ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌.. | Gulf Boosting to Pharma Companies | Sakshi
Sakshi News home page

ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌..

Published Sat, Sep 14 2019 10:47 AM | Last Updated on Sat, Sep 14 2019 10:47 AM

Gulf Boosting to Pharma Companies - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : భారత ఫార్మా రంగ సంస్థలను మధ్యప్రాచ్య దేశాలు ఊరిస్తున్నాయి. 2018–19 టాప్‌–30 ఎక్స్‌పోర్ట్స్‌ మార్కెట్లలో మూడు మధ్యప్రాచ్య దేశాలు చోటు సంపాదించాయి. వీటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 13వ స్థానం కైవసం చేసుకుంది. గత ఆరి్థక సంవత్సరంలో ఈ దేశానికి రూ.1,820 కోట్ల విలువైన ఎగుమతులు భారత్‌ నుంచి జరిగాయి. 2017–18తో పోలిస్తే వృద్ధి ఏకంగా 103 శాతం నమోదైంది. ఇరాన్‌కు 46% వృద్ధితో రూ.1,267 కోట్లు, టర్కీకి రూ.1,155 కోట్ల విలువైన ఔషధాలను ఇక్కడి కంపెనీలు సరఫరా చేశాయి. మధ్యప్రాచ్య దేశాల్లో ఇక్కడి కంపెనీలకు వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ భాస్కర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 

ఆ దేశాల్లో తయారీ..
మందుల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడకూడదని చాలా దేశాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తయారీని ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలనూ ఇస్తున్నాయి. ప్రభుత్వ హెల్త్‌ ప్రాజెక్టుల్లో స్థానిక కంపెనీల నుంచే మందులకు కొనుగోలు చేస్తున్నాయి. తమ వద్ద ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా పలు దేశాలు భారత కంపెనీలను ఆహ్వానిస్తున్నాయని రవి ఉదయ భాస్కర్‌ వివరించారు. దేశీయంగా తయారీపై నియంత్రణ ఉంటుందన్నది ఆ దేశాల ఆలోచన అని చెప్పారు. విదేశాల్లో తయారీ కేంద్రాల స్థాపన ద్వారా భారత సంస్థలు అవకాశాలను అందుకోవచ్చని ఆయన అన్నారు.

స్వావలంబన దిశగా..
మందుల తయారీకి అవసరమైన రూ.24,500 కోట్ల విలువైన ముడి పదార్థాలను 2018–19లో భారత్‌ దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.17,500 కోట్ల ముడి సరుకు చైనా నుంచే వచ్చింది. ఒకవేళ చైనా నుంచి సరఫరా నిలిచిపోతే భారత పరిస్థితి ఏంటి అన్న అంశంపై ఫార్మెక్సిల్‌ ఒక అధ్యయనం చేపట్టింది. లైఫ్‌స్టైల్, కార్డియోవాసు్క్యలర్, ఆంకాలజీ వంటి ఆరు విభాగాల్లో మందులకు అవసరమైన ముడి పదార్థాలను తయారు చేయగల సత్తా భారత కంపెనీలకు ఉందని నిర్ధారించింది. పది రోజుల్లో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని కౌన్సిల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణ చెప్పారు. 

నియంత్రణ సంస్థలతో..
ఫార్మెక్సిల్‌ తొలిసారిగా పలు దేశాల ఔషధ నియంత్రణ సంస్థల అధిపతులతో తొలిసారిగా సెపె్టంబర్‌ 19–20 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తోంది. చైనా, బ్రెజిల్, వియత్నాం వంటి 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత కంపెనీలు సైతం వీరితో ముఖాముఖి సమావేశమయ్యేందుకు సదస్సు వీలు కలి్పస్తుందని ఫార్మెక్సిల్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ సీనియర్‌ ఆఫీసర్‌ లక్ష్మీ ప్రసన్న తెలిపారు.   

తొలి త్రైమాసికం అదుర్స్‌..
జూన్‌ త్రైమాసికంలో ఫార్మా ఎగుమతులు 11% వృద్ధి చెంది రూ.35,000 కోట్లు నమోదు చేశాయి. చైనా 37%, జపాన్‌ 32%, ఉత్తర అమెరికా 30%, సీఐఎస్‌ 13%, ఎల్‌ఏసీ రీజియన్‌ 12% వృద్ధి చెందాయి. 169% వృద్ధితో ఇరాన్‌కు రూ.392 కోట్ల విలువైన సరుకు సరఫరా అయింది. 2019–20లో ఔషధ ఎగుమతులు రూ.1,54,000 కోట్లు నమోదయ్యే అవకాశం ఉందని ఫార్మెక్సిల్‌ అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,33,980 కోట్లు ఆరోగ్య సేవలపై వ్యయం తగ్గించుకోవడానికి చాలా దేశాలు తక్కువ ధరలో లభించే జనరిక్‌  కు మళ్లుతున్నాయి. అలాగే యూఎస్‌ మార్కెట్‌ రికవరీ, ధరలు స్థిరపడడం, చైనా  నియంత్రణ పరమైన నిర్ణయాలు ఎక్స్‌పోర్ట్స్‌ అధికం కావడానికి దోహదం చేయనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement