glucose levels
-
ప్యాంక్రియాటైటిస్ వస్తే?
దేహంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి)ది కీలక పాత్ర. దీని నుంచి అవసరమైనప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవసరమైనప్పుడు శక్తిని తీసుకునేందుకు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వల్లనే డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సొమాటోస్టాటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఓ చిన్న గొట్టం ద్వారా జీర్ణప్రక్రియకు అవసరమైన క్లోమరసం కూడా వచ్చి చిన్నపేగుల దగ్గర కలుస్తుంది. ఏవైనా కారణాల వల్ల ఈ క్లోమరసం తాలూకు స్రావాల్లోని ప్రోటీన్లు ఉండల్లాగా మారి, క్లోమరసాన్ని తీసుకెళ్లే గొట్టానికి అడ్డుపడ్డప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ గ్రంథిలోనే రాళ్లలా ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘ప్యాంక్రియాటైటిస్’ అంటారు. నిజానికి ఇది అంత ప్రాణాంతకం కానప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే దీనికి చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు : ► తిన్నది జీర్ణం కాకపోవడం ► ఏదైనా తిన్నవెంటనే కడుపులో తీవ్రమైన మంట, నొప్పి ► స్వల్పంగా జ్వరం ► పొట్టభాగం ఎడమవైపున పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి మొదలై కొన్ని సందర్భాల్లో అది వీపుకు వైపునకు పాకుతుండటం ► కామెర్లు ఠీ పొట్ట ఉబ్బరం ఠీ వాంతి అవుతున్నట్లు అనిపిస్తుండం (వికారం) ► కొందరిలో విరేచనాలు కావడం ► కడుపుపైన తాకితే భరించలేనంత బాధ (టెండర్నెస్) ► కొందరిలో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కారణాలు : ఏ కారణం లేకుండానే పాంక్రియాస్లో రాళ్ల వంటివి రావడం జరుగుతుంది. అయితే కొందరిలో మితిమీరిన మద్యపానం చాలావరకు పాంక్రియాటైటిస్‌కు కారణమవుతుంది. నిర్ధారణ పరీక్షలు : బాధితులకు కొన్ని రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేసి, పాంక్రియాస్ నుంచి వచ్చే నాళం ఎంత దెబ్బతిన్నదీ, ఆ గ్రంథి ఏ మేరకు ఉబ్బి ఉంది అన్న విషయాలు తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స : పాంక్రియాటైటిస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటే కొన్ని రకాల మందులతో దాన్ని తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. మందులతో తగ్గనప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ల్యాపరోస్కోపిక్ / కీహోల్ శస్త్రచికిత్సలతో కడుపుపై కత్తితో కోయకుండానే, చిన్నపాటి గాట్లతోనే శస్త్రచికిత్స చేసి, ప్యాంక్రియాస్ గ్రంథిలోని దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన సమయం, ఇతర ఇన్ఫెక్షన్లు, సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు బాగా తగ్గిపోతాయి. -
3 గంటల ముందే లైట్లార్పితే.. గర్భిణుల్లో మధుమేహానికి చెక్! కీలక విషయాలు
న్యూఢిల్లీ: గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ తెలిపారు. ‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్‌గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు! -
షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి?
ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. డయాబెటిస్ రెండు రకాలు.. మొదటి రకం (టైపు -1) ఇది.. పిల్లల్లో వచ్చేది . శరీరానికి రక్షణ కల్పించాల్సిన ఇమ్మ్యూనిటి వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంపైనే దాడి చేస్తుంది. పెద్దల్లో కనిపించే టైపు - 2 డయాబెటిస్‌కు కారణాలివే.. ►ఒంటికి సూర్య రశ్మి తగలక పోవడం - దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం ►అధిక బరువు - ఊబకాయం - శారీరిక శ్రమ లోపించడం, అధిక తిండి ►జన్యు వారసత్వం (తల్లి తండ్రి లో ఒకరికి ఉన్నా వచ్చే అవకాశముంది) ►టెన్షన్ - స్ట్రెస్ ►భోజనంలో పిండిపదార్థాలు ఎక్కువ కావడం - ప్రోటీన్ , పీచు లాంటివి బాగా తక్కువ కావడం రాకుండా ఎలా కాపాడుకోవాలి ? ►చిన్నపటి నుంచి పిల్లలని, బుసబుస పొంగే కూల్ డ్రింక్స్ , పిజ్జా , బర్గెర్ , పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. ఆయా కాలాల్లో దొరికే పళ్ళు బాగా తినాలి. పిల్లలు ఆటలాడాలి ►ఒకప్పుడు నలబై యాభై లలో డయాబెటిస్ వచ్చేది . ఇప్పుడు ముప్పై వయసులోనే కొంతమందిలో ఇరవై లోనే టైపు 2 చక్కర వ్యాధి వచ్చేస్తోంది . గతం తో పోలిస్తే ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది ►క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం , రక్తం లో ఇన్సులిన్ ఉన్నా అది సరిగా స్పందించకపోవడం - ఈ కారణంచేత రక్తం లో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి . ఇదే చక్కర వ్యాధి రక్తం లో గ్లూకోస్ లెవెల్ ఎంత ఉండాలి? ►ఇంట్లో accu చెక్ లాంటి పరికరంతో రక్తం లో గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు ►అన్నం తిన్నాక గంటన్నర కు చెక్ చేసుకోవాలి . రీడింగ్ 140 ఉంటే సమస్యే లేదు . 180 దాక ఉన్నా పెద్దగా సమస్య కాదు . 300 దాటితే మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్టు ►500 దాటితే ఆపాయ స్థితి సహజ పద్ధతిలో డయాబెటిస్‌ను ఎలా జయించాలి ? ►రోజుకు కనీసం 30 నిముషాలు ఎండలో { ఉదయం లేదా సాయంకాలం} వేగంగా నడవాలి . అప్పుడు డి విటమిన్ అందుతుంది . శారీరిక శ్రమ వల్ల ఇన్సులిన్ ఉత్త్పత్తి పెరుగుతుంది/దాని పని తీరు మెరుగు పడుతుంది. బరువు కూడా తగ్గడం దీనికి మరింత దోహద పడుతుంది . ►మానసిక ఒత్తడికి దూరం కావాలి . అనారోగ్యం గా వున్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు . అది పెద్ద సమస్య కాదు. టెన్షన్ ఉన్నప్పుడు కూడా ►ఆధునిక జీవనం టెన్షన్ ల మయం. కొద్దిపాటి లేదా కాసేపు టెన్షన్ సరే అనుకోవచ్చు . రోజుల తరబడి టెన్షన్ పడితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగి పోతుంది . యోగ , పాటలు వినడం, NLP .. ఏ పద్దతి అయినా ఫరవాలేదు. ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి . తగిన విశ్రాంతి , నిద్ర , సంతోషం , తృప్తి.. ఇవన్నీ అవసరం . ►ఎలాంటి మందులు లేకుండా చక్కర వ్యాధి ని దూరం చేయాలంటే ఆహార నియమాలు తప్పని సరి . పిండి పదార్థాలు అంటే బియ్యం గోధుమలు లాంటి వాటితో చేసిన వంటకాలు - బాగా తగ్గించాలి. ►తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మెరుగు, దాని కన్నా బాసుమతి మెరుగు . దాని కన్నా సిరి ధాన్యాలు మెరుగు . మీ కంచం లో పిండి పదహార్థాలనిచ్చే బియ్యం తో చేసినవి గోధుమలతో చేసినవి బాగా తక్కువ ఉండాలి. ►ఆరు పాళ్లల్లో కేవలం ఒక పాలు మాత్రం ఇవి కావాలి . మిగతావి అయిదు రెట్లు ఉండాలి . అంటే అన్నం ఒక కప్పు అయితే ఆకుకూరలు , కాయగూరలు , మాంసాహారులైతే చికెన్, మటన్, చేపలు, గుడ్డు, శాకాహారులైతే పన్నీర్, పప్పు , వేరుశనగ గింజలు, బ్రాన్ చన, పుట్ట గొడుగులు ఇవి అయిదు పాళ్లు కావాలి. ప్రతిదీ ప్రతి రోజూ తినాలని కాదు. వీలు బట్టి .. అవకాశాన్ని బట్టి.. ►ఆకు కూరలు కాయగూరలు మాత్రం ప్రతి రోజు .. ఆ మాటకు వస్తే ప్రతి పూట ఉండేలా చూసుకోవాలి. కాయగూరల్ని కొన్ని పచ్చివిగా తినొచ్చు . ఉదాహరణ కీర.. మిగతావి మీ టేస్ట్ బట్టి కుక్ చేసి ►కాయగూరల్లో బంగాళాదుంప లాంటివి బియ్యం తో సమానం. అంటే వీటిలో పిండి పదార్థాలు అధికం. కాబట్టి వాటిని తక్కువగా వాడాలి. మీ బ్లడ్ గ్లూకోస్ ఎక్కువ స్థాయిలో ఉంటే అసలు తినకూడదు . ►చికెన్, మటన్, పనీర్ లాంటివి ప్రోటీన్ ను అందిస్తాయి . ఇవి ఎంతో అవసరం . ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీ లు పాడైపోతాయి అనుకోవడం అపోహ. మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే మీకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది వరకే కిడ్నీ సమస్య ఉన్నవారు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవద్దు. ►ఒకటి -రెండు నెలలుప్రతి రోజు .. మీ గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోండి . రెండు కప్పుల తెల్లన్నం తిన్నా , మీ రీడింగ్ 140 దాటడం లేదంటే మీకు షుగర్ సమస్య లేనట్టే . అలాగని ఎక్కువ తెల్లనం తింటే ఊబకాయం వచ్చి భవిషత్తులో షుగర్ సమస్య రావొచ్చు . మీ రీడింగ్ 250 లోపు ఉంటే , మరుసటి పూట అన్నం తగ్గించండి . ఖీర, చికెన్ లాంటివి పెంచండి. ►ఇలా ఒక నెల రోజులు ప్రతి రోజూ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటుంటే మీ శరీర తత్త్వం మీకే అవగాహన అయిపోతుంది. ఎలాంటి ఫుడ్ తింటే మీ రీడింగ్ 140 లోపే వుందని అర్థం చేసుకొంటారు ►వీలైనంత వరకు 140 లోపు ఉంచేలా ప్రయత్నించండి . 180 దాక అయినా ఫరవాలేదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మీ రీడింగ్ ను 140 దాటకుండా చూసుకొంటే ఎప్పుడో ఒక సారి జిహ్వచాపల్యం తట్టుకోలేక స్వీట్స్ లాంటివి తిని రీడింగ్ కాసేపు 250 టచ్ చేసినా ఏమీ కాదు. అర గంటలో తగ్గిపోతుంది. ►ఇలా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ మీ రీడింగ్‌ను 140 దాటకుండా రెండు -మూడు నెలలు చూసుకోగలిగితే , అప్పుడు సాయంకాలం ఒక పండు తినొచ్చు . బాగా తీయగా వుండే మామిడి, ద్రాక్ష, అరటి కాకుండా మిగతా పళ్లు.. దీని వల్ల మీ క్లోమం బలపడుతుంది. షుగర్ సమస్య దూరం అయిపోతుంది . ►రెండు మూడు నెలలు రీడింగ్ చూసుకొంటే ఆ తరువాత మీకే ఐడియా వస్తుంది. ఏ ఫుడ్ తినాలి ? ఎంత తినాలి ? ఎంత తింటే రీడింగ్ ఎంత ఉంటుంది? అని. అప్పుడు మీకు మీరే న్యూట్రిషనిస్ట్. ఇలా శాశ్వతంగా డయాబెటిస్‌ను జయించవచ్చు . మీ రెడింగ్ 300 దాటితే మీకు ఇన్సులిన్ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వాడుతున్న మెట్ఫార్మిన్ లాంటివి ఒక్క సరిగా మానేస్తే షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కిడ్నీ లు దెబ్బ తిని ఉంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ మంచిది కాదు . అలాంటాప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఆచి తూచి రిస్క్ లేని రీతిలో నెమ్మదిగా పాటించొచ్చు -వాసిరెడ్డి అమర్నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు -
ఫాస్టింగ్ కాస్తంత ఎక్కువగా... పోస్ట్ లంచ్ తక్కువగా ఉంటోందా?
డయాబెటిస్‌ను నిర్ధారణ చేసేందుకు సాధారణంగా పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్) ఒకసారి రక్తపరీక్ష, తిన్న తర్వాత దాదాపు రెండు గంటలకు మళ్లీ మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్’ అనే స్థితిలో ఉన్నారనీ... అంటే రక్తంలో చక్కెర అదుపు సరిగా లేని కారణంగా భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు హెచ్చరిస్తారు. ఫాస్టింగ్ విలువలు ఎక్కువగా... పోస్ట్ లంచ్ మరీ తక్కువగా ఉంటే...? కొందరిలో ఫాస్టింగ్ విలువలు 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్లంచ్లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. ఎందుకిలా జరుగుతుందంటే... రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు బాగా పడిపోతాయి. ఇలాంటి పరిణామం జరిగినప్పుడే పోస్ట్ లంచ్ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. ముందస్తు సూచనగా పరిగణించాల్సిందే... డయాబెటిస్ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... దీన్ని కూడా డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్’గా పరిగణించవచ్చు. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, అన్ని రకాల పోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ బాగానే ఉపయోగపడతాయి. -
మధుమేహులకు తీపికబురు
వాషింగ్టన్ : పండ్ల రసాన్ని నేరుగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే ఆందోళన అసంబద్ధమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ఫ్రూట్ జ్యూస్‌తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో చేపట్టిన ఈ అథ్యయనంలో పండ్ల రసాల ప్రభావం గ్లైసిమిక్ కంట్రోల్‌పై ఎలాంటి ప్రభావం చూపినట్టు వెల్లడికాలేదు. ఫ్రూట్ జ్యూస్‌లు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్‌పై సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా చేపట్టిన ఈ అథ్యయనం మధుమేహ చికిత్సలో మైలురాయిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. యాపిల్, బెర్రీ, సైట్రస్, ద్రాక్ష, దానిమ్మ జ్యూస్‌ల ప్రభావం షుగర్ లెవెల్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఈ అథ్యయనంలో విశ్లేషించారు. టైప్ 2 డయాబెటిస్‌ను ఆరోగ్యకర జీవన శైలి, సరైన ఆహారం, వ్యాయామంతో నియంత్రించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూట్రిషనల్ సైన్స్ జర్నల్‌లో అథ్యయన ఫలితాలను ప్రచురించారు. -
ఆకు కూరలతో బుర్రకు పదును!
ఆకు కూరలతో బుర్రకు పదును! ఆకు కూరలు తింటే ఆరోగ్యం బాగుపడుతుందని చాలాసార్లు విని ఉంటాం. ఇందులో గొప్ప విశేషమేమీ లేకపోవచ్చు. కాకపోతే ఇవే ఆకు కూరలు ప్రతిరోజూ తింటూ ఉంటే... వయసుతో పాటు మెదడు పనితీరు మందగించడానన్నీ తగ్గిస్తుందని అంటున్నారు రూథ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే పదకొండేళ్లలో మెదడుకు జరిగే నష్టాన్ని ఒక్క రోజు ఆకుకూరలు తినడం ద్వారా పరిహరించవచ్చు. షికాగో ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు వెయ్యిమంది వృద్ధులు (81 ఏళ్ల సగటు వయసు) పై పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్టు మార్థా క్లెయిర్ మోరిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మతిమరపు వంటి లక్షణాలేవీ లేని సమయంలో పరిశోధన మొదలుపెట్టామని, జ్ఞాపకశక్తి, ఆలోచనలకు సంబంధించి ఏటా పరీక్షలు పెట్టి చూశామని వివరించారు. వీటితోపాటు వారు ఎంత తరచుగా ఆకుకూరలు తింటూండేవారో తెలుసుకున్నామని మార్థా వివరించారు. ఈ అంశం ఆధారంగా వారిని ఐదు గుంపులుగా విభజించి పరిశీలనలు జరిపామని, రోజూ ఒక కప్పు కంటే ఎక్కువ ఆకుకూరలు తినే వారి మెదడు పని తీరుతో పోలిస్తే తక్కువ తినే వారి పని తీరు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఐదు గుంపుల మధ్య ఉన్న తేడాల ఆధారంగా ఒక కప్పు ఆకు కూరలతో 11 ఏళ్ల నష్టాన్ని నివారించవచ్చునన్న అంచనాకు వచ్చినట్లు చెప్పారు. గ్లూకోజ్ ఎంతుందో చెప్పేస్తుంది.. మధుమేహులకు రక్తంలో చక్కెర మోతాదు ఎంతుందో తెలుసుకోవడం రోజువారీ పని. అయితే ఇందుకోసం సూదులతో గుచ్చుకోవడమంటే ఎవరికైనా కష్టమే. ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉండనే ఉంది. ఇన్ని కష్టాలు ఉండటం వల్లనే చాలామంది మధుమేహులు రోజువారీ పరీక్షలకు వెనుకాడుతూ ఉంటారు. అయితే ఇకపై ఈ సమస్యలు దూరం కానున్నాయి. ఎలాగంటారా? షింగుహువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్యాచ్ సిద్ధం చేశారు మరి. రెండు దశల్లో పని చేసే ఈ ప్యాచ్‌తో సూది గుచ్చుకోకుండానే రక్తంలోని చక్కెర శాతం ఎంత అన్నది చెప్పేస్తుంది. ఈ ప్యాచ్‌ను చర్మంపై అతికించుకునే ముందు అక్కడ కొంచెం హైయాలోరొనిక్ యాసిడ్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్యాచ్‌పై ఓ కాగితం బ్యాటరీని ఉంచుతారు. ఫలితంగా యాసిడ్ కాస్తా కరిగి చర్మం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న గ్లూకోజ్‌ను ఉపరితలంపైకి తెస్తుంది. దాదాపు 20 నిమిషాల తరువాత ప్యాచ్‌పై ఓ బయో సెన్సర్‌ను ఉంచితే చక్కెర మోతాదు ఎంతో తెలుపుతుంది. తాము ఇప్పటికే ఈ ప్యాచ్‌ను చైనాలోని కొన్ని ఆసుపత్రుల్లో మనుషులపై ప్రయోగించి చూశామని ప్యాచ్ ద్వారా వచ్చిన ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయని, పరీక్షలు చేయించుకున్న కార్యకర్తలు కూడా ఎలాంటి బాధ అనుభవించలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఒంటరితనంతో ఆయువుకు హానికరం ఆహారంలో మితిమీరిన కొవ్వు, ఎడాపెడా తగలేసే సిగరెట్లు, మోతాదుకు మించిన మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. ఈ జాబితాలోకి ఒంటరితనాన్ని కూడా చేర్చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మితమీరిన కొవ్వు, ధూమపానం, మద్యపానం మాదిరిగానే ఒంటరితనం కూడా మనుషుల ఆయువును హరించేస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు పదిహేను సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత చేటు జరుగుతుందో కుటుంబంలో అయిన వారి తోడు లేకుండా, సామాజిక సంబంధాలు కూడా పెద్దగా లేకుండా ఒంటరి జీవితం గడపడం వల్ల కూడా దాదాపు అంతే చేటు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్యూయెర్టో రికోలోని ఎక్సెటర్ యూనివర్సిటీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒంటరి వ్యక్తులపై జరిపిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరితనం వల్ల గుండెకు, మెదడుకు చాలా హాని జరుగుతుందని, దీర్ఘకాలిక ఒంటరితనం ఆయువును హరించేస్తుందని ఈ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
గ్లూకోజ్ స్థాయిలను గుర్తించేందుకు కొత్త ప్రొటీన్
మధుమేహ బాధితులు ప్రతిసారీ వేలిపై సూదితో గుచ్చుకుని రక్తపు చుక్కతో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఇక తప్పనుంది. చిన్న ఇంప్లాంట్‌ను శరీరంలో అమర్చుకుంటే చాలు.. 24 గంటలూ ఆ పరికరమే గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ అణువులతో కలవగానే ఆకారం మారిపోయేలా శాస్త్రవేత్తలు సృష్టించిన ఓ కొత్త ప్రొటీన్‌తో ఇది సాధ్యం కానుంది. ఈ గ్లూకోజ్ బైండింగ్ ప్రొటీన్ (జీబీపీ) ఆధారంగా గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే సూక్ష్మ పరికరాలను రూపొం దించవచ్చని, దాని ద్వారా చాలా చౌకగా గ్లూకోజ్ పర్యవేక్షణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నిమిషానికోసారి గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే పరికరాలు కూడా ఉన్నా.. అవి చాలా ఖరీదైనవని, పైగా ఎక్కువ కాలం పనిచేయవని అంటున్నారు. జీబీపీ సాయంతో రూపొందించే ఇంప్లాంట్లు మధుమేహ బాధితులకు బాగా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. -
మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం
నవీనయుగంలో వయస్సు, లింగ - విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందునా ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ‘మధుమేహం’ లేదా ‘డయాబెటిస్’ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నా కానీ మానసిక ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాధులు వంటి కారణాలు ప్రధానంగా ఉండడమే గణనీయంగా పెరిగిపోతున్న వ్యాధిగ్రస్తులకు సూచనగా ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ‘డయాబెటిస్’ ఒక వ్యాధి కాదు. ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్, అంటే శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిక్ లక్షణాలైన అధికమూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో ‘పాంక్రియాస్’ అనే గ్రంథి నుండి వెలువడే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారం చేసుకొని డయాబెటిస్‌ను రెండు ప్రధాన రకాలుగా విభజించుతారు. డయాబెటిస్ 1లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ వలన లేదా ఆటోఇమ్యూనిటీ వలన పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందువలన వీరిలోకి బయటనుండి ఇన్సులిన్ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటన్’ (IDDM) అంటారు. డయాబెటిస్ 2 లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికి శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించేవారిలో, శారీర శ్రమలేకుండా స్థిరంగా ఉండేవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీరికి ఇన్సులిన్ బయటి నుండి ఇచ్చే అవసరం ఉండదు. కానీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ-హైపర్ గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవెల్స్ టాబ్లెట్ల ద్వారా నియంత్రించ లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉండే డయాబెటిస్‌ని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివలన తలెత్తే కాంప్లికేషన్లు పేషెంట్‌ను మరింత కృంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంత్రించకపోతే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకొంటూ ఆహారం సరిగా తీసుకోకపోతే చక్కెరస్థాయి తగ్గిపోయి ‘హైపోగ్లైసీమెయా’ తలెత్తుంది. శరీరమంతా చమట పట్టడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురై కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు ‘హైపోగ్లైసీమెయా’ కి గురైన వ్యక్తిలో కన్పిస్తాయి. కొన్నిరకాల దుష్ర్పభావాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160... కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా వ్యాయామం చేస్తూ మందులు, ఆహారం సమయానికి తీసుకొంటూ, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించవలసిందే. డయాబెటిస్తో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారిలో దుష్ర్పభాలు త్వరగా వస్తాయి గనుక రక్తపోటును, కొలస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని మనస్సును సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. హోమియోపతిలో ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. జన్యుపరమైన, మానసికపరమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరిపడే మోతాదులో నిర్ణీతకాలం దాకా వాడితే. 1. రోగుల్లో ఇన్సులిన్ డోసేజ్ని తక్కువ చేయడం 2. రోగుల్లో యాంటీ హైరప్గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం, పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. నా పేరు రాములు, నేను ఆటోమొబైల్ కంపెనీలో ఫోర్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తాను. నేను చాలా సంవత్సరాలపాటు డయాబెటిస్తో బాధపడ్డాను. విపరీతమైన ఆకలి, దాహం, నీరసం మొదలైన సమస్యలతో ఎంతో సతమతమయ్యేవాడిని. ఎన్నోరకాల మందులు, వ్యాయామాలు, డైటింగ్, వాకింగ్ ఎన్నో చేశాను. కాని ఫలితం కన్పించలేదు. హోమియోపతి మందుల వల్ల డయాబెటిస్ కంట్రోల్‌కి వస్తుందని ఎంతోమంది చెబితే విని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్మెంట్ వలన, సలహాల వలన ఇప్పుడు నా డయాబెటిస్ చాలా కంట్రోల్కొచ్చింది. నా సంతోషానికి కారణమైన పాజిటివ్ హోమియోపతికి చాలా థ్యాంక్స్. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922