
ఇరాన్‌లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్‌లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

రెయిన్ బో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు.
What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG
— briefchaatindia (@briefchaatindia) March 13, 2025
కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్‌బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్‌లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్‌తో ఎరుపు పెయింట్‌ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment