ప్రతీకాత్మక చిత్రం
Health Tips By Bhavana Kasu: ప్రయాణాల సమయంలో లేదా ఎక్కువ గంటలు ఇల్లు దాటి బయటి ప్రదేశాలలో గడిపినప్పుడు ఎక్కువమంది ఉపయోగించే టాయిలెట్‌ను ఉపయోగించవలసి వస్తుంది. ఏవైనా వెజైనల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందా? –వి. అనిల, పెద్దపల్లి
ఉద్యోగాలు, వృత్తిరీత్యా ప్రయాణాలు చేసేవాళ్లల్లో బయట వాష్‌రూమ్స్‌ను ఉపయోగించక తప్పదు. కానీ చాలామంది అనుకున్నట్టు పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్స్ కన్నా వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే వచ్చే ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువ. వెజైనాలో మామూలుగా ఉండే మంచి బ్యాక్టీరియా ప్రపోర్షన్ చేంజ్ అయ్యి ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ పెరిగి, వెజైనా ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి.
బయట వాష్‌రూమ్స్ వల్ల చాలా అరుదుగా ఇన్‌ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. చర్మం మీద గాయాలు, పుళ్లతో చర్మం ఎక్స్‌పోజ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ నుంచి కొన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. టాయిలెట్ సీట్‌పై నుంచి వ్యాపించే అవకాశం తక్కువ.
ఎందుకంటే చాలా బ్యాక్టీరియా, వైరస్‌లు బయట వాతావరణంలో ఎక్కువకాలం జీవించలేవు. మానవ శరీరానికి బయట.. టాయిలెట్ సీట్ పైన అవి ఎక్కువసేపు బతకలేవు. డైరెక్ట్ ఎక్స్‌పోజ్డ్ స్కిన్ కాంటాక్ట్‌తోనే వ్యాపిస్తాయి. వెజైనిటిస్ అంటే వెజైనల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు వెజైనాలో దురద, మంట, ఎరుపెక్కిపోవడం, వాపు, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో నొప్పీ రావచ్చు.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. యూరినరీ, వెజైనల్ ఇన్‌ఫెక్షన్స్‌ను నివారించడానికి.. వెజైనాను డూషింగ్ అంటే సిరంజితో వాటర్‌తో శుభ్రం చెయ్యకూడదు, ఇన్నర్‌వేర్‌ను రెండు పూటలూ మార్చుకోవాలి, అంతేకాదు ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఇతరులు వాడిన ఇన్నర్‌వేర్ మళ్లీ వాడకూడదు,
మంచినీళ్లు ఎక్కువగా తాగాలి, మూత్రవిసర్జనను ఆపుకోకూడదు, నెలసరి సమయంలో తరచుగా ప్యాడ్స్ మార్చుకుంటూండాలి, టాయిలెట్‌కి వెళ్లేముందు, వెళ్లొచ్చాక కచ్చితంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే టిష్యూ వైపర్, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి, డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ నాబ్స్‌ను టిష్యూ పేపర్‌తో పట్టుకొని వాడాలి, మీరు వాడే వస్తువులేవీ టాయిలెట్ ఫ్లోర్ మీద పెట్టొద్దు.. లాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు పబ్లిక్ టాయిలెట్స్ వాడినా ప్రమాదమేమీ ఉండదు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి
Comments
Please login to add a commentAdd a comment