిమ్మత్, తులసితో కలిసి పనిచేశారు. అలా 1992లో సావ్జీ తన ముగ్గురు సోదరులతో కలిసి హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేశారు. ముంబైలో ఎగుమతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 నాటికి కంపెనీ ఎంతో వృద్ధి సాధించింది. అప్పటికే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,500కు చేరింది. ఆ తర్వాత 2005లో 'కిస్నా' పేరుతో ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 6,250 అవుట్లెట్లతో అతిపెద్ద వజ్రాభరణాల బ్రాండ్‌గా కొనసాగుతోంది. ధోలాకియా తరచూ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు, ఫ్లాట్లు, ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అంతేకాదు కుటుంబం సావ్జీకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం గతంలో రూ.50 కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని నిర్ణయించడం విశేషం. అలాగే గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, లాఠీ తాలూకా తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగా మొక్కల్ని నాటారు. అయితే సులభంగా సంపదను పొందితే దాన్ని నిర్వహించటం వారసులకు అంత సులువు కాదు. అయితే మనుగడ కోసం మనుషులు చేసే పోరాటం గురించి తెలుసుకుంటేనే.. ప్రతి రూపాయినీ ఎలా ఖర్చు చేయాలి అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. ఇదే నియమాన్ని పాటించాలని ఆ వజ్రాల వ్యాపారి తన కుమారుడికి చెప్పారు. అయితే సంపాదన కోసం లేదా పనికోసం తన పేరును ఎక్కడా వాడకూడదని సావ్జీ కండిషన్ పెట్టారు. ఇదీ చదవండి: కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..! దాంతో సావ్జీ ధంజీ ధోలాకియా కుమారుడు ద్రవ్యను ఇంటి పేరును ఉపయోగించకుండా స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించాడు. కేవలం రూ.7 వేలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ద్రవ్య.. షూ స్టోర్, మెక్‌డొనాల్డ్స్, కాల్ సెంటర్‌తో సహా అనేక ఉద్యోగాలు చేశాడు. చివరికి ఒక బేకరీలో రోజుకు రూ.200 జీతానికి ఉద్యోగం సంపాదించాడు. కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు ద్రవ్య చెప్పాడు. అలా సదరు వ్యాపారి తన పిల్లలకు అసలైన జీవిత పాఠాలను నేర్పించారు. 27 ఏళ్ల ద్రవ్య కంపెనీనీ టేకోవర్ చేశారు. 2016 లెక్కల ప్రకారం హరికృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ రూ.12000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది. దాదాపు 71 దేశాల్లో వ్యాపారం సాగిస్తోంది. -
రూ.1000 కోట్ల డీల్ - భారత్‌లో టాటా ఐఫోన్స్ తయారీ..
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు. టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports. Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్‌ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్‌పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్‌షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్‌హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. క్షీణించిన ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జూలై–సెప్టెంబర్‌లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ 10,74,189 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 4.7 శాతం అధికం. భారత్‌లో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ టోకు విక్రయాలు 20 లక్షల మార్కును దాటడం కూడా ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే పీవీ హోల్‌సేల్స్ 19,36,804 యూనిట్ల నుంచి ఈ ఏడాది 20,70,163 యూనిట్లకు దూసుకెళ్లాయి. ద్విచక్ర వాహనాలు మినహా.. 2023–24 రెండవ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్లు, వాణిజ్య వాహనాల విభాగాలు వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు స్వల్పంగా తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూలై–సెప్టెంబర్‌లో డీలర్లకు చేరిన మొత్తం ద్విచక్ర వాహనాలు 46,73,931 యూనిట్ల నుంచి 45,98,442 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల హోల్‌సేల్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాలు 1,20,319 నుంచి 1,95,215 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 60,52,739 యూనిట్ల నుండి 61,16,091 యూనిట్లకు ఎగశాయి. పండుగ సీజన్లోకి ప్రవేశించడంతో అన్ని వాహన విభాగాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడవ త్రైమాసికంలో కూడా మెరుగ్గా ఉంటుందని సియామ్ అంచనా వేస్తోంది. ఎంట్రీ లెవెల్ బేజారు.. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ కారణంగా పీవీ విభాగంలో అమ్మకాల వృద్ధికి ఆజ్యం పోసింది. మొత్తం అమ్మకాలలో యుటిలిటీ, ఎస్యూవీ విభాగం 60 శాతం వాటాను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. 2018–19 జూలై–సెప్టెంబర్‌లో నమోదైన 1.38 లక్షల యూనిట్ల గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంట్రీ లెవల్ కార్ల హోల్‌సేల్స్ 35,000 యూనిట్లకు పడిపోయాయి. ఎంట్రీ లెవల్ టూ వీలర్ సెగ్మెంట్లోనూ ఇదే ట్రెండ్ ఉంది. గ్రామీణ డిమాండ్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం ఇందుకు కారణం. కాగా, సెప్టెంబర్ నెలలో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ గతేడాదితో పోలిస్తే 3,55,043 నుంచి 2 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 17,35,199 నుంచి 17,49,794 యూనిట్లకు, త్రీవీలర్లు 50,626 నుంచి 74,418 యూనిట్లను తాకాయి. అన్ని విభాగాల్లో కలిపి సెప్టెంబర్‌లో హోల్‌సేల్ అమ్మకాలు 20,93,286 నుంచి 21,41,208 యూనిట్లకు పెరిగాయి. క్షీణించిన ఎగుమతులు భారత్ నుంచి వాహన ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 22,11,457 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం తగ్గుదల. వివిధ దేశాలలో భౌగోళిక రాజకీయ, ద్రవ్య సంక్షోభాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అర్థ భాగంలో ఎగుమతులు క్షీణించాయని వాహన పరిశ్రమల సంఘం సియామ్ సోమవారం తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ ఎగుమతులు 5 శాతం వృద్ధితో 3,36,754 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్లు 20 శాతం తగ్గి 16,85,907 యూనిట్లు, త్రీవీలర్లు 2,12,126 నుంచి 1,55,154 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 25 శాతం పడిపోయి 31,864 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్రధానంగా రెండు కారణాల వల్ల ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్నాయని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. మొదటిది కొన్ని ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సమస్యలు, రెండవది పలు భౌగోళిక ప్రాంతాలలో ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి ఉందని చెప్పారు. రూపాయి పరంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో సహా చాలా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎగుమతులు మున్ముందు మెరుగుపడతాయని. భావిస్తున్నామని ఆయన వివరించారు. -
అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం!
గతంలో లిబియాలో సంభవించిన వరదలు, మొరాకోలో వచ్చిన భూకంపం చాలామంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారాంతం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ జలమయమైపోయాయి, ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కొన్ని వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. వర్షాలు తగ్గిన తరువాత ఇలాంటి వాహనాలను (కార్లను) ఉపయోగిస్తారా? లేదా ఎక్కడికైనా ఎగుమతి చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వరదల్లో మునిగిన కార్లను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి రిపేర్ చేసుకుని మళ్ళీ ఉపయోగిస్తారు. అది కూడా కారు ఖరీదుని బట్టి, రిపేరుకి అయ్యే ఖర్చుని బట్టి ఉంటుంది. అయితే అమెరికా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఒకసారి వరద నీళ్లలో కారు ఇంజిన్ తడిస్తే.. దాన్ని అమెరికాలో ఎవరూ ముట్టుకోరు. సాధారణంగా లగ్జరీ కార్ల ధరలు లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లు ఒక్కసారి వరద నీళ్లలో తడిచినా.. దాని విలువ దారుణంగా పడిపోతుంది. బురద నీళ్లలో ఇంజిన్ తడిస్తే.. ఎంత గొప్ప కారయినా 5 వేల డాలర్లకు మించి విలువ రాదు. ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పగించి కొత్త కార్లు తీసుకుంటారు. కార్లను వేలం ద్వారా విక్రయించడం నిజానికి అమెరికా వరదల్లో మునిగిన కార్లను.. అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్‌యార్డ్‌లు లేదా వెహికల్ రీబిల్డర్లకు సాల్వేజ్ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన కంపెనీలు.. లేదా వ్యక్తులు కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. కారు వరదల్లో మునిగితే ఇంటీరియర్ & ఇంజిన్ వంటి వాటిలో మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. కొంత మేర సీట్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అక్కడి కంపెనీలు పరిష్కరించి, వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగించి, కొంత యధా స్థితికి తీసుకువస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది. అంటే 2లక్షల డాలర్ల విలువ చేసే కార్లు కేవలం 40వేల డాలర్లకే విక్రయిస్తారన్న మాట. వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు. ఆఫ్రికాలో లాభాల పంట ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేరు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో లాభాల పంట పండినట్లే. ముఖ్యంగా కెన్యా, నైగర్, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. సాధారణంగా వరదల్లో మునిగిన కారు ఇంజిన్ కొంత మేరకు దెబ్బతింటుంది, వాహనానికి గుండెలాంటి ఇంజిన్‌లో సమస్య తలెత్తితే దాన్ని మళ్ళీ బాగుచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నపని, కావున అమెరికాలో ఇలాంటి కార్లను వెనుకాడకుండా విక్రయించేస్తారు. ఇదీ చదవండి: వేగం పెంచిన ఇండియా.. డౌన్లోడ్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా.. ఇంజిన్‌తో పాటు కార్పెట్లు, సీట్-మౌంటు స్క్రూలు, లైట్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివన్నీ సమస్యకు గురవుతాయి. అంతే కాకుండా కొన్ని రోజులకు తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే వాటిని తక్కువ ధరలను విక్రయిస్తారు. ఇక సాఫ్ట్వేర్ విషయంలోనూ ఇప్పుడు చాలా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆడి, బెంజ్, BMW, లెక్సస్, ఫోర్డ్ ఫోక్స్ వాగన్.. బ్రాండ్ ఏదైనా అందులో ఉండే సాఫ్ట్‌వేర్‌ను చైనా కంపెనీలు క్రాకర్ వర్షన్లలో అమ్ముతున్నాయి. కాబట్టి ఈ వరద కార్లు అన్ని హంగులు సమకూర్చుకుని బురదను వదిలి మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. మరి ఈ కార్లు ఇండియాకు రావా.. అనుకుంటున్నారా? మన ప్రభుత్వం ఎందుకనో ఈ డీల్స్‌కు నో చెబుతోంది. కాబట్టి ఆ అదృష్టమేదో అఫ్రికన్లకే చేరని. Consumer caution is rising as flood-damaged cars enter the used car market, often appearing in auto auctions, dealerships and classified ads. The @WisconsinBBB joined us this morning for tips on how to avoid being scammed by these vehicles: https://t.co/wN3xPmoTDR — CBS 58 News (@CBS58) October 2, 2023 -
ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపెక్సిల్ అవార్డును సొంతం చేసుకుంది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డికి లోక్‌సభాపతి ఓంబిర్లా ఈ అవార్డును అందజేశారు. అనంతరం దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో పురోగతి సాధించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ కలప ఆధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలతో పాటు బీడీ ఆకు, ఎర్రచందనం వ్యాపారం చేసే ఒక ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు. ఎకో టూరిజాన్ని కూడా కార్పొరేషన్ ప్రొత్సహిస్తోందని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సగటు ఉత్పత్తితో 35 వేల హెక్టార్లలో యూకలిప్టస్ను పెంచుతున్నట్టు చెప్పారు. 6 వేల హెక్టార్లలో జీడి మామిడి, 4 వేల హెక్టార్లలో కాఫీ, మిరియాలు, 2,500 హెక్టార్లలో వెదురు, 825 హెక్టార్లలో టేకు, 1000 హెక్టార్లలో ఇతర వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. 5,353 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి సుమారు రూ.2 వేల కోట్లు సమీకరించామని, 2023లో ఇప్పటి వరకూ రూ.218 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సాధించామని, మరో రూ.250 కోట్లు సాధించే దిశగా ముందుకెళుతున్నట్టు తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి కార్పొరేషన్ ‘త్రీస్టార్ ఎక్స్పోర్ట్ హౌస్’ హోదాను పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో, ఆయన దిశానిర్దేశంలో కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధిస్తుందని దేవేందర్‌రెడ్డి వివరించారు. -
సింగపూర్‌కు మన బియ్యం.. అనుమతిచ్చిన కేంద్రం
భారత్ - సింగపూర్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆహార అవసరాలను తీర్చేలా భారత్ నుంచి సింగపూర్‌కు బియ్యాన్ని ఎగుమతి చేసుకునేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. భారత్, సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు, ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని, ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. Our response to media queries on export of rice to Singapore:https://t.co/RfmpXV38jR pic.twitter.com/lzqbRlzesb — Arindam Bagchi (@MEAIndia) August 29, 2023 20 శాతం సుంకం ఆగస్ట్ 27న దేశీయంగా బియ్యం ధరల్ని అదుపులో ఉంచేలా ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. వరి ఉత్పత్తిపై అంచనాలు.. అప్రమత్తమైన కేంద్రం ప్రపంచంలోని బియ్యం ఎగుమతులలో భారత్ వాటా సుమారు 40 శాతం. భారత్ నుంచి సుమారు 140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. భారత్ తరువాత అత్యధికంగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో వరి పండించే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం, దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో వర్షాభావం కారణంగా ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గనుందన్న అంచనాలున్నాయి. దానివల్ల బియ్యం ధరలు పెరగకుండా ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ ‘ఆహారం, వినియోగదారుల వ్యవహారాల’ మంత్రిత్వ శాఖ జులై 20న ఉత్తర్వులు జారీచేసింది. బియ్యమో రామచంద్రా అమెరికాలో ఆసియా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. ఎక్కవగా భారత్ నుంచే అక్కడకు ఎగుమతి అవుతుంది. బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలతో అమెరికాలోని భారతీయులు అప్రమత్తయ్యారు. బియ్యమో రామచంద్రా అనుకుంటూ.. ముందుగానే బియ్యం బస్తాల్ని కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దాంతో కొన్ని సూపర్ మార్కెట్లలలో రైస్ బ్యాగ్‌లు కొద్ది నిమిషాలలోనే అమ్ముడు పోవడం, బియ్యం లభ్యం కాకపోవడంతో క్యూ లైన్లలో నిలబడి ఎదురు చూపులు చూస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, బియ్యం ఎగుమతులపై తాజాగా భారత్ ఆంక్షల సడలించడంతో సింగపూర్ ప్రజలకు ఊరట కలిగినట్లైంది. -
చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి : చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరబ్‌కు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం, జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్–ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం.. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు, అకడమిక్–రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది. ఉత్పత్తి, వినియోగం పెంపు.. అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాలయాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్ స్నాక్స్‌ను, డిపార్ట్మెంటల్ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించినట్లు కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!
బొప్పాయి సీజన్ మొదలైంది. ఒకట్రెండు కాదు సుమారు ఆరునెలల పాటు సాగే సీజన్ కావడంతో తోటల్లో సందడి మొదలైంది. ఇటు రైతుల్లో.. అటు వ్యాపారుల్లో బొప్పాయి మాటే.. రేటే వినిపిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీకి తరలించే బొప్పాయి ప్యాకింగ్ మరింత స్పెషల్‌గా ఉంటుంది. మరి అన్నమయ్య బొప్పాయి గొప్పలేంటో చూద్దామా.. అదే అదే చదివేద్దామా! అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు,మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయికి మంచి రోజులొచ్చాయి. ఇక్కడి బొప్పాయికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. సీజన్లో వ్యాపారులే తోటల దగ్గరికొచ్చి కాయలను కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ఇక్కడి రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సుమారు 876 హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు అంచనా. ఇక ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతోంది. దీంతో ఢీల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయిని తోటల వద్దే కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆరునెలల పాటు ఇక్కడే మకాం బొప్పాయి ఎగుమతులు చేయడం కోసం వ్యాపారులు, ఏజెంట్లు సుమారు ఆరునెలల పాటు ఈ ప్రాంతంలో మకాం వేస్తారు. ముంబై , రాజస్థాన్‌కు తరలించే బొప్పాయిల కంటే దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేసే కాయల కటింగ్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. చెట్ల నుంచి కాయను జాగ్రత్తగా దించుతున్న కూలి, ఎగుమతి కాయల్ని పేపర్లో చూడుతున్న కూలీలు ఈ కాయల కటింగ్, ప్యాకింగ్ కోసం బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలంతా ఒక క్రమపద్ధతిలో ప్యాకింగ్ చేస్తారు. సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. అయితే ఢిల్లీ కటింగ్‌లో తేడా ఉంటుంది. కటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరిమరీ కోస్తుంటారు. పైగా ఒక్క కాయ కూడా కింద పడకుండా చెట్టు నుంచే జాగ్రత్తగా కిందికి దించుతారు. ఇక్కడి నుంచి ఢీల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరురోజుల సమయం పడుతుంది. అప్ప టి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయ డం కూలీల ప్రత్యేకత. ఈ సీజన్లో వందలాది మంది కూలీలు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతుండడం విశేషం. డిల్లీలో భలే డిమాండ్ ఢిల్లీలో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.26వరకు ధరలు పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. అక్కడ బొప్పాయిని ఎక్కువగా బేకరీ ఐటం, హల్వా తయారీలో ఎక్కువగా వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు. లారీ లోపల నలువైపుల ఎండుగడ్డి నింపి బొప్పాయి లోడింగ్ చేస్తున్న దృశ్యం ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ధరలు.. నిన్నామొన్నటి వరకు బొప్పాయికి సరైన ధరలు లేక రైతులు డీలా పడ్డారు. ప్రస్తుతం బొప్పాయి ధరలు మార్కెట్లో బాగా పుంజుకొన్నాయి. పదిరోజుల కిందట కిలో బొప్పాయి ధర రూ. 12 నుంచి 15 వరకు మాత్రమే పలికాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతుండడం విశేషం. ఈఏడాదిలో బొప్పాయి ఇవే అత్యధిక ధరలు అని రైతులు అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇలాగే నిలకడగా ఉంటే లాభాల పంట పండినట్లేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తోటల వద్దే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యా పారులు ముందుగానే సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. చెట్టు నుంచి కాయల్ని కింద పడనీయకుండా కోసి తరలిస్తుంటారు. – సుధాకర్ రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె ఐదు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో నేను ఐదు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ.26 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీ ఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. ఇవే ధరలు నిలకడ ఉంటే లాభాలు చూడవచ్చు. – నరసింహారెడ్డి, బొప్పాయి రైతు, ఎగువతొట్టివారిపల్లి (చదవండి: ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా! ఏకంగా..) -
కొబ్బరి పొట్టు..లాభాలు పట్టు
సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు. ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి. విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్ కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్‌ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది. మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్‌లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని -
గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్‌గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎక్స్‌పోర్టు హబ్‌గా మారుస్తాం గుంటూరును మిర్చి ఎక్స్పోర్ట్ హబ్‌గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. – ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్‌కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ధర ‘తేజో’మయమే ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్‌కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది. -
ఎగుమతిదార్లకు ‘రేజర్‌పే’ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే తాజాగా మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ సేవలను ప్రారంభించింది. ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా జరిపే నగదు లావాదేవీల చార్జీలపై 50 శాతం వరకు పొదుపు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లు తమకు నచి్చన దేశంలో ఖాతాను తెరవడానికి, అలాగే రేజర్‌పే ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానికంగా చెల్లింపులను స్వీకరించడానికి కంపెనీ సహాయం చేస్తుంది. తద్వారా చార్జ్బ్యాక్స్, ట్రాన్స్ఫర్ ఖర్చులను నివారించవచ్చు’ అని రేజర్‌పే వెల్లడించింది. మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్‌తో 160 దేశాల నుండి బ్యాంకుల ద్వారా నగదును స్వీకరించడానికి ఎగుమతిదారులకు వీలు కలుగుతుంది. అన్ని చెల్లింపులు ఎల్రక్టానిక్ ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ స్టేట్మెంట్తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 10,000 పైచిలుకు మంది ఎగుమతిదార్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని రేజర్‌పే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ కొఠారి చెప్పారు. -
బియ్యం ఎగుమతిపై ఇండియా బ్యాన్..!
-
సీఎం జగన్ సర్కార్‌ను ప్రశంసించిన నీతి అయోగ్
-
తడికలపూడి టు ఫ్రాన్స్
సాక్షి, అమరావతి: కోకో పంటకు ప్రపంచస్థాయి బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు స్థానికంగా మాత్రమే కోకో గింజలను విక్రయిస్తున్న రైతుల ద్వారా ఫైన్ ఫ్లేవర్డ్ కోకో గింజల్ని ఉత్పత్తి చేసి వాటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడంతో ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కోకో సాగు, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏపీలో సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 21వేల హెక్టార్ల నుంచి 39,714 హెక్టార్లకు విస్తరించింది. తద్వారా 10,903 టన్నుల కోకో గింజలు ఉత్పత్తి వస్తుండగా దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్ట్లే, క్యాంప్కో వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. అదనపు ధర కల్పించడమే లక్ష్యంగా.. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం మరోవైపు గింజల్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ వల్ల ప్రీమియం చాక్లెట్స్ తయారీకి అవసరమైన ఫ్లేవర్ కోకో గింజలకు వస్తుంది. వీటికి మార్కెట్ ధర కంటే 30% అదనంగా చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ చేస్తే మరో 15% అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ప్రీమియం చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లేవర్డ్ గింజల ఉత్పత్తే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం 35% సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా ముందుకొచ్చే రైతులు, ఎఫ్పీఓలకు సబ్సిడీపై ఆర్ధిక చేయూతనిస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరింతమంది రైతుల ద్వారా ప్రీమియం కోకో గింజలను ఉత్పత్తి చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ -
మొన్న విడుదలైన కారు అప్పుడే విదేశాలకు..
గత కొన్ని రోజులకు ముందు భారతీయ మార్కెట్లో విడుదలైన 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు దేశీయ తీరాలు దాటి విదేశాల్లో అడుగుపెట్టడానికి సన్నద్దమయిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి కొత్త కారు ఫ్రాంక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చేరుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి 556 వాహనాలు మొదటి బ్యాచ్‌గా ఎగుమతికానున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలా కంపెనీలు ఈ విధంగా ఎగుమతి చేశాయి. 2023 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదలైంది. ఈ SUV ధరలు రూ. 7.47 లక్షల నుంచి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!) మారుతి ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. -
దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, విశాఖపట్నం: మార్కెట్‌ను మామిడి పండ్లు ముంచెత్తుతున్నాయి. నగరంలో రోడ్లు, వీధుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగా చౌకధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. గతం కంటే రుచి, నాణ్యతతో ఉంటున్నాయి. తొలుత వీటి ధర ప్రియంగా ఉండడమే కాదు.. పులుపు, చప్పదనంతో రుచి తక్కువగా ఉండేవి. ఆకర్షణీయమైన రంగుకు ఆకర్షితులైన మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసి పెదవి విరిచే వారు. కానీ పక్షం రోజుల నుంచి మార్కెట్లోకి మంచి రుచి కలిగిన మామిడి పండ్లు వస్తున్నాయి. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటోంది. నెల కిందట కిలో రూ.60–70 ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడు రూ.25–30కే దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు వంటి పండ్లు మూడు, నాలుగు కిలోలు రూ.100కే లభ్యమవుతున్నాయి. మరికొన్ని రకాలైతే రూ.100కు ఐదారు కిలోలు చొప్పున విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు, తోపుడు బండ్లపై మరికొందరు, పోగులుగా పెట్టి ఇంకొందరు ఎక్కడికక్కడే అమ్ముతున్నారు. చౌకగా లభిస్తున్న మామిడి పండ్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ఎగుమతులు లేకే.. ఏటా ఈ ప్రాంతంలో పండిన మామిడి పండ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేయగా మిగిలిన పండ్లను స్థానిక మార్కెట్లకు తరలిస్తుంటారు. వాస్తవానికి నిరుడు, ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా లేదు. 50 శాతానికి మించి దిగుబడి లేదు. మామిడి దిగుబడి తగ్గిన సంవత్సరం ధరలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాపు తగ్గినా ధర మాత్రం సరసంగానే ఉంటోంది. ఎగుమతులు క్షీణించడం వల్లే ఈ ఏడాది మామిడి ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖ నగరంలో మామిడి పండ్లను విక్రయించే వారు కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. 20 కిలోల మామిడి పండ్లు రూ.150–200 కొని నగరంలో కిలో రూ.20–30కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లు పక్వానికి వచ్చిన కావడం వల్ల రుచిగా ఉంటున్నాయని, ధర కూడా అందుబాటులో ఉండడం వల్ల వీటి విక్రయాలు బాగున్నాయని అక్కయ్యపాలెంలో రాజు అనే అమ్మకందారుడు చెప్పాడు. తాను రోజుకు 400–500 కిలోలు విక్రయిస్తున్నానని, గతంలో కిలో, రెండు కిలోలు తీసుకెళ్లిన వారిప్పుడు రెట్టింపునకు పైగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు. మరికొద్ది రోజుల పాటు చౌక ధరలే కొనసాగుతాయని, నెలాఖరు వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయని వివరించాడు. -
నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి
కఠ్మాండు: నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి మొదలైంది. రుతు పవనాల రాకతో ప్రాజెక్టులు నిండి నేపాల్‌లోని జల విద్యుత్ కర్మాగారాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దీంతో, 600 మెగావాట్ల మిగులు కరెంటును శనివారం నుంచి భారత్‌కు విక్రయిస్తున్నామని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతినిధి తెలిపారు. నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారానే ఎక్కువగా కరెంటు ఉత్పత్తవుతుంది. డిమాండ్ తక్కువగా ఉండే వేసవి కాలంలో విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే శీతాకాలంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. గత ఏడాది జూన్– నవంబర్ మధ్యలో భారత్‌కు విద్యుత్ ఎగుమతి ద్వారా రూ.1,200 కోట్లను ఆర్జించింది. కొన్ని రోజుల క్రితం డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్ కొనుగోలు చేసింది. -
ఎగుమతుల్లో రికార్డ్ సృష్టించనున్న వాల్‌మార్ట్ - 2027 నాటికి..
న్యూఢిల్లీ: దేశం నుంచి 2027 నాటికి ఏటా 10 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను వాల్‌మార్ట్ ఎగుమతి చేయడంలో సహాయపడటానికి అపూర్వ సరఫరాదారుల వ్యవస్థ దోహదం చేస్తుందని రిటైల్ వాల్‌మార్ట్ తెలిపింది. భారతీయ సంఘాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, స్థానిక వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడానికి, దేశం నుండి ప్రపంచానికి రిటైల్ కోసం పరివర్తన, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించాలన్న సంస్థ ప్రణాళికను వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో డాగ్ మెక్‌మిలన్ పునరుద్ఘాటించారు. భారతీయ సరఫరాదారులు, భాగస్వాములను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘వాల్‌మార్ట్ భారతదేశానికి కట్టుబడి ఉంది. దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు, సభ్యుల కోసం నాణ్యమైన, సరసమైన, స్థిర ఉత్పత్తులను తయారు చేసే భారతీయ సరఫరాదారులు, భాగస్వాముల గురించి మేము సంతోషిస్తున్నాము. ఉద్యోగాలను సృష్టించడం, సంఘాలను బలోపేతం చేయడం, తయారీ కేంద్రంగా భారత పురోగతిని వేగవంతం చేయడం ద్వారా మా వ్యాపారం దేశ వృద్ధికి తోడ్పడగలదని గర్విస్తున్నాము’ అని వివరించారు. -
గొంగ్లూర్ టు జపాన్! గానుగ వంటనూనెల ఎగుమతికి సన్నాహాలు..
సాక్షి, సంగారెడ్డి: సంఘటితమై పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామ మహిళలు (స్వయం సహాయక బృందం) తయారు చేస్తున్న గానుగ (కోల్డ్ ప్రెస్డ్) వంటనూనెలను జపాన్‌కు ఎగుమతి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గొంగ్లూర్ గ్రామానికి చెందిన 126 మంది మహిళలు నడుపుతున్న సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న గానుగ వంటనూనెల నమూనాలను ఇటీవల నాణ్యతా పరీక్షలకు తీసుకెళ్లిన జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) వాటి ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయా నూనెల ఎగుమతికి వీలుగా సర్వోదయ సంస్థ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. నూనెలు.. చేతితో చేసిన సబ్బులు.. శుద్ధిచేసిన పప్పు దినుసులు ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యుల సహకారంతో గ్రామంలో పలు రకాల కుటీర పరి శ్రమలను స్థాపించారు. అందులో ఒకటైన సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్... ‘సర్వోదయాస్ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన సబ్బులు, పప్పు దినుసుల ప్రాసెసింగ్‌తోపాటు సహజ పద్ధతుల్లో వంట నూనెలను తయారు చేస్తోంది. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెలు, కుసుమ, కొబ్బరినూనెలను ఉత్పత్తి చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం.. ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ తయారీ, నాణ్యతా పరీక్షలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గొంగ్లూర్ మహిళలు గతంలో ఐఐటీ–హైదరాబాద్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ఐఐటీ–హెచ్... భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంలో భాగంగా తమ క్యాంపస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఎస్ఐసీ ద్వారా ‘జెట్రో’ను సంప్రదించింది. ఐఐటీ–హెచ్, ఎస్ఐసీలు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాయి. మరోవైపు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ తయారీకి తోడ్పాటు అందించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) హైదరాబాద్‌కు గొంగ్లూర్ మహిళలు విజ్ఞప్తి చేయగా ఆ సంస్థ సైతం అందుకు అంగీకారం తెలిపింది. కీలక ముందడుగు పడింది.. సర్వోదయ మంజీరా వంట నూనెల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మేము పంపిన శాంపిల్‌ను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎంవోయూ కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ప్రతినెలా 5 వేల లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతి ఆర్డర్ వస్తే ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌నాయక్, మంజీరా సర్వోదయ ఫౌండర్ తొలుత బెంగళూరుకు.. వంట నూనెల ఎగుమతులకు సంబంధించి జపాన్ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గొంగ్లూర్ మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన వంటనూనెలను తొలుత బెంగళూరులోని ‘జెట్రో’ గోదాములకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు. జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు.. సర్వోదయ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఇప్పటికే పలు జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు పొందింది. బహుళజాతి సంస్థలు తీసుకున్నట్లే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్), హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయూష్ విభాగం నుంచి కూడా లైసెన్స్ పొందింది. చదవండి: బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి.. -
మొబైల్స్ ఎగుమతికి కొత్త వ్యూహాలు.. ఈ ఏడాది టార్గెట్ ఇదే!
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీలో ఉన్న వివో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 2023 చివరినాటికి మరో రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలో నూతనంగా రాబోతున్న యూనిట్లో ఉత్పత్తి 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. 169 ఎకరాల విస్తీర్ణంలో నెలకొంటున్న ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 కోట్ల యూనిట్లు. ఈ ఏడాది 10 లక్షలకుపైగా మేడిన్ ఇండియా మొబైల్స్‌ను ఎగుమతి చేసే పనిలో నిమగ్నమైనట్టు కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా వివో మేడిన్ ఇండియా ఫోన్లు గతేడాది థాయ్‌లాండ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో విక్రయిస్తున్న ప్రతి వివో ఫోన్ దేశీయంగా తయారైనదే. బ్యాటరీ 95 శాతం, చార్జర్ విడిభాగాలు 70 శాతం స్థానికంగా సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో వివో తయారీ కేంద్రం ఉంది. రూ. 7,500 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా తొలిదశలో 2023 చివరినాటికి ర.3,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ‘ఇప్పటికే రూ. 2,400 కోట్లు వ్యయం చేశాం. మరో రూ. 1,100 కోట్లు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఇక్కడ అడుగు పెట్టిన నాటి నుండి వ్యూహాత్మక మార్కెట్ గా భారత్ కొనసాగుతోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల తెలిపారు. -
విదేశీ ఎగుమతికి సిద్దమైన బుజ్జి కారు, ఇదే!
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్' ఇప్పుడు తమ కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నద్ధమైపోయింది. కంపెనీ దీని కోసం చెన్నైలోని కామరాజర్ పోర్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. సిట్రోయెన్ ఎగుమతులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. కంపెనీ విదేశీ ఎగుమతికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ మార్గం ద్వారా రవాణా చేస్తుంది. 2023 మార్చి 31న మొదటి బ్యాచ్ మేడ్-ఇన్-ఇండియా C3 హ్యాచ్‌బ్యాక్‌లు కామరాజర్ పోర్ట్ నుండి ASEAN, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడం జరిగింది. కంపెనీ తమ కార్లను ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకోవడానికి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. సి2 ఎయిర్ క్రాస్ విడుదలతో దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొంది, ఇటీవల సి3 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసి మరింత గొప్ప అమ్మకాలను పొందటానికి సన్నద్ధమవుతోంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుంచి రెనాల్ట్, నిస్సాన్, టయోటా, మారుతీ సుజుకి, ఇసుజు మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. నిజానికి ఈ పోర్ట్ ఎగుమతుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సిట్రోయెన్ సి3 ధర భారతీయ మార్కెట్లో రూ. 7.02 లక్షల నుంచి రూ. 9.35 లక్షల వరకు ఉంది. అయితే ఇందులో సి3 ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 14.06 లక్షల వరకు ఉంది. కాగా సిట్రోయెన్ కొత్త సి3 ఎయిర్‌క్రాస్ మిడ్ సైజ్ SUV ఈ నెల 27న మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. -
బత్తాయి..భలే భలే..
సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి. కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు. ఏపీలోనే సాగు అధికం బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది. మొదలైన ఎగుమతులు రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ధర బాగుంది ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు: కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు (రూ.3.40 లక్షల కోట్లు) చేరినట్టు వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ చమురు దిగుమతుల్లో రష్యా 18వ స్థానంలో ఉంది. ఆ ఏడాది 9.86 బిలియన్ డాలర్ల చమురు దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పుడు చమురు దిగుమతుల్లో నాలుగో పెద్ద దేశంగా రష్యా నిలిచింది. జనవరిలో మన చమురు దిగుమతుల్లో 28 శాతం రష్యా నుంచే వచి్చంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన చమురు దిగుమతుల్లో 1 శాతం వాటానే కలిగిన రష్యా.. 2023 జనవరిలో 1.27 మిలియన్ బ్యారెళ్లతో (రోజువారీ) 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గించుకున్నాయి. దీంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే రష్యా భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి మన దేశం పెద్ద ఎత్తున చమురు దిగుమతికి మొగ్గు చూపించింది. చైనా నుంచి పెరిగిన దిగుమతులు చైనా నుంచి దిగుమతులు 6.2 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య 90.72 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఏఈ నుంచి దిగుమతులు 21.5 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా నుంచి 19.5 శాతం అధికంగా 46 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. ఎగుమతుల పరంగా చూస్తే అమెరికా 17.5% తో భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాకు మన దేశం నుంచి ఈ 11 నెల ల్లో 71 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. యూఏఈకి సైతం ఎగుమతులు 28.63 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చైనాకి మన దేశ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 19.81 బిలియన్ డాలర్ల ఉంచి 13.64 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
ఉల్లి ఎగుమతులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఆదివారం) తెలిపింది. 2022 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య భారదేశం నుంచి సుమారు 523.8 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లి రవాణా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఉల్లి విత్తన ఎగుమతిపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపైన ఫిబ్రవరి 25న ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. భారత్ నుంచి సుమారు చాలా దేశాలకు ఉల్లి ఎగుమతి అవుతోందని, ఏ దేశానికీ ఉల్లి ఎగుమతులపై నిషేధం లేదని, అందుకు విరుద్ధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు దురదృష్టకరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' శనివారం ట్వీట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఉల్లి ఎగుమతులు దాదాపు 50 శాతం పెరిగి 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 16.3 శాతం పెరిగి 523.8 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు, కానీ ఉల్లి విత్తనాల ఎగుమతిపైన నిషేధం ఉన్నప్పటికీ DGFT నుండి ఆథరైజేషన్ కింద అనుమతించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని బట్టి భారతదేశం నుంచి ఉల్లి ఏ దేశానికైనా ఎగుమతి చేయవచ్చని, దానిపైన ఎటువంటి ఆంక్షలు లేదని స్పష్టమవుతోంది. There is no ban on onion exports from India to any country and misleading statements suggesting the contrary is unfortunate. Infact, from July-December 2022, onion exports have consistently been above the $40 million mark every month, benefiting our Annadatas. https://t.co/tGzwVHCt9J — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2023 -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్‌లాండ్‌పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్‌లాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్ పార్క్‌తో పాటు క్లస్టర్ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే.. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు. కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి. చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
2023లో ఎగుమతులకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: బలహీనమైన గ్లోబల్ డిమాండ్, పెద్ద ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం కారణంగా 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అలాగే ఎగుమతులు మధ్యస్తంగా ప్రభావితమవుతాయని ఎకానమీ విశ్లేషణా సంస్థ– గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అంచనావేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశం కరెంట్ ఖాతాను మెరుగుపరుచుకోవడం, ఇంధన దిగుమతి బిల్లును తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని కూడా సూచించింది. జీటీఆర్ఐ నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►2022లో భారత్ ముడి చమురు, బొగ్గు దిగుమతుల బిల్లు 270 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం వస్తు దిగుమతుల బిల్లులో ఇది 40 శాతం. ►ప్రస్తుత పరిస్థితుల్లో దేశం స్థానిక చమురు క్షేత్రాల అన్వేషణను తిరిగి శక్తివంతం చేయాలి. అలాగే బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తిని పెంచాలి. ఆయా అంశాల్లో పురోగతి ఇంధన దిగుమతి బిల్లును గణనీయంగా తగ్గిస్తుంది. దీనితోపాటు కరెంట్ ఖాతాను మెరుగుపరుస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. ►చైనాను మినహాయించి ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను సృష్టించే అమెరికా ప్రయత్నం క్రమంగా ప్రపంచ సరఫరా గొలుసుల పునర్నిర్మాణానికి దారితీస్తోంది. కొన్ని పెద్ద ఉత్పాదక సంస్థల స్థాన మార్పిడికీ దారితీస్తోంది. ఆయా పరిణామాలు, ధోరణి నుండి ప్రయోజనం పొందేందుకు భారతదేశం తగిన మంచి స్థితిలో ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ►భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై రాజీ పడకుండా స్వయం సంమృద్ధికి కృషి చేయాలి. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు(ఎఫ్‌టీఏ) సంబంధించి దేశీయ విధానాలపై కొత్త నిబంధనల ప్రభావాన్ని జాగ్రత్తగా భారత్ అంచనావేసి, ముందడుగు వేయాలి. ►అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)సహా అభివృద్ధి చెందిన దేశాలు భాగస్వామ్య దేశాల నుండి ఎగుమతుల విషయంలో టారిఫ్యేతర అడ్డంకులను సృష్టించేందుకు కొన్ని నిబంధనలను ప్రయోగించే అవకాశం ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆయా అంశాల్లో అప్రమత్తత అవసరం. ►వాణిజ్య గణాంకాలను పరిశీలిస్తే, 2021లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 395 బిలియన్ డాలర్లు. ప్రపంచం అనిశ్చితి ఉన్నప్పటికీ 2022లో దేశ ఎగుమతులు 440–450 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఈ స్థాయి ఎగుమతులు భారత్ విజయంగానే చెప్పుకోవచ్చు. ►వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జనవరి నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 405 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 2021లో 573 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 725 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ►ఇక సేవల రంగానికి వస్తే ఈ విభాగం నుంచి 2021లో ఎగుమతులు 254 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 300 డాలర్ల వరకూ పెరుగుతాయని భావిస్తున్నాం. ►మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. ఆయన 2022 తన బాధ్యతల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వాణిజ్య విధాన రూపకల్పన, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) , స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) అంశాలకు సంబంధించి శ్రీ వాస్తవకు విశేష అనుభవం ఉంది. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
డీజిల్ ఎగుమతిదారులకు కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం గురువారం లీటరుకు రూ.5 నుంచి రూ. 7కు పెంచింది. అలాగే జెట్ ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై లీటరుకు రూ.2 పన్నును తిరిగి ప్రవేశపెట్టింది. కాగా, దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై పన్నును టన్నుకు రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ఏటీఎఫ్‌పై విడ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మార్జిన్లు పెరిగిన నేపథ్యంలో ఎగుమతులపై ప్రభుత్వం పన్ను పెంచింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయినందున దేశీయంగా ఉత్పత్తయిన చమురుపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. -
దేశంలో విద్యుత్ సంక్షోభం..కోల్ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 13 నెలల్లో 12 మిలియన్ టన్నుల(ఎంటీ) కోకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే
జకార్తా: నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వంటనూనె ఎగుమతులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85% వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్‌లో పామాయిల్ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట -
గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది. దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది. (చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల) -
భారత్‌కు మద్దతుగా నిలిచిన చైనా.. షాక్‌లో ప్రపంచ దేశాలు!
డ్రాగన్ కంట్రీ చైనా అనూహ్యంగా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుదలతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఈ సందర్భంగా ముందస్తు ఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా, భారత్ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది. ఇది కూడా చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
రూ.1.41 లక్షల కోట్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: ఎగుమతులు మంచి వృద్ధిని చూస్తునాయి. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లోనే 1 నుంచి 14వ తేదీ వరకు 18.79 బిలియన్ డాలర్ల విలువ మేర (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఆభరణాలు, రత్నాలు ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. గతేడాది ఏప్రిల్ 1–14 మధ్య ఎగుమతులు 13.72 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించాలి. ఇక ఈ నెల 1–14 మధ్యకాలంలో దిగుమతులు 12 శాతం పెరిగి 25.84 బిలియన్ డాలర్లుగా (రూ.1.94 లక్షల కోట్లు) నమోదైనట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021–22లో మొత్తం ఎగుమతులు రికార్డు స్థాయిలో 420 బిలియన్ డాలర్లు. దిగుమతులు 612 బిలియన్ డాలర్లు. -
గ్రానైట్ ఎగుమతులు ఆపాలని చైనా, హాంకాంగ్ నుంచి ఆదేశాలు
-
అదానీ పోర్టు సరికొత్త రికార్డులు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టుగా
దొండపర్తి (విశాఖ దక్షిణ): అదానీ పోర్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. కార్గో రవాణాలో 300 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్)గా దేశ నౌకాశ్రయాల్లో రెండు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలతో కార్గో రవాణాలో వృద్ధిని నమోదు చేస్తుండడం అదానీ పోర్ట్స్ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీసెజ్ సీఈఓ అండ్ హోల్‌టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొన్నారు. ఏటా 100 మిలియన్ మెట్రిక్ టన్నులు(పోర్ట్‌ఫోలియోలో 5 పోర్టులతో) సరకు రవాణా సాధించడానికి 14 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. ఏపీసెజ్ తరువాత ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి ఏటా 200 మిలియన్ మెట్రిక్ టన్నులు (పోర్ట్‌ఫోలియోలో 9 పోర్టులతో) కార్గోను రవాణా చేసినట్లు తెలిపారు. ఇపుడు ఏపీసెజ్ పోర్ట్‌ఫోలియోలో 12 పోర్టులతో మూడేళ్లలోనే ఏటా 300 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించిందని వివరించారు. కరోనా సమయంలోను, ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత తీరప్రాంతంలోని పోర్టుల నెట్‌వర్క్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపుతో పాటు సాంకేతికతతో కూడిన డిజిటలైజ్డ్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2025 నాటికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామన్నారు. అలాగే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టు కంపెనీగా ఎదుగుతుందని చెప్పారు. అదానీ పవర్ పునర్వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: పూర్తి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకునే పథకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. కంపెనీకి చెందిన విభిన్నతరహా సొంత అనుబంధ సంస్థలను విలీనం చేసుకోనున్నట్లు తెలియజేసింది. విలీనం చేసుకోనున్న సంస్థల జాబితాలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, అదానీ పవర్ ముంద్రా, ఉడు పి పవర్ కార్పొరేషన్, రాయ్‌పూర్ ఎనర్జెన్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలుకు 2021 అక్టోబర్ 1ను ఖరారు చేయగా.. ఆరు సంస్థల ఆస్తులు, అప్పులు అదానీ పవర్‌కు బదిలీకానున్నట్లు వివరించింది. -
ఆంధ్రా మామిడి ‘అదుర్స్’.. రికార్డు స్థాయిలో..
సాక్షి, అమరావతి: మామిడి సీజన్ రైతులకు మంచి ‘ఫలాల’తో మొదలైంది. ప్రభుత్వ చర్యలు, రైతులకు ఇచ్చిన సలహాలతో మంచి నాణ్యత కలిగిన పండ్లు వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. వివిధ రాష్ట్రాల వ్యాపారులు తోటల వద్దకు వచ్చి మరీ కొంటున్నారు. గతేడాది టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష పలికిన బంగినపల్లి ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతోంది. కృష్ణాజిల్లాలో రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన నాణ్యమైన మామిడి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం గత రెండేళ్లూ మామిడి మార్కెట్‌ను కరోనా దెబ్బ తీసింది. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈసారి కాస్త మంచి రేటు వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో ఆరంభంలోనే రికార్డు స్థాయి ధర పలకడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలో పండే బంగినపల్లి , సువర్ణరేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఎగుమతుల కోసం ఇప్పటికే 18,486 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది 3.35 లక్షల హెక్టార్లలో మామిడి సాగవగా, హెక్టార్‌కు గరిష్టంగా 12 టన్నుల చొప్పున 40.26 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న తోటబడులు ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడుల కార్యక్రమంతో పాటు ఫ్రూట్ కేర్ విధానాల వల్ల దిగు బడుల్లో నాణ్యత పెరిగింది. కాయ రెట్టింపు సైజు వచ్చి, బరువు కూడా పెరిగింది. సాధారణంగా కిలోకి 4, 5 కాయలు తూగుతాయి. ఫ్రూట్‌కేర్ విధానం వల్ల కిలోకి రెండుకు మించి తూగడంలేదు. బుట్ట కట్టడం వలన తెగుళ్లు సోకడంలేదు. పురుగుల మందులు వాడే అవకాశం లేదు. మచ్చలు లేవు. తద్వారా నాణ్యత పెరుగుతోంది. తెలంగాణ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బాగుండటంతో రేటు పెంచేందుకు కూడా వెనుకాడటం లేదు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగుంట గ్రామానికి చెందిన రైతు చేబ్రోలు శ్రీనివాసరావుకు 20 ఎకరాల మామిడి తోటలున్నాయి. మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. వైఎస్సార్ తోట బడుల్లో అధికారుల సలహాలు పాటించారు. ఫ్రూట్‌కేర్ విధానంలో పండ్లకు బుట్టలు కట్టారు. తెగుళ్లు సోకలేదు, మందులు వాడలేదు. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తోంది. నాణ్యత పెరగడంతో మంచి ధర పలికింది. తెలంగాణకు చెందిన వ్యాపారులు టన్ను రూ.1.30 లక్షల చొప్పున 2 టన్నులు కొన్నారు. ఢిల్లీ వ్యాపారులు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 6 టన్నులు, ముంబై వ్యాపారులు రూ.1.15 లక్షల చొప్పున 5 టన్నులు కొన్నారు. ఇంత ధర గతంలో లేదని శ్రీనివాసరావు తెలిపారు. టన్ను రూ.1.20 లక్షలకు అమ్మాం మాకు ఆరెకరాల మామిడి తోట ఉంది. ఫ్రూట్‌కేర్ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగింది. గతేడాది గరిష్టంగా టన్ను రూ.లక్ష పలికింది. ఈ ఏడాది టన్ను రూ.1.20 లక్షలు పలికింది. ఇటీవలే 5 టన్నులు అమ్మాం. వ్యాపారులు తోటకే వచ్చి పట్టుకెళ్లారు. – సీహెచ్, కృపారాజు, రెడ్డికుంట, కృష్ణా జిల్లా పండ్ల నాణ్యత బాగుంది ఏపీలో ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఫ్రూట్ కేర్ విధానాలు పాటిస్తుండడం వలన పండ్ల నాణ్యత పెరిగింది. ఏ ఒక్క కాయమీద మచ్చ కన్పించలేదు. మంచి సైజు వస్తోంది. రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 10 టన్నులు కొన్నాం. మరో 20 టన్నులు రూ.80 వేల నుంచి రూ.లక్ష చొప్పున కొన్నాం. ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాలకు ఎగుమతి చేస్తాం. – మహ్మద్ అబ్దుల్ అలీమ్, ఆల్ నఫే ఫ్రూట్ కంపెనీ త్వరలో బయ్యర్స్–సెల్లర్స్ మీట్ వైఎస్సార్ తోట బడులు ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇస్తుండటంతో మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఏడాది ఎక్స్పోర్ట్ క్వాలిటీ దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్– సెల్లర్స్ మీట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ -
వారెవ్వా కియా! రికార్డు సృష్టించిన అనంత ప్లాంట్.. తక్కువ వ్యవధిలోనే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్ నుంచి 5 లక్షలకుపైగా యూనిట్లను భారత్‌తోపాటు విదేశాలకు సరఫరా చేసింది. దేశీయంగా 4 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. లక్షలకుపైగా కార్లను 91 దేశాలకు ఎగుమతి చేసింది. 2019 సెపె్టంబర్లో అనంతపూర్ ప్లాంట్ నుంచి సెల్టోస్ కార్ల ఎగుమతి ప్రారంభమైంది. భారత్ నుంచి విదేశాలకు యుటిలిటీ వాహనాలను అధికంగా సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా.. గతేడాది ఎగుమతుల్లో 25 శాతంపైగా వాటాను దక్కించుకుంది. ‘అయిదు లక్షల యూనిట్లు అనేది పెద్ద సంఖ్య. 29 నెలల్లోపే ఈ మైలురాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాం. భారత్‌లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండీ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల ద్వారా కస్టమర్లకు గొప్ప విలువను అందించడంపై దృష్టి సారించాం. నాలుగు లక్షల భారతీయ కుటుంబాలలో భాగమయ్యాం. వినియోగదార్లు మాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కొత్త కారు కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోగలం. కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడం ద్వారా దేశంలో వృద్ధి ప్రయాణంలో ఈ కారు మార్గనిర్దేశం చేస్తుంది’ అని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం
ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా సంచలనం సృష్టించింది. భారత్ నుంచి ఒక ఏడాదిలో రికార్డు స్థాయి యూనిట్ల ఎగుమతితో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హ్యుందాయ్ క్రెటా 2021కిగానూ మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్యూవీ ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదల 26.17 శాతం నమోదు కావడం విశేషం. మొత్తం 32, 799 యూనిట్లు ఓవర్సీస్కి ఎగుమతి అయ్యాయి. 2020లో యూనిట్ల సంఖ్య 25,995 యూనిట్లుగా ఉంది. ఇక 2021లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తంగా 42, 238 ఎస్‌యూవీల ఎగుమతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్తో పాటు వెన్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజర్ మోడల్స్‌ను ఎంపిక చేసిన మార్కెట్లలోకి వదిలింది హ్యుందాయ్ ఇండియా. సౌతాఫ్రికాతో పాటు పెరూ, డొమినికా రిపబ్లికా, చాద్, ఘనా, లావోస్‌కు సైతం ఎన్ లైన్, ఎల్పీజీ వేరియెంట్లను ఎగుమతి చేసింది. -
AP: సుగంధ పరిమళాలు.. ఎగుమతులకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సుగంధ ద్రవ్యాల ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలం నాటికి రాష్ట్రం నుంచి 15.16 కోట్ల కిలోల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. సుమారు 80కిపైగా దేశాలకు రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలను మనం రాష్ట్రం ఎగుమతి చేసింది. రాష్ట్రంలో సాగవుతున్న మిర్చి, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతోపాటు కాఫీ, జీడిపప్పు వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా వీటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. చదవండి: AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. 71 దేశాలకు అరకు కాఫీ ఎగుమతులు విశాఖ మన్యంలో పండించే అరకు కాఫీకి ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రం నుంచి 1.49 కోట్ల కిలోల కాఫీ ఎగుమతి అయ్యింది. సుమారు 71 దేశాలకు మన రాష్ట్రం నుంచి ఏడు నెలల్లో రూ.659.62 కోట్ల విలువైన కాఫీ ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ. 2,202.22 కోట్ల విలువైన 9.7 కోట్ల కిలోల పొగాకు కూడా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యింది. విదేశాల్లో మంచి డిమాండ్ రాష్ట్రంలో సాగయ్యే కొన్ని పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పొగాకు బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ వంటి వాటితో చర్చలు జరిపి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో జీడిపప్పు ఎగుమతులు రూ.3 కోట్లుగా ఉన్నాయి. వీటిని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – జీఎస్ రావు, జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ -
టాప్ 20లో రెండు జిల్లాలు.. ఎగుమతుల్లో మరో మెట్టు ఎక్కిన ఏపీ
జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ సత్ఫలితాలిస్తున్నాయి. డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఎగుమతులు చేసిన టాప్–20లో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ సత్ఫలితాలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదు చేయడం ద్వారా ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుని రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది టాప్–20 జిల్లాల జాబితాలో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) అత్యధికంగా ఎగుమతులు చేసిన 20 జిల్లాల జాబితాలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. విశాఖ జిల్లా రూ.20,662.5 కోట్ల (275.50 కోట్ల డాలర్ల) విలువైన వాణిజ్య ఎగుమతులతో 14వ స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా రూ.18,204.15 కోట్ల (242.72 కోట్ల డాలర్ల) విలువైన ఎగుమతులతో 18వ స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా నుంచి జరిగిన ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్ (92.06 కోట్ల డాలర్లు), రసాయనాలు (57.21 కోట్ల డాలర్లు), ఫార్మాస్యూటికల్స్ (18.81 కోట్ల డాలర్లు), ప్లాస్టిక్ అండ్ లినోలియం (16.41 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (15.34 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎగుమతి జరిగిన వాటిలో ఇంజనీరింగ్ గూడ్స్ (149.51 కోట్ల డాలర్లు), సముద్ర ఉత్పత్తులు (34.28 కోట్ల డాలర్లు), బియ్యం (30.57 కోట్ల డాలర్లు), ఎలక్ట్రానిక్ గూడ్స్ (4.01 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (1.30 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా ఉత్పత్తుల గుర్తింపు గత సంవత్సరం రాష్ట్రం నుంచి రూ.1,22,640 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2030 నాటికి రూ.2,46,010 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఇటీవల జరిగిన వాణిజ్య ఉత్సవ్ సందర్భంగా జిల్లాల వారీ కీలక ఉత్పత్తులను గుర్తించి వాటి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాను ఒక ఎక్స్పోర్ట్ హబ్‌గా చేసి అక్కడి నుంచే ఎగుమతులకు సంబంధించిన అన్ని సేవలందించే విధంగా ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ జి.ఎస్.రావు రావు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలున్న ఐదు, ఆరురకాల ఉత్పత్తులను ఎంపికచేసి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎగుమతులకు సంబంధించిన సమాచారంతో మ్యాగ్జైన్లు, కొనుగోళ్లు–అమ్మకందారులతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
ఊహలకు అందని రూపాలు
టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్ బియన్నాలే, మార్క్ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి. సాధనమున సమకూరిన కళ స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్.. ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను. నెలల సమయం.. కోవిడ్ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్ వేసుకుంటాను. అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా. -
ఎగుమతులకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్ ముగింపునకు 190 బిలియన్ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్ మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్‌ఈఐఏ స్కీమ్ కొనసాగింపు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ) స్కీమ్ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు. 2022 మార్చి వరకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్జీఎస్ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది. లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది. -
కార్గో ఫ్లైట్ ద్వారా మత్స్య సంపద ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు
-
ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు
న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా పెంచుకునే దిశగా ప్రభుత్వం, పరిశ్రమ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గణనీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశమున్న 75 ఉత్పత్తులను గుర్తించినట్లు పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ వెల్లడించింది. వీటిలో వ్యవసాయం, ఖనిజాలు తదితర తొమ్మిది రంగాలకు చెందినవి ఉన్నాయని, అమెరికా.. యూరప్ వంటి మార్కెట్లకు వీటిని ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. 2027 నాటికి 750 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యాన్ని సాధించేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపింది. రాబోయే 75 నెలల్లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ వివరించారు. చేపలు, మాంసం, కాటన్, ఖనిజాలు, వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫర్నిచర్, మ్యాట్రెస్లు, బొమ్మలు మొదలైనవి గుర్తించిన ఉత్పత్తుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మరింతగా ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉన్న ఈ 75 ఉత్పత్తుల వాటా .. మొత్తం ఎగుమతుల్లో 46 శాతంగా ఉంటోంది. వీటి విలువ సుమారు 127 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు -
ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. షావోమీ స్మార్ట్ఫోన్లు విక్రయించబడని దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని పలు దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న కస్టమర్లకు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్‌ను చూపిస్తుంది. యూఎస్‌తో సహా అనేక దేశాల్లో షావోమీ అధికారికంగా ఉనికి లేదు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! క్యూబా, ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా, సూడాన్ లేదా క్రిమియా దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్లకు షావోమీ షాక్ నిచ్చింది. గతవారం నుంచి ఈ స్మార్ట్ఫోన్లను షావోమీ బ్లాక్ చేసిందని యూజర్లు సోషల్‌మీడియాలో హైలైట్ చేస్తున్నారు. షావోమీ బ్లాక్ చేస్తూ సందేశాలను కూడా పంపినట్లు యూజర్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన దేశాల్లో స్మార్ట్‌ఫోన్ సేవలను బ్లాక్ చేస్తుందని కంపెనీ పాలసీలో ఎక్కడలేదు. For the past few weeks, Xiaomi has been proactively blocking users from provisioning their phones if they live in Cuba, Iran, Syria, North Korea, Sudan, or Crimea, in order to comply with export regulations and stop resellers. https://t.co/51AdXIMgnW — Mishaal Rahman (@MishaalRahman) September 9, 2021 చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! -
గంగవరం పోర్టు రికార్డ్!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రావాణాలో ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్‌ను ఉపయోగించి 24 గంటల వ్యవధిలో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువులను పోర్ట్ స్వీకరించింది. గతంలో ఈ రికార్డు కింద 16,690 టన్నులు మాత్రమే నమోదైంది. 64,575 మెట్రిక్ టన్నుల యూరియాను అందుకుంది. 24 గంటల్లో 23,500 మెట్రిక్ టన్నుల దుక్క ఇనుము, 46,700 మెట్రిక్ టన్నుల ఇనుము ధాతువు గుళికలు పోర్ట్ నుంచి సరఫరా అయింది. ఆగస్ట్ నెలలో కన్వేయర్స్ ద్వారా వైజాగ్ స్టీల్‌కు 6,08,706 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా చేశారు. నౌకాశ్రయం అత్యున్నత మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యానికి ఇది నిదర్శనమని గంగవరం పోర్ట్ ఈడీ జి.జె.రావు తెలిపారు. చదవండి : HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు -
తల వెంట్రుకల ఎక్సపోర్ట్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు
-
హైదరాబాద్, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తల వెంట్రుకలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలపై ఈడీ ఆకస్మిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనపై తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా వికాస్ ఎంటర్ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్, హృతిక్ కంపెనీలతో పాటు నా లా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్, ఎక్స్లెంట్ హెయిర్ కంపెనీలపై ఈడీ దాడులు జరిపింది. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
తాడేపల్లిగూడెం నుంచి బెంగాల్‌కు కిసాన్ రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా పట్టణానికి ఆదివారం ఉల్లిపాయల లోడ్‌తో కిసాన్ రైలు బయల్దేరి వెళ్లింది. విజయవాడ డివిజన్లోని బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్(బీడీయూ) బృందం తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు రవాణా చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారవేత్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి దీన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంది. తక్కువ ఖర్చు, సురక్షిత రవాణా, సరుకు భద్రత, ప్రభుత్వం అందించే రాయితీల గురించి రైతులు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడం ద్వారా మొదటిసారిగా తాడేపల్లిగూడెం నుంచి మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు. కిసాన్ రైలును విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
ఆంధ్ర రొయ్యా మజాకా.. అక్కడ మీసం మెలేస్తోందండి!
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీసం మెలేస్తోంది. నాణ్యమైన, అత్యంత రుచికరమైన రొయ్యలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందటంతో ప్రపంచంలోని 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఎగుమతుల విలువ అక్షరాలా రూ.16,183 కోట్లు. డీజీసీఐఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని ఏ రాష్ట్రాలు వేటిని ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయో 2020 సంవత్సర నివేదికలో డీజీసీఐఎస్ పేర్కొంది. రొయ్యలతోపాటు ఫెర్రో–సిలికా, మాంగనీస్ మన రాష్ట్రం నుంచి 69 దేశాలకు ఎగుమతి చేశారు. రాష్ట్రం నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి కాగా.. వాటి విలువ రూ.3,015.9 కోట్లుగా నివేదిక వెల్లడించింది. పొగాకు, క్యాప్సికం వంటివి కూడా మన రాష్ట్రం నుంచి భారీగానే ఎగుమతి అయ్యాయని తెలిపింది. కేరళ నుంచి బంగారం.. హరియాణ నుంచి బాస్మతి రైస్ కేరళ నుంచి ఎక్కువ స్థాయిలో బంగారం ఎగుమతి అయినట్టు వెల్లడైంది. ఎనిమిది దేశాలకే ఇది ఎగుమతి అయినా దీని విలువ అక్షరాలా రూ.43,233.83 కోట్లు. కేరళ నుంచి జీడిపప్పు 47 దేశాలకు ఎగుమతి అయింది. బిర్యానీకి ప్రసిద్ధి గాంచిన బాస్మతి రకం బియ్యం హరియాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. 121 దేశాలకు రూ.16,443.09 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని హరియాణ ఎగుమతి చేసింది. గుజరాత్ నుంచి 48 దేశాలకు రూ.77,325.1 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్‌ను ఎగుమతి చేశారు. మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో అతిపెద్ద విలువ కలిగినది డైమండ్స్ కాగా.. మహారాష్ట్ర నుంచి 77 దేశాలకు డైమండ్స్ ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 1.70 లక్షల కోట్లు. ఢిల్లీ నుంచి టర్బో జెట్స్ పెద్దఎత్తున ఎగుమతి కాగా.. వీటి విలువ రూ.11,600 కోట్లుగా డీజీసీఐఎస్ తేల్చింది. జమ్ముకశ్మీర్ నుంచి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలను ఎక్కువగా ఎగుమతి చేశాయి. -
ఏపీ నుంచి 42,935 టన్నుల అరటి ఎగుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి 2020–21లో 42,935 మెట్రిక్ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్లు కేంద్రం తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలను ఎగుమతులకు అనువైన అరటిసాగుకు సానుకూలమైన ప్రాంతాలుగా గుర్తించిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం అపెడా అనేక చర్యలు చేపడుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారు. జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలు చేస్తోందన్నారు. క్రయ–విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపికచేసిన క్లస్టర్లలో నూరుశాతం టిష్యూ కల్చర్ అరటిని సాగుచేసేందుకు ప్రోత్సహిస్తోందని తెలిపారు. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలో పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ తెలిపారు. 2023 ఆగస్టుకల్లా అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్–1 కింద కేవలం అండర్‌గ్రౌండ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కింద గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో రైట్ ఆఫ్ వే సమస్యలతో ప్రాజెక్ట్ అమలులో ఇబ్బందులు తలెత్తాయన్నారు. భారత్‌నెట్ ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాల్లో 65 వేల పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో అమలు జరుగుతోందని, లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్టు గడవుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. -
ఉద్దానం మామిడి రుచి చూశారా? యమ టేస్టీ
కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి. ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్లోడింగ్ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా ఇదే పంథా.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. - పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం ముందు శాంపిల్ తీసుకెళతాం చిక్కాఫ్ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్‌లో లోడ్ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. - ఆరంగి శివాజీ, చిక్కాఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కవిటి మండలం -
60 వేల రెమిడెసివిర్ వయల్స్ విదేశాలకు..
ముంబై: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో రెమిడెసివిర్ టీకాకు డిమాండ్ అదేస్థాయిలో పెరుగుతోంది. కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఈ టీకా కొరత వేధిస్తోంది. కొరత నేపథ్యంలో టీకా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, డామన్‌కు చెందిన బ్రూక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 60,000 రెమిడెసివిర్ వయల్స్‌ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు తరలించినట్లు మంబై పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ డైరెక్టర్ రాజేశ్ డొకానియాను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం రాజేశ్ డొకానియా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్రూక్ ఫార్మా సంస్థ రెమిడెసివిర్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారీ సంఖ్యలో వయల్స్‌ను విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బ్రూక్ ఫార్మా డైరెక్టర్‌ను పోలీసులు ప్రశ్నించడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని అధికార శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించింది. రాజేశ్ డొకానియాను తరలించిన పోలీసు స్టేషన్‌కు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ నేతలు చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. బ్రూక్ ఫార్మా కంపెనీతో మాట్లాడి, మహారాష్ట్రకు రెమిడెసివిర్ టీకాలు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బ్రూక్ ఫార్మా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అత్యవసరమైన టీకాలను విదేశాలకు అక్రమంగా తరలించిన ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారిస్తే బీజేపీకి అభ్యంతరం ఎందుకో చెప్పాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీశాయి. రాజేశ్ డొకానియాను పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఫార్మర్‌గా ధోని సెకండ్ ఇన్నింగ్స్
రాంచీ: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం పరిపాటిగా మారింది. లాక్డౌన్లో షూటింగ్‌లు వాయిదా పడటంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సైఫ్‌లు తమ ఫాంలో వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వీరి జాబితాలో చేరిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని తన వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక ఆర్గానిక్ పద్దతిలో పండించిన తన పంటను ధోని దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అయిన ధోని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో అతడి పంటను కొనేందుకు దుబాయ్ రైతు మార్కెట్లు ఆసక్తిని కనబరుస్తున్నాయట. (చదవండి: కొత్తజంటకు ధోని డిన్నర్ పార్టీ) దీంతో ధోని సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఆర్గానిక్ పంటకు భారీగా డిమాండ్ వస్తుండటంతో ఈ పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు జార్ఖండ్ వ్యవసాయ శాఖ ముందుకొచ్చింది. రాంచీ శివార్లలోని సెంబో గ్రామం రింగ్ రోడ్డు వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ధోని స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిల పంటను ఆర్గానిక్ పద్దతిలో పండించాడు. దీంతో ఈ పంటను వ్యవసాయ శాఖ స్వయంగా దుబాయ్‌కి ఎగుమతి చేయనుంది. ఇప్పటికే రాంచీ మార్కెట్లో ధోని పండించిన కూరగాయలు, పళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కింద ధోని పండించిన కూరగాయలను కూడా ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.