ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం.
డయాబెటిస్ రెండు రకాలు..
మొదటి రకం (టైపు -1) ఇది.. పిల్లల్లో వచ్చేది . శరీరానికి రక్షణ కల్పించాల్సిన ఇమ్మ్యూనిటి వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంపైనే దాడి చేస్తుంది.
పెద్దల్లో కనిపించే టైపు - 2 డయాబెటిస్‌కు కారణాలివే..
►ఒంటికి సూర్య రశ్మి తగలక పోవడం - దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం
►అధిక బరువు - ఊబకాయం - శారీరిక శ్రమ లోపించడం, అధిక తిండి
►జన్యు వారసత్వం (తల్లి తండ్రి లో ఒకరికి ఉన్నా వచ్చే అవకాశముంది)
►టెన్షన్ - స్ట్రెస్
►భోజనంలో పిండిపదార్థాలు ఎక్కువ కావడం - ప్రోటీన్ , పీచు లాంటివి బాగా తక్కువ కావడం
రాకుండా ఎలా కాపాడుకోవాలి ?
►చిన్నపటి నుంచి పిల్లలని, బుసబుస పొంగే కూల్ డ్రింక్స్ , పిజ్జా , బర్గెర్ , పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. ఆయా కాలాల్లో దొరికే పళ్ళు బాగా తినాలి. పిల్లలు ఆటలాడాలి
►ఒకప్పుడు నలబై యాభై లలో డయాబెటిస్ వచ్చేది . ఇప్పుడు ముప్పై వయసులోనే కొంతమందిలో ఇరవై లోనే టైపు 2 చక్కర వ్యాధి వచ్చేస్తోంది . గతం తో పోలిస్తే ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది
►క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం , రక్తం లో ఇన్సులిన్ ఉన్నా అది సరిగా స్పందించకపోవడం - ఈ కారణంచేత రక్తం లో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి . ఇదే చక్కర వ్యాధి
రక్తం లో గ్లూకోస్ లెవెల్ ఎంత ఉండాలి?
►ఇంట్లో accu చెక్ లాంటి పరికరంతో రక్తం లో గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు
►అన్నం తిన్నాక గంటన్నర కు చెక్ చేసుకోవాలి . రీడింగ్ 140 ఉంటే సమస్యే లేదు . 180 దాక ఉన్నా పెద్దగా సమస్య కాదు . 300 దాటితే మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్టు
►500 దాటితే ఆపాయ స్థితి
సహజ పద్ధతిలో డయాబెటిస్‌ను ఎలా జయించాలి ?
►రోజుకు కనీసం 30 నిముషాలు ఎండలో { ఉదయం లేదా సాయంకాలం} వేగంగా నడవాలి . అప్పుడు డి విటమిన్ అందుతుంది . శారీరిక శ్రమ వల్ల ఇన్సులిన్ ఉత్త్పత్తి పెరుగుతుంది/దాని పని తీరు మెరుగు పడుతుంది. బరువు కూడా తగ్గడం దీనికి మరింత దోహద పడుతుంది .
►మానసిక ఒత్తడికి దూరం కావాలి . అనారోగ్యం గా వున్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు . అది పెద్ద సమస్య కాదు. టెన్షన్ ఉన్నప్పుడు కూడా
►ఆధునిక జీవనం టెన్షన్ ల మయం. కొద్దిపాటి లేదా కాసేపు టెన్షన్ సరే అనుకోవచ్చు . రోజుల తరబడి టెన్షన్ పడితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగి పోతుంది . యోగ , పాటలు వినడం, NLP .. ఏ పద్దతి అయినా ఫరవాలేదు. ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి . తగిన విశ్రాంతి , నిద్ర , సంతోషం , తృప్తి.. ఇవన్నీ అవసరం .
►ఎలాంటి మందులు లేకుండా చక్కర వ్యాధి ని దూరం చేయాలంటే ఆహార నియమాలు తప్పని సరి . పిండి పదార్థాలు అంటే బియ్యం గోధుమలు లాంటి వాటితో చేసిన వంటకాలు - బాగా తగ్గించాలి.
►తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మెరుగు, దాని కన్నా బాసుమతి మెరుగు . దాని కన్నా సిరి ధాన్యాలు మెరుగు . మీ కంచం లో పిండి పదహార్థాలనిచ్చే బియ్యం తో చేసినవి గోధుమలతో చేసినవి బాగా తక్కువ ఉండాలి.
►ఆరు పాళ్లల్లో కేవలం ఒక పాలు మాత్రం ఇవి కావాలి . మిగతావి అయిదు రెట్లు ఉండాలి . అంటే అన్నం ఒక కప్పు అయితే ఆకుకూరలు , కాయగూరలు , మాంసాహారులైతే చికెన్, మటన్, చేపలు, గుడ్డు, శాకాహారులైతే పన్నీర్, పప్పు , వేరుశనగ గింజలు, బ్రాన్ చన, పుట్ట గొడుగులు ఇవి అయిదు పాళ్లు కావాలి. ప్రతిదీ ప్రతి రోజూ తినాలని కాదు. వీలు బట్టి .. అవకాశాన్ని బట్టి..
►ఆకు కూరలు కాయగూరలు మాత్రం ప్రతి రోజు .. ఆ మాటకు వస్తే ప్రతి పూట ఉండేలా చూసుకోవాలి. కాయగూరల్ని కొన్ని పచ్చివిగా తినొచ్చు . ఉదాహరణ కీర.. మిగతావి మీ టేస్ట్ బట్టి కుక్ చేసి
►కాయగూరల్లో బంగాళాదుంప లాంటివి బియ్యం తో సమానం. అంటే వీటిలో పిండి పదార్థాలు అధికం. కాబట్టి వాటిని తక్కువగా వాడాలి. మీ బ్లడ్ గ్లూకోస్ ఎక్కువ స్థాయిలో ఉంటే అసలు తినకూడదు .
►చికెన్, మటన్, పనీర్ లాంటివి ప్రోటీన్ ను అందిస్తాయి . ఇవి ఎంతో అవసరం . ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీ లు పాడైపోతాయి అనుకోవడం అపోహ. మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే మీకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది వరకే కిడ్నీ సమస్య ఉన్నవారు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవద్దు.
►ఒకటి -రెండు నెలలుప్రతి రోజు .. మీ గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోండి . రెండు కప్పుల తెల్లన్నం తిన్నా , మీ రీడింగ్ 140 దాటడం లేదంటే మీకు షుగర్ సమస్య లేనట్టే . అలాగని ఎక్కువ తెల్లనం తింటే ఊబకాయం వచ్చి భవిషత్తులో షుగర్ సమస్య రావొచ్చు . మీ రీడింగ్ 250 లోపు ఉంటే , మరుసటి పూట అన్నం తగ్గించండి . ఖీర, చికెన్ లాంటివి పెంచండి.
►ఇలా ఒక నెల రోజులు ప్రతి రోజూ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటుంటే మీ శరీర తత్త్వం మీకే అవగాహన అయిపోతుంది. ఎలాంటి ఫుడ్ తింటే మీ రీడింగ్ 140 లోపే వుందని అర్థం చేసుకొంటారు
►వీలైనంత వరకు 140 లోపు ఉంచేలా ప్రయత్నించండి . 180 దాక అయినా ఫరవాలేదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మీ రీడింగ్ ను 140 దాటకుండా చూసుకొంటే ఎప్పుడో ఒక సారి జిహ్వచాపల్యం తట్టుకోలేక స్వీట్స్ లాంటివి తిని రీడింగ్ కాసేపు 250 టచ్ చేసినా ఏమీ కాదు. అర గంటలో తగ్గిపోతుంది.
►ఇలా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ మీ రీడింగ్‌ను 140 దాటకుండా రెండు -మూడు నెలలు చూసుకోగలిగితే , అప్పుడు సాయంకాలం ఒక పండు తినొచ్చు . బాగా తీయగా వుండే మామిడి, ద్రాక్ష, అరటి కాకుండా మిగతా పళ్లు.. దీని వల్ల మీ క్లోమం బలపడుతుంది. షుగర్ సమస్య దూరం అయిపోతుంది .
►రెండు మూడు నెలలు రీడింగ్ చూసుకొంటే ఆ తరువాత మీకే ఐడియా వస్తుంది. ఏ ఫుడ్ తినాలి ? ఎంత తినాలి ? ఎంత తింటే రీడింగ్ ఎంత ఉంటుంది? అని. అప్పుడు మీకు మీరే న్యూట్రిషనిస్ట్. ఇలా శాశ్వతంగా డయాబెటిస్‌ను జయించవచ్చు .
మీ రెడింగ్ 300 దాటితే మీకు ఇన్సులిన్ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వాడుతున్న మెట్ఫార్మిన్ లాంటివి ఒక్క సరిగా మానేస్తే షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కిడ్నీ లు దెబ్బ తిని ఉంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ మంచిది కాదు . అలాంటాప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఆచి తూచి రిస్క్ లేని రీతిలో నెమ్మదిగా పాటించొచ్చు
-వాసిరెడ్డి అమర్‌నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment