మధుమేహులకు తీపికబురు | Drinking 100 per cent fruit juice does not raise blood sugar levels  | Sakshi
Sakshi News home page

మధుమేహులకు తీపికబురు

Published Fri, Jan 19 2018 1:02 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

 Drinking 100 per cent fruit juice does not raise blood sugar levels  - Sakshi

వాషింగ్టన్‌ : పండ్ల రసాన్ని నేరుగా తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయనే ఆందోళన అసంబద్ధమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ఫ్రూట్‌ జ్యూస్‌తో టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌ పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో చేపట్టిన ఈ అథ్యయనంలో పండ్ల రసాల ప్రభావం గ్లైసిమిక్‌ కంట్రోల్‌పై ఎలాంటి ప్రభావం చూపినట్టు వెల్లడికాలేదు.

ఫ్రూట్‌ జ్యూస్‌లు, బ్లడ్‌ గ్లూకోజ్‌ కం‍ట్రోల్‌పై సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా చేపట్టిన ఈ అథ్యయనం మధుమేహ చికిత్సలో మైలురాయిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. యాపిల్‌, బెర్రీ, సైట్రస్‌, ద్రాక్ష, దానిమ్మ జ్యూస్‌ల ప్రభావం షుగర్‌ లెవెల్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఈ అథ్యయనంలో విశ్లేషించారు.

టైప్‌ 2 డయాబెటిస్‌ను ఆరోగ్యకర జీవన శైలి, సరైన ఆహారం, వ్యాయామంతో నియం‍త్రించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూట్రిషనల్‌ సైన్స్‌ జర్నల్‌లో అథ్యయన ఫలితాలను ప్రచురించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement