హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్ వర్షన్‌ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం, మూత్రాన్ని ఆపుకోలేని సమస్యకు ఈ ఔషధం ద్వారా అందుబాటు ధరలో చికిత్స లభిస్తుందని ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు.
దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
Comments
Please login to add a commentAdd a comment