Paracetamol tablets
-
నీళ్లోసుకుంటే ఈ మాత్రేసుకోవద్దు!
గర్భధారణ జరిగాక సాధారణంగా పారాసిటమాల్ వంటి మందులు తప్ప మహిళలకు ఎలాంటి మందులూ ఇవ్వరు. కొన్ని రకాల మందులైతే అస్సలు ఇవ్వకూడదు కూడా. కొన్ని మందులు తీసుకోవడం వల్ల గర్భంలోని పిండంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్త. అలాంటి మందులేవో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ కథనం...గర్భవతులు వాడకూడని మందులేమిటో పోరబాటున వాడితే వచ్చే ప్రతికూల ప్రభావాలెలా ఉంటాయో తెలుసుకుందాం. యాంటీకన్వల్సెంట్స్ : ఫిట్స్ వ్యాధి ఉన్నవారిలో సీజర్స్ తగ్గడానికి వాడే మందులివి. కార్బమాజిపైన్, సోడియం వాల్్రపోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకాన్వల్సెంట్ మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో చెవి, ముఖానికి సంబంధించిన ఎముకల అపసవ్యత, న్యూరల్ ట్యూబ్ లో΄ాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫిట్స్ రావడంతో మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫిట్స్ కోసం ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు దాన్ని కేవలం ఒకే ఒక టాబ్లెట్‌కు పరిమితం చేసుకుని, ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకుని, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కా΄ాడుకుంటుంటే నిరభ్యంతరంగా గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కానీ తల్లి వాడే కొన్ని రకాల ఫిట్స్ మందులు పిండంపై దుష్ప్రభావం చూపవచ్చు. అలాంటప్పుడు బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా, గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ΄ాలెట్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) వంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేలా మోతాదులు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ΄్లాన్ చేయాలి. యాంటిసైకోటిక్ : ఇవి మానసిక çసమస్యలకూ, మనసు నిలకడగా ఉండటానికి వాడతారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో ఇచ్చే లిథియమ్ వల్ల గుండెకు సంబంధించిన ఎబ్స్టైన్ అనామలీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మానసిక సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ΄్లానింగ్ చేసుకోకూడదు. యాంటీమైగ్రెయిన్ మందులు : ఎర్గోటమైన్, మెథీజరిజడ్ వంటి మందుల్ని తలనొప్పి తగ్గడానికి ఇస్తారు. వీటి వల్ల సమయానికి ముందే ప్రసవం అయి΄ోయే అవకాశాలెక్కువ. కాబట్టి మైగ్రేన్ మందులు వాడుతుంటే గైనకాలజిస్టుకు ఆ విషయం చె΄్పాలి. యాంటీ బయాటిక్స్ : ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే ఈ మందులు బిడ్డలో అనేక దుష్ప్రభావాలు కలగజేయవచ్చు. ఉదా: టెట్రాసైక్లిన్స్ వల్ల దంతాల రంగుపోవడం, ఎముకల ఎదుగుదలకు అడ్డంకులు వంటి సమస్యలు రావచ్చు. సల్ఫోనమైడ్స్ అనే మందుల వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే కామెర్లూ, స్ట్రె΄్టోమైసిన్ వాడటం వల్ల చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. యాంటీకోయాగ్యులెంట్స్ : రక్తం గడ్డకట్టడంలో లోపాలుంటే ఇచ్చే వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపుకు చెందిన ఈ మందుల వల్ల ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతిలో రక్తస్రావం, కంటి అపసవ్యతలు ఏర్పడటం, తల పెరగకుండా ఉండటం, ఫలితంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలెక్కువ. యాంటీ డయాబెటిక్ : మధుమేహానికి వాడే మందులైన క్లోరో్రపోమైడ్ వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే చిన్నారి తాలూకు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం (హైపోగ్లైసీమియా) వంటి కండిషన్లు ఏర్పడవచ్చు. విటమిన్–ఎ అనలాగ్స్ : ఈ మందుల్ని మొటిమలు (యాక్నే) చికిత్సలో వాడతారు. ఎట్రటినేట్, ఐసోట్రెటినోయినిన్లాంటి మందులతో చెవులు చిన్నగా ఉండటం, గుండె సమస్య, మెదడులోకి నీరు చేరడం, అబార్షన్ కావడం, ముఖాకృతిలో తేడాలు రావడం వంటివి జరగవచ్చు. డయాగ్నస్టిక్ రేడియోలజీ : గర్భం ధరించిన తొలిరోజుల్లో ఎక్స్–రే తీయించిన కేసుల్లో... చిన్నారి పుట్టిన తొలి ఏళ్లలో లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలెక్కువ. అందుకే గర్భవతులు రేడియేషన్‌కు ఎక్స్΄ోజ్ కావద్దంటూ ఎక్స్‌రే రూమ్‌ల ముందు స్పష్టంగా హెచ్చరిక రాసి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడినప్పటికీ చిన్నారి మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. ఏ మందు ఎంత సురక్షితమో లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి గర్భవతులు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే వారు డాక్టర్‌ను తప్పక సంప్రదించాకే వాడాలని గుర్తుంచుకోండి. డాక్టర్లు సైతం ఆ మందుల అవసరాన్ని, బిడ్డపై పడే ప్రభావాల్ని జాగ్రత్తగా బేరీజు వేశాకే తల్లికి ప్రిస్క్రయిబ్ చేస్తారు. -
జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా?
జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే. పైగా మొన్నటివరకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసెటమాల్ టాబ్లెట్లను విరి విరిగా వాడేస్తున్నారు. అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను అలా విచ్చలవిడిగా వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆ టాబ్లెట్లను అధికంగా వాడటం వల్లే కలిగే దుష్పరిణామాలు గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గకుంటే మళ్లీ మరో టాబ్లెట్ వేసుకోవడం చేయరాదు. అలాగే జ్వరం వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల మధ్య వ్యవధిలో పెద్దలకైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాలు వయస్సు అంత కన్నా లోపు ఉన్న పిల్లలకైతే 15 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ మోతాదును ఇవ్వాలి. ఇవేమి పాటించకుండా వీటిని ఎలా పడితే అలా వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను పొరపాటున కూడా వేసుకోరాదు. కాబట్టి ఇకపై పారాసెటమాల్ టాబ్లెట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి (చదవండి: తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!) -
పారాసెటమాల్ 650 ఎంజీ చాలు.. అనవసర మందులు వాడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసెటమాల్ 650 ఎంజీ వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. అనేక దేశాలు, డబ్ల్యూహెచ్‌వో దీనినే నిర్ధారించాయని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర అంశాలపై డాక్టర్ ప్రేమ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఒమిక్రాన్ బారిన పడిన వారు పారాసెటమాల్ మూడు పూటలా మూడు నుంచి ఐదు రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవాలి. కొందరిలో ఐదు రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడే వారు బుడెసోనైడ్ ఇన్హేలర్ను 800 మైక్రో గ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా పనిచేయదు. హోమ్ ఐసోలేషన్ ప్రధానం సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది. వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే ఇరువురు ఎన్–95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు మూడు రోజులు దాటి తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్లు తిరిగిపడటం, మగత వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. ఒకే ప్రభావం ఉండదు ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైనా ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే. యువత, ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో, చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు.. ఎక్కువగా పారాసిటమాల్ మాత్రలు తీసుకుని
సాక్షి, జీడిమెట్ల: కడుపునొప్పి భరించలేక పారాసిటమాల్ మాత్రలు పెద్ద మొత్తంలో తీసుకున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా శంకర్‌నగర్‌కు చెందిన చేకూరి రాజు, లక్ష్మి(45) భార్యాభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి షాపూర్‌నగర్ సమీపంలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముంటూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా లక్ష్మి గత రెండేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతోంది. పలు ఆస్పత్రిలో చూపించి నా నొప్పి నయం కాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 25న కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో భరించలేక లక్ష్మి ఇంట్లో ఉన్న పారాసిటమాల్ మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. దీంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతున్న లక్ష్మి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం) -
8 కోట్ల జ్వరం బిళ్లలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఆర్నెల్లుగా జ్వరానికి వాడే పారాసెటిమాల్ అత్యధికంగా వినియోగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ, ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పరిశీలనలో వెల్లడైంది. కోవిడ్ నేపథ్యంలో చిన్నపాటి జ్వరం సూచనలు ఉన్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసెటిమాల్ తీసుకుంటున్నారు. గత ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ రాష్ట్రంలో 8,13,44,410 మాత్రలను వినియోగించారు. రోజుకు సగటున 4.51 లక్షల మాత్రలకు పైగా వినియోగం నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2020 కంటే ముందు పోలిస్తే ఈ వినియోగం చాలా ఎక్కువగా ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. భారీగా నొప్పి నివారణ మందులు.. చాలామంది తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులకు అలవాటు పడినట్టు గుర్తించారు. ఆరు నెలల్లో 6.63 కోట్ల డైక్లోఫినాక్ మాత్రలు వాడారంటే పెయిన్‌కిల్లర్స్ వినియోగం ఎలా ఉందో అంచనా వేయచ్చు. ఏదైనా గాయాలైనప్పుడు, ఆపరేషన్లు, విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు తాత్కాలికంగా వాడి గాయాల తీవ్రత తగ్గగానే ఆపాలి. కానీ చాలామంది చిన్న తలనొప్పి, ఒళ్లు నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడ్డారు. ఇవి ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మధుమేహంతో జాగ్రత్త ఒక్కసారి మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొత్తగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత 180 రోజుల్లో 6.44 కోట్ల మెట్ఫార్మిన్ మాత్రలు వినియోగమయ్యాయి. రక్తపోటు (బీపీ) బాధితులకు ఇచ్చే అటెన్‌లాల్ మాత్రలు 3.76 కోట్లు వినియోగమయ్యాయి. బీపీ, షుగర్ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమయానికి తినకపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాలతో గ్యాస్ సమస్యలు తలెత్తి 3.24 కోట్ల ర్యాంటిడిన్ మాత్రలు వినియోగించారు. గత ఆర్నెల్లలో రకరకాల మాత్రలకు రూ.73 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక డబ్లూహెచ్‌వో/జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ స్టాండర్డ్స్) ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో 481 రకాల మందులు ఏదో ఒక సందర్భంలో వినియోగించినట్టు తేలింది. కోవిడ్ సమయంలో ఎక్కడా మందుల కొరత లేకుండా సర్కారు పటిష్ట చర్యలు చేపట్టగలిగిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. -
పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ కరోనా కేసుల సంఖ్య పెరిగితే పారాసిటమాల్ ట్యాబ్లెట్ల కొరత రాకుండా ఉండేం దుకు అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర విదేశీ ఎగుమతుల డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా సహాయం అందిస్తాం. ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావులేదు. విపత్కర పరిస్థితుల్లో భారత్ అంతర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలి’’ అని పేర్కొన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్ ) కాగా కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒకవేళ భారత్ తమకు సహకరించనట్లయితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య పరంగా తమ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన భారత్‌తో సత్పంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని సోమవారం నాటి సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మందుల సరఫరాకు ససేమిరా అన్న భారత్.. మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
పారాసిటమాల్‌తో చికిత్స అంటే...
ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో... ఆ మాటకొస్తే మన దేశంలోనే ఒక విపత్కరమైన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ గురించి భరోసా ఇవ్వడానికో లేదా ధైర్యం చెప్పడానికో ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే... దాన్ని తీసుకొని ‘ఇంత నిర్లక్ష్యమా... చైనాలో, ఇటలీలో పరిస్థితులు కనిపించడం లేదా’ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అలాగని... అక్కడి పరిస్థితులను వివరించి కాస్త అప్రమత్తంగా ఉండమని చెబితే ‘ఎందుకు మరీ ఇంతలా బెదరగొడుతున్నారు’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిపుణులు ఏం చెప్పినా... అటు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండమనో... ఇటు మరింతగా బెంబేలెత్తిపొమ్మనో కాదు. ఈ రెండు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో, ఈ రెండు అంశాల మధ్య బ్యాలెన్స్డ్గా ఎలా వ్యవహరించాలో చూద్దాం. భారత్‌లో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. కేరళకు వచ్చిన వుహాన్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కేసు ఇది. ఆ తర్వాత ఫిబ్రవరి రెండున, మూడున కేరళలోని కాసర్గోడ్లో మరో రెండు కేసులను గుర్తించారు. ఇవి కూడా చైనా నుంచి వచ్చిన వారిలోనే. ఇక మార్చి 1–15 వరకు మొత్తం 110 కేసులను గుర్తించారని కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ వివరాలు తెలుపుతున్నాయి. అదే తెలంగాణ ప్రభుత్వం చెప్పే వివరాలను బట్టి రాష్ట్రంలో ఇప్పటికి ఆరుగురు రోగులను గుర్తించారు. 66.000కు పైగా ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంజనీరుకు కరోనా ఉన్నట్లు అనుమానించగానే అతడు లేదా అతడిని తాకారని భావించిన 36 మందిని గుర్తించి వారందరినీ ట్రాక్ చేసి, వారికి పరీక్షలు నిర్వహించారు. మన దేశం, రాష్ట్రాల్లో ఈ వారమే కీలకం... మన రాష్ట్రంతో పాటు దాదాపు దేశమంతటా మార్చి మొదటివారంలో (జనవరి 30న కనుగొన్న కేసును మినహాయించి) కరోనా కేసులు కనుగొన్నారు. ఇప్పటికి రెండో వారం గడిచి మూడోవారంలోకి మనం ప్రవేశించనున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి, రెండో, మూడో వారం నాటి ధోరణులను చూద్దాం. న్యూయార్క్‌లో మొదటివారం రెండు కేసులు నమోదు కాగా... రెండోవారంలో ఆ సంఖ్య 105కు పెరిగింది. మూడో వారంలో రోగుల సంఖ్య కాస్తా 610కి మించిపోయింది. అలాగే ఫ్రాన్స్‌లో మొదటి వారంలో 12 మంది రోగులను కనుగొంటే... రెండోవారానికి 190 మంది మూడో వారానికి ఆ సంఖ్య 660కి పెరిగింది. ఇరాన్లో పరిస్థితి ఇంకా భీతావహంగా ఉంది. మొదటివారంలో కేసుల సంఖ్య 2 మాత్రమే ఉండగా రెండోవారంలో 43, మూడోవారంలో 245, మూడోవారంలో 4,400కు పైగా, ఐదో వారంలో దాదాపు 13,000 కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో మొదటివారంలో 3, రెండోవారంలో 150, మూడోవారంలో 1036, నాలుగోవారంలో 6,300, ఐదోవారంలో 21,157 కేసులు నమోదయ్యాయి. ఇక మన భారత్ విషయానికి వద్దాం. మొదటివారంలో 3 కేసులు, రెండో వారంలో 24 కేసులు, మూడోవారంలో 110 కేసులు వచ్చాయి. ఈ గణాంకాల ధోరణలు పరిశీలిస్తే... మొదటి వారం కంటే రెండోవారినికి వందల సంఖ్యలో కేసులు పెరిగితే... రెండో వారం నుంచి మూడోవారానికి అవి వేల సంఖ్యకు చేరుకున్నాయి. నాలుగు–ఐదు వారాల్లో 10,000 సంఖ్యను తాకుతున్నాయి. అంటే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంటే... మూడో వారం నుంచి నాలుగోవారానికి వేల సంఖ్యకు చేరుతున్నందున.... ఇప్పుడు మనం మూడో వారంలో ఉన్నందున ఈ దశలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మరణాల శాతం తక్కువఅని నిర్లక్ష్యం వద్దు అందరూ చెబుతున్న మాట ఏమిటంటే... కరోనా కేసుల కారణంగా నమోదైన మరణాలు 2 శాతమేనని. ఈ సంఖ్య చాలా తక్కువగా అనిపించినా మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వహించడానికి వీల్లేని పరిస్థితి. మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. అందుకే కేవలం ఒక శాతం మందికి కరోనా సోకినా... రోగుల సంఖ్య కోటి మందికి పైమాటే. అందులో రెండు శాతం అంటే... రెండు కోట్ల మంది. ఈ సంఖ్యను ఊహించడానికే భయంగా ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉంటూనే... భయం లేకుండా వ్యవహరించమని నిపుణుల సలహా ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం నిపుణులు ఏవైనా ధైర్యవచనాలు చెబితే నిర్లక్ష్యాన్ని పెంచుతున్నారనీ... ఏవైనా జాగ్రత్తలు ఉటంకిస్తే అసలే భయపడుతున్న తరుణంలో మరింతగా బెంబేలెత్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారాసిటమాల్‌తో చికిత్స అంటే... చికిత్సకు పారాసిటమాల్ పనికి వస్తుందంటే... కేవలం పారాసిటమాల్ వల్లనే కరోనా వైరస్ నయమవుతుందని కాదు. కానీ పారాసిటమాల్ కీలక భూమిక వస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఎందుకంటే... వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధికైనా లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అంటే... అది ఏ వైరస్ అయినప్పటికీ, దాని కారణంగా జ్వరం వస్తే అది తగ్గేందుకు, దానితోపాటు కనిపించే తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గేందుకు ఇచ్చే తొలి మాత్ర ‘పారాసిటమాల్’. దాని తర్వాత అవసరాన్ని బట్టి ‘ఫావిలావిర్’ అని కరోనా కోసం ఏర్పరచి ప్రోటోకాల్‌లో నిర్ణయించిన మాత్ర... ఆ తర్వాత అవసరాన్ని బట్టి వ్యాధి నిరోధకత పెంచేందుకు ఒక్కోసారి హెచ్ఐవీకి వాడే మాత్రలను డాక్టర్లు ఇస్తుంటారు. తమదైన ప్రోటోకాల్‌తో కరోనా వైరస్‌ను నయం చేసిన మన జైపూర్ డాక్టర్ల చికిత్స విధానాన్ని తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వెల్లడవుతోంది. ఇప్పటికి ఇంకెక్కడా దీనికి నిర్దిష్టమైన ప్రోటోకాల్ లేనందున, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎమ్ఆర్) సంస్థ అనుమతితో మనం స్వయంగా ఈ ప్రోటోకాల్ రూపొందించుకున్నాం. అయితే... పారాసిటమాల్ అనేది అందరికీ తెలిసిన మాత్ర కాబట్టి దానిని ఉదాహరిస్తుంటారు తప్ప... అదే సర్వ వైరస్ల రోగాలకు నివారిణి అని కాదు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కొందరు విమర్శలకు దిగుతుంటే... నిర్లక్ష్యంగా వ్యవహరించే మరికొందరు పారాసిటమాల్ చాలట అంటూ ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఈ రెండు ధోరణులూ తప్పే. అతి భయమూ కూడదు. ఉదాసీనతా పనికి రాదు. గణాంకాలు ధైర్యం కోసమే... ఇటీవల చివరి రోగిని సైతం డిశ్చార్జ్ చేసిన చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారిని పరిశీలిస్తూ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా తెలిసిన వివరాల ప్రకారం... మొత్తం 72,000 మంది రోగులను పరిశీలించగా... వారిలో గుండెజబ్బులు ఉన్న వెయ్యి మందిలో 105 మంది, డయాబెటిస్తో బాధపడుతున్న వెయ్యిలో 73 మంది, ఆస్తమా ఉన్న వెయ్యిమందిలో 63 మంది హైబీపీతో బాధపడుతున్న వందమందిలో ఆరుగురు రోగులు, క్యాన్సర్‌తో బాధడుతున్న 1000 మందిలో 56 మంది మరణించారని తేలింది. అంటే... గుండెజబ్బులున్నవారిలో దాదాపు 90 శాతం, డయాబెటిస్తో బాధపడేవారలో 93 శాతం, ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో 94 శాతం, క్యాన్సర్ వ్యాధిగస్తుల్లో 95 శాతం మంది సురక్షితమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏ జబ్బూ లేనివారిలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే మృతి చెందారని ఈ వివరాలు చెబుతున్నాయి. దీని అర్థం గుండెజబ్బులున్నవారిలో 10.5% మంది, డయాబెటిస్తో బాధపడుతున్నవారిలో 7.3% మంది, ఆస్తమా ఉన్నవారిలో 6.3 శాతం మంది, హైబీపీ రోగుల్లో 6% మంది ‘మాత్రమే’ మరణించారని చెబితే... ఈ ‘మాత్రమే’ అన్న పదాన్ని పరిగణనలోకి తీసుకుని వారు చనిపోయినా పర్వాలేదా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. అయితే ఇక్కడి గణాంకాల ద్వారా చెప్పే విషయం ఏమిటంటే... ఆ కొద్దిశాతం మంది మరణించినా పర్లేదని దాని అర్థం కాబోదు. కేవలం ఇంత కొద్దిశాతం మాత్రమే మరణాలు ఉన్నందున, మనమంతా ఆశాజీవులం కాబట్టి... ఒకవేళ వ్యాధిసోకినా కూడా... మనం కూడా బతికి బయటపడ్డ వారి జాబితాలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ అని భరోసా ఇవ్వడమే. ప్రతి జీవితమూ చాలా విలువైనదే, అమూల్యమైనదే (ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్). కాబట్టి ఇక్కడ పేర్కొన్న శాతాలను బట్టి మిగతావాళ్లు చనిపోయినా పర్వాలేదు అనేలా వ్యాఖ్యానించడం పొరబాటన్నది వైద్యనిపుణుల, అధ్యయనవేత్తలు/గణాంకవేత్తల, శాస్త్రవేత్తల మాట. ఏ విషయాలైనా వివరించినప్పుడు దాన్ని పట్టుకుని అయితే ఆ చివరకో... లేదంటే ఈ చివరకో (ఎయిదర్ దిస్ ఎక్స్ట్రీమ్... ఆర్ దట్ ఎక్స్ట్రీమ్) అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. అలాగే ధైర్యం–భయాందోళనల విషయంలో అటు చివర, లేదంటే ఇటు చివర ఉండటం కూడా తప్పే. ఏ విషయంలోనైనా బ్యాలెన్స్డ్గా ఉండేలా ఈ తరుణంలో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది.- డాక్టర్ ఎస్. మల్లికార్జున్ రావు,సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో గత 8 నెలల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఏకంగా 93 కోట్లకు పైగా పారాసెటిమాల్ మాత్రలను వినియోగించారని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాస్పత్రుల వరకూ మందుల వినియోగంలో పారాసెటిమాల్ మాత్రలే మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.35 కోట్లని ఈ–ఔషధి గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌కు వివరాలు అప్లోడ్ కాలేదని, అవి కూడా అందితే పారాసెటిమాల్ మాత్రల వినియోగం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పెయిన్ ‘కిల్లర్స్’ నొప్పి నివారిణి (పెయిన్ కిల్లర్) మాత్రలు తరచూ వాడితే పెను ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది రోగులు పెడచెవిన పెడుతున్నారు. గత 8 నెలల్లో.. 76.26 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలను రోగులు వాడారు. మాత్రల వినియోగంలో పారాసెటిమాల్ తర్వాత వీటిది రెండో స్థానం. నెలకు సగటున 9.53 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలు వాడుతున్నారని వెల్లడైంది. చిన్న చిన్న నొప్పులకు కూడా ఎక్కువ మంది రోగులు పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల సంఖ్య 60.38 కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా వినియోగించే మందుల్లో రక్తపోటు (బీపీ) మందులు కూడా ఉంటున్నాయి. అస్తవ్యస్త జీవనశైలిలో భాగంగా రక్తపోటు (బీపీ) పెరుగుతున్న నేపథ్యంలో మందుల వాడకం ఎక్కువవుతోంది. గత 8 నెలల్లో 40.28 కోట్ల అటెన్‌లాల్ 50 ఎంజీ మాత్రలను బీపీ వ్యాధిగ్రస్తులు వాడారు. అదేవిధంగా మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారు 60.38 కోట్ల మెట్ఫార్మిన్ 500 ఎంజీ మాత్రలను వినియోగించారు. -
ట్యాబ్లెట్లో దోమ
సంగారెడ్డి రూరల్ : గ్రామ ఆరోగ్య వేదికలో వైద్య సిబ్బంది అందజేసిన ప్యారసెటమాల్ ట్యాబ్లెట్లో దోమ రావడంతో అధికారులు కంగుతిన్నారు. బుధవారం సంగారెడ్డి రూరల్ మండల కేంద్రమైన కందిలో గ్రామ ఆరోగ్య వేదిక నిర్వహించారు. లక్ష్మీనగర్‌కు చెందిన సీహెచ్ రాము అనే యువకుడికి జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఉండటంతో ఆరోగ్య వేదికకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన రాము, సిబ్బంది ఇచ్చిన ట్యాబ్లెట్లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్ ట్యాబ్లెట్ ప్యాకింగ్‌లో మృతి చెందిన దోమ ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే ఆరోగ్య వేదికకు వచ్చి ట్యాబ్లెట్‌ను సిబ్బందికి చూపించడంతో వారు ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకొని పైఅధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
కలుషితం కాటేసింది
నెల్లూరు (పొగతోట/కలెక్టరేట్/బారకాసు), న్యూస్‌లైన్ : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వసతిగృహ అధికారుల తీరు తయారైంది. మూడురోజులుగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అల్లాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పారాసిట్మాల్, మెట్రాండిజోల్ మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 23 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో వసతిగృహ అధికారులు హడావుడి చేశారు. స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్దనున్న తిక్కవరపు మీనమ్మ ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలోని విద్యార్థినులు కలుషిత నీరు అస్వస్థతకు గురయ్యారు. 23 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డీఎస్ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ ఉన్నతాధికారుల సమాచారంతో కలెక్టర్ శ్రీకాంత్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వసతిగృహ విద్యార్థుల కోసం నిర్మించిన గ్రౌండ్ లెవల్ వాటర్ ట్యాంక్‌లో నీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లెవల్లో ఉండటంతో డ్రైనేజీ వాటర్ మంచినీరులో కలసి కలుషితమైంది. అలస్యంగా తెలుసుకున్న వసతి గృహ అధికారులు కార్పొరేషన్ అధికారులకు సచాచారం ఇవ్వడంతో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. వసతి గృహంలో పారిశుధ్యం అధ్వన్నంగా ఉంది. హాస్టల్‌కు ఎదురుగా సులభ్‌కాంప్లెక్స్ నిర్మించారు. విద్యార్థులు దుర్గంధం భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. మార్కెట్లోని వ్యాపారులు వసతి గృహం వద్ద మూత్ర విసర్జన చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. వసతి గృహం వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. వసతి గృహంలో విద్యార్థుల కోసం గత కలెక్టర్ శ్రీధర్ ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ఆర్ఓ ప్లాంట్స్ మరమ్మతులకు గురై నాలుగు నెలలు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. రిపేరు ఎవరు చేస్తారో తెలియక పట్టించుకోలేదని వసతి గృహ అధికారి జ్యోతిరాణి చెప్పడం విడ్డూరంగా ఉంది. హాస్టల్ సముదాయంలో మూడువసతి గృహాల్లో ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గత మూడేళ్లుగా విద్యార్థినులకు వైద్యసేవలు అందడంలేదు. ప్రతి రెండో శనివారం వసతి గృహంలోని విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఉదయం టిఫెన్, రాత్రికి భోజనం వసతి గృహంలో అందిస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. విద్యార్థినులతో నిండిన జిల్లా ఆస్పత్రి డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల (పెద్దాస్పత్రి)లో విద్యార్థినులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఠాగూర్, ఆర్ఎంఓ డాక్టర్ ఉషాసుందరి పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల అన్ని సౌకర్యాలతో తిర్చిదిద్దిన ఆస్పత్రిలోని సాధారణ వార్డును విద్యార్థినులకు కేటాయించారు. ఎప్పటికప్పుడు వైద్యసేవల విషయమై పర్యవేక్షించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, నగర డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, తహశీల్దార్ నరసింహులు, డీఎస్‌డబ్ల్యూఓ నాగేంద్రరావు, తదితర అధికారులు పెద్దాస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అలాగే హాస్టళ్ల వార్డన్లు కూడా ఆస్పత్రి వద్ద ఉంటూ అవసరమైన సేవలందిస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన తమ పిల్లలు అస్వస్థతకు లోనైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హుటాహుటిన పెద్దాస్పత్రికి చేరుకున్నారు. పిల్లల ఆరోగ్యంపై సిబ్బందిని అడిగి తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. బెడ్లపై వైద్యం పొందుతున్న పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుని ఏమీ కాదమ్మా నీకు అంటూ ఓదార్చుతూ అక్కడే ఉండిపోయారు. పిల్లలకు ఏమీ కాదని వైద్యులు భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హాస్టల్ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని కలెక్టర్ శ్రీకాంత్ వార్డెన్లను హెచ్చరించారు. కలుషిత నీటివల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆయన తీవ్ర స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నగరంలోని మద్రాస్బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. కలుషితనీటికి కారణైమైన మెయిన్పైప్లైన్ను వెంటనే మార్చాలని కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొత్త పైప్‌లైన్‌ను వేయాలని సూచించారు. అప్పటి వరకు విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలన్నారు. తాగునీటి పైప్లైన్లు శిథిలావస్థకు చేరితే ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గృహ అవసరాలకు వినియోగించే పైప్లైన్లు దెబ్బతిన్నాయన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పైప్లైన్లు దెబ్బతిని మురుగునీరు పంపిణీ అవుతుందన్న విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ఎందుకు గుర్తించడంలేదన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దంటూ తీవ్రంగా మందలించారు.