న్యూఢిల్లీ: గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ తెలిపారు.
‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్‌గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు!
Comments
Please login to add a commentAdd a comment