నీళ్లోసుకుంటే ఈ మాత్రేసుకోవద్దు! | Paracetamol use in pregnancy: Not as safe as we may think? | Sakshi
Sakshi News home page

నీళ్లోసుకుంటే ఈ మాత్రేసుకోవద్దు!

Published Tue, Sep 17 2024 12:01 PM | Last Updated on Tue, Sep 17 2024 1:08 PM

Paracetamol use in pregnancy: Not as safe as we may think?

గర్భధారణ జరిగాక సాధారణంగా పారాసిటమాల్‌ వంటి మందులు తప్ప మహిళలకు ఎలాంటి మందులూ ఇవ్వరు. కొన్ని రకాల మందులైతే అస్సలు ఇవ్వకూడదు కూడా. కొన్ని మందులు తీసుకోవడం వల్ల గర్భంలోని పిండంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్త. అలాంటి మందులేవో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ కథనం...

గర్భవతులు వాడకూడని మందులేమిటో పోరబాటున వాడితే వచ్చే ప్రతికూల ప్రభావాలెలా ఉంటాయో తెలుసుకుందాం. 
యాంటీకన్వల్‌సెంట్స్‌ : ఫిట్స్‌ వ్యాధి ఉన్నవారిలో సీజర్స్‌ తగ్గడానికి వాడే మందులివి. కార్బమాజిపైన్, సోడియం వాల్‌్రపోయిక్‌ యాసిడ్, ఫెనీటోయిన్‌ వంటి అన్ని యాంటీకాన్వల్‌సెంట్‌ మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో చెవి, ముఖానికి సంబంధించిన ఎముకల అపసవ్యత, న్యూరల్‌ ట్యూబ్‌ లో΄ాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. 

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫిట్స్‌ రావడంతో మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ΄్లాన్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఫిట్స్‌ కోసం ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు దాన్ని కేవలం ఒకే ఒక టాబ్లెట్‌కు పరిమితం చేసుకుని, ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకుని, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కా΄ాడుకుంటుంటే నిరభ్యంతరంగా గర్భధారణకు ΄్లాన్‌ చేసుకోవచ్చు. 

కానీ తల్లి వాడే కొన్ని రకాల ఫిట్స్‌ మందులు పిండంపై దుష్ప్రభావం చూపవచ్చు. అలాంటప్పుడు బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా, గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్‌ లిప్, క్లెఫ్ట్‌ ΄ాలెట్‌ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు (కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజెస్‌) వంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఫిట్స్‌ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేలా మోతాదులు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ΄్లాన్‌ చేయాలి.  
 
యాంటిసైకోటిక్‌ : ఇవి మానసిక çసమస్యలకూ, మనసు నిలకడగా ఉండటానికి వాడతారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో ఇచ్చే లిథియమ్‌ వల్ల గుండెకు సంబంధించిన ఎబ్‌స్టైన్‌ అనామలీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మానసిక సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ΄్లానింగ్‌ చేసుకోకూడదు. 
 
యాంటీమైగ్రెయిన్‌ మందులు :  ఎర్గోటమైన్, మెథీజరిజడ్‌ వంటి మందుల్ని తలనొప్పి  తగ్గడానికి ఇస్తారు. వీటి వల్ల సమయానికి ముందే ప్రసవం అయి΄ోయే అవకాశాలెక్కువ. కాబట్టి మైగ్రేన్‌ మందులు వాడుతుంటే గైనకాలజిస్టుకు ఆ విషయం చె΄్పాలి. 
 
యాంటీ బయాటిక్స్‌ : ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి వాడే ఈ మందులు బిడ్డలో అనేక దుష్ప్రభావాలు కలగజేయవచ్చు. ఉదా: టెట్రాసైక్లిన్స్‌ వల్ల దంతాల రంగుపోవడం, ఎముకల ఎదుగుదలకు అడ్డంకులు వంటి సమస్యలు రావచ్చు. సల్ఫోనమైడ్స్‌ అనే మందుల వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే కామెర్లూ, స్ట్రె΄్టోమైసిన్‌ వాడటం వల్ల చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. 
 
యాంటీకోయాగ్యులెంట్స్‌ : రక్తం గడ్డకట్టడంలో లోపాలుంటే ఇచ్చే వార్‌ఫేరిన్‌ డైఫినాడైయాన్‌ గ్రూపుకు చెందిన ఈ మందుల వల్ల ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతిలో రక్తస్రావం, కంటి  అపసవ్యతలు ఏర్పడటం, తల పెరగకుండా ఉండటం, ఫలితంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలెక్కువ. 
 
యాంటీ డయాబెటిక్‌ : మధుమేహానికి వాడే మందులైన క్లోరో్రపోమైడ్‌ వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే చిన్నారి తాలూకు రక్తంలో గ్లూకోజ్‌ తగ్గడం (హైపోగ్లైసీమియా) వంటి కండిషన్లు ఏర్పడవచ్చు. 
  
విటమిన్‌–ఎ అనలాగ్స్‌ : ఈ మందుల్ని మొటిమలు (యాక్నే) చికిత్సలో వాడతారు. ఎట్రటినేట్, ఐసోట్రెటినోయినిన్‌లాంటి మందులతో చెవులు చిన్నగా ఉండటం, గుండె సమస్య, మెదడులోకి నీరు చేరడం, అబార్షన్‌ కావడం, ముఖాకృతిలో తేడాలు రావడం వంటివి జరగవచ్చు. 
 
డయాగ్నస్టిక్‌ రేడియోలజీ :  గర్భం ధరించిన తొలిరోజుల్లో ఎక్స్‌–రే తీయించిన కేసుల్లో... చిన్నారి పుట్టిన తొలి ఏళ్లలో లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలెక్కువ. అందుకే గర్భవతులు రేడియేషన్‌కు ఎక్స్‌΄ోజ్‌ కావద్దంటూ ఎక్స్‌రే రూమ్‌ల ముందు స్పష్టంగా హెచ్చరిక రాసి ఉంటుంది. 

గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడినప్పటికీ చిన్నారి  మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. ఏ మందు ఎంత సురక్షితమో లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి గర్భవతులు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే వారు డాక్టర్‌ను తప్పక సంప్రదించాకే వాడాలని గుర్తుంచుకోండి. డాక్టర్లు సైతం ఆ మందుల అవసరాన్ని, బిడ్డపై పడే ప్రభావాల్ని జాగ్రత్తగా బేరీజు వేశాకే తల్లికి ప్రిస్క్రయిబ్‌ చేస్తారు.     
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement