
మూత్రవిసర్జన సమయంలో రక్తపు చార కనిపించడం ఎవరిలోనైనా ఆందోళన కలిగించే అంశమే. అయితే అంతగా బెంబేలు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్), కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల ఇలా జరగవచ్చు. కాకపోతే మూత్రవిసర్జన సమయంలో రక్తం కనిపిస్తున్నవారు మాత్రం ఒకసారి ఫిజీషియన్ లేదా యూరాలజిస్ట్‌ను సంప్రదించి... మూత్రపరీక్షలు, అబ్డామిన్ స్కానింగ్ తప్పక చేయించుకోవాలి.
అవసరమైతే ఐవీపీ (ఇంట్రావీనస్ పైలోగ్రామ్) వంటి పరీక్షలూ చేయించాల్సిరావచ్చు. ఆ పరీక్షల్లో నిర్ధారణ (డయాగ్నోజిస్) అయిన జబ్బును బట్టి చికిత్స ఉంటుంది. కాకపోతే మరీ భయాందోళనలు అక్కర్లేదుగానీ... తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం మాత్రం అవసరమని గుర్తించాలి.
(చదవండి: మెనోపాజ్ నిద్రలేమికి లింకప్ ఏమిటి)
Comments
Please login to add a commentAdd a comment