ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయి
థైరోకేర్ సంస్థ అధ్యయనంలో వెల్లడి
దేశవ్యాప్తంగా 19.66 లక్షలమంది
హెచ్‌బీఏ1సీ ఫలితాలపై అధ్యయనం
22.25 శాతం ప్రీడయాబెటిక్, 27.18 శాతం మందిలో మధుమేహం
సాక్షి, అమరావతి: దేశంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. 2045 నాటికి 12 కోట్లకు చేరతారని అంచనాలున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టు ప్రముఖ డయాగ్నోస్టిక్ ప్రివెంటివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ సంస్థ థైరోకేర్ అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది దేశవ్యాప్తంగా 19.66 లక్షల మంది హెచ్‌బీఏ1సీ ఫలితాలను థైరోకేర్ సంస్థ విశ్లేíÙంచింది. వ్యాధి వ్యాప్తిలో భయంకరమైన పోకడలను గుర్తించినట్టు స్పష్టం చేసింది.
కలవరపెడుతున్న అసాధారణ గ్లూకోజ్ స్థాయి
19.66 లక్షల మంది ఫలితాలను విశ్లేషించగా అందులో 49.43 శాతం మంది రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. 22.25 శాతం మంది ప్రీడయాబెటిక్ దశలో ఉండగా, 27.18 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆహారంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు మధుమేహం, ప్రీడయాబెటిస్ ముప్పు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. గోధుమ ఆధారిత ఆహారాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తక్కువ ప్రాబల్యం రేటును ఉన్నట్టు వివరించారు.
యువకుల్లో అధికంగా ప్రీ డయాబెటిక్
18–35 ఏళ్ల యువతలో ప్రీ డయాబెటిక్ ప్రాబల్యం అధికంగా ఉండగా, 36–65 సంవత్సరాల వారిలో వ్యాధి ప్రభావం వృద్ధి చెందుతోంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు నిర్వహించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు పాటించినట్‌లైతే వ్యాధిని నివారించవచ్చని థైరోకేర్ సూచించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడంతో పాటు, తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
‘హాని’కరమైన ఆహార అలవాట్లు
ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ ఉండటానికి హానికరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ గతంలో స్పష్టం చేసింది. సమోసా, పకోడీ, చిప్స్, నూడిల్స్ ఇలా మార్కెట్‌లో లభించే అ్రల్టాప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మధుమేహం ప్రమాదం పెరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ పదార్థాల్లో అడ్వాన్స్‌డ్ గ్‌లైకేషన్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ ఆహారం తిసుకునే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగి తొందరగా మధుమేహం బారినపడతారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment