మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం
నవీనయుగంలో వయస్సు, లింగ - విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందునా ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ‘మధుమేహం’ లేదా ‘డయాబెటిస్’ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నా కానీ మానసిక ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాధులు వంటి కారణాలు ప్రధానంగా ఉండడమే గణనీయంగా పెరిగిపోతున్న వ్యాధిగ్రస్తులకు సూచనగా ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ‘డయాబెటిస్’ ఒక వ్యాధి కాదు.
ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్, అంటే శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిక్ లక్షణాలైన అధికమూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో ‘పాంక్రియాస్’ అనే గ్రంథి నుండి వెలువడే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే.
ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారం చేసుకొని డయాబెటిస్‌ను రెండు ప్రధాన రకాలుగా విభజించుతారు. డయాబెటిస్ 1లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ వలన లేదా ఆటోఇమ్యూనిటీ వలన పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందువలన వీరిలోకి బయటనుండి ఇన్సులిన్‌ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటన్’ (IDDM) అంటారు.
డయాబెటిస్ 2 లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికి శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించేవారిలో, శారీర శ్రమలేకుండా స్థిరంగా ఉండేవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీరికి ఇన్సులిన్ బయటి నుండి ఇచ్చే అవసరం ఉండదు. కానీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ-హైపర్ గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవెల్స్ టాబ్లెట్ల ద్వారా నియంత్రించ లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉండే డయాబెటిస్‌ని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు.
డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివలన తలెత్తే కాంప్లికేషన్లు పేషెంట్‌ను మరింత కృంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంత్రించకపోతే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకొంటూ ఆహారం సరిగా తీసుకోకపోతే చక్కెరస్థాయి తగ్గిపోయి ‘హైపోగ్లైసీమెయా’ తలెత్తుంది. శరీరమంతా చమట పట్టడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురై కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు ‘హైపోగ్లైసీమెయా’ కి గురైన వ్యక్తిలో కన్పిస్తాయి.
కొన్నిరకాల దుష్ర్పభావాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160... కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా వ్యాయామం చేస్తూ మందులు, ఆహారం సమయానికి తీసుకొంటూ, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించవలసిందే. డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారిలో దుష్ర్పభాలు త్వరగా వస్తాయి గనుక రక్తపోటును, కొలస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని మనస్సును సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి.
హోమియోపతిలో ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. జన్యుపరమైన, మానసికపరమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరిపడే మోతాదులో నిర్ణీతకాలం దాకా వాడితే. 1. రోగుల్లో ఇన్సులిన్ డోసేజ్‌ని తక్కువ చేయడం 2. రోగుల్లో యాంటీ హైరప్‌గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం, పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
నా పేరు రాములు, నేను ఆటోమొబైల్ కంపెనీలో ఫోర్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తాను. నేను చాలా సంవత్సరాలపాటు డయాబెటిస్‌తో బాధపడ్డాను. విపరీతమైన ఆకలి, దాహం, నీరసం మొదలైన సమస్యలతో ఎంతో సతమతమయ్యేవాడిని. ఎన్నోరకాల మందులు, వ్యాయామాలు, డైటింగ్, వాకింగ్ ఎన్నో చేశాను. కాని ఫలితం కన్పించలేదు.
హోమియోపతి మందుల వల్ల డయాబెటిస్ కంట్రోల్‌కి వస్తుందని ఎంతోమంది చెబితే విని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్‌మెంట్ వలన, సలహాల వలన ఇప్పుడు నా డయాబెటిస్ చాలా కంట్రోల్‌కొచ్చింది. నా సంతోషానికి కారణమైన పాజిటివ్ హోమియోపతికి చాలా థ్యాంక్స్.
హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై
అపాయింట్‌మెంట్ కొరకు 9246199922