Urinary Problems
-
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
ఆపుకోలేక.. చెప్పుకోలేక..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సగటు మనిషి ఆయుర్దాయం నూరేళ్లుగా లెక్క కడుతూంటారు. ఇందులో సగం అంటే 50 ఏళ్లు వచ్చేసరికి సాధారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూంటాయి. అలా వచ్చే కొన్ని సమస్యలను కంటికి రెప్పలా చూసుకునే కన్న పిల్లలకు కూడా చెప్పుకోలేక కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన 60 నుంచి 70 శాతం మందిలో హఠాత్తుగా చుక్కలు చుక్కలుగా యూరిన్ (మూత్రం) రావడం సమస్యగా ఉంటోంది. దీనిని వైద్య పరిభాషలో ‘స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్’ అని పిలుస్తుంటారు. దీనికి వయోభారంతో వచ్చే కండరాల బలహీనత ప్రధాన కారణమని యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 10 మందిలో ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధ పడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య ఐదు నుంచి ఆరు ఉంటోందని యూరాలజీ వైద్యులు అంటున్నారు. కొంతమంది ఈ సమస్యను ఎవ్వరికీ చెప్పలేక.. ముందు జాగ్రత్తలు తీసుకోలేక కేన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మహిళల్లో అధికం స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ పురుషుల్లో కంటే నాలుగు పదులు దాటిన మహిళల్లో ఎక్కువని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ హార్మోన్ స్రావంలో లోపాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీసి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో మూడు పదుల వయసు దాటిన వారిని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. రుతుస్రావం నిలిచిపోయే పరిస్థితిలో ఏర్పడే పోస్ట్ మెనోపాజల్ దశలో స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్ సమస్యలు మొదలవుతాయి. అధిక కాన్పులు, శస్త్రచికిత్సలు, ప్రొస్టేట్ చికిత్స మహిళల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా రావడానికి కారణమవుతున్నాయి. పురుషుల్లో మధుమేహం, శస్త్రచికిత్సలతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తుమ్మినా, దగ్గినా తెలియకుండానే మూత్ర విసర్జన, వెజైనల్ సమస్యలు దీని లక్షణాలుగా చెబుతున్నారు.మూత్రం చుక్కచుక్కలుగా పడుతున్న వారికి కాకినాడ జీజీహెచ్‌లో యూరాలజీ, వెజైనల్ డ్రైనెస్ సమస్యకు గైనకాలజీ ఓపీల్లో సేవలందిస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈ రెండు విభాగాల ఓపీకి ప్రతి నెలా వస్తున్న కేసులను పరిశీలిస్తే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా యూరాలజీ వైద్యుల వద్ద అవుట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్‌కు అధునాత వైద్య సదుపాయాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో అందుబాటులోకి తీసుకువచ్చామని స్థానిక సృజనా ఆస్పత్రి కాస్మెటిక్ గైనకాలజిస్టు డాక్టర్ ఏఎల్ సత్యవతి చెప్పారు. ముంబైకి చెందిన ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు సీజెల్ అజ్మీరా భాగస్వామ్యంతో ఈ సేవలు తీసుకువచ్చారు. మానసిక సమస్యలు ఉత్పన్నం స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సహా, పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ అసమతుల్యతలు మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మహిళలు సంసార, సాధారణ జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేని వేదనతో సతమతమవుతూంటారు. తొలి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే ఈ సమస్యలను ధైర్యంగా వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే తక్షణ పరిష్కారం ఉంటుంది. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ మందులు అవసరం లేని చికిత్స అవాంఛిత మూత్రం కేసులు పెరుగుతున్నాయి. స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సమస్యకు చెమట పట్టని వ్యాయామాలతో పెల్విక్ కండరాల పటిష్టత ద్వారా మందుల అవసరం లేని పరిష్కారం లభిస్తోంది. దీనికి అధునాతన బీటీఎస్ ఎంసెల్లా చైర్‌ను వినియోగిస్తాం. 28 నిమిషాల వ్యవధిలో 11 వేల పెల్విక్ వ్యాయామాలు చేయించడం ఈ యంత్రం ప్రత్యేకత. వీటిని కిగెల్స్ ఎక్సర్సైజ్లు అంటారు. వెజైనల్ డ్రైనెస్ నివారణకు వెజైనల్ రెజువనేషన్ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కుర్చీలో కూర్చోవడం ద్వారా నొప్పి లేని చికిత్స అందిస్తాం. – డాక్టర్ ఏఎల్ సత్యవతి, కాస్మెటిక్ గైనకాలజీ నిపుణురాలు, కాకినాడ ఆగితే తగ్గదు మూత్రం లీకేజీ, వెజైనల్ డ్రైనెస్లు నానాటికీ అధికమవుతున్న సమస్యలు. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. తగ్గుతుందిలే అన్న ధీమా ఎంత మాత్రం సరికాదు. దీనివలన సమస్య తగ్గదు సరికదా, మానసిక సమస్యలు ఎక్కువై మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తుంది. తక్షణమే వైద్యులను సంప్రదించి వైద్యం పొందాలి. ఈ ఇబ్బందిని చెప్పుకొనేందుకు చాలా మంది మహిళలు ముందుకు రాకపోవడమే అసలు సమస్య. మందులు అవసరం లేని అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సత్ఫలితాలిస్తున్నాయి. – డాక్టర్ మణికంఠన్ జంధ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ -
అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..
మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి కూడా. వీటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు. వింత కథనం ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్‌లోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు. కనీసం నీటిని తాకరు ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. రావణుని మొండితనాన్ని గ్రహించి.. ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టినా, అది మరిక కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు. లఘుశంక తీర్చుకునేందుకు.. శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. బైద్యనాథ్‌లో కొలువై.. ఆ శివలింగమే బైద్యనాథ్‌లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే.. -
అర్జంట్‌గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్‌రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్‌మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్‌షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్‌లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! జీవితాంతం..
ఎన్నో జబ్బులు గురించి ఇంతవరకు విన్నాం. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. పైగా అవి ఏదో విటమిన్లోపం లేదా జన్యు సమస్యల కారణంగా వచ్చిన జబ్బులు. ఇంకాస్త ముందుకెళ్లితే మన పనితీరు కారణంగా వచ్చే విచిత్రమైన వ్యాధులు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునే ఈ వ్యాధి అత్యంత అరుదైనది, విని ఉండే ఆస్కారమే లేదు కూడా. ఎందుకంటే అది మనిషి జీవితంలో రొటిన్‌గా చేసే సాధారణ పనిని చేయలేకపోవడం. చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అరుదైన వ్యాధి బారిన పడింది 30 ఏళ్ల మహిళ. ఈ వ్యాధి పగవాడికి కూడా వద్దంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల మహిళ మూత్ర విసర్జన చేయలేకపోడం అనే వింత సమస్యతో బాధపడుతుంది. ఆ మహిళ పేరు ఎల్లే ఆడమ్స్. ఆమె అక్టోబర్ 2022లో తాను టాయిలెట్‌కి వెళ్లలేకపోతున్నట్లు తొలిసారిగా గుర్తించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆమె ఆరోజంతా టాయిలెట్‌కి వెళ్లలేకపోయింది. మనిషి నిత్య జీవితంలో సర్వసాధరణంగా చేసే పనిని చేయలేకపోతున్నానంటూ భోరున విలపించింది. దీంతో ఆమె వైద్యలును సంప్రదించగా..వారు అత్యవసర క్యాథెటర్‌ను అందించారు. అంటే ఒక ఒక గొట్టాన్ని మూత్రాశయంలోకి పంపి యూరిన్‌ని తీయడం. దీంతో ఆమె మూత్రశయం నుంచి లీటర్ యూరిన్ తీశారు వైద్యులు. ఇది సాధారణంగా రోగికి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడే ఉపయోగిస్తారు. అయితే ఎల్లేకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే యూరిన్‌ని ఇలా తీయాల్సి వస్తోంది. ఆ గొట్టాన్ని తీసేసి బాత్రూంకి వెళ్లి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. చివరికి ఎన్ని మందులు వాడిని ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. దీని గురించి యూరాలజీ సెంటర్ల చుట్టు తిరుగుతూనే ఉంది. సరిగ్గా 14 నెలలు తర్వాత వైద్యులు నిర్వహించిన పలు టెస్ట్‌ల ద్వారా ఎల్లే ఫౌలర్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇక జీవితాంతం మూత్ర విసర్జన చేయడానికి క్యాథెటర్ అవసరం అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవని తెలిపారు. ఫౌలర్స్ అనేది యూరిన్‌ని పాస్ చేయలేని సమస్య. ఇది ఎక్కువగా యువతులలోనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల తాను ఎంతగా ఇబ్బందిపడుతోందో కన్నీరుమున్నీగు చెబుతోంది ఎల్లే. (చదవండి: మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్ దుమారం!) -
అతి మూత్ర సమస్యకు చెక్:ఎంఎస్ఎన్ తొలి జనరిక్ మెడిసిన్ లాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్ వర్షన్‌ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం, మూత్రాన్ని ఆపుకోలేని సమస్యకు ఈ ఔషధం ద్వారా అందుబాటు ధరలో చికిత్స లభిస్తుందని ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు. దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
Health: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్..
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. శరీర నిర్మాణపరంగా వారి మూత్రవ్యవస్థ నిర్మితమైన తీరు వల్ల వారిలో ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికం. దీనికి తోడు బయటకు వెళ్లి ఆఫీసుల్లో పనిచేసే మహిళల్లో (వర్కింగ్ ఉమెన్)లో... వారికి ఉండే కొన్ని పరిమితుల వల్ల ఇన్ఫెక్షన్లు, మరికొన్ని ఇతర సమస్యలు పెరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలిపే కథనం. సాధారణ మహిళలైన గృహిణులకూ (హోమ్ మేకర్స్‌కూ), బయటికి వెళ్లి పనిచేసే మహిళలకూ (వర్కింగ్ ఉమెన్కూ) కొన్ని తేడాలు ఉంటాయి. వర్కింగ్ ఉమన్ నీళ్లు తక్కువగా తాగడం, అలాగే మూత్రానికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా చాలాసేపు ఆపుకోవడం ఈ రెండు పనులూ చాలా ఎక్కువగా చేస్తుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి... 1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... ఈ మూత్ర విసర్జన సమస్యలు మళ్లీ రెండు రకాలు. ►మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. ►రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక నొప్పి రావడం. ఇక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా రావచ్చు. ఎందుకీ సమస్యలు : మొదటి కారణం సాధారణంగా వర్కింగ్ ఉమెన్... మూత్రవిసర్జనను తప్పించుకోడానికి నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. నిర్వహణ బాగుండే పెద్ద పెద్ద ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ బాగుండకపోవడం, కొన్ని చోట్ల మరీ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. రెండో కారణం ఇక ఎంతగా మూత్రవిసర్జన చేయాల్సి వచ్చినా రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనను ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా బిగబట్టడం వల్ల పెద్దగా సమస్యలేవీ రావుగానీ... అదే పని పదేపదే చాలాకాలం పాటు కొనసాగుతున్నప్పుడు మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఎలాంటి సమస్యలొస్తాయంటే... మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ (యూటీఐ) అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే... శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక... వాటిని మూత్రం రూపంలో ఓ కండర నిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి. చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుకుంటే... అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలాసేపు నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధిచెంది... దాని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని... ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. దీన్ని కొంచెం సీరియస్ సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. లక్షణాలు మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు... సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య పదే పదే వస్తుంటే మాత్రం అందుకు కారణాలు నిర్ధారణ చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలూ చేయిస్తుంటారు. సీయూఈ, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి), సిస్టోస్కోప్ (యూటీఐ). అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి. చికిత్స యూరినరీ ఇన్ఫెక్షన్లకు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతోనూ, అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు. -డాక్టర్ లలిత, సీనియర్ కన్సల్టెంట్, యూరో గైనకాలజిస్ట్ చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Health: పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అంతకంటే ఎక్కువగా
Health Tips By Bhavana Kasu: ప్రయాణాల సమయంలో లేదా ఎక్కువ గంటలు ఇల్లు దాటి బయటి ప్రదేశాలలో గడిపినప్పుడు ఎక్కువమంది ఉపయోగించే టాయిలెట్‌ను ఉపయోగించవలసి వస్తుంది. ఏవైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందా? –వి. అనిల, పెద్దపల్లి ఉద్యోగాలు, వృత్తిరీత్యా ప్రయాణాలు చేసేవాళ్లల్లో బయట వాష్‌రూమ్స్‌ను ఉపయోగించక తప్పదు. కానీ చాలామంది అనుకున్నట్టు పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కన్నా వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. వెజైనాలో మామూలుగా ఉండే మంచి బ్యాక్టీరియా ప్రపోర్షన్ చేంజ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగి, వెజైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బయట వాష్‌రూమ్స్ వల్ల చాలా అరుదుగా ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. చర్మం మీద గాయాలు, పుళ్లతో చర్మం ఎక్స్పోజ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ నుంచి కొన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. టాయిలెట్ సీట్‌పై నుంచి వ్యాపించే అవకాశం తక్కువ. ఎందుకంటే చాలా బ్యాక్టీరియా, వైరస్లు బయట వాతావరణంలో ఎక్కువకాలం జీవించలేవు. మానవ శరీరానికి బయట.. టాయిలెట్ సీట్ పైన అవి ఎక్కువసేపు బతకలేవు. డైరెక్ట్ ఎక్స్పోజ్డ్ స్కిన్ కాంటాక్ట్తోనే వ్యాపిస్తాయి. వెజైనిటిస్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెజైనాలో దురద, మంట, ఎరుపెక్కిపోవడం, వాపు, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో నొప్పీ రావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. యూరినరీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ను నివారించడానికి.. వెజైనాను డూషింగ్ అంటే సిరంజితో వాటర్‌తో శుభ్రం చెయ్యకూడదు, ఇన్నర్‌వేర్‌ను రెండు పూటలూ మార్చుకోవాలి, అంతేకాదు ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఇతరులు వాడిన ఇన్నర్‌వేర్ మళ్లీ వాడకూడదు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి, మూత్రవిసర్జనను ఆపుకోకూడదు, నెలసరి సమయంలో తరచుగా ప్యాడ్స్ మార్చుకుంటూండాలి, టాయిలెట్‌కి వెళ్లేముందు, వెళ్లొచ్చాక కచ్చితంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే టిష్యూ వైపర్, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి, డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ నాబ్స్‌ను టిష్యూ పేపర్‌తో పట్టుకొని వాడాలి, మీరు వాడే వస్తువులేవీ టాయిలెట్ ఫ్లోర్ మీద పెట్టొద్దు.. లాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు పబ్లిక్ టాయిలెట్స్ వాడినా ప్రమాదమేమీ ఉండదు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి -
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్‌బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
Health: రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
చాలామంది రాత్రిపూట ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేస్తూనే ఉంటారు. దీనివల్ల వారికి తెల్లవార్లూ నిద్ర ఉండదు. అయితే ఇలా మూత్రం రావడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు నిపుణులు. వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడాన్ని నోక్టురియా అంటారు. అధిక రక్తపోటును ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇచ్చే మూత్రవిసర్జన మాత్ర కూడా నోక్టోరియా సమస్యకు దారితీస్తుంది. దీంతోపాటుగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి మన జీవనశైలి కూడా మరొక కారణం. ►ఇది ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. ►కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. ►ఆల్కహాల్‌ను ఎక్కువగా తాగినా.. కెఫీన్‌ను ఎక్కువగా తీసుకున్నా.. రాత్రిపూట మూత్రవిసర్జన ఎక్కువగా చేస్తారు. ►ఇవి శరీరంలో ఎక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీస్తాయి. ►అందువల్ల తరచు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి వైద్యునికి చూపించుకుని వారి సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకుని ఏమీ లేదని నిర్థారించుకుని నిశ్చింతగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! చదవండి: Health Tips: పండక్కి ఫుల్లుగా తినండి కానీ... వీళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి! లేదంటే Health Tips: బర్త్ ప్లాన్ అంటే ఏమిటి? డెలివరీ టైమ్‌లో.. Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల..