పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత | India Relaxes Ban On Exports Of Paracetamol | Sakshi
Sakshi News home page

పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత: కేంద్రం

Published Sat, Apr 18 2020 3:18 AM | Last Updated on Sat, Apr 18 2020 4:42 AM

India Relaxes Ban On Exports Of Paracetamol - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పారాసిటమాల్‌ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ కరోనా కేసుల సంఖ్య పెరిగితే పారాసిటమాల్‌ ట్యాబ్లెట్ల కొరత రాకుండా ఉండేం దుకు అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర విదేశీ ఎగుమతుల డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement