ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు.
టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్‌వేర్ కంపెనీగా అవతరించింది.
ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట
భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్‌లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు.
PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023
Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL
Comments
Please login to add a commentAdd a comment